హైటెక్‌ సిటీ: వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్‌ కష్టాలు | Hyderabad: Minister KTR Inaugurates Hitech City Railway Under Bridge | Sakshi
Sakshi News home page

కేపీహెచ్‌బీ–హైటెక్‌సిటీ ఆర్‌యూబీని ప్రారంభించిన కేటీఆర్‌

Published Mon, Apr 5 2021 11:53 AM | Last Updated on Mon, Apr 5 2021 2:24 PM

Hyderabad: Minister KTR Inaugurates Hitech City Railway Under Bridge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్‌ సిటీ రైల్వే అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని సోమవారం మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్‌ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఆర్‌యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్‌ ఉన్న హైటెక్‌ సిటీ, ఎంఎంటీఎస్‌ స్టేషన్‌ మార్గంలో కష్టాలు తీరనున్నాయి.

ఇక జేఎన్‌టీయుహెచ్‌ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్‌ సమస్య తలెత్తేది. ప్రతిరోజు దాదాపుగా 40 వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది. అదే విధంగా చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్‌లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు. 

చదవండి: సర్పంచ్‌ పాడె మోసిన మంత్రి జగదీశ్‌‌ రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement