
సాక్షి,విజయవాడ: మధురా నగర్ ఏరియా లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ట్రాఫిక్ సమస్యపై స్పందించారు. రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. రూ. 17 కోట్లు ప్రభుత్వ నిధులు,రూ.10 కోట్లు రైల్వే నిధులతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది.
6 నెలల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాబోతోంది. పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం తలపెట్టారు. టీడీపీ నాయకులు దీనికి అడ్డుపడి స్టే తెచ్చినా ఏదో ఒక టైంలో తీర్పు వస్తుంది. ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. శాసన రాజధాని ఇక్కడ నుంచి తీసేస్తాం అని కొడాలి నాని అనలేదు. మానవత్వం తో రైతులు ఆలోచించాలని కొడాలి నాని ఉద్దేశం తప్ప , అందులో మరో ఉద్దేశం లేదు’ అని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ‘విజయవాడ అభివృద్ధి పట్ల సీఎం కట్టుబడి ఉన్నారు. త్వరలోనే ఈ రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుంది. గత ప్రభుత్వంలో లాగా జగన్ మోహన్ రెడ్డి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు. కచ్చితంగా రాబోయే రోజుల్లో విజయవాడ అభివృద్ధి మరింతగా జరుగుతుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment