'గవర్నర్కు అన్ని అధికారాలున్నాయి' | governer have all powers in crores for vote | Sakshi
Sakshi News home page

'గవర్నర్కు అన్ని అధికారాలున్నాయి'

Published Mon, Jun 22 2015 5:56 PM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

'గవర్నర్కు అన్ని అధికారాలున్నాయి'

'గవర్నర్కు అన్ని అధికారాలున్నాయి'

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఈ కేసు విషయంలో గవర్నర్ నరసింహన్కు కీలక సూచనలు ఇచ్చారు. ఈ కేసును నరసింహన్ స్వయంగా పరిశీలించవొచ్చని, పర్యవేక్షించవచ్చని సూచించారు. విభజనం చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్కు ఈ అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిలో రెండు రాష్ట్రాల పోలీసులకు కూడా అధికారాలు ఉన్నాయనే విషయాన్ని ఆయన గుర్తుచేశారు. శాంతిభద్రతలపై రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించే అధికారం గవర్నర్కు ఉందని ఆయన ఓ జాతీయ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement