
బెంగాలీ ఫుడ్‌ఫెస్టివల్
హైటెక్ సిటీలోని రాడిసన్ హైదరాబాద్ హోటల్ దసరా నవరాత్రుల సందర్భంగా శుక్రవారం నుంచి బెంగాలీ ఫుడ్‌ఫెస్టివల్ ప్రారంభిస్తోంది. ఈ హోటల్‌లోని కాస్కేడ్-24X7 రెస్టారెంట్ భోజనప్రియులైన ‘సిటీ’జనులకు బెంగాలీ రుచులను వడ్డించనుంది. బెగుని, మఛ్ చాప్, నర్కోల్ దియే మాంషొ, భపా ఇలిష్, కొపి బెట్కి పాలక్, బైగన్ ఘంటొ, జింగె పొస్తో, సుఖ్తొ, భజా ముంగెర్ దాల్, మిస్టీ పులావు, ముడి ఘంటొ, ఆలూ దియే మాంషొ, దోయి మఛొ, బెట్కి మఛేర్ ఝల్, చొణార్ తొర్కారి, మిస్టీ దోయి వంటి సంప్రదాయ బెంగాలీ వంటకాలను అందించనుంది. పూర్తి బెంగాలీ అలంకరణతో ఉండే కాస్కేడ్ రెస్టారెంట్‌లో అతిథులకు వడ్డన చేసే స్టీవార్డ్స్ సైతం సంప్రదాయ బెంగాలీ వస్త్రధారణతో కనిపిస్తారు.