
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలకు నిలయమైన హైటె క్ సిటీ సైబర్ టవర్స్‌కు కూతవేటు దూరంలోని ఓ మార్కెటింగ్ కంపెనీలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రావడంతో కలకలం రేగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు, ఫైర్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న రోహిణి లేఅవుట్‌లోని ఓ భవనం మూడో అంతస్తులో మూవింగ్ నీడిల్ అనే మార్కెటింగ్ కంపెనీ ఉంది. ఆపైఅంతస్తులో ఇదే కంపెనీకి చెందిన క్యాంటీన్, కెఫెటేరియాను నిర్వహిస్తున్నారు. అయితే శనివారం రాత్రి 8.30 గంటలకు క్యాంటీన్‌లో మంటలు చెలరేగాయి. అదిచూసిన స్థానికులు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. గంటసేపు శ్రమించి మంటలను అదుపుచేశారు. క్యాంటీన్‌లోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని ప్రమాదం సంభవించిందని, ఫరీ్నచర్ పూర్తిగా కాలిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం కావడంతో ఉద్యోగులెవరూ లేరని, ప్రాణనష్టం తప్పిందని వెల్లడించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: వివేకా కేసు: గంగిరెడ్డిని కలిసేందుకు సునీత ప్రయత్నం!)
Comments
Please login to add a commentAdd a comment