dhulipalla narendra kumar
-
ధూళ్లిపాళ్ల నరేంద్రకు ఎమ్మెల్యే వెంకట రోశయ్య సవాల్
గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ధూళ్ళిపాళ్ల నరేంద్ర దొంగలా తయారయ్యారని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు 45 ఎకరాల జడ్పీ భూముల్లో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారని విమర్శించారు. ఎలక్షన్లు వచ్చాయని ఉనికి కాపాడుకోవడానికి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నరేంద్రకు లేదని అన్నారు. అభివృద్ధి పైన చర్చకు రావాలని ధూళ్లిపాళ్ల నరేంద్రకు వెంకట రోశయ్య సవాల్ విసిరారు. 'వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ పాల్పడి ధూళ్లిపాళ్ల నరేంద్ర వేల కోట్లు దోచేశారు. గత ప్రభుత్వంలో పొన్నూరు, పెదకూరపాడు, మంగళగిరి నియోజకవర్గాల్లో గ్రావెల్, ఇసుకను ధూళ్ళిపాళ్ల నరేంద్ర, ఆయన తమ్ముడు సురేంద్ర అక్రమ మైనింగ్ చేశారు. రైతులకు రావాల్సిన బోనస్ ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు సహకార రంగాన్ని నాశనం చేస్తే ధూళ్ళిపాళ్ల నరేంద్ర రైతుల ఆస్తి సంఘం డైరీని దోచేశారు. ప్రభుత్వం గురించి గానీ జగన్మోహన్ రెడ్డి గురించి గానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా వారు చేయలేని పనులన్నీ ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలో చేశాం.' అని వెంకట రోశయ్య అన్నారు. ఇదీ చదవండి: ‘బాబు-పవన్‌ల కుతంత్రాలు.. సీఎం జగన్‌కు తిరుగేలేదు’ -
అడ్డంగా దొరికిన ధూళిపాళ్ల
-
పోలీసులపై ‘సంగం’ దౌర్జన్యం
చేబ్రోలు: తమకు బకాయి ఉన్న బోనస్ డబ్బులను చెల్లించాలని కోరిన ఏలూరు జిల్లా పాడి రైతులపై దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై సంగం డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాలు పోసిన రైతులకు ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన సుమారు రూ.50లక్షల బోనస్ డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారంటూ సంగం డెయిరీ సిబ్బందిని నిలదీసిన ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం, వేములపల్లి గ్రామాలకు చెందిన పాడి రైతులపై చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అనుచరులు దాడి చేసిన విషయం విదితమే. డెయిరీ సిబ్బంది, ధూళిపాళ్ల అనుచరులు సుమారు వందమంది విచక్షణారహితంగా కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేయడంతో 15మంది రైతులకు కాళ్లు, చేతులు విరగడంతోపాటు తీవ్ర గాయాలయ్యాయి. మూడు కార్లు ధ్వంసం కావడంతో రూ.ఐదు లక్షల మేర నష్టం జరిగింది. అప్పట్లో బాధిత రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రతోపాటు 15 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే కేసులోని కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని సంగం డెయిరీలో తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ సీఐ ఎం.రాంబాబు, చేబ్రోలు ఎస్ఐ కె.ఆనంద్, పొన్నూరు ఎస్ఐ బార్గవ్, పోలీసు సిబ్బంది శుక్రవారం డెయిరీ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. వీరి రాకను ముందే పసిగట్టిన డెయిరీ సిబ్బంది, టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నారు. మార్కెటింగ్ మేనేజర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వరరావు తదితరులు పోలీసులు అనుమతి లేకుండా సంగం డెయిరీలోకి ప్రవేశించడానికి వీలులేదని తెలిపారు. ఏలూరు రైతులపై దాడి కేసులో నిందితులు డెయిరీలో ఉన్నారని.. వారి కోసం వచ్చినట్లు సీఐ, ఎస్ఐలు చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. సెర్చ్ వారెంట్, రెవెన్యూ అనుమతి కావాలని చెప్పడంతో ఇరువురు వీఆర్వోలు ఉన్నారని చూపినప్పటికీ లోపలికి రావడానికి వీల్లేదని పట్టుబట్టారు. సంగం డెయిరీ సిబ్బందితోపాటు, నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలు, పొన్నూరు, పెదకాకాని మండలాలకు చెందిన టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
పరారీలో టిడిపి మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
-
సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదు: మంత్రి అప్పలరాజు
సాక్షి, గుంటూరు: చంద్రబాబునాయుడు ఒకపథకం ప్రకారం రాష్ట్రంలో సహకార సంఘాల్లో ఉన్న పాల డెయిరీలను తన వాళ్లకు కట్టబెట్టాడని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. సంగం డెయిరీ దూళిపాళ్ల నరేంద్ర అబ్బ సొత్తు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగం డెయిరీ ప్రభుత్వం ఆస్తి.. అది ప్రజల సొత్తు అని చెప్పారు. ఏ రోజుకైనా సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు ఇస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో చంద్రబాబు పిచ్చెక్కిందని అన్నారు. ఎన్నికల సమయానికి చంద్రబాబు పిచ్చి ఏ స్థాయికి వెళ్తుందో అర్థం కావట్లేదని దుయ్యబట్టారు. గతంలో చేసిన పాపాలతో ఇదే కర్మ రా బాబు అని చంద్రబాబు రోడ్ల వెంబడి తిరుగుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడి చెరువు వద్ద నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, గ్రామంలో మట్టి తవ్వకాలపై చలో అనుమర్లపూడికి ధూళిపాళ్ల పిలుపునిచ్చారు. ఈ క్రమంలో చలో అనుమర్లపూడికి అనుమతి లేదంటూ పోలీసులు.. గ్రామంలో 144 సెక్షన్ అమలలో ఉందని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయన.. గ్రామంలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీంతో, తప్పుడు ప్రచారం చేస్తున్న ధూళిపాళ్లపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో మోహరించారు. అనంతరం, ధూళిపాళ్లను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: రుణ ఎగవేత కేసులో కేశినేనికి డీఆర్టీ సమన్లు -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్లకు నిరసన సెగ
శేకూరు(చేబ్రోలు): ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ గ్రామంలోని మట్టి అంతా రైల్వేకు, జిల్లా నలుమూలలకు అమ్ముకుని కోట్లు సంపాదించుకున్నారు.. నేడు జగనన్న కాలనీలకు పంచాయతీ తీర్మానం ద్వారా మట్టి తోలుకుని మెరక చేసుకుంటుంటే నీకు ఎందుకు అంత కడుపుమంట’ అని శేకూరు గ్రామ మహిళలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను నిలదీశారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం శేకూరు గ్రామంలోని ఊరచెరువు పూడికతీతకు కొద్ది రోజుల క్రితం పంచాయతీ తీర్మానం చేశారు. చెరువులోని పూడికతీత ద్వారా వస్తున్న మట్టితో గ్రామంలోని జగనన్న కాలనీలు, రోడ్లు, డొంకలను అభివృద్ధి చేస్తున్నారు. చెరువులోని మట్టి వైఎస్సార్సీపీ నాయకులు అమ్ముకుంటున్నారని టీడీపీ నాయకులు ప్రచారం చేసి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను గ్రామంలోకి తీసుకొచ్చారు. ధూళిపాళ్లను అడ్డుకున్న మహిళలు, స్థానికులు ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితవాడలను అభివృద్ధి చేయని నీవు ఇప్పుడు చెరువు పూడికతీతను అడ్డుకోవడానికి వచ్చావా’ అని ధూళిపాళ్లపై శేకూరు మహిళలు, దళితవాడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో గ్రామంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువులను క్వారీలుగా మార్చిన ఘనత మీదేనని విమర్శించారు. నరేంద్రకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కంగుతిన్న ధూళిపాళ్ల వెనుదిరిగి పంచాయతీ ఆఫీసు వద్దకు వెళ్లారు. దళిత మహిళకు గాయాలు, పోలీసులకు ఫిర్యాదు శేకూరులో చెరువును పరిశీలించడానికి వచ్చిన టీడీపీ నేతలు మహిళపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాతంగి హేమరాజ్యం, మంచాల జాన్సన్‌కు గాయాలవడంతో 108 వాహనం ద్వారా తెనాలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ధూళిపాళ్ల నరేంద్ర పంచాయతీ కార్యాలయంలో దళిత మహిళాసర్పంచ్‌పై అసభ్యకరంగా మాట్లాడటంపై ఆమె నిరసన తెలిపారు. టీడీపీ శ్రేణులు జరిపిన దాడి ఘటనకు బాధ్యులైన ధూళిపాళ్ల నరేంద్రకుమార్, శివలింగప్రసాద్, ఎం.అశోక్, సత్యనారాయణ, సుబ్బారావు మరికొంతమందిపై కులంపేరుతో దూషించినట్లు, హత్యాయత్నం తదితర అంశాలపై కేసు నమోదు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ మాతంగి శ్యామల, భర్త శ్యామారావు, స్థానిక నాయకులు ఎస్ఐ వై.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. -
గుంటూరు: శేకురులో టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు చుక్కెదురు
-
టీడీపీ నేత ధూళిపాళ్లకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్‌ను ధార్మిక సంస్థల చట్ట నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేసుకోవాలంటూ దేవదాయ కమిషనర్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ట్రస్టీలు బుద్ధయ్యచౌదరి, రామలింగేశ్వరరావు వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. దేవదాయ శాఖ కమిషనర్ నోటీసులపై అభ్యంతరాలుంటే వాటిని రెండు వారాల్లో అధికారులకు సమర్పించాలని నరేంద్రకుమార్ తదితరులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ బుధవారం తీర్పు వెలువరించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. తమ ట్రస్ట్ దేవదాయ చట్ట నిబంధనల ప్రకారం ‘ధార్మిక సంస్థ’ నిర్వచనం పరిధిలోకి రాదన్నారు. అందువల్ల ధార్మిక చట్ట నిబంధనల కింద రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ల ట్రస్ట్ కార్యకలాపాలన్నీ ధార్మిక సంస్థల చట్ట నిబంధనల పరిధిలోకి వస్తాయని, ఈ ట్రస్ట్ ప్రజల నుంచి రూ.కోట్ల మేర విరాళాలు సేకరిస్తోందన్నారు. ఆదాయపు పన్ను నుంచి కూడా మినహాయింపు పొందుతోందని, పెద్ద మొత్తం స్థిరచరాస్తులున్నాయని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇటీవల తీర్పును రిజర్వ్ చేశారు. బుధవారం తీర్పు వెలువరిస్తూ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలతో ఏకీభవించారు. ధూళిపాళ్ల నరేంద్ర తదితరుల పిటిషన్లను కొట్టేశారు. -
ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులిచ్చిన కాకినాడ పోలీసులు
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు కాకినాడ పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఈ నెల నాలుగో తేదీన ఆయన ప్రెస్‌మీట్ పెట్టి డ్రగ్స్ రవాణా వ్యవహారంలో ప్రభుత్వానికి, పోలీసులకు గంజాయి వ్యాపారులతో సంబంధం ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చి పోలీసులు నోటీసును అందజేశారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను వారం రోజుల్లో అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. చదవండి: (ఫేక్ పోస్టును షేర్ చేసిన పురందేశ్వరి) -
Dhulipalla Narendra: సాక్షులను ప్రభావితం చేస్తున్నారుగా?
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు సోమవారం విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒక రోజు ముందు నోటీసు ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్ భవన్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించనని చెబుతూ బెయిల్ పొందిన ధూళిపాళ్ల.. అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగం డెయిరీ డైరెక్టర్లతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన డెయిరీ డైరెక్టర్లతో సమావేశం కావడమంటే.. వారిని ప్రభావితం చేసేందుకేనని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ధూళిపాళ్లను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు డెయిరీ వ్యవహారాల్లో ధూళిపాళ్ల కుటుంబం పాల్పడిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా డెయిరీకి చెందిన 10 ఎకరాలను తన కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేయడం, ఫోర్జరీ పత్రాలతో రూ.153 కోట్లు రుణాలు తీసుకుని దారి మళ్లించడం, ఇటీవల డెయిరీ ఖాతాల నుంచి రూ.50 కోట్లు ట్రస్టుకు మళ్లించడం మొదలైన విషయాలపై ఏసీబీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్టయినప్పుడు విచారణలో ధూళిపాళ్ల చెప్పినదానికి, ప్రస్తుత విచారణలో చెబుతున్నదానికి పొంతన లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. నిధులు మళ్లించలేదని ధూళిపాళ్ల మొదట్లో వాదించారు. కాగా ఏసీబీ అధికారులు తాజా విచారణలో ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించడంతో కంగుతిన్నారు. దీంతో ఆ నిధుల మళ్లింపునకు ఏవేవో కారణాలు చెబుతూ తన చర్యను సమర్థించుకునేందుకు విఫలయత్నం చేసినట్టు సమాచారం. కానీ సహకార చట్టం నిబంధనలను ఏసీబీ అధికారులు గట్టిగా ప్రస్తావించడంతో ఆయన చాలాసేపు మౌనం వహించారని తెలుస్తోంది. -
Dhulipalla Narendra Kumar: ధూళిపాళ్లపై ఈడీ కన్ను
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ కుంభకోణం కేసులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. తాజాగా ఆయన అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘిస్తూ డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల తమ కుటుంబ ట్రస్టుకు బదిలీ చేసి భారీ అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ పక్కాఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసి అక్రమార్కులపై కఠిన చర్యలకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మరోవైపు సొంత పార్టీలోనే ధూళిపాళ్లకు పరిస్థితులు ఎదురుతిరుగుతున్నాయి. దశాబ్దాలుగా కష్టపడ్డవారిని విస్మరించిన ఆయన తన స్వార్థం చూసుకున్నారని గుంటూరు జిల్లా టీడీపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు. ఆయనకు ఏ విధంగానూ సహకరించకూడదని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి నేతలు కూడా ఆయనకు అండగా నిలబడకుండా తూతూమంత్ర పరామర్శలతో సరిపెడుతున్నారు. ఇప్పటికే ప్రాథమిక ఆధారాల సేకరణ వందల కోట్ల విలువైన సంగం డెయిరీ ఆస్తులను ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం కొల్లగొట్టిన ఉదంతంపై ఈడీ తీవ్రంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఫోర్జరీ పత్రాలతో భారీ మొత్తాల్లో రుణం తీసుకోవడం, వాటికి లెక్కాపత్రం లేకపోవడంపై ఈడీ దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే తక్షణం రంగంలోకి దిగి ఈ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రస్టుకు వచ్చిన నిధులను నరేంద్ర దారి మళ్లించి ‘బ్లాక్’ చేసినట్లు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు లభించాయి. ► సంగం డెయిరీకి ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో 10 ఎకరాలను ధూళిపాళ్ల తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు బదిలీ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలా బదిలీ చేయడం సహకార చట్టంలోని 439 నిబంధనకు విరుద్ధమని ఈడీ గుర్తించింది. ఆ భూముల్లో తమ కుటుంబ ట్రస్ట్ పేరిట ఓ కార్పొరేట్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా తేల్చింది. ధూళిపాళ్ల భార్య జ్యోతిర్మయి ఆ ఆస్పత్రికి ఎండీగా ఉన్న విషయం గమనార్హం. ► సహకార సొసైటీని కంపెనీగా మార్చాలంటే ముందు ప్రభుత్వానికి బకాయిలు చెల్లించడంతోపాటు ప్రభుత్వ భూములను వెనక్కి ఇచ్చేసి నిరభ్యంతర పత్రం పొందాలి. ఈ నిబంధనలను కూడా ధూళిపాళ్ల పట్టించుకోలేదు. ► ఫోర్జరీ పత్రాలతో ధూళిపాళ్ల జాతీయ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) నుంచి రూ.115.58 కోట్లు రుణం తీసుకున్నారు. ఆ నిధులను తమ కుటుంబ ట్రస్ట్‌కు బదిలీ చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. ► సంగం డెయిరీ నిధులతో కొనుగోలు చేసిన 72.54 ఎకరాలను ధూళిపాళ్ల హస్తగతం చేసుకున్న విషయంపై ఈడీ కూపీ లాగుతోంది. ► సంగం డెయిరీ చైర్మన్‌గా ఉంటూనే సహకార చట్టాలకు విరుద్ధంగా ధూళిపాళ్ల సొంతంగా మిల్క్‌లైన్ అనే డెయిరీని నెలకొల్పడం, అనంతరం దానికి తన భార్య జ్యోతిర్మయిని ఎండీని చేయడంపై కూడా దృష్టి సారించింది. ► తాజాగా డెయిరీ నిధులు రూ.50 కోట్లను ధూళిపాళ్ల తమ సొంత ట్రస్ట్‌కు బదిలీ చేసిన విషయాన్నీ ఈడీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా మనీలాండరింగ్ పాల్పడి అక్రమాలకు పాల్పడ్డ ధూళిపాళ్ల నరేంద్రపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఈడీ సమాయత్తమవుతోందని కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ► సుదీర్ఘకాలంగా డెయిరీలో పనిచేస్తున్న ముఖ్యులను కాదని.. నిబంధనలకు విరుద్ధంగా నిధులను దారి మళ్లించడంతో వారంతా నరేంద్ర పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఈడీ జోక్యం చేసుకోనున్న నేపథ్యంలో వారంతా మౌనాన్ని ఆశ్రయించడం మేలనే భావనలో ఉన్నారు. ధూళిపాళ్లపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మరోవైపు ధూళిపాళ్లకు సొంత పార్టీ టీడీపీలోనే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆయన సొంత నియోజకవర్గం పొన్నూరుతో సహా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలిచేందుకు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు. భారీ అవినీతికి పాల్పడి ఆధారాలతో సహా దొరికిన ఆయనకు ఈ కేసులో శిక్ష పడటం ఖాయమని టీడీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక ఆయన అక్రమాలపై తాజాగా ఈడీ కూడా దృష్టి సారించడంతో టీడీపీలో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో ధూళిపాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. చదవండి: ఇనోదయ ఆస్పత్రిపై జాయింట్ కలెక్టర్ చర్యలు -
‘సంగం’ కేసులో దర్యాప్తు నిలుపుదలకు హైకోర్టు నో
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాలపై ఏసీబీ చేపట్టిన దర్యాప్తు ప్రక్రియను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఆ కంపెనీ ఎండీ గోపాలకృష్ణన్ కస్టడీ విషయంలో చట్ట నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని విజయవాడ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టును శుక్రవారం ఆదేశించింది. దర్యాప్తు ప్రక్రియపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకురావొచ్చని తెలిపింది. కంపెనీకి సంబంధించిన వ్యాపార వివరాలు, పాల ఉత్పత్తిదారుల వివరాలు కంపెనీ ప్రాంగణం దాటి బయటకు వెళ్లకూడదని దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది. కంపెనీ ప్రయోజనాలకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దంది. ఏ రోజు చేసిన దర్యాప్తు వివరాలు ఆ రోజు కంపెనీ ప్రతినిధుల సమక్షంలో పంచనామా రూపంలో రికార్డ్ చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. -
ఆ ఇద్దరికీ కరోనా పరీక్షలు చేయించండి
సాక్షి, అమరావతి/కంబాలచెరువు(రాజమహేంద్రవరం) : సంగం డెయిరీ అక్రమాల వ్యవహారంలో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి కరోనా పరీక్షలు చేయించాలని హైకోర్టు బుధవారం ఏసీబీ, రాజమండ్రి జైలు అధికారులను ఆదేశించింది. ఒకవేళ వారికి కోవిడ్ నిర్ధారణ అయితే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, ఎండీ గోపాలకృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్‌రావు బుధవారం విచారణ జరిపారు.ఏసీబీ తరఫు న్యాయవాది గాయత్రీరెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని, అందువల్ల విచా రణను వేసవి సెలవుల తరువాత చేపట్టాలని అభ్యర్థించారు. ధూళిపాళ్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఎండీ గోపాలకృష్ణన్‌కు కరోనా సోకిందన్నారు. మిగిలిన ఇద్దరు కూడా జైల్లో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆయుష్కు గోపాలకృష్ణన్ తరలింపు.. సంగం డెయిరీ అక్రమాల కేసు ఏ2 నిందితుడు గోపాలకృష్ణన్‌ను వైద్య చికిత్సల నిమిత్తం విజయవాడలోని ఆయుష్‌కి తరలించామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆయన ‘వైరల్ బ్రాంకో న్యూమోనియా’తో బాధపడుతున్నట్లు తెలిపారని చెప్పారు. -
నరేంద్ర తదితరుల విచారణకు ఏసీబీకి హైకోర్టు అనుమతి
సాక్షి అమరావతి: సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి టీడీపీ సీనియర్ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్, సహకారశాఖ మాజీ ఉద్యోగి గురునాథంలను ఏసీబీ అధికారులు ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటినుంచి నరేంద్రను 3 రోజులు, గోపాలకృష్ణన్‌ను రెండురోజులు, గురునాథంను ఒకరోజు విచారించవచ్చని ఏసీబీ అధికారులకు తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తదితరులను సంగం అక్రమాల కేసులో విచారించాల్సి ఉందని, అందువల్ల వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు నరేంద్ర తదితరులను 5 రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి.. ధూళిపాళ్ల తదితరుల విచారణకు ఏసీబీకి అనుమతి ఇచ్చారు. జీవో 19పై ముగిసిన వాదనలు మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 19ని సవాలు చేస్తూ సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ధర్మారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు నిన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారమే జీవో ఇచ్చామన్నారు. షరతులకు అనుగుణంగా నడుచుకోకుండా, నిబంధనలను ఉల్లంఘించినందునే సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్దంగా 10 ఎకరాల భూమిని ఆస్పత్రి నిర్మాణం నిమిత్తం ట్రస్ట్‌కు బదిలీ చేశారని తెలిపారు. డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయన్నారు. అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని చెప్పారు. అంతకుముందు పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. స్వాధీన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
Dhulipalla Narendra: ముగ్గురూ.. ముగ్గురే
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు నిందితులపై నేర నిరూపణకు అవసరమైన పక్కా కార్యాచరణతో మరింత లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఏ–1, ఏ–2, ఏ–3 నిందితులుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ప్రస్తుత ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా సహకార శాఖ మాజీ అధికారి (రిటైర్డ్ డీసీవో) ఎం.గురునాథంలను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో మాజీ ఎండీ కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు మరికొందరు నిందితులుగా ఉన్నారు. సంగం డెయిరీలో 1994 నుంచి 2000 వరకు జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. డెయిరీకి చెందిన ప్రభుత్వ ఆస్తులను కొట్టేసే భారీ స్కెచ్‌లో ఆ ముగ్గురూ ఎవరి పాత్ర వారు పోషించినట్టు నిగ్గు తేలుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురి పాత్రపై ఏసీబీ సేకరించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి. అప్పనంగా కట్టబెట్టేశారు రెండో ప్రధాన నిందితుడైన గోపాలకృష్ణన్ సహకార నిబంధనలను, చట్టాలను పట్టించుకోకుండా డెయిరీకి చెందిన పదెకరాల ప్రభుత్వ భూమిని ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ట్రస్ట్‌కు బదలాయించేశారు. ఆ భూమిని సంగం డెయిరీ అభివృద్ధి కోసం గతంలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీడీడీసీ) మిల్క్ కమిషనర్ పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమి. మూడో ప్రధాన నిందితుడైన గురునాథం సంగం డెయిరీని సహకార రంగం నుంచి కంపెనీగా మార్చేందుకు జరిగిన కుట్రలో కీలకమైన నకిలీ నిరభ్యంతర ధృవపత్రం (ఎన్వోసీ) సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారు. ఏదైనా సహకార సంఘం కంపెనీగా మారాలంటే ప్రభుత్వం భూములు, నిధులు వెనక్కి అప్పగించడంతోపాటు జిల్లా సహకార అధికారి (డీసీఓ) నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే గురునాథం పోర్జరీ వ్యవహారం జరిగింది. కంపెనీగా మార్చేందుకు 2011 సెప్టెంబర్ 24న తీర్మానం చేస్తే అంతకు ఏడు నెలల ముందు అంటే అదే ఏడాది ఫిబ్రవరి 26న గురునాథం ఫోర్జరీ ఎన్వోసీ సృష్టించారు. నా తరువాత రెండు రోజులకే ఆయన రిటైరయ్యారు. ఇలా సృష్టించిన ఎన్వోసీని జతచేసి 2012 సెప్టెంబర్‌లో కంపెనీగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు దరఖాస్తు చేసి 2013 జూన్ 18న ధూళిపాళ్ల సొంత కంపెనీగా మార్చేసుకున్నారు. తండ్రి పేరిట భూములు కొట్టేసిన ధూళిపాళ్ల 1973లో ఏర్పాటైన సంగం డెయిరీకి 1992లో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్ అయ్యారు. 1994 నుంచీ అక్రమాలకు తెరతీశారు. తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. డెయిరీ ఆస్తులను సొంత ప్రయోజనాలకు దారి మళ్లించేలా స్కెచ్ వేసి 10 ఎకరాలను సొంతం చేసుకున్నాడు. నిధుల దుర్వినియోగం, పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడటం వంటి తీవ్రమైన అభియోగాలు సైతం ధూళిపాళ్లపై ఉన్నాయి. డెయిరీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో పదెకరాలను సొంత ట్రస్ట్‌కు మళ్లించి.. ఫోర్జరీ పత్రాలతో ఎన్డీడీబీ నుంచి రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ భూమిలో సొంతంగా ఆస్పత్రి నిర్మించుకున్నారు. అంతేకాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడి సహకార డెయిరీని తన కంపెనీగా మార్చుకున్నాడు. తద్వారా డెయిరీకి, ప్రభుత్వానికి చెందిన దాదాపు రూ.700 కోట్ల విలువైన 72.54 ఎకరాలను, ఇతర ఆస్తులను సొంతం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేశాడు. రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల హైకోర్టు ఆదేశాల మేరకు సంగం డెయిరీ అక్రమాల కేసులో నిందితులైన ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్, గురునాథంలను ఏసీబీ అధికారులు ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హౌస్‌మోషన్ రూపంలో దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు శనివారం రాత్రి ఏసీబీ కస్టడీని రద్దు చేసింది. దీంతో తొలి రోజు విచారణ అనంతరం ముగ్గురు నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు ఆదివారం అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అప్పగించారు. కాగా, కేసు దర్యాప్తు సమాచారాన్ని ఏ మీడియా సంస్థలకు తాము ఇవ్వలేదని ఏసీబీ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వార్తలను కొన్ని పత్రికలు ప్రచురించాయని, దీనివల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అనధికార సమాచారాన్ని ప్రచురించవద్దని కోరింది. -
డెయిరీ భూముల్ని సొంత ట్రస్ట్‌కు ఎందుకు మళ్లించారు!
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: సంగం డెయిరీకి చెందిన ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా సొంత ట్రస్ట్‌కు ఎందుకు మళ్లించారని సంబంధిత కేసులో ప్రధాన నిందితుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు ప్రశ్నించారు. ‘రూ.కోట్ల విలువైన డెయిరీ ఆస్తులను కాజేసేందుకు పథకం ప్రకారం పోర్జరీ పత్రాలు సృష్టించింది నిజం కాదా? మీరు చేసిన అక్రమాల్లో ఎవరికి ఎటువంటి లబ్ధి కలగజేశారు? విచారణలో వాస్తవాలు చెప్పి కేసు దర్యాప్తునకు సహకరించండి’ అంటూ ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో శనివారం ఈ విచారణ సాగింది. సంగం డెయిరీ అక్రమాల కేసులో లోతైన దర్యాప్తుకోసం రిమాండ్‌లో ఉన్న ఏ1, ఏ2, ఏ3 నిందితులు ధూళిపాళ్ల, గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు తమ కస్టడీకివ్వాలని ఏసీబీ కోరగా.. కోర్టు అనుమతివ్వడం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణ, గురునాథంలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ముందు జాగ్రత్తచర్యగా ముగ్గురు నిందితులకు పీపీఈ కిట్లు వేసి విజయవాడ తీసుకొచ్చారు. ఏసీబీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విచారణ నిర్వహించారు. డెయిరీభూములను ట్రస్ట్‌కు మళ్లించటం, ఫోర్జరీ పత్రాలు సృష్టి అనే కీలక అంశాలపై పలు ప్రశ్నలు సంధించారు. నిందితులు ముగ్గురూ మితంగానే బదులిచ్చినట్టు సమాచారం. నిందితుల విచారణ సందర్భంగా విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొంది. ధూళిపాళ్ల నరేంద్రను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వచ్చారు. ఆయన్ను కలిసేందుకు అనుమతించాలంటూ న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఏసీబీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. తొలిరోజున విచారణ అనంతరం నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఏసీబీ ఉత్తర్వుల అమలు నిలిపివేత.. ఇదిలా ఉంటే.. ధూళిపాళ్ల నరేంద్రతోపాటు గోపాలకృష్ణన్, గురునాథంలను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపేసింది. నరేంద్ర తదితరులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. తమను ఐదురోజులపాటు ఏసీబీ కస్టడీకిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్ రూపంలో పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
సగం డెయిరీని పథకం ప్రకారమే లూటీ చేశారు: రైతులు
-
Dhulipalla Narendra Kumar: ఏసీబీ కస్టడీకి ధూళిపాళ్ల
సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో ప్రధాన నిందితుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌తోపాటు మరో ఇద్దరు నిందితులను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కస్టడీకి అనుమతిస్తూ విజయవాడ ఏసీబీ స్పెషల్ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. సంగం డెయిరీలో అక్రమాలు, అవకతవకలకు పాల్పడిన నరేంద్ర, అతడికి సహకరించిన మరికొందరిపై ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీడీడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ బాబు.ఎ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం–1988లోని 13(1)(సీ)(డీ), ఐపీసీ సెక్షన్ 408, 409, 418, 420, 465, 471, 120బి రెడ్ విత్ 34 కింద ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు సంగం డెయిరీ ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా కో ఆపరేటివ్ రిటైర్డ్ అధికారి ఎం.గురునాథం, గతంలో ఎండీగా పనిచేసిన కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు, మరికొందరు నిందితులుగా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ ప్రాథమికంగా కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. దస్తావేజులు, ఫోర్జరీ పత్రాలను కూడా స్వాధీనం చేసుకుంది. పాల ఉత్పత్తిదారుల సొసైటీ ఏర్పాటు దగ్గర్నుంచి దాన్ని ప్రైవేటు కంపెనీగా మార్చుకునే వరకు కోట్ల విలువైన ఆస్తులను కొట్టేసేందుకు పక్కా పథకం ప్రకారమే జరిగినట్టు ఏసీబీ నిగ్గు తేల్చింది. ఈ కేసులో ధూళిపాళ్లతోపాటు పి.గోపాలకృష్ణన్, ఎం.గురునాథంలను ఈ నెల 23న ఏసీబీ అరెస్టు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో ఈ నెల 24న రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని, రిమాండ్‌లో ఉన్న ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు, బెయిల్ ఇవ్వాలని ధూళిపాళ్ల కోర్టును కోరారు. ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఏసీబీ కస్టడీకి ఇస్తూ అనుమతి ఇచ్చింది. దీంతో మే 1 నుంచి 5వ తేదీ వరకు ధూళిపాళ్లతోపాటు గోపాలకృష్ణ, గురునాథంలను ఏసీబీ విచారించనుంది. శనివారం ఉదయం ఏసీబీ ప్రత్యేక బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి ముగ్గురిని కస్టడీలోకి తీసుకోనున్నట్లు ఏసీబీ అధికారి ఒకరు వెల్లడించారు. -
కేసుపెడితే చాలు.. కక్షసాధింపేనట!
ప్రభుత్వం పెత్తనం తగ్గించి సహకార రంగ అభివృద్ధి పేరుతో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ తెచ్చారు. అప్పట్లో ఐఏఎస్ అధికారిగా ఉన్న జయప్రకాష్ నారాయణ ఈ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు మొత్తం డెయిరీ ఇండస్ట్రీని కబ్జా చేశారు. తెలివిగా ముందు మాక్స్ చట్టంలోకి మారి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి కుటుంబం పెత్తనం కిందకు వచ్చేసిందన్నమాట. ఇవన్నీ పక్కనపెట్టి ఏసీబీ వారు కేసుపెడితే చాలు కక్ష సాధింపు అనే తరహా ప్రచారం ఏపీ రాజకీయాల్లోనే సాధ్యమేమో అనిపిస్తోంది. తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు వ్యవహారం సహజంగానే దుమారం రేపుతోంది. ధూళిపాళ్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ మొదలు, పలువురు టీడీపీ నేతలు ఇది రాజకీయ కక్ష అని వరుస ప్రకటనలు ఇచ్చారు. టీడీపీకి దాదాపు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఒక పత్రిక యజమాని కూడా ఒక సలహా ఇచ్చారు. తాను అనుకున్న జాబితా ప్రకారం టీడీపీ నేతలపై జగన్ కక్ష సాధిస్తున్నారని, ఆయన లిస్టులో ఉన్న టీడీపీ నేతలంతా స్వచ్ఛందంగా జైలుకు వెళ్లడం మంచిదని సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు అక్రమాలకు పాల్పడింది వారికే తెలుసు కనుక, స్వచ్ఛందంగా ఆ కేసుల వివరాలు వెల్లడించి లొంగి పోతే బెటర్ అని ఆ పత్రికాధిపతి సలహా ఇచ్చి ఉంటే బావుండేది. మీడియా అయినా, ప్రతిపక్ష టీడీపీ అయినా ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఉండాల్సింది. ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ పెట్టిన అభియోగాలు ఏమిటి? అవి వాస్తవమైనవా? కాదా? అందుకు ఆధారాలు ఉన్నాయా? లేవా అన్న వాటి జోలికి వెళ్లకుండా, కక్ష అంటూ కోరస్ సాంగ్ పాడుతున్నారు. వారికి బ్యాండ్ బాజాగా ఒక వర్గం మీడియా వాయిస్తోంది. నిజానికి ఈ మీడియానే గతంలో టీడీపీ మునిగిపోవడానికి కారణమని, వాస్తవాలు తెలియనివ్వకుండా భజన చేసి చంద్రబాబును ముంచారని, ఇప్పటికీ చెత్తపలుకు అనో, మరొకటి అనో అదే పని చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ధూళిపాళ్లపై తప్పుడు కేసు పెడితే ఎవరూ అంగీకరించకూడదు. రాజ కీయ కక్ష అయితే ఎవరూ సమర్థించకూడదు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ టీడీపీ అధినేతతో సహా పలువురు టీడీపీ నేతలకు కూడా సంగం డెయిరీలో జరిగిన అక్రమాలు తెలుసు. ధూళిపాళ్ల మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు ఏమి సమాధానం ఇచ్చారో కూడా టీడీపీ వారికి తెలుసు. సంగం డెయిరీలో జరుగుతున్న విషయాలను ఆయన ప్రస్తావించారని అంటారు. కానీ ఇప్పుడు అదే బాబు దీనిని రాజకీయ కక్ష అనో, అమూల్ కంపెనీ కోసం సంగం డెయిరీని బలి చేస్తున్నారనో ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి అమూల్ వచ్చిన తర్వాత ఏపీలో పోటీ పెరిగి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో సహా అన్ని పాల కంపెనీలు ఐదు నుంచి ఏడు రూపాయలు అదనంగా రైతులకు చెల్లించవలసి వస్తోంది. దీనిని మనసులో పెట్టుకుని చంద్రబాబు ఈ విమర్శ చేసి ఉండవచ్చు. అమూల్ పూర్తిగా రైతుల సంస్థ. అది ఏ ఒక్కరి సొంతం కాదు. కానీ ఏపీలో ఏం జరిగింది? ప్రభుత్వం పెత్తనం తగ్గించి సహకార రంగ అభివృద్ధి పేరుతో మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ తెచ్చారు. అప్పట్లో ఐఏఎస్ అధికారిగా ఉన్న జయప్రకాష్ నారాయణ ఈ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు మొత్తం డెయిరీ ఇండస్ట్రీని కబ్జా చేశారు. తెలివిగా ముందు మాక్స్ చట్టంలోకి మారి, ఆ తర్వాత ప్రొడ్యూసర్ కంపెనీగా మార్చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి కుటుంబం పెత్తనం కిందకు వచ్చేసిందన్నమాట. సంగం డెయిరీలో నరేంద్ర రాజకీయాన్ని మరో టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర వర్గం కానీ, దివంగత నేత కోడెల శివప్రసాదరావు వర్గం కానీ వ్యతిరేకించాయో, లేదో టీడీపీ గుంటూరు జిల్లా నాయకులను అడిగితే చెబుతారు. ధూళిపాళ్ల అరెస్టు అన్యాయం అని చంద్రబాబు కానీ, మరే నేత కానీ భావిస్తే ఏ రకంగా అక్రమమో చెప్పాలి. సంగం డెయిరీలో అక్రమాలు జరగలేదని వారు చెప్పడం లేదు. నకిలీ పత్రాలు పెట్టి 116 కోట్ల రుణం తీసుకున్నది అవాస్తవం అని వారు ఖండించినట్లు కనపడలేదు. నరేంద్ర తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుకు పదెకరాల భూమి బదిలీ చేయడం, ఆ ట్రస్టులో తన కుటుంబ సభ్యులకే పెత్తనం ఇవ్వడం వంటివి జరగలేదని వీరు అనడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా అలా భూమి బదిలీ చేయలేదని వీరు చెప్పడం లేదు. సొసైటీలకు బోనస్ పేరుతో ఏ రకంగానూ నిధుల దుర్వినియోగం జరగలేదని వీరు అనడం లేదు. సంగం డెయిరీని ప్రైవేటు సంస్థగా మార్చేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించారా లేదా అన్నదానికి వీరు బదులు ఇవ్వడం లేదు. నరేంద్ర మొత్తం సంగం డెయిరీని తన సొంత సంస్థగా మార్చారా లేదా? వీటిలో ఏ ఒక్కటి వాస్తవం కాదని టీడీపీ నేతలు చెప్పగలిగితే అప్పుడు రాజకీయ కక్ష అని ఆరోపించినా అర్థం ఉంటుంది. సంగం డెయిరీలోనే కాదు. ఇతర జిల్లాలలో కూడా ఆ పరిశ్రమలో జరిగిన అవకతవకలను బయటకు తీసుకు వచ్చి క్షాళన చేస్తే మంచిదే. చిత్తూరు సహకార డెయిరీ ఎలా మూతపడిందీ అందరికీ తెలుసు. చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సహకార డెయిరీ పరిశ్రమను ఎలా దెబ్బతీసిందీ ఆ రంగంలోని వారికి తెలుసు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆమె హెరిటేజ్‌పై పలు ఆరోపణలు చేశారు. కొందరు మాత్రం సంగం డెయిరీ వ్యవహారంపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ఎసీబీ పరిధిలోకి వస్తుందా? అన్న ప్రశ్న వేస్తున్నారు. అది లీగల్‌గా చూసుకోవలసిన అంశం. అందులో ఏదైనా తప్పు ఉంటే ఏసీబీ వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించారు కనుక ఏసీబీ పరిధిలోకి వస్తుందని కొందరు వివరిస్తున్నారు. సంగం డెయిరీలో జరిగిన అక్రమాల గురించి వెలికి తీయడం తప్పు కాదని, కాని నరేంద్రను అరెస్టు చేసిన తీరు సరికాదని కొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెల్ల వారుతూనే పోలీసులు పెద్ద సంఖ్యలో నరేంద్ర గ్రామానికి వెళ్లి అరెస్టు చేయాలా అని అంటున్నారు. కాని వాస్తవ రాజకీయ పరిస్థితులు వీరికి తెలియవా? ముందుగా తాము వస్తున్నామని పోలీసులు చెబితే ఏ నిందితుడు అయినా అక్కడే ఉంటారా? తనకు ఏదో రకంగా ముందస్తు బెయిల్ వచ్చేవరకు తప్పించుకుని తిరుగుతున్న కేసులు ఎన్ని చూడడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా స్కాములు చేసినవారికి సంబంధించి కొన్ని వార్తలను కూడా ప్రచారం చేయవద్దని ఆదేశించిన ఘట్టాలు చూసిన తర్వాత కూడా అలా అరెస్టు చేయాలి? ఇలా అరెస్టు చేయాలి? అని ఎలా చెప్పగలరు. ఒకప్పుడు మీడియా ఏదైనా స్కామ్ సమాచారం తెలిస్తే, అందులోని వాస్తవాలను పరిశోధించి రాసేవి. కానీ ఇప్పుడు కుంభకోణాలు చేసినవారికి కొండంత అండగా ఉండడానికి ఒక వర్గం మీడియా పోటీ పడుతోంది. దీనిని బట్టే ఏపీలో రాజకీయం, మీడియా ఏ రకంగా కలిసిపోయి కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారాలలో ప్రభుత్వంవైపు తప్పు ఉంటే నిరభ్యంతరంగా చెప్పవచ్చు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కుంభకోణాలకు మద్దతు ఇచ్చే దైన్యస్థితికి కొన్ని ప్రముఖ పత్రికలు పడిపోవడం గర్హనీయమే అని చెప్పాలి. సంగం డెయిరీలో జరిగిన పరిణామాలపై, ఆ పరిశ్రమతో సంబంధాలు కలిగి, టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక మాజీ అధికారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా అవినీతిని బయటకు తీసుకువచ్చారని, దానిని స్వాగతిస్తున్నానని అన్నారు. ఇంకా మరి కొన్ని జిల్లాలలో కూడా ఇలాంటి అక్రమాలను వెలికితీసి పాడిపరిశ్రమను బాగు చేస్తే రైతులకు ఉపయోగం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ ప్రభుత్వం ధైర్యంగా ఆయా జిల్లాలలో పాడి పరిశ్రమకు సంబంధించి జరిగిన అక్రమాలను బయటకు తెచ్చి, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చేయగలిగితే ఎవరెన్ని రాజకీయ విమర్శలు చేసినా పట్టించుకోనవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
దూళిపాళ్ల అక్రమాలు బయటపెట్టాలి
-
ధూళిపాళ్ల సోదరుడిపై మత్య్సకారుల ఆగ్రహం
-
సురేంద్ర మా జీవితాలతో ఆటలాడుకుంటున్నారు..
సాక్షి, అమరావతి: అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడిపై రాజధాని ప్రాంత మత్య్సకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న అధికారం అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న సురేంద్రపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి మత్య్సకారులు ప్రయత్నించారు. అయినా వారిని కలిసేందుకు చంద్రబాబు సమయం ఇవ్వలేదు. వివరాల్లోకి వెళ్తే.. అధికార బలంతో సురేంద్ర తమ పొట్టకొడుతున్నారని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచి యూనిట్ ఇసుకను ఒడ్డుకు తరలిస్తే 400 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.. కానీ సురేంద్ర తమకు 150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. మూడేళ్ల నుంచి సురేంద్ర తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. యూనిట్ ఇసుకను తరలిస్తే 400 రూపాయలు ఇవ్వాలని కోరితే అన్న అధికారం అడ్డంపెట్టుకుని తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నట్టు తెలిపారు. ఇసుక ర్యాంపులపై జోక్యం చేసుకుంటున్న సురేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చేదు అనుభవం!
పొన్నూరు: అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎస్సీలకు కేటాయించిన భూమిలో వాటర్ ట్యాంక్ శంకుస్థాపనకు వచ్చిన నరేంద్రను గ్రామస్థులు అడ్డుకుని నిలదీశారు. చట్టాలను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఆ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని బాధితులు వాపోయారు. మండల పరిధిలోని తాళ్ళపాలెంలో ఎస్సీలకు కేటాయించిన ఇళ్ల స్థలంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంచినీటి పథక ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. దీంతో బాధితులు తమ స్థలాల్లో ఏ విధంగా నిర్మాణాలు చేస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. దీనిపై ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ స్పందిస్తూ అప్పటి అధికారులు ఇచ్చిన పట్టాలు నకిలీవి అని తేల్చి చెప్పారు. ఈ స్థలాలను ఆర్డీవో రద్దు చేశారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన బాధితులు తమకు ప్రభుత్వం 2005లో నివేశన స్థలాలు కేటాయించి ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా ఎలా రద్దు చేస్తుందని మండిపడ్డారు. ఎమ్మెల్యే శంకుస్థాపనకు వెళుతుండగా ఎస్సీలు అడ్డుకున్నారు. దీంతో అక్కడే ముందస్తుగా ఉన్న పోలీస్ బలగాలు బాధితులను నిలువరించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కక్ష సాధిస్తున్నారు గ్రామంలో అధికార పార్టీ చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నామని మాకు కేటాయించిన స్థలాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ నాయకులు ప్రజావ్యతిరేక పనులు చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు.– అద్దేపల్లి సంఘమేశ్వరావు న్యాయపోరాటం చేస్తాం ప్రభుత్వం స్థలం ఇచ్చే సమయంలోనే అన్ని జాగ్రతలు తీసుకోని స్థలాలను కేటాయిస్తుంది. స్థలాలు మంజూరు చేసే సమయంలో రెవెన్యూ అధికారులు పదిసార్లు పరిశీలించిన తరువాత కానీ పట్టాలు మంజూరు చేయరు. కేవలం ఎస్సీలకు కేటాయించారనే స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు ఎస్సీలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనిపై గతంలో కోర్టును ఆశ్రయించాం. నేడు ఎస్సీల స్థలాలో నిర్మాణం చేస్తున్న, చేయిస్తున్న అందరిపై న్యాయ పోరాటం చేస్తాం.– ఎం.అన్నపూర్ణ -
'ధూళిపాళ నరేంద్రకు అన్యాయం'
అమరావతి: ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ అధికార టీడీపీలో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. మంత్రి పదవులు దక్కకపోవడంతో పార్టీ సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా నాయకుల మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. ధూళిపాళ్ల నరేంద్రకు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన మద్దతుదారులు గుంటూరు జిల్లా చింతలపూడిలో రాస్తారోకో చేశారు. మరోవైపు ధూళిపాళ్ల నివాసం వద్ద కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీకి రాజీనామా చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. ధూళిపాళకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. కార్యకర్తలు అభీష్టం మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడినట్టు తెలుస్తోంది. దూళిపాళ్లను బుజ్జగించేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆయనను బుజ్జగించే బాధ్యత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించినట్టు సమాచారం.