MMTS Train Accident: Near Hyderabad Hitech City 3 People Dead - Sakshi
Sakshi News home page

Hyderabad MMTS Train Accident: ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టి ముగ్గురు మృతి.. ఆత్మహత్యలా? ప్రమాదమా?

Jul 26 2022 5:51 PM | Updated on Jul 26 2022 7:40 PM

MMTS Train Accident Near Hyderabad Hitech City 3 People Dead - Sakshi

నాంపల్లి రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్‌పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను వ‌న‌ప‌ర్తికి చెందిన రాజ‌ప్ప‌, శ్రీను, కృష్ణ‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాలను ఉస్మానియా ఆస్ప‌త్రి మార్చురీకి త‌ర‌లించారు.

ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల్లో ఒక‌రి వ‌ద్ద మ‌ద్యం సీసాలు ఉన్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో రైల్వేస్టేష‌న్‌కు స‌మీపంలోని మూల‌మ‌లుపులో ప‌ట్టాలు దాటుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
చదవండి: ఆటోలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన కిరాతకులు.. గదిలో బంధించి 3 నెలలపాటు సామూహిక అత్యాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement