ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణతో అధికార టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణతో అధికార టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. సీనియర్ నాయకులకు మొండిచేయి చూపి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడంపై నిరసన జ్వాలలు రేగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధిని కేబినెట్ లోకి తీసుకోకపోవడంపై ఆయన అనుచరులు మనస్తాపం చెందారు.
పార్థసారధికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా పెనుకొండ మార్కెట్ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట్రామిరెడ్డి, రొద్దం సింగిల్ విండో అధ్యక్షుడు ఆంజనేయులు తమ పదవులకు రాజీనామా చేశారు.