Under Bridge
-
హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మరో నాలుగు ప్రాజెక్టులు వచ్చే మార్చిలో ప్రారంభం కానున్నాయి. బహదూర్‌పురా ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ కుడివైపు అండర్‌పాస్, తుకారాంగేట్ ఆర్‌యూబీలు ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రకటించిన జీహెచ్ఎంసీ.. తాజాగా బైరామల్‌గూడ ఎడమవైపు ఫ్లై ఓవర్ సైతం మార్చిలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. దీంతో ఎస్సార్డీపీలో భాగంగా నాలుగు అభివృద్ధి ఫలాలతో ప్రజలకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గనున్నాయి. బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ 2020 ఆగస్టులో అందుబాటులోకి వచ్చింది. ఎడమవైపు ఫ్లై ఓవర్ వచ్చేనెల రెండో వారంలో అందుబాటులోకి రానున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. వీలును బట్టి మిగతా మూడు ప్రాజెక్టులు కూడా వచ్చే నెలలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది. పనులు తుదిదశలో ఉన్నాయని తెలిపిన అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టారు. చదవండి: వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం బైరామల్‌గూడ కుడివైపు ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ఒవైసీ జంక్షన్ వైపు నుంచి ఉప్పల్ జంక్షన్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు, సిగ్నల్ చిక్కులు ఉండవు. ప్రయాణవేగం పెరుగుతుంది. ప్రయాణ సమయం, వాహనాల ఇంధన,నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఎస్సార్డీపీలో భాగంగా ప్రభుత్వం రూ. 25వేల కోట్లకు పైగా ఖర్చయ్యే ఫ్లై ఓవర్లు, మేజర్ కారిడార్లు, స్కైవేలు, అండర్‌పాస్‌లు, మేజర్ కారిడార్లు, ఆర్ఓబీలు,ఆర్‌యూబీలు, తదితరమైన వాటి నిర్మాణం చేపట్టడం తెలిసిందే. వాటిల్లో పూర్తయిన పనులతో ఆయా మార్గాల్లో సాఫీ ప్రయాణంతో ట్రాఫిక్ చిక్కులు తగ్గాయని జీహెచ్ఎంసీ పేర్కొంది. బైరామల్ గూడ ఫ్లై ఓవర్.. అంచనా వ్యయం : రూ. 28.64 కోట్లు ఫ్లై ఓవర్ పొడవు : 780 మీటర్లు వెడల్పు :12.50 మీటర్లు లేన్లు : 3 ప్రయాణం : ఒక వైపు -
హైటెక్ సిటీ: వాహనదారులకు తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: కేపీహెచ్‌బీ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలో నూతనంగా రూ.66.59 కోట్లతో పూర్తి చేసిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్యూబీ)ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఉండే మార్గంలో దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్యూబీ ప్రారంభంతో వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం ఈ ఆర్యూబీ ప్రారంభంతో ఇప్పటికే అధిక ట్రాఫిక్ ఉన్న హైటెక్ సిటీ, ఎంఎంటీఎస్ స్టేషన్ మార్గంలో కష్టాలు తీరనున్నాయి. ఇక జేఎన్టీయుహెచ్ నుంచి హైటెక్ సిటీకి వెళ్లే దారిలోని ఈ రైల్వే బ్రిడ్జి కింద గతంలో చిన్నపాటి వర్షం పడితే ఇక్కడి కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తేది. ప్రతిరోజు దాదాపుగా 40 వేల లీటర్ల నీరు ఊరుతూ ఉండేది. అదే విధంగా చిన్నపాటి వర్షం కురిసినా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉండేది కాదు. ప్రస్తుతం ఈ నీటిని నిల్వ చేయటానికి సమీపంలోనే పెద్ద సంపును నిర్మించారు. ఈ సంపులో నిల్వ చేసిన నీటిని మూసాపేట సర్కిల్లో నాటిన హరితహారం మొక్కలకు అందించనున్నారు. చదవండి: సర్పంచ్ పాడె మోసిన మంత్రి జగదీశ్ రెడ్డి -
విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం
సాక్షి,విజయవాడ: మధురా నగర్ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ట్రాఫిక్ సమస్యపై స్పందించారు. రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. రూ. 17 కోట్లు ప్రభుత్వ నిధులు,రూ.10 కోట్లు రైల్వే నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. 6 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాబోతోంది. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం తలపెట్టారు. టీడీపీ నాయకులు దీనికి అడ్డుపడి స్టే తెచ్చినా ఏదో ఒక టైంలో తీర్పు వస్తుంది. ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. శాసన రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తాం అని కొడాలి నాని అనలేదు. మానవత్వం తో రైతులు ఆలోచించాలని కొడాలి నాని ఉద్దేశం తప్ప , అందులో మరో ఉద్దేశం లేదు’ అని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ‘విజయవాడ అభివృద్ధి పట్ల సీఎం కట్టుబడి ఉన్నారు. త్వరలోనే ఈ రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుంది. గత ప్రభుత్వంలో లాగా జగన్ మోహన్ రెడ్డి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు. కచ్చితంగా రాబోయే రోజుల్లో విజయవాడ అభివృద్ధి మరింతగా జరుగుతుంది’ అని అన్నారు. చదవండి: మరో నాలుగు కులాలకు వైఎస్సార్ చేయూత -
రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య
రైల్వేగేట్‌ః నగరంలోని వరంగల్ అండర్ బ్రిడ్జి సమీపంలోని రైల్వేట్రాక్ పై గుర్తు తెలియని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వరంగల్ జీఆర్పీ ఎస్సై ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. అండర్ బ్రిడ్జి ఎ-క్యాబిన్ సమీపంలో ఆదివారం ఉదయం 6.10 గంటలకు ఓ మహిళ(30) ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరిచామని, మృతురాలి సంబంధీకులు వరంగల్ జీఆర్పీలో సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. -
అండర్ బ్రిడ్జీలు నిర్మించండి
చెన్నై, సాక్షి ప్రతినిధి:ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రోజా కోరారు. నగరి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, వేపగుంట, పూడి ైరె ల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ బుధవారం దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు రోజా విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రైల్వే జీఎంకు వినతిపత్రాలు సమర్పించానన్నారు. అన్ని స్టేషన్లలో సర్వేచేసి ప్రయాణికులకు ఏమి కావాలో తెలుసుకుని ఫొటోలతో సహా రిపోర్టు ఇచ్చానని తెలిపారు. రైల్వేవారు పెద్ద మనసుతో వీటిల్లో 65 శాతం పూర్తిచేశారని తెలిపారు. ప్లాట్‌ఫారాల పొడిగింపు, ప్రయాణికులు వేచి ఉండేందుకు షెల్టర్లు, తాగునీటి వసతి, ఏకాంబర కుప్పంలో మెట్లవసతి కల్పించారని తెలిపారు. అలాగే పుత్తూరు రైల్వేస్టేషన్లో వెయిటింగ్ రూములో మార్పులు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు మెరుగుపరిచారని చెప్పారు. తాను కోరిన వాటిల్లో మెయిన్ ప్రాజెక్టయిన ఏకాంబర కుప్పంలో అండర్‌బ్రిడ్జి లేని కారణంగా రైల్వేగేటు వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయని అన్నారు. అండర్ బ్రిడ్జి లేని కారణంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. అండర్ బ్రిడ్జీ నిర్మాణానికి రూ.1.65 కోట్లు మంజూరైనా దక్షిణ రైల్వే నుంచి జాయింట్ ఇన్స్పెక్షన్ రాకపోవడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. నిధులున్నా పనులు ఆగిపోయాయి కాబట్టి జాయింట్ ఇన్స్పెక్షన్ తొందరగా చేసి బ్రిడ్జీ పనులు పూర్తి చేయడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరినట్లు తెలిపారు. అలాగే పుత్తూరులో రైల్వే పట్టాలకు ఇరువైపులా చెరిసగం గ్రామాలు ఉండగా లెవల్‌క్రాసింగ్ గేటు లేనందున ప్రజలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. ద్విచక్రవాహనాలు, నడిచేందుకు వీలుగా అండర్బ్రిడ్జీని కోరానని తెలిపారు. ఎంపీలేదా మున్సిపాలిటీ మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తే పనులు చేస్తామని రైల్వే వారు అంగీకరించారని ఆమె చె ప్పారు. నగిరి మున్సిపల్ చైర్పర్సన్ శాంతి కుమార్, కౌన్సిలర్ రమేష్‌రెడ్డి, పురుషోత్తం తదితర నేతలంతా జీఎంను కలిసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కాబట్టి ఏదో రావడం, పోవడం కాకుండా ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని జీఎంను కలిసినట్లు రోజా వివరించారు. -
టిప్పర్ బోల్తా .. ముగ్గురికి గాయాలు
రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం యమ్నంపేట ఔటర్ రింగ్ రోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం ఓ టిప్పర్ బోల్తా పడడంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. ఘట్కేసర్ నుంచి ఈసీఐఎల్ వైపు వెళుతున్న టిప్పర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనక ట్రక్ పైకి లేచింది. అది బ్రిడ్జిని తాకడంతో బోల్తాపడింది. టిప్పర్ డ్రైవర్‌తోపాటు అందులో ఉన్న మరో ఇద్దరికి గాయాలు కాగా, వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.