
సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులు రేవంత్ రెడ్డి, ఉదయ్‌సింహా, సెబాస్టియన్‌లపై ఏసీబీ కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద నమోదు రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 కింద అభియోగం నమోదైంది. అయితే తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్‌లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఓటుకు కోట్లుకు సంబంధించి అన్ని ఆధారాలున్న ఉన్నాయని ఏసీబీ తెలిపింది. ఆడియో, వీడియో టేపులతో సహా అన్ని ఆధారాలున్నాయని పేర్కొంది. రూ.50లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా నిందితులు పట్టుబడ్డారని ఏసీబీ తెలిపింది. ఈనెల 19న సాక్షుల విచారణ, షెడ్యూలును ఖరారు చేస్తామని ఏసీబీ కోర్టు పేర్కొంది.
చదవండి : (బాబే మాస్టర్ మైండ్.. అంతా ఆ గదిలోనే)
(ఓటుకు కోట్లు కేసు: రేవంత్‌రెడ్డికి వార్నింగ్)
Comments
Please login to add a commentAdd a comment