సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు జెట్ స్పీడ్ వేగంతో మారిపోతున్నాయి. తాజాగా బీఆర్‌ఎస్ నేత ఆరూరి రమేష్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే, ఆరూరి విషయంలో నిన్న(బుధవారం) హైడ్రామా జరిగింది. ఆరూరి బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆరూరి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఇక, అంతకుముందే ఆరూరి.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ కోసం ఆరూరి ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డిని ఏ క్షణంలోనైనా ఆరూరి కలిసే అవకాశం ఉంది. అనంతరం, ఆరూరి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment