చెన్నై, సాక్షి ప్రతినిధి:ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రైల్వే సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే రోజా కోరారు. నగరి, ఏకాంబరకుప్పం, పుత్తూరు, వేపగుంట, పూడి ైరె ల్వేస్టేషన్లలో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలని కోరుతూ బుధవారం దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్‌కు రోజా విన్నవించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో రైల్వే జీఎంకు వినతిపత్రాలు సమర్పించానన్నారు. అన్ని స్టేషన్లలో సర్వేచేసి ప్రయాణికులకు ఏమి కావాలో తెలుసుకుని ఫొటోలతో సహా రిపోర్టు ఇచ్చానని తెలిపారు. రైల్వేవారు పెద్ద మనసుతో వీటిల్లో 65 శాతం పూర్తిచేశారని తెలిపారు.
ప్లాట్‌ఫారాల పొడిగింపు, ప్రయాణికులు వేచి ఉండేందుకు షెల్టర్లు, తాగునీటి వసతి, ఏకాంబర కుప్పంలో మెట్లవసతి కల్పించారని తెలిపారు. అలాగే పుత్తూరు రైల్వేస్టేషన్‌లో వెయిటింగ్ రూములో మార్పులు, ఫ్యాన్లు వంటి సౌకర్యాలు మెరుగుపరిచారని చెప్పారు. తాను కోరిన వాటిల్లో మెయిన్ ప్రాజెక్టయిన ఏకాంబర కుప్పంలో అండర్‌బ్రిడ్జి లేని కారణంగా రైల్వేగేటు వద్ద వాహనాలు నిలిచిపోతున్నాయని అన్నారు. అండర్ బ్రిడ్జి లేని కారణంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని చెప్పారు. అండర్ బ్రిడ్జీ నిర్మాణానికి రూ.1.65 కోట్లు మంజూరైనా దక్షిణ రైల్వే నుంచి జాయింట్ ఇన్స్‌పెక్షన్ రాకపోవడంతో పనులు ఆగిపోయాయని తెలిపారు. నిధులున్నా పనులు ఆగిపోయాయి కాబట్టి జాయింట్ ఇన్స్‌పెక్షన్ తొందరగా చేసి బ్రిడ్జీ పనులు పూర్తి చేయడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరినట్లు తెలిపారు.
అలాగే పుత్తూరులో రైల్వే పట్టాలకు ఇరువైపులా చెరిసగం గ్రామాలు ఉండగా లెవల్‌క్రాసింగ్ గేటు లేనందున ప్రజలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. ద్విచక్రవాహనాలు, నడిచేందుకు వీలుగా అండర్‌బ్రిడ్జీని కోరానని తెలిపారు. ఎంపీలేదా మున్సిపాలిటీ మ్యాచింగ్ ఫండ్స్ ఇస్తే పనులు చేస్తామని రైల్వే వారు అంగీకరించారని ఆమె చె ప్పారు. నగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతి కుమార్, కౌన్సిలర్ రమేష్‌రెడ్డి, పురుషోత్తం తదితర నేతలంతా జీఎంను కలిసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కాబట్టి ఏదో రావడం, పోవడం కాకుండా ప్రజల సమస్యలను అవగాహన చేసుకుని జీఎంను కలిసినట్లు రోజా వివరించారు.
అండర్ బ్రిడ్జీలు నిర్మించండి
Published Thu, Jan 28 2016 1:44 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM
Advertisement