
ఏసీబీ కార్యాలయం, ఫైల్ ఫోటో
సాక్షి, హైదరాబాద్: ఏసీబీ కోర్టులో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుంది. జూలై 7 నుంచి సాక్షుల విచారణ కొనసాగించాలని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. జూలై 7 నుంచి 13 వరకు 18 మంది సాక్షుల విచారణకు ఏసీబీ కోర్టు షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
తెలంగాణలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో టీడీపీ నేతలు బేరసారాలు సారించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ బేరసారాల్లో భాగంగా టీడీపీ నేత చంద్రబాబు మనవాళ్లు బ్రీఫ్‌డ్‌మీ అంటూ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు అభియోగాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి బయటికి వచ్చిన వీడియోలు అప్పట్లో సంచలనంగా మారాయి. ఈ కేసుకు సంబంధించి రేవంత్‌రెడ్డి కొద్ది రోజులు జైలులో ఉన్నారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో రేవంత్‌రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment