సాక్షి, హైదరాబాద్: ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేక టీడీపీని వదిలిపెట్టినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన నాయకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం ఆయన వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువా వేసి ఆయనను సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీకి స్థానం లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తామన్నారు. తనకు వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నామన్నారు. ఏపీ అభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. హైదరాబాద్‌ను రాష్ట్రానికి దూరం చేసింది చంద్రబాబేనని విరుచుకుపడ్డారు. గుంటూరుకు గల్లా జయదేవ్ గుంటూరుకు అతిథిలాంటి వారని ఎద్దేవా చేశారు. గుంటూరు నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని, బ్యాలెట్ ద్వారా గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తనలాంటి నాయకుడిని వదులుకోవడం టీడీపీ ఖర్మ అని పేర్కొన్నారు. మోదుగుల వేణుగోపాలరెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
చదవండి:
వైఎస్సార్‌సీపీలోకి వలసల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment