హైదరాబాద్: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిదికోసం హైదరాబాద్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రణబ్కు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, మంత్రులు తదితరులు స్వాగతం పలికారు.
ఈ నెల 31వరకు హైదరాబాద్లోనే రాష్ట్రపతి బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
Published Fri, Dec 18 2015 5:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement