సాక్షి, సిటీబ్యూరో: హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఎల్‌అండ్‌టీ నెక్టŠస్ గలేరియా మాల్‌ను అనుసంధానిస్తూ నిర్మించిన స్కైవాక్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. స్టేషన్‌లో దిగిన ప్రయాణికులు నేరుగా గలేరియా మాల్‌కు వెళ్లి షాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ట్రాఫిక్, పొల్యూషన్ సమస్యల బారిన పడకుండా నేరుగా షాపింగ్‌కు వెళ్లే వారికి ఇదో సదవకాశమని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ఇప్పటికే పంజగుట్ట మెట్రోస్టేషన్ వద్ద ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిన విషయం విదితమే. రవాణా ఆధారిత అభివృద్ధిలో భాగంగా ఎల్‌అండ్‌టీ సంస్థ నగరంలో పలు చోట్ల మాల్స్ నిర్మించడంతో పాటు వాటిని స్టేషన్లకు అనుసంధానించడంతో ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉందన్నారు. ప్రపంచ స్థాయి సదుపాయాలను గ్రేటర్ సిటీజన్లకు పరిచయం చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment