
'ఆ అగ్గిలో బాబు బూడిదవడం ఖాయం'
విజయవాడ: గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ పార్టీ నేత సీ రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటంలో గవర్నర్ విఫలమయ్యారని అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మెప్పుకోసమే గవర్నర్ పనిచేస్తున్నారని చెప్పారు. రాజధాని నిర్మాణం బాగుందని గవర్నర్ ఎలా సర్టిఫికెట్ ఇస్తారని ప్రశ్నించారు.
రాజధాని ప్రాంతంలో రైతులు పడుతున్న బాధలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్ ఎందుకు నోరు మెదపడం లేదని రామచంద్రయ్య ప్రశ్నించారు. బీసీలు, కాపుల మధ్య చంద్రబాబు అగ్గిపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆ అగ్గిలో చంద్రబాబు బూడిదవడం ఖాయం అని రామచంద్రయ్య అన్నారు.