
`విద్యార్థుల కృషితోనే హైటెక్ సిటీగా హైదరాబాద్`
నిజామాబాద్: విద్యార్థుల కృషితోనే హైదరాబాద్ హైటెక్ సిటీగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్పారు. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హైదరాబాద్ను హైటెక్ సీటీగా చేశానని గొప్పలు చెబుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అనే అంశంపై సదస్సుకు కవిత గురువారం హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో తెలంగాణను అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. అయితే అది కాస్తా మెంటల్గేమ్గా తేలిపోయిందని కవిత ఎద్దేవా చేశారు.