బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి గృహ నిర్బంధం | BJP Leaders House Arrest | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి గృహ నిర్బంధం

Published Tue, Jul 17 2018 11:28 AM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని తెలంగాణ ప్రభుత్వం నగర బహిష్కణ చేయడంపై బీజేపీ ఆందోళన తీవ్రతరం చేసింది. పరిపూర్ణానంద స్వామిపై విధించిన నగర బహిష్కరణను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ.. మంగళవారం ‘ఛలో ప్రగతిభవన్‌’కు బీజేపీ ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యాలయానికి చేరుకునేందుకు సిద్ధమవుతున్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులను పోలీసులు వారి నివాసంలోనే గృహ నిర్బంధం చేశారు. పోలీసుల చర్యలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement