
సాక్షి, అమరావతి: అధికార పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సోదరుడిపై రాజధాని ప్రాంత మత్య్సకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న అధికారం అడ్డంపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్న సురేంద్రపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి మత్య్సకారులు ప్రయత్నించారు. అయినా వారిని కలిసేందుకు చంద్రబాబు సమయం ఇవ్వలేదు.
వివరాల్లోకి వెళ్తే.. అధికార బలంతో సురేంద్ర తమ పొట్టకొడుతున్నారని మత్య్సకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది నుంచి యూనిట్ ఇసుకను ఒడ్డుకు తరలిస్తే 400 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది.. కానీ సురేంద్ర తమకు 150 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. మూడేళ్ల నుంచి సురేంద్ర తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. యూనిట్ ఇసుకను తరలిస్తే 400 రూపాయలు ఇవ్వాలని కోరితే అన్న అధికారం అడ్డంపెట్టుకుని తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నట్టు తెలిపారు. ఇసుక ర్యాంపులపై జోక్యం చేసుకుంటున్న సురేంద్రను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment