టీడీపీకి ఊహించని దెబ్బ | TDP MLA kagitha venkata rao resigned | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఊహించని దెబ్బ

Published Sun, Apr 2 2017 6:22 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

టీడీపీకి ఊహించని దెబ్బ - Sakshi

టీడీపీకి ఊహించని దెబ్బ

విజయవాడ: కేబినెట్ విస్తరణ ప్రకంపనలు టీడీపీలో కొనసాగుతున్నాయి. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఫిరాయింపుదారులకు పెద్దపీట వేయడం పట్ల సీనియర్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడం పట్ల పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నాగేశ్వరపేటలోని తన నివాసంలో మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. గౌడ కులంలో పుట్టినందుకే తన మంత్రి పదవి ఇవ్వలేదని వెంకట్రావు వాపోయారు. టీడీపీలో బీసీ నాయకుడిని ఇంతగా అవమానిస్తారని అనకోలేదని, టీడీపీలో బీసీలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆవేదన చెందారు.

కాగిత వెంకట్రావుతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రేపు(సోమవారం) పెడన బంద్ కు కాగిత వెంకట్రావు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement