'ధూళిపాళ నరేంద్రకు అన్యాయం' | dhulipalla narendra kumar disappointed | Sakshi
Sakshi News home page

'ధూళిపాళ నరేంద్రకు అన్యాయం'

Published Sun, Apr 2 2017 2:46 PM | Last Updated on Sat, Jun 2 2018 7:14 PM

'ధూళిపాళ నరేంద్రకు అన్యాయం' - Sakshi

'ధూళిపాళ నరేంద్రకు అన్యాయం'

అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అధికార టీడీపీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మంత్రి పదవులు దక్కకపోవడంతో పార్టీ సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నాయకుల మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన మద్దతుదారులు గుంటూరు జిల్లా చింతలపూడిలో రాస్తారోకో చేశారు.

మరోవైపు ధూళిపాళ్ల నివాసం వద్ద కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీకి రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ధూళిపాళకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు అభీష్టం మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. దూళిపాళ్లను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయనను బుజ్జగించే బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement