సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు గుడ్‌న్యూస్. ఉప్పల్ కూడలిలో నిర్మించిన స్కైవాక్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. కాగా, కాలినడకన రోడ్డు దాటేవారి కోసం హెచ్‌ఎండీఏ దీన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఉప్పల్ చౌరస్తాలో 665 మీటర్ల మేర రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్‌ను హెచ్‌ఎండీఏ నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్‌లలో ఇది ఒకటిగా నిలిచింది.
ఇక.. పాదచారులు, ప్రయాణీకులు ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ కాలినడక వంతెనను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
స్కైవాక్ పైన, కింద, పరిసర ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. ఇక గ్రీనరీ, పాదచారుల కోసం టాయిలెట్లను అందుబాటులోకి తెచ్చారు. నడిచివెళ్లేవారికి రక్షణ కోసం ఇరువైపులా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అమర్చిన ఎల్‌ఈడీ దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పైన కూడా ఎండ తగల కుండా ఉండేందుకు విదేశాల నుంచి తెప్పించ్చిన రూఫ్‌లను ఏర్పాటు చేశారు.
Witness the magnificent Uppal Skywalk, a true jewel of urban connectivity!
— BRS Party (@BRSparty) June 25, 2023
Thanks to the visionary leadership of CM Sri KCR and guidance of Municipal Administration and Urban Development Minister Sri @KTRBRS, infrastructure in Hyderabad has undergone a phenomenal transformation.… pic.twitter.com/K0FQ2PiRCn
ఇది కూడా చదవండి: ఢిల్లీలో టీకాంగ్రెస్ నేతలు బిజీ.. రాహుల్ సమక్షంలో భారీగా చేరికలు
Comments
Please login to add a commentAdd a comment