sand mafia
-
జనసేన టీడీపీ మధ్య ఇసుక వేస్తే భగ్గుమనేలా..!
కృష్ణా, సాక్షి: ఏపీలో కూటమి నేతల మధ్య ‘ఇసుక మాఫియా’ కోసం ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఈ విషయంలోనూ టీడీపీనే పైచేయి సాధిస్తోంది. తాజాగా అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఇసుక పంచాయతీ కొట్టుకునేదాకా తీసుకెళ్లింది. ఆ వీడియోలు ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కి వైరల్ అవుతున్నాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళం ఇసుక క్వారీపై టీడీపీ నేతల ఆధిపత్యం కొనసాగుతోంది. పగలూ రాత్రీ తేడాలేకుండా ఇసుక తరలిస్తూ.. పార్టీకి చెందిన వాళ్లకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన తరఫు వాళ్లకు మాత్రం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. విషయం తెలిసి రేటు విషయంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జనసేనవాళ్లను అసభ్యంగా తిట్టడంతో అది బాహాబాహీకి దారి తీసింది. ఇరు పార్టీల వాళ్లు అర్ధరాత్రి రోడ్డునపడి కొట్టుకున్నారు. ఈ ఘటనలో క్వారీ క్యాష్ కౌంటర్ సూపర్ వైజర్ అఖిల్‌కు గాయాలయ్యాయి. అనంతరం గొడవ.. ఘంటసాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీసులు కాంప్రమైజ్‌కు ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో కేసు నమోదు చేసి లారీ, జేసీబీని సీజ్ చేశారు. అయితే విషయం తెలిసిన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు , అల్లుడు రంగంలోకి దిగారు. కేసు లేకుండా రాజీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఘర్షణ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఇసుక దోపిడీతో వంద కోట్లకు సోమిరెడ్డి స్కెచ్: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సర్వేపల్లి నియోజకవర్గంలో వంద కోట్ల మేర ఇసుక దోపిడీకి సోమిరెడ్డి స్కెచ్ వేశారని తెలిపారు. రీచ్‌లకు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి కాకాణి తాజాగా నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి పాలన అంతా దోపిడీమయమే. సర్వేపల్లి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దోపిడీకి స్కెచ్ వేశారు. ఇటీవల జిల్లా మైనింగ్ అధికారి ఇరువూరు వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీ, టిప్పర్లను పట్టుకున్నారు. ఈ రీచ్‌కు అనుమతి లేకపోయినా ఇసుకను తవ్వుతున్నారు. వాహనాలను పట్టుకున్న అధికారులను సోమిరెడ్డి బెదిరించారు. రీచ్‌లో ఇసుకను తీసుకెళ్లే దారులను తెగ్గొట్టారు.టీడీపీ నేతలు సూచించిన దారుల్లోనే వెళ్లాలని చెబుతున్నారు. ఇష్టానుసారంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. అధికారులను బెదిరించి మరీ సోమిరెడ్డి దోచుకుంటున్నారు. పూడికలు తీయకుండానే బిల్లులు చేసుకున్నారు. దీనివల్ల నీరు చివరకు చేరక రైతులు ఇబ్బంది పడుతున్నారు. సర్వేపల్లిలో అనధికార బార్లను నిర్వహిస్తున్నారు. ఇసుక, నీటి పారుదల, గ్రావెల్‌లలో అక్రమాలతో పాటు అనధికారికంగా బెల్ట్ దుకాణాలు.. బార్లను కొనసాగిస్తున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. జిల్లాకు కలెక్టర్, ఎస్సీలు ఉన్నా.. వారు లేనట్టుగానే ఉంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. -
టీడీపీ ఇసుక మాఫియా అరాచకం.. కర్రలతో దాడియత్నం!
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. తాజాగా అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేసిన వైఎస్సార్సీపీ నేతలపై ఇసుక మాఫియా దాడులు చేసింది. వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో టీడీపీ ఇసుక మాఫియా దాడులకు తెగబడింది.వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం బొడ్డేపల్లి గ్రామం వద్ద టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యదేచ్చగా ఇసుక అక్రమ రవాణాకు టీడీపీ నేతలు పాల్పుడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతలు ఇసుక తవ్వకాలు జరుపుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వకాలు, అక్రమ తరలింపును వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో ఆముదాలవలస వైఎస్సార్సీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్, పార్టీ నేతలు తాజాగా అనధికార ఇసుక ర్యాంపు వద్దకు వెళ్లి పరిశీలించారు. దీంతో, ఇసుక మాఫియా వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకుంది. టీడీపీ ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అనంతరం, వైఎస్సార్సీపీ నేతలపై కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, టీడీపీ నేతలు జిల్లాలోని నాగావళి, వంశధార నదుల్లో ఇష్టానుసారం ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.ఈ సందర్భంగా చింతాడ రవి కుమార్ మాట్లాడుతూ.. ఇసుక అక్రమ రవాణా చేస్తూ టీడీపీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన మాపై దాడులు చేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో అనేక చోట్ల ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నాడు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ కోట్ల రూపాయలను దోచుకుంటున్నాడు. ఇసుక మాఫియా దాడులు చేసినా.. అక్రమ రవాణాపై పోరాడుతూనే ఉంటాం. రైల్వే బ్రిడ్జ్ ఆనుకొని 100 మీటర్ల దూరంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు. -
గాజువాకలో ఇసుక దందా
-
ఇసుకాసురులపై జనాగ్రహం
నగరి: చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ పరిధి సత్రవాడ వద్ద కుశస్థలి నది నుంచి ఇసుకను ఎడాపెడా తరలించేయడం, కాలకృత్యాలు తీర్చుకోవడానికి యేటిగట్టుపైకి వెళ్లే మహిళలను ఫొటోలు, వీడియోలు తీస్తూ అసభ్యకరంగా ప్రవర్తించడంపై స్థానిక గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్రవాడ, వినాయకపురం గ్రామాలకు చెందిన మహిళలు బుధవారం సత్రవాడ సచివాలయం ఎదురుగా రోడ్డుపై బైటాయించి రాకపోకలను స్తంభింపజేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో ఇసుక ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుకను దోచుకెళుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక తరలింపుదారులు యేటిగట్టుకు వెళ్లే మహిళల ఫొటోలు, వీడియోలు తీస్తున్నారని మండిపడ్డారు. -
రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
తవ్వేస్తాం.. దోచేస్తాం అంటున్న తెలుగు తమ్ముళ్లు!
-
టీడీపీ నేతల ఇసుక దోపిడీతో మాకు పనిలేకుండా పోయింది..
-
తూర్పుగోదావరి జిల్లాలో యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
-
కలియుగ కుంభకర్ణుడు.. మందు కొట్టి నిద్రపోతున్న చంద్రబాబు.. జగ్గిరెడ్డి కామెంట్స్
-
తవ్వుకోవడం.. అమ్ముకోవడం కూటమి నేతల కనుసన్నల్లోనే..!
-
ద్వారకా తిరుమల మండలంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
-
ఇసుక దందాతో తాగునీటికి కటకట
సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఇసుక దందా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర సరిహద్దులు దాటి ఏకంగా జాతీయ స్థాయికి చేరింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భ జలాలు అడుగంటాయని, తాగునీటికి కటకట తప్పదని వేటపాలెం మండలం పుల్లరిపాలెంలోని సాయి ఎస్టీ కాలనీ వాసులు యానాది హక్కుల పరిరక్షణ సంఘం పేరున నవంబర్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.‘రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎస్టీ కాలనీ సమీపంలోని ఇసుక దిబ్బల నుంచి ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పరిసర ప్రాంతాల్లోని అసైన్డ్ భూముల్లో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉండడంతో తవ్వకాల వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన కొందరికి అప్పగించారు. ఈ వ్యవహారంలో స్థానిక నేతకు పెద్దఎత్తున ముడుపులు ముడుతున్నట్లు సమాచారం. వేటపాలెం ప్రాంతం నుంచి బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు హైదరాబాద్‌కు సైతం ఇసుక భారీగా తరలిపోతోంద’ని వారు వివరించారు. ఈ విషయమై తక్షణం విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు అందాయి. అయితే అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులు నవంబర్ 27న తొలి విచారణ సందర్భంగా బాధితులనే బెదిరించారు. ఈ విషయమై ఎస్టీలు మరోమారు జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తహసీల్దార్, పోలీసు, ఇతర అధికారులతో కూడిన బృందం ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ విచారించాలని ఆదేశించింది. కాగా, తాము చెప్పినట్లు విచారణలో చెప్పాలని, ఇక్కడ ఎటువంటి ఇసుక తవ్వకాలు జరగడంలేదని అధికారులు రాసిన పేపర్లలో సంతకాలు పెట్టాలని అధికార పార్టీ నేతలు.. ఎస్టీలను బెదిరించినట్లు సమాచారం. మాపైనే ఫిర్యాదు చేస్తారా.. అని అధికారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తాము న్యాయవాదిని నియమించుకుని సమాధానం ఇస్తామని శుక్రవారం విచారణకు వచి్చన అధికారులకు బాధితులు తేల్చి చెప్పారు.మామూళ్ల మత్తులో అధికారులు! వేటపాలెం ప్రాంతంలో ఇప్పటికే కనుచూపు మేర రొయ్యల చెరువులు వెలిసి, కెమికల్స్ ప్రభావంతో భూగర్భ జలాలు కలుషితమయ్యాయని, ఇప్పుడు ఇసుక తవ్వకాల వల్ల వేసవిలో తాగునీటి కోసం తమ కుటుంబాలకు ఇబ్బందులు తప్పవని యానాది హక్కుల పరిరక్షణ సంఘం ప్రెసిడెంట్ ఇండ్ల స్వాతి, సెక్రటరి పోలయ్య, కాలనీ వాసులు వాపోతున్నారు. ఈ విషయమై మండల, జిల్లా అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచి్చంది. అయినా కొందరు అధికారులు ఇసుక మాఫియా నుంచి నెల మామూళ్లు పుచ్చుకుంటుండటంతో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని సమాచారం. -
కూటమి అండతో ఇసుక దందా
-
పోలవరం కాలువ గట్లపై మట్టిని తవ్వేస్తున్న జనసేన, టీడీపీ నేతలు
-
ఇసుక ఫ్రీ ఫ్రీ ఫ్రీ..
-
గూడెం ఎమ్మెల్యే మట్టి మాఫియా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం మట్టి మాఫియాకు కేంద్రంగా మారింది. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని తాడిపూడి కాల్వ గట్లకు ప్రభుత్వ విప్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తూట్లు పొడుస్తున్నారు. ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వందలాది లారీల మట్టిని స్వాహా చేస్తున్నారు. ఇందులో దాదాపు 300కు పైగా లారీల మట్టితో ఎమ్మెల్యేకు చెందిన స్కూల్ గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు. దీని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని అంచనా. నియోజకవర్గంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట, గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని తెలికిచర్లలో గ్రావెల్ తవ్వకాలకు ఎమ్మెల్యే తెగబడ్డారు. వారం రోజుల క్రితం వరకు జనసేన, టీడీపీ చోటా నేతలు గ్రావెల్ తవ్వకాలు కొనసాగించగా.. ఆ తరువాత ఎమ్మెల్యే బొలిశెట్టి రంగంలోకి దిగి సొంతంగా దందా నిర్వహిస్తున్నారు. జగ్గన్నపేటలో ఉన్న తాడిపూడి గట్లను ఆనవాళ్లు లేకుండా ధ్వంసం చేస్తున్నారు. దీంతోపాటు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి వలవల బాబ్జికి గ్రావెల్ వంతు వచ్చింది. సోమవారం నుంచి ఆయనకు చెందిన లేఅవుట్లు, స్థలాలకు జగ్గన్నపేట నుంచే గ్రావెల్ తవ్వకం ప్రారంభమైంది. అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలకు పోలీస్ కౌన్సెలింగ్పార్టీ కోసం తాము తంటాలు పడుతుంటే.. తమ ఊళ్లోకి ఎవరో వచ్చి మట్టి తవ్వకుంటున్నారంటూ జగ్గన్నపేటకు చెందిన ఐదుగురు టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే లారీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. అడ్డుకున్న ఐదుగురినీనాలుగు రోజుల నుంచి తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచి పంపుతూ కౌన్సెలింగ్ పేరిట పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.స్పందించని జిల్లా కలెక్టర్ఈ విషయంపై కలెక్టర్ చదలవాడ నాగరాణికి ఫిర్యాదు చేయడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ నేత కొట్టు సత్యనారాయణ పలుసార్లు ఫోన్ చేసినా ఆమె స్పందించని పరిస్థితి నెలకొంది. స్థానికులు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లినా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. -
నెల్లూరులో మంత్రి నారాయణ అనుచరుల బరితెగింపు
-
రెచ్చిపోయిన టీడీపీ ఇసుక మాఫియా.. జనసేన నేతపై దాడి
అనకాపల్లి : హోం మంత్రి అనిత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు కోటవురట్ల మండలంలో టీడీపీ, జనసేన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు.అయితే, ఇసుక అక్రమ రవాణా తరలింపులో కూటమి నేతల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు. టీడీపీ నేతలు జనసేన నేత కోన మౌళిపై గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన కోన మౌళిని అత్యవసర చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇసుక అక్రమ రవాణపై ఇరు పార్టీ నేతలు చేసుకున్న దాడుల్ని భూతగాదా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మితిమీరిన టీడీపీ ఇసుక దందా..ఉమా శంకర్ గణేష్ ఫైర్
-
ఉచిత ఇసుక ఊరికే రాదు .. డబ్బులిస్తే మాత్రం .
-
Andhra Pradesh: కాసులకే ఇసుక
⇒ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో శనివారం 20 టన్నుల ఇసుక కోసం ఓ వినియోగదారుడు అధికారికంగానే రూ.18,570 చెల్లించాడు. ఇదికాకుండా లోడ్ చేసినందుకు రూ.3 వేలు, టోల్గేట్ రూ.660, ఇతరాలన్నీ కలిపి ఇంటికి వెళ్లేసరికి రూ.25 వేలు సమర్పించుకున్నాడు. ⇒ విశాఖలో 20 టన్నుల ఇసుకను రూ.45 వేలకుపైగా చెల్లించి కొనాల్సి వస్తోంది. విజయవాడలోనూ 20 టన్నుల ఇసుక రూ.25 వేలకు తక్కువ దొరకడం లేదు.సాక్షి, అమరావతి:డబ్బులెవరికీ ఊరికే రావు..! ఉచిత ఇసుక కూడా ఊరికే రాదు!!డబ్బులిస్తే మాత్రం ఉచితంగానే వస్తుంది!!విచిత్రంగా ఉన్నా ఇది నిజం! ఉచిత ఇసుక అంటూ రకరకాల విన్యాసాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రీచ్‌లను పచ్చముఠాల చేతుల్లో పెట్టేసి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది. ఉచితంగా ఇస్తున్నామని నమ్మబలుకుతూ వినియోగదారుల ముక్కు పిండి వసూలు చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాధారణ ధరకు ఇసుక దొరికే పరిస్థితి లేకుండాపోయింది. 20 టన్నుల లారీ ఇసుక రూ.25 వేల నుంచి రూ.45 వేలకు పైనే పలుకుతోంది. ట్రాక్టర్ ఇసుకను రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత డబ్బులు కట్టాక ఇక ఉచితం ఏమిటని వినియోగదారులు వాపోతున్నారు. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయగా కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే 40 లక్షల టన్నులను పచ్చముఠాలు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం తెలిసిందే. మిగతా ఇసుకను సైతం ఊడ్చేసి నిర్మాణ రంగాన్ని కుదేలు చేయడంతో 40 లక్షల మందికిపైగా కార్మికులు జీవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. వసూళ్లు మామూలేఇసుకపై జీఎస్టీ, సీనరేజీ చార్జీలు రద్దు చేశామంటూ ఇటీవల మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి సర్కారు ప్రకటించింది. అయితే వసూళ్లు మాత్రం ఆగలేదు. తవ్వకం, లోడింగ్ చార్జీలతోపాటు జీఎస్టీ ముక్కుపిండి వసూలు చేస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రీచ్‌లన్నీ ప్రైవేట్ చేతిలో పెట్టేసి..ఇసుక రీచ్‌లను టెండర్ల ప్రక్రియ నిర్వహించి మరీ ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించిన కూటమి సర్కారు ఉచితంగా ఇస్తున్నట్లు బుకాయించడం విడ్డూరంగా ఉందని ప్రజాసంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. టన్ను ఇసుక తవ్వేందుకు రూ.35 నుంచి రూ.120 వరకూ వసూలు చేసేలా టెండర్ వేసి దక్కించుకున్న టీడీపీ నేతలు ఉచితంగా ఎందుకు ఇస్తారనే ప్రశ్నకు ప్రభుత్వం విచిత్రమైన సమాధానాలు చెబుతోంది. ఇసుక కావాల్సిన వారు రీచ్‌లకు నేరుగా కార్మికులను తీసుకెళ్లి తవ్వించుకుని లోడ్ చేయించుకోవాలని ఉచిత సలహాలిస్తోంది! లేదంటే కాంట్రాక్టు సంస్థలకు డబ్బులు కట్టి ఇసుకను తీసుకెళ్లాలంటోంది. రీచ్‌లు లేని చోట్ల సొంత మనుషులకు లైసెన్సులు! ఒకవైపు రీచ్‌లన్నింటినీ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టేసి మరోవైపు వినియోగదారులు లారీలు, కార్మికులను తీసుకెళ్లి ఇసుక తవ్వించుకుని తీసుకెళ్లాలని ప్రభుత్వం చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కాంట్రాక్టర్లకు రీచ్‌లు అప్పగించిన తర్వాత వినియోగదారులు వారిని కాదని ఇసుకను తవ్వించే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలి. ఉచితంగా ఇస్తున్నట్లు చిత్రీకరించే క్రమంలో ఇలాంటి వింత విధానాలు తెచ్చింది. సాధ్యం కాని రీతిలో ప్రజలే ఇసుకను తవ్వించుకోవాలని చెబుతూ పచ్చ ముఠాల దోపిడీకి లైన్ క్లియర్ చేసినట్లు తేటతెల్లమవుతోంది. ఇక ఇసుక రీచ్‌లు లేని జిల్లాల్లో తమ సొంత మనుషులకు మినరల్ డీలర్ లైసెన్సులు ఇచ్చి మరో తరహా దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఆయా జిల్లాల్లో ఇందుకు టెండర్లు పిలవనున్నారు. తీసుకెళ్లనివ్వని ‘తమ్ముళ్లు’స్థానిక అవసరాలకు ట్రాక్టర్లు, ఎడ్లబళ్లలో ఎవరైనా ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చన్న ప్రభుత్వ ప్రకటన బోగస్ అని తేలిపోయింది. ట్రాక్టర్లు తీసుకెళ్లి ఇసుకను లోడ్ చేయించుకునేందుకు టీడీపీ నేతలు ఎక్కడా ఒప్పుకోవడం లేదు. సామాజిక అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు ఇసుక తీసుకెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా స్థానికంగా ఎక్కడా అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఎవరైనా సరే తమకు డబ్బు కట్టాల్సిందేనని టీడీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మరోవైపు వారే ట్రాక్టర్లలో ఇసుకను రీచ్‌ల నుంచి ప్రైవేట్ డంప్‌లకు భారీగా తరలించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. రీచ్‌ల్లో అమ్మకాల కంటే అక్రమ రవాణాయే ఎక్కువగా జరుగుతోంది. ఎవరైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకున్నా అది అంత సులభంగా జరిగే ఆస్కారం లేకుండా పోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నానా తిప్పలు పడి ఎలాగోలా బుక్ చేసుకున్నా స్లాట్ రావడానికి నాలుగైదు రోజులు పడుతుండటంతో నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు.పూతలపట్టు నుంచి బెంగళూరుకు !రోజూ అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేతసాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీ టీడీపీ నేతలకు వరంగా మారింది. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకువెళ్లడానికి ఎటువంటి అనుమతి అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించటంతో ఆ పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా నదులు, వాగులు, వంకలను తవ్వేస్తున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను తరలించి సురక్షిత ప్రాంతాల్లో డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాత్రిళ్లు ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన ఒక టీడీపీ నేత నిర్వాకమే ఇందుకు నిదర్శనం. పూతలపట్టు మండలం వావిల్‌తోట వంకలోని ఇసుకను టీడీపీ నేత తవ్వించి ట్రాక్టర్లలో తరలించి శివారు ప్రాంతంలోని వినియోగంలో లేని క్రషర్స్, వాటి పరిసర ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారు. రాత్రి వేళ ఆ ఇసుకను లారీలు, కంటైనర్ల ద్వారా బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తుండగా ఎవరైనా అడిగితే... తన సొంతానికి అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలా 15 రోజులుగా నిత్యం పెద్ద ఎత్తున ఇసుకను అడ్డగోలుగా తవ్వి బెంగళూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది. సదరు టీడీపీ నేత ఈ దందాలో మరికొందరు టీడీపీ నాయకులు, అధికారులకు వాటా ఇస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.పెన్నా నదిలో ‘వసూళ్ల గేటు’ఇసుక తీసుకెళుతున్న ఎడ్లబండ్లు, ట్రాక్టర్లకు డబ్బు వసూలు చేస్తున్న టీడీపీ నేతప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి అనుచరుడు గుర్రప్ప అలియాస్ గురివిరెడ్డి ఏకంగా పెన్నా నదిలో అనధికార గేటు పెట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒంటెద్దు బండికి రూ.150, రెండు ఎడ్ల బండ్లకు రూ.300, ట్రాక్టర్‌కు రూ.1,000 నుంచి రూ.1,200 చెల్లిస్తే కానీ పెన్నా నదిలోకి అనుమతించడం లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా పెన్నా నదిలో గేటు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని కొందరు వ్యక్తులు పెన్నా నదిలోని ఇసుకకు మీకు ఎందుకు గేటు చార్జీలు చెల్లించాలని సోమవారం వాగ్వాదానికి దిగడంతో ఈ పంచాయితీ రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అయినా ఫలితం లేకపోయింది. గేటు దగ్గర వసూళ్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.అక్రమ రవాణాకు అడ్డారామాపురం గ్రామం ఇసుక అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. పెన్నా నది ఒడ్డునే గ్రామం ఉండటంతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఇక్కడ నుంచి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారు. మండల పరిధిలోని పెన్నా నది పరీవాహక గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. -
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ బరితెగింపు
-
కేసులకు, జైళకు భయపడే పిరికి వోళ్ళం కాదు: Govardhan Reddy
-
చంద్రబాబుకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
ఇసుకాసురులు ఆగడాలకు ఇద్దరు బలి
-
దళారీల ఇసుక బుకింగ్
సాక్షి, అమరావతి: దళారులు నిమిషాల్లో ఆన్లైన్లో భారీగా ఇసుక బుకింగ్ చేస్తున్నారని, ధరలు పెంచి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో వ్యాఖ్యానించారు. గతంలో ఉన్న ఇసుక మాఫియానే ఇప్పుడూ దోచేస్తోందని ఆరోపించారు. దళారుల వల్లే రాష్ట్రంలో ఇసుక ధరలు పెరిగాయని చెప్పాలంటూ సీఎం చంద్రబాబు అంతకుముందు మంత్రులను ఆదేశించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ఆయన ప్రత్యేకంగా రాజకీయ అంశాలపై మాట్లాడారు. ఇసుక ధరలు గతంలో కంటే ఎక్కువగా ఉండడం వల్ల ప్రజల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పలువురు మంత్రులు వాపోయినట్లు తెలిసింది. అయితే దళారులు, రవాణా చేసేవారి వల్ల ధరలు పెరిగాయని ప్రజలకు చెప్పాలని సీఎం వారికి సూచించారు. తక్కువ రేటుకు ఇసుకను ఆన్లైన్లో బుక్ చేసుకుని బ్లాక్ మార్కెట్లో ఎక్కువకు అమ్ముతున్నట్లు ప్రచారం చేయాలని నిర్దేశించినట్లు తెలిసింది. ఈ సమస్యను అధిగవిుంచేందుకు ఇసుకపై సీనరేజీ చార్జీ ఎత్తేశామని, ఓవర్‌లోడ్ వాహనాలను ఆపకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించినట్లు సమాచారం. ఇసుకను పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు సీనరేజ్, జీఎస్టీని రద్దు చేస్తూ తాజాగా రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. స్థానిక సంస్ధలకు చెందాల్సిన రూ.264 కోట్ల సీనరేజ్‌ను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొలుసు పార్ధసారధి, వంగలపూడి అనిత మీడియాకు వెల్లడించారు.రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేపట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం అనుమతించిందని, ఎన్జీటీ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి రవీంద్ర పేర్కొన్నారు. 108 రీచ్‌లు, 25 స్టాక్ పాయింట్లు, 17 మాన్యువల్ రీచ్‌లను జిల్లా ఇసుక కమిటీలకు అప్పగించామన్నారు. సొంత అవసరాలకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో రీచ్‌లకు వెళ్లి నేరుగా ఇసుక తీసుకెళ్లవచ్చని, అయితే వారంతా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన విధించినట్లు తెలిపారు. ఆన్లైన్లో చేసుకోలేకపోతే రీచ్ దగ్గరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తీసేందుకు బోట్ల అసోసియేషన్లను అనుమతించామన్నారు.ఐదు జిల్లాల్లో 20 శాతం మార్జిన్‌తో విక్రయంవిశాఖ, అనకాపల్లి, తిరుపతి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో ఇసుక రీచ్‌లు లేనందున చిన్న అవసరాలకు ఇసుక కావాల్సిన వారికి సరఫరా చేసేందుకు మినరల్ డీలర్లను నియమించి 20 శాతం మార్జిన్‌తో విక్రయించేంలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఐదు జిల్లాల్లో బల్‌్కగా కావాల్సిన వారు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చన్నారు. అక్రమ రవాణా, అక్రమ విక్రయదారులపై పీడీ చట్టం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడు, కర్నాటక, ఒడిశా, తెలంగాణ సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు చేసి సీసీ కెమేరాలతో నిఘా పెడతామన్నారు. రాష్ట్రంలో అవసరాలకే ఇసుక వినియోగించాలని, బయట రాష్ట్రాలకు ఒక్క ట్రక్కు కూడా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సొంత అవసరాల కోసం రీచ్‌కు వెళ్లి నేరుగా ఇసుక ఉచితంగా తీసుకోవచ్చునని, అయితే తిరిగి అధిక ధరకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తే పీడీ యాక్ట్ కింద కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకందీపావళి సందర్భంగా ఈ నెల 31వ తేదీ నుంచి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అర్హత గల గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తామన్నారు. అక్టోబర్ 31వ తేదీన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారన్నారు. గ్యాస్ సరఫరా ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు డిపాజిట్ చేస్తుందని, సంబంధిత ఏజెన్సీ 48 గంటల్లోగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ జమ చేస్తుందన్నారు. వచ్చే సంవత్సరం నుంచి ఏప్రిల్ – జూలై వరకు ఒక ఉచిత సిలిండర్, ఆగస్టు – నవంబర్ మధ్యలో ఒక ఉచిత సిలిండర్, డిసెంబర్ – మార్చి మద్యలో ఒక ఉచిత సిలిండర్‌ను పంపిణీ చేస్తామన్నారు. రెండు నెలల్లో అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేయడం మహిళల సాధికారత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి అనిత చెప్పారు.జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం రద్దురూ.100 కోట్లు దాటిన పనుల టెండర్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాలని గత ప్రభుత్వం తెచ్చిన చట్టంలో పారదర్శకత లేదని, ఆ చట్టాన్ని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. సీవీసీ నిర్దేశించిన విధి విధానాల మేరకు టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.⇒ వార్షిక ఆదాయం రూ.20 కోట్లు ఉన్న దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్య 15 నుంచి 17కు పెంపు చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. పాలకమండలిలో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరు చొప్పున అవకాశం. ⇒ విశాఖలో శ్రీ శారదా పీఠానికి వేదపాఠశాల, సంస్కృతి పాఠశాల నిర్వహణకు 15 ఎకరాల భూమిని కేటాయిస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల రద్దుకు మంత్రి మండలి ఆమోదం.⇒ 2021 ఆగస్టు 15 నుంచి గత ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ జీవోఐఆర్ వెబ్సైట్లో పొందుపరచాలని నిర్ణయం. ⇒ చెవిటి, మూగ, కుష్ఠు వ్యాధిగ్రస్తులపై వివక్ష నిర్మూలించేందుకు ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం –1968, ఆయుర్వేదం, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టం–1956, డాక్టర్ ఎన్టీఆర్ వర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ చట్టం–1986లో పలు అంశాల సవరణలకు మంత్రిమండలి ఆమోదం. ⇒ విశాఖ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ సీట్లను 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన 134 జీవోకు మంత్రిమండలి ఆమోదం. కళాశాలలో 25 టీచింగ్, 56 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు. ⇒ మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలోని 30 పడకల ఆస్పత్రిని వంద పడకలుగా మార్చేందుకు ఆమోదం. 73 అదనపు పోస్టుల మంజూరు. ⇒ వరి సేకరణ కోసం మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,800 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ హామీకి ఆమోదం. ⇒ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే తీసుకున్న రూ.80 కోట్ల బ్యాంకు ఋణానికి ప్రభుత్వ గ్యారెంటీని కొనసాగించేందుకు మంత్రి మండలి ఆమోదం.ఆ దళారులు మీవాళ్లే కదా?⇒ కూటమి సర్కారు రాగానే పచ్చ ముఠాల ఇసుక దందా⇒ గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుక మాయం⇒ నిర్మాణ రంగం కుదేలై 40 లక్షల మంది కార్మికుల అవస్థలు⇒ ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేకే బ్లాక్ మార్కెట్ ఆరోపణల పాటఅధికారంలోకి రాగానే స్టాక్ యార్డుల్లో భద్రపరిచిన లక్షల టన్నుల ఇసుక నిల్వలను కరిగించేసి నాలుగు నెలల పాటు నిర్మాణ రంగాన్ని స్తంభింప చేసిన కూటమి సర్కారు తన నిర్వాకాలను కప్పిపుచ్చుకునేందుకే దళారులు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారనే నాటకానికి తెర తీసినట్లు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వర్షాకాలంలో అవసరాల కోసం వైఎస్సార్ సీపీ హయాంలో 80 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన విషయం తెలిసిందే. కూటమి సర్కారు అధికారంలోకి రావడమే ఆలస్యం పచ్చ ముఠాలు సగం నిల్వలను అమ్ముకుని సొమ్ము చేసుకోగా మిగతా ఇసుకను సైతం ఒక్క రేణువు కూడా మిగల్చకుండా ఆరగించేశాయి. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా తవ్వేసి అందినకాడికి దండుకోవడంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. 40 లక్షల మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కుదేలవడంతో భవన నిర్మాణ కార్మికులు జోవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ఈ ఇసుక దోపిడీని ప్రతిపక్షం ఎక్కడికక్కడ ఎండగట్టడం, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతుండటంతో చేసిన తప్పులను కప్పి పుచ్చి మభ్యపెట్టే యత్నాల్లో భాగంగానే బ్లాక్ మార్కెట్ నాటకానికి కూటమి సర్కారు తెర తీసినట్లు సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జనం జేబులను గుల్ల చేసి గుమ్మడి కాయ దొంగలా జేబులు తడుముకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. -
నన్ను చంపేందుకు.. పోలీసులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే స్కెచ్
-
ఇసుకుపై చంద్రబాబు పిచ్చి మాటలు.. బొత్స కౌంటర్
-
చంద్ర బాబు కాదు.. మందు బాబు!
-
బాబు హయాంలో ఆదాయం గుండు సున్నా ఉచిత ఇసుక హామీపై జగన్ ఫైర్
-
ఇది మాఫియా సామ్రాజ్యం
రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయి. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందే. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలోదోచుకో పంచుకో తినుకో విధానంలో రాష్ట్రంలో మాఫియా పాలన సాగుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఎక్కడా మచ్చుకైనా డీబీటీ కానరావడం లేదని... కన్పిస్తుందల్లా డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో) ఒక్కటేనని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, సూపర్ సిక్స్ లేదు.. సెవెనూ లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలపై ప్రజలు నిలదీస్తారనే భయంతో పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అసమర్థ ప్రభుత్వాన్ని చంద్రబాబు నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏకంగా ఇన్ని నెలలపాటు ఓట్ ఆన్ అకౌంట్‌పై నడుస్తున్న ప్రభుత్వం బహుశా దేశంలోనే కాదు.. ప్రపంచంలోనూ మరెక్కడా ఉండదన్నారు. ఎన్నికలప్పుడు నాసిరకం లిక్కర్.. ధరలు ఎక్కువ అంటూ దుష్ప్రచారం సాగించిన చంద్రబాబు ఇప్పుడు ఓ పద్ధతి ప్రకారం మద్యం మాఫియాకు తెర లేపారని చెప్పారు. అప్పుడైనా.. ఇప్పుడైనా అవే డిస్టిలరీస్, లిక్కర్లో అవే స్పెసిఫికేషన్స్ అని గుర్తుచేశారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీస్ ఉంటే 14 కంపెనీలకు చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చారని, తాము అధికారంలో ఉండగా ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు.శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఇసుక, మద్యం, పేకాట క్లబ్‌ల మాఫియాలు విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. ఓ నియోజకవర్గంలో పరిశ్రమ ఉన్నా.. ఎవరైనా కొత్తగా స్థాపించాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎవరు ఏం చేయాలన్నా అడిగినంత ముడుపులు ముట్టజెప్పాల్సిందేనన్నారు. ఎమ్మెల్యే కింత.. ముఖ్యమంత్రికి ఇంత.. అనే రీతిలో దోచుకో.. పంచుకో.. తినుకో.. విధానంలో మాఫియా పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎన్నికల హామీల అమలు.. ప్రభుత్వ అవినీతిపై ఎవరూ నిలదీయకుండా.. ప్రశ్నించే స్వరం వినిపించకూడదనే లక్ష్యంతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని.. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్‌పై పెట్టిన కేసే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..» చంద్రబాబు మోడస్ ఆపరండా (ఓ పద్ధతి ప్రకారం అనుసరించే వ్యూహం) గమనిస్తే ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు. ప్రజల ఆశలతో చెలగాటాలాడుతూ అబద్ధాలు చెబుతారు. వాళ్లకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మీడియా సామ్రాజ్యంతో కలిసి గోబెల్స్ ప్రచారం చేస్తారు. » ఆయన ఏ స్థాయిలో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారంటే.. పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తారు. వలంటీర్లకు రూ.10 వేలు జీతం అని మోసగించడంతో అది మొదలవుతుంది. మీకు రూ.పది వేలు రావాలంటే మా ప్రభుత్వం రావాలి.. మా ప్రభుత్వం రావాలంటే మేం చెప్పిన అబద్ధపు హామీలను ప్రతీ ఇంటికి తీసుకెళ్లాలి అని వలంటీర్లకు చెబుతారు.» ఏ ఇంటికి వెళ్లినా సరే చిన్నపిల్లలు కనిపిస్తే నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు! సంతోషమా..? అని అడుగుతారు. వాళ్ల అమ్మలు కనిపిస్తే నీకు రూ.18 వేలు.. సంతోషమా? అంటారు. చిన్నమ్మలు తారసపడితే నీకు రూ.18 వేలు.. పెద్దమ్మలు కనిపిస్తే నీకు రూ.48 వేలు... ఉద్యోగం కోసం వెతుక్కుంటూ 20 ఏళ్ల పిల్లాడు బయటకొస్తే నీకు రూ.36 వేలు... కండువా వేసుకొని రైతు బయటకొస్తే నీకు రూ.20 వేలు.. సంతోషమా? అని అడుగుతారు. ఎవరినైనా సరే ఇదే మాదిరిగా మాటలు చెప్పి, ప్రజల ఆశలతో చెలగాటమాడి అధికారంలోకి రావడమే మోడస్ ఆపరండాగా మార్చుకున్నారు.» తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం క్లిçష్ట పరిస్థితుల్లో ఉంది. చేయాలన్నా నేను చేయలేకపోతున్నా..! అంటూ కొత్త మోడస్ ఆపరండా తెరపైకి తెస్తారు. అంతటితో ఆగిపోతుందా.. అంటే ఆగిపోదు. ఎన్నికల హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తారేమో? ఎవరైనా నిలదీస్తారేమో? అనే భయంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రశ్నించే స్వరం వినిపించకుండా చేయాలని ఆరాట పడుతున్నారు. వీటికి తోడు మార్పులు తీసుకొస్తున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో స్కామ్‌లకు తెర తీస్తున్నారు. వీళ్ల మోడస్ ఆపరండా ఏమిటో ఈ ఐదు నెలలుగా సాగుతున్న ఇసుక, మద్యం మాఫియా పాలనే నిదర్శనం. -
ఈ దొంగల రాజ్యంలో బ్రతకలేం.. ఇసుక దోపిడీపై డ్రైవర్ల ఆగ్రహం
-
ఇసుక రీచ్‌లూ కొల్లగొట్టేశారు
సాక్షి, అమరావతి: మద్యం మాఫియాతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఇసుక దోపిడీకి రాచమార్గం నిరి్మంచుకుంది. రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ తమ వారికే దక్కేలా చేసుకుని వాటిపై గుత్తాధిపత్యం సాధించింది. 108 మాన్యువల్ ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ఏర్పాట్లుచేసుకుని ఇప్పటికే 80కి పైగా రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. జిల్లా ఇసుక కమిటీల ద్వారా వాటిని హస్తగతం చేసుకున్నారు. వాటిలో బుధవారం సుమారు 30 వరకు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు.అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పిన వారికే అన్నిచోట్లా జిల్లా ఇసుక కమిటీలు రీచ్‌లు కట్టబెట్టాయి. ఒక పథకం ప్రకారం దసరా పండుగ ముందు ఎటువంటి హడావుడి లేకుండా ఈ రీచ్‌లకు షార్ట్ టెండర్లు పిలిచారు. దానికిముందే వాటి వివరాలను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇవ్వడంతో వారు ఏ రీచ్‌కి ఎవరు టెండర్లు వేయాలి, ఎంతకి వేయాలో నిర్ణయించారు. వారు సిద్ధమైన తర్వాత జిల్లా కలెక్టర్లు వెంటనే టెండర్లు పిలిచి దాఖలు చేయడానికి రెండే రెండ్రోజుల సమయం ఇచ్చారు. ఈ సమాచారం తెలియక చాలామంది టెండర్లు దాఖలు చేయలేకపోయారు. ఆఖరి నిమిషంలో తెలుసుకుని ఎవరైనా టెండర్ వేయడానికి వస్తే వారికి టెండర్ డాక్యుమెంట్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పెట్టారు.రోజంతా కూర్చోబెట్టి ఎందుకు టెండర్ దాఖలు చేయాలనుకుంటున్నారు? ఎవరి కోసం వేస్తున్నారు? తవ్వకాలకు కావల్సిన సరంజామా మొత్తం ఉన్నాయా అంటూ తెగ విసిగించారు. వేచి ఉన్న వారికి చివర్లో ఏదో ఒక సాకు చెప్పి పంపించేశారు. అన్నీ తట్టుకుని నిలబడిన కొద్దిమంది టెండర్లు దాఖలు చేసినా వారిని అధికారులే బెదిరింపులకు గురిచేసినట్లు తెలిసింది. ఇక అధికార పార్టీ వాళ్లను కాదని మీరెలా టెండర్లు వేస్తారు? వేసినా ఉపయోగం ఉండదని చెప్పడంతో కొందరు వెనక్కి తగ్గినట్లు సమాచారం. టెండర్లు వేసిన వారికీ నిబంధనల ప్రకారం ఏ విషయం చెప్పకుండా పంపించేశారు. చివరికి.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే ఇసుక కాంట్రాక్టులన్నింటినీ కట్టబెట్టేశారు. వారి ద్వారా ముఖ్యనేతకు ముడుపులు అందేలా పక్కా ప్రణాళిక రూపొందించారు. ఈ నెలాఖరులోపు మిగిలిన రీచ్‌లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వాటిని సొంతం చేసుకునేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేసిన ఇసుక కమిటీలు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే జిల్లా స్థాయి ఇసుక కమిటీలు రీచ్‌లను కట్టబెట్టాయి. అత్యధికంగా 17 రీచ్‌లు ఉన్న తూర్పుగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్యేలు బయట వ్యక్తులను కనీసం టెండర్లు వేయడానికి సైతం అనుమతివ్వలేదు. వారికి టెండర్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి అధికారులు భయపడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. ⇒ కడియపులంక రీచ్‌ను రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన బినామీకి ఇప్పించినట్లు సమాచారం. ⇒ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మూడు రీచ్‌లు ఉండగా ఒకదాన్ని అక్కడి ఎమ్మెల్యే బత్తుల బలరామయ్య చేజిక్కించుకున్నట్లు తెలిసింది. మరో మూడు రీచ్‌లను ఆయనతోపాటు బుచ్చయ్యచౌదరి చెప్పిన వారికి కేటాయించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ⇒ నిడదవోలు నియోజకవర్గంలోని ముక్కామల, కాకరపర్రు, మల్లేశ్వరం, తీపర్రు 2, 3, మందలపర్రు, జీడిగుంట రీచ్‌లుండగా వాటిని జనసేన, టీడీపీ నేతలు కలిసి పంచుకుని అందుకనుగుణంగా టెండర్లు దాఖలు చేయించి దక్కించుకున్నారు. ⇒ మంత్రి కందుల దుర్గేష్ రెండు రీచ్‌లను తన వారికి ఇప్పించుకోగా మిగిలిన వాటిని టీడీపీ నేతలు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వాటిల్లో టీడీపీ నేతలు చెప్పినట్లే జరిగింది. దీంతో స్థానిక జనసేన నాయకులు టీడీపీ వాళ్లతో వాగ్వాదానికి దిగినా ప్రయోజనం కనిపించలేదని చెబుతున్నారు. ⇒ కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం–1, 2, 3, చిడిపి, వేగేశ్వరపురం ఇసుక రీచ్‌లను స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర నేతలతో కలిసి సిండికేట్‌గా ఏర్పడి తమ వారికి ఇప్పించినట్లు సమాచారం. ⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆరు రీచ్‌లకు టెండర్లు పిలవగా ఒకటి ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పిన వారికి దక్కేలా చేశారు. మిగిలినవన్నీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య తన మనుషులకు కేటాయించేలా చేసుకున్నారు. ⇒ నందిగామ నియోజకవర్గంలో తొమ్మిది రీచ్‌లకు రెండు మినహా మిగిలినవన్నీ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించిన వారికి కేటాయించారు. ⇒ అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని శ్రీకాకుళం 3, 5 రీచ్‌లకు టెండర్లు పిలవగా రెండింటినీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఒక రీచ్‌ను తన సొంత బంధువుకి, మరో రీచ్‌ను తన అనుంగు అనుచరుడికి కట్టబెట్టినట్లు సమాచారం. బయట వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడంతో ఖరారైన రీచ్‌లన్నీ టీడీపీ వారి పరమయ్యాయి. పామర్రులో టీడీపీ నేతలకు ఎమ్మెల్యే వార్నింగ్..ఇక కృష్ణాజిల్లా పామర్రులో ఐదు రీచ్‌లు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా చెప్పిన వారికే ఖరారు చేశారు. టెండర్లు దాఖలు చేయడానికి వెళ్లిన టీడీపీ నేతలను ఎమ్మెల్యే ఫోన్‌చేసి తిట్టిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తోట్లవల్లూరు ఇసుక రీచ్ కోసం మొవ్వ మండల నేత కాకర్ల బెనర్జీ తదితరులు వెళ్లగా ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయనకు ఫోన్‌చేసి వార్నింగ్ ఇచ్చారు. టెండర్ వెయ్యొద్దని, తనకు తెలీకుండా ఎలా టెండర్ దాఖలు చేస్తారని ఎమ్మెల్యే బెనర్జీకి వార్నింగ్ ఇస్తున్న వీడియోను కొందరు టీడీపీ నేతలే రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి పార్టీలో ఉన్నానని, ఎప్పుడూ ఇలాంటివి చూడలేదని బెనర్జీ చెబుతుంటే ఎమ్మెల్యే ఆయన్ను గట్టిగా హెచ్చరించారు. మొత్తం మీద ఇసుక రీచ్‌లకు తన సొంత మనుషులతో టెండర్లు వేయించిన ఎమ్మెల్యే.. సొంత పార్టీ వారితో సహా ఇతరులెవరూ టెండర్లు వేయకూడదని హకుం జారీచేశారు. చివరికి ఆయన చెప్పిన వారికే టెండర్లు ఖరారయ్యాయి. -
ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజలను పిచ్చోళ్లుగా, ఏమీ ప్రశ్నించలేని అశక్తులుగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. ఇసుక విషయంలో కూటమి ప్రభుత్వం అందరి కళ్లముందే భారీ మోసానికి పాల్పడే ధైర్యం చేస్తూండటంతో! అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతూంటే ఇప్పటికే ఉచిత ఇసుకను ప్రజలకు దూరం చేసేశారు. తాజాగా ఇసుక రీచ్‌లను ప్రైవేట్ వారికి అప్పగించేస్తున్నారు. మరీ ఇంత మోసమా?. ఇసుక ఉచితంగా దొరక్కపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది కార్మికులు నష్టపోతున్నారని భవన నిర్మాణం రంగం కుదేలైందని ఇదే కూటమి నేతలు జగన్ హయాంలో పెడబొబ్బలు పెట్టిన విషయం ఒక్కసారి గుర్తు చేసుకోవాలిక్కడ. ఇలాంటి కట్టుకథలు, మాయమాటలు చెప్పి... తాము అధికారంలోకి వస్తే అంతా ఫ్రీ అంటూ హామీలతో ఊదరగొట్టారు కూడా. ప్రజలు కూడా బహుశా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు దగ్గరుండి మరీ ఇసుక తవ్వించి ఉచితంగా పంపిణీ చేస్తారు కాబోలు అనుకున్నారు అప్పట్లో. పైసా ఖర్చు లేకుండా ఇళ్ల వద్దకే ఇసుక వస్తుందని భ్రమపడ్డారు. బాబు, పవన్‌ల మాటలు అమాయక ఆంధ్రులు సంబరపడ్డారు. మాటిచ్చి... తూచ్ మనడంలో చంద్రబాబు దిట్ట అన్నది మాత్రం మరచిపోయారు. ఏదైతేనేం... టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికల సందర్భంగా కలిసికట్టుగా మేనిఫెస్టోనైతే ప్రకటించాయి. మేనిఫెస్టోతో తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించినా ప్రభుత్వ భాగస్వామిగా బీజేపీకి కూడా బాధ్యత ప్పకుండా ఉంటుంది. అయితే ఏదో ఒకలా కూటమి అధికారంలోకైతే వచ్చింది కానీ.. అప్పటి నుంచే ఒక్కటొక్కటిగా హామీలకు తిలోదకాలు ఇవ్వడమూ మొదలైంది. ఈ క్రమంలో తాజా అంకమే ఉచిత ఇసుక మాటను ఉట్టికెక్కించడం!వాస్తవానికి ఆంధప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు ఇసుక కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రం మొత్తమ్మీద ప్రజల అవసరాల కోసం ఏకంగా 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసి ఉంచారు కానీ.. అధికారంలోకి వచ్చీ రాగానే కూటమి నేతలు ఈ ఇసుక నిల్వలతో అయినకాడికి బొక్కేశారు. ప్రజలకేమైనా ఇచ్చారా? ఊహూ అస్సలు లేదు. ముక్కు పిండి మరీ వసూలు చేసుకున్నారు. వందల కోట్ల రూపాయలు సొంత జేబుల్లో నింపుకున్నారు. నిల్వలు కరిగిపోవడంతో ఇసుక దొరకడమే గగనమైంది. ఒకానొక సందర్బంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ‘‘ఎవరు కావాలంటే వారు ఇసుక తవ్వుకుని తెచ్చుకోవచ్చు’’ అన్నారు కూడా. టీడీపీ నేతలు స్టాక్‌పాయింట్ల వద్ద పెత్తనం చెలాయిస్తూ ప్రజలను నిలువుగా దోపిడీ చేశారు. పోనీ ప్రభుత్వమైనా ఉచితంగా ఇస్తున్నదా అంటే అదీ లేదు. సీనరేజీ, జీఎస్టీల పేరుతో పెద్ద మొత్తాల్లోనీ ఫీజులు వసూలు చేస్తోంది. లారీ లోడింగ్ ఖర్చుల సంగతి సరేసరి. జగన్ అధికారంలో ఉండగా అవసరమైన వారికి అవసరమైనంత ఇసుక హేతుబద్దమైన రేటుకు దొరికేది. ఈ క్రమంలో ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చేది. ఇప్పుడు మాత్రం హళ్లికి హళ్లి... సున్నకు సున్నా! గతం కంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి. మొత్తానికే ఎసరు..ఇసుక ఉచితంగా లభించడాన్ని విజయవంతంగా అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎకాఎకి మొత్తం పథకానికి మంగళం పాడేందుకు స్కెచ్ వేసినట్టు ఉంది. నదులలోని 108 ఇసుక రీచ్‌లను గంపగుత్తగా ప్రైవేట్ వారికి అప్పగించేలా గుట్టుచప్పుడు కాకుండా నిర్ణయం చేశారు. వీటి ద్వారా డబ్బై లక్షల టన్నుల ఇసుకను సరఫరా చేస్తారట. అంతేకాదు...రెండు రోజులలోనే ఈ వ్యవహారం మొత్తాన్ని చక్కబెట్టేయాలన్నది ప్లాన్! టెండర్లు పిలవడం, కేటాయింపులు అన్నీ అన్నమాట! సహజంగానే టీడీపీ వారికే టెండర్లు దక్కే ఏర్పాట్లు ఉంటాయి దీంట్లో! సాధారణంగా టెండర్లలో పాల్గొనేందుకు అందరికీ అవకాశం కల్పిస్తూ కొంత సమయం ఇస్తారు. అలా కాకుండా రెండు రోజుల వ్యవధి మాత్రమే పెట్టడంతోనే ఇందులోని మతలబు ఏమిటన్నది తెలిసిపోతోంది. ఇసుక రీచ్‌లు ప్రైవేట్ వారికి అప్పగిస్తే వారు అక్రమంగా అమ్మకాలు జరపకుండా ఉంటారా? ఇసుక ఉచిత సరఫరా ఎలాగో చెప్పకుండా, విధి, విధానాలను నిర్ణయించకుండా హడావుడిగా టెండర్లు ఏమిటో? ప్రైవేటు వ్యక్తులు ఇసుక తవ్వి ప్రభుత్వానికి అందచేస్తే ,అధికారులు ఉచితంగా ఇస్తారా? లేక ప్రైవేటు వ్యక్తులు తమ రీచ్‌లలో ఇసుక తీసుకుని అమ్ముకునే స్వేచ్చ ఉంటుందా? మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అయితే ప్రైవేటు వ్యక్తులు ఇసుకను అమ్ముకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం వేరే స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినా, అక్కడ ఇసుక ఎంతవరకు ఉంటుంది? మొత్తం రీచ్ లన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి వెళ్లాక, ప్రభుత్వం ఎక్కడ నుంచి ఇసుక తెచ్చి ఉచితంగా ఇస్తుంది?. ఇప్పటికే టీడీపీ నేతలు అనేక రీచ్‌లను దౌర్జన్యంగా ఆక్రమించారని వార్తలు వస్తున్నాయి. ఇతరులు ఎవరైనా పొరపాటున బిడ్ పొంది రీచ్ కు వెళితే, టీడీపీ నేతలు వారిని బెదిరించి పంపించి వేస్తున్నారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో ఒక టీడీపీ నేత బెదిరింపుల వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు. తమ హయాంలో ఏడాదికి రూ.700 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, ప్రజలకు రెండు, మూడు రెట్ల భారం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు. 2014-19 మధ్య ఇదే తరహాలో ఇసుక ద్వారా వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అక్రమాలకు పాల్పడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ఇసుక పాలసీ ప్రకటించకుండా దొంగచాటుగా టెండర్లు ఏమిటని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ టైమ్‌లో మొదటి మూడు నెలలు తప్ప, ఆ తర్వాత పుష్కలంగా ఇసుక దొరికినా, ఇసుక లభ్యం కావడం లేదని, లేదా ఎక్కువ ధర పెట్టవలసి వస్తోందటూ మొసలి కన్నీరు కార్చిన ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి ఎల్లో మీడియా, ఇప్పుడు ఇసుక ధరలు రెట్టింపైనా అంతా బాగుందన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వాన్ని అడ్డగోలుగా మోస్తూ, భజన చేస్తూ ప్రజలను మభ్య పెట్టడంలో ఎల్లో మీడియా విశేషంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈనాడు మీడియా ఇసుక సమస్యకు ఎలా కవరింగ్ ఇచ్చిందో చూడండి. ఆ పత్రికలో 'రీచ్ లలోను కొనుగోళ్లు" అని హెడింగ్ పెట్టి, అదేదో కొత్త సదుపాయం క్రియేట్ చేస్తున్నట్లు పిక్చర్ ఇచ్చారు. ప్రైవేటు వ్యక్తులు ముందుకు వస్తే రీచ్ లకు అనుమతులు ఇస్తారని, ఎవరైనా ఇసుక కమిటీ నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అసలు గుట్టు విప్పారు. అంతే తప్ప కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ హామీకి విరుద్ధంగా ఇసుక బేరసారాలు పెట్టారని ఈనాడు మీడియా రాయలేదు. కూటమి మానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి తూట్లు పొడిచారని పేర్కొనలేదు. చంద్రబాబుతో పాటు ఈనాడు మీడియా కూడా జనాన్ని ఎంత అన్యాయంగా మోసం చేస్తున్నది ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం లేదు.ఇక మరో మీడియా ఆంద్రజ్యోతి అయితే త్వరలో ప్రైవేటు ఇసుక రీచ్ లు వస్తున్నాయని, మరింత ఇసుక అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ప్రభుత్వానికి తన వంతు బాజా వాయించింది. ఉచిత ఇసుకకు అదనంగా ఇది ఏర్పాటు అని మళ్లీ కవరింగ్ ఇచ్చారు. ఇదేదో గనుల శాఖ ప్రతిపాదించినట్లు రాశారు తప్ప, చంద్రబాబుకు ఏమీ సంబంధం లేదన్నట్లు మాయ చేసేందుకు యత్నించారు. ప్రజలకు అవసరమైన ఇసుకను ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యమని కూడా ఆంధ్రజ్యోతి ముక్తాయించింది. దీనిని బట్టి ఈ మీడియా ఎంతగా ప్రజలను చీట్ చేయడానికి కృషి చేస్తున్నది అర్థం చేసుకోవచ్చు. ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా కలిసి ఇసుక కొట్టాయని అనుకోవచ్చా!. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఎక్కడైనా ఉచితంగా లభిస్తోందా?... ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఇసుక దోపిడీపై వైఎస్ జగన్ ఫైర్
-
రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం .. పామర్రులో టీడీపీ నేతల కుమ్ములాటలు
-
‘దారి’ తప్పిన ఇసుక!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇసుక ‘దారి’ తప్పుతోంది. అటు ప్రభుత్వానికి ఆదాయం రాకుండా.. ఇటు జనానికి తక్కువ ధరకు దొరక్కుండా.. కాంట్రాక్టర్లు, దళారీల చేతిలో చిక్కుకుపోతోంది. ఇసుక విక్రయాల్లోని లొసుగులను వారు ఆసరాగా చేసుకుంటే.. అధికారుల కక్కుర్తి ఆ అవకతవకలకు తోడవుతోంది. అందులోనూ ప్రస్తుత వానాకాలంలో ఏర్పడిన ఇసుక కొరత అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ పనుల కోసమంటూ అడ్డగోలుగా బల్క్ అలాట్మెంట్లు చేయించుకుంటూ.. ఆ ఇసుకను వినియోగదారులకు అడ్డగోలుగా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల జలమండలి పేరిట జరిగిన ‘బల్క్ అలాట్మెంట్’ వ్యవహారం దీనికి ఓ మచ్చుతునక మాత్రమే. లొసుగులను వాడుకుంటూ.. రాష్ట్రంలో ఇసుక విక్రయాలతో ప్రభుత్వ ఖజానాకు ఏటా సుమారు రూ.700 కోట్ల మేర ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వం ఆన్లైన్లో ఇసుక విక్రయాల కోసం ‘శాండ్ సేల్ మేనేజ్మెంట్, మానిటరింగ్ సిస్టమ్ (ఎస్ఎస్ఎంఎంఎస్)’ను అమలు చేస్తోంది. అందరికీ అందుబాటు ధరలో ఇసుక అందాలన్నదే దీని లక్ష్యం. కానీ రీచ్‌ల నుంచి ఇసుక వెలికితీసే కాంట్రాక్టర్ల నుంచి రవాణా, వేబ్రిడ్జీల దాకా జరుగుతున్న అక్రమాలు ఇసుక ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ప్రస్తుత వర్షాకాలంలో వాగులు, నదుల్లో ప్రవాహాలతో ఇసుక తవ్వకాలు తగ్గిపోయాయి. ఈ కొరతను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ విభాగాలను కూడా వాడుకుంటుండటం గమనార్హం. కాంట్రాక్టర్ల గుప్పిట్లో స్టాక్ పాయింట్లు ప్రభుత్వం గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుకను తవ్వి వెలికితీసి, స్టాక్ పాయింట్లకు తరలించాల్సిన కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో అంతా తామే అన్నట్లుగా చక్రం తిప్పుతున్నారు. ఇసుక రీచ్‌లు ఎక్కువగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలో వీరి కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. శాండ్ సేల్ మేనేజ్మెంట్, మానిటరింగ్ విధానంలో కేవలం ఇసుక వెలికితీత, స్టాక్‌యార్డుకు తరలింపునకు మాత్రమే కాంట్రాక్టర్లు పరిమితం కావాలి. అయితే ఆన్లైన్ విధానంలో బుక్ చేసుకున్న లారీల్లో ఇసుకను లోడ్ చేయాల్సిన సందర్భంలోనే.. కాంట్రాక్టర్లు వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తూ, అక్రమాలకు తెరలేపుతున్నారు. ఒక్కో లారీలో అదనంగా రెండు, మూడు టన్నులు లోడ్ చేస్తూ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ(టీజీఎండీసీ) ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలా లారీల్లో అక్రమంగా లోడ్ చేసే ఇసుక విలువ రోజుకు రూ.15 లక్షల నుంచి రూ.20లక్షలపైనే ఉంటుందని అంచనా. ఇందులో కాంట్రాక్టర్లు, స్థానిక పోలీసులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, రాజకీయ నాయకుల వరకు ముడుపులు అందుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఇసుక వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని 16 మంది పోలీసు సిబ్బంది సస్పెండ్ కావడం గమనార్హం. ఇసుక వెలికితీత, విక్రయాలను పర్యవేక్షించాల్సిన మైనింగ్ అధికారులు.. కాంట్రాక్టర్ల కనుసన్నల్లో పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో మూడు, నాలుగు రెట్ల ధర ఆన్లైన్ విధానంలో ఒక్కో టన్ను ఇసుక ధర రూ.630 మాత్రమే. కానీ మార్కెట్లో ప్రస్తుతం సన్న ఇసుక టన్నుకు రూ.1,900, దొడ్డు ఇసుక రూ.1,600పైనే పలుకుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో టన్ను ఇసుక ధర రూ.2,200కు కూడా చేరింది. రవాణా చార్జీలతోపాటు స్టాక్ పాయింట్ల నుంచి చివరికి చేర్చేదాకా.. వివిధ దశల్లో ఇవ్వాల్సిన ముడుపుల మూలంగా ఇసుక ధర భారీగా ఉంటోందని లారీల యజమానులు చెప్తున్నారు. ఇక కొందరు దళారులు, ఇసుక వ్యాపారులు వే బ్రిడ్జిల వారితో కుమ్మక్కై అదనంగా బరువు చూపుతూ కొనుగోలుదారులను మోసగిస్తున్నారు. ఒక్కో లారీపై కొనుగోలుదారులు రూ.8 వేల నుంచి రూ.10వేల వరకు నష్టపోతున్నట్టు అంచనా. బహిరంగ మార్కెట్‌కు బల్క్ అలాట్మెంట్లు రాష్ట్రంలో ఇసుకకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు బల్క్ అలాట్మెంట్ల పేరిట దండుకుంటున్నారు. టీజీఎండీసీ ఏటా సగటున కోటిన్నర క్యూబిక్ మీటర్లకుపైగా ఇసుకను విక్రయిస్తుండగా.. అందులో సుమారు 10 నుంచి 15శాతం ప్రభుత్వ అవసరాల కోసం కేటాయిస్తోంది. ప్రభుత్వ శాఖల అధికారులు టీజీఎండీసీ వద్ద ఆన్లైన్ ఖాతాను సృష్టించి, తమ లాగిన్ ద్వారా ప్రభుత్వ పనులకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేసి, ఎంత మొత్తంలో ఇసుక అవసరమో పేర్కొనాల్సి ఉంటుంది. టీజీఎండీసీ ఆ పత్రాలను పరిశీలించి, ఏకమొత్తంలో ఇసుక కేటాయింపు (బల్క్ అలాట్మెంట్) చేస్తుంది. అయితే కొందరు అక్రమార్కులు ప్రభుత్వ శాఖల లాగిన్‌ను కూడా దుర్వినియోగం చేస్తున్నట్టు ఇటీవల జలమండలి పేరిట జరిగిన దందాతో వెల్లడైంది. 90లక్షల టన్నుల ఇసుక జలమండలి లాగిన్ ద్వారా కమర్షియల్ మార్కెట్‌కు చేరినట్టు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో టీజీఎండీసీ అప్రమత్తమైంది. ఈ వ్యవహారంపై టీజీఎండీసీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ జరుగుతుండటంతో పూర్తి వివరాలు వెల్లడించేందుకు టీజీఎండీసీ అధికారులు సుముఖత చూపడం లేదు. -
చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ నేతల దోపిడీ
-
ఏపీ ఉచిత ఇసుక.. అంబటి సెటైర్లే సెటైర్లు
-
ఇసుక కోసం తమ్ముళ్ల తన్నులాట
ఇసుకను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీలోని రెండువర్గాలు మధ్య ఘర్షణ తలెత్తగా.. ముగ్గురు గాయపడ్డారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామ టీడీపీ నాయకులు పెంచలయ్య, వెంకటేశ్వర్లు, సురేష్‌రెడ్డి జొన్నవాడ నుంచి ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను పెనుబల్లి వద్ద అడ్డుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ జొన్నవాడలోని యజమానికి సమాచారం అందించగా.. అక్కడి టీడీపీ కార్యకర్తలు ప్రణీత్, ప్రసాద్ మరికొంతమంది పెనుబల్లి చేరుకుని ట్రాక్టర్ ఎందుకు ఆపారని పెంచలయ్యను ప్రశ్నించారు. మాటామాటా పెరిగి వివాదం చెలరేగడంతో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పెనుబల్లికి చెందిన టీడీపీ నాయకులు పెంచలయ్య, సురేష్‌రెడ్డి, వెంకటేశ్వర్లుకు గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారిని బుచ్చిరెడ్డిపాళెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. – బుచ్చిరెడ్డిపాళెం రూరల్కన్నెత్తి చూడని అధికారులుజొన్నవాడ వద్ద పెన్నా నది నుంచి నిత్యం ఇసుక, పెనుబల్లి పొలాల నుంచి మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నా రెవెన్యూ, విజిలెన్స్, పోలీస్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. రెండు గ్రామాల టీడీపీ నాయకుల ప్రోద్బలంతో నిత్యం అక్రమంగా ఇసుక తరలిస్తూ రూ.లక్షల్లో వెనకేసుకుంటున్నారు. మండలంలో మినగల్లు ఇసుక రీచ్ నుంచి మాత్రమే గతంలో ఇసుక తరలింపునకు అనుమతి ఉండేది. ప్రస్తుతం ఈ రీచ్‌కు కూడా అనుమతి లేదు. అయినా టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మట్టి, ఇసుక తరలించేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సైతం తమను ఎవరూ ఏమీ చేయలేరని, ఇసుక, మట్టి తరలించే విషయంలో వెనక్కు తగ్గేదే లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. పలుకుబడి ఉన్నవాళ్లకే ఇసుకటీడీపీ నాయకులు, పలుకుబడి ఉన్నవారికే ఇసుక అందుబాటులో ఉంది. జొన్నవాడ, మినగల్లు నుంచి ఇసుక అక్రమంగా తరలించే విషయంలో టీడీపీ నాయకులు పోటీ పడుతున్నారు. ప్రజలకు మంచి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. – విల్సన్, బుచ్చిరెడ్డిపాళెం -
ఇసుక ఖతం.. దోచేస్తున్న పచ్చ నేతలు
-
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు టీడీపీ నాయకుల దాడి
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులోని వంకలో ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. శనివారం రాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇసుకను బయటి ప్రాంతాలకు తరలిస్తుండటంతో వైఎస్సార్సీపీకి చెందిన భూమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రమణారెడ్డి మరికొందరు అడ్డుకున్నారు. పొలాల అవసరాలకు ఇసుకను ట్రాక్టర్లతో తీసుకెళ్లొచ్చు కానీ.. టిప్పర్లతో బయటకు తరలించడం ఏమిటని నిలదీశారు. తామే అధికారంలో ఉన్నాం కాబట్టి తమ ఇష్టం వచి్చనట్టి చేసుకుంటామని టీడీపీకి చెందిన నారప్పరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నారప్పరెడ్డి రమే‹Ùరెడ్డి ఘర్షణకు దిగారు.అనంతరం టీడీపీ నేతలు దాడికి తెగబడటంతో వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి వెంకటరమణరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ నేతలు ప్రయతి్నంచగా.. టీడీపీకి చెందిన వెంకటసుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండువర్గాల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీకి చెందిన బి.వెంకటరమణారెడ్డి, మరికొందరితోపాటు టీడీపీకి చెందిన ఎన్.వెంకటరమణ సుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డి, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు ఎర్రగుంట్ల సీఐ నరే‹Ùబాబు తెలిపారు. యంత్రాంగం ప్రేక్షక పాత్ర పెద్దనపాడు వంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని కలెక్టర్, ఎస్పీ పదేపదే చెబుతున్నా ఎర్రగుంట్ల మండలంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. నిత్యం గ్రామంలో రెవెన్యూ అ«ధికారులు తిరుగుతుంటారు. గ్రామస్తులు అడ్డుకునే వరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
ఇసుక రాకాసులు.. రెండు చేతులా కోట్ల రూపాయల సంపాదన
-
అమాంతం పెరిగిన ఇసుక రేట్లు.. ఇదేనా చంద్రబాబు నీ పాలన..
-
బాబుకు ఝలక్.. ఇసుక మాఫియాకి జేసీ వార్నింగ్
-
ఇక్కడ లోడింగ్.. అక్కడ అన్లోడింగ్
-
ఇసుకపై ఇరకాటం..!
సాక్షి, అమరావతి: ఇసుక పేరుతో సాగుతున్న దోపిడీ వ్యవహారాలపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతుండటంతో ఆ తప్పంతా అధికార యంత్రాంగంపై నెట్టివేసేందుకు సీఎం చంద్రబాబు సన్నద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడమే ఆలస్యం స్టాక్ యార్డుల్లో ఉన్న ఇసుకలో దాదాపు 40 లక్షల టన్నులు మాయం చేసి అందినకాడికి విక్రయించి పచ్చముఠాలు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇప్పటికే బహిర్గతమైంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకూ తరలించారు. నిత్యం తవ్వుకో తమ్ముడూ అంటూ రీచ్‌ల్లోనూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుండటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఇక ఇతర మీడియాల్లోనూ దీనిపై కథనాలు వెలువడుతుండటంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించింది. వైఎస్ జగన్ సర్కారు హయాంలో కంటే ఇసుక ధర ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గతంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువగా ఉన్నట్లు ఫీడ్ బ్యాక్ వస్తోందని ప్రస్తావించారు. స్టాక్ యార్డుల్లో నిల్వ ఉన్న ఇసుకను ఇష్టానుసారంగా విక్రయించినప్పుడు కళ్లు మూసుకుని బుకాయించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దీన్ని అధికారులపై నెట్టివేసే యత్నాలపై యంత్రాంగంలో విస్మయం వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్రంలో 59 ఇసుక యార్డుల్లో ఇక 24.08 లక్షల టన్నులు ఇసుక మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
ఇసుకను మింగేస్తున్నారు..!
సాక్షి నెట్వర్క్: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు వద్ద భారీగా నిల్వ ఉంచిన ఇసుక గుట్ట నుంచి పెద్ద మొత్తంలో ఇసుక మాయమైందనే విమర్శలొస్తున్నాయి. గత ప్రభుత్వం నిల్వ చేసిన కొండలా ఉండే ఇసుక గుట్ట క్రమంగా కరిగిపోయింది. అమ్మింది కొంత.. అమ్ముకున్నది కొంత.. ఎగరేసుకుపోయింది మరికొంత.. అధికారులు చెబుతున్న లెక్కలకు.. కళ్లముందు కనిపిస్తున్న వాస్తవానికి పొంతన కుదరకపోవడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నది.కృష్ణానది, మున్నేరులకు వచ్చే వరదలు, భారీ వర్షాల సమయంలో ఇసుక కొరత రాకూడదనే సదుద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు వద్ద భారీగా ఇసుక నిల్వ చేసింది. గత నెల 9వ తేదీకి ముందు ఇక్కడ జిల్లా మైనింగ్ అధికారులు లెక్కలు వేసి 1,39,000ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ఇసుకను కొలతలు వేసి లిఖితపూర్వకంగా రాసి స్థానిక అధికారులకు అప్పగించారు.అనంతరం ఇక్కడ గత నెల 8వ తేదీన ఇసుక అమ్మకాలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు 44.346 మెట్రిక్ టన్నుల ఇసుక విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారుల లెక్కల ప్రకారం చూస్తే ఇక్కడ ఇంకా 84.654 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండాలి.కానీ వాస్తవంగా ఉన్న ఇసుక సుమారు 20వేల టన్నులు మాత్రమే ఉంటుందని అధికారులు తాజాగా అంచనాకు వచ్చారు. మిగిలిన 64.654 మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైందనేది ప్రశ్నార్థకం. ఇప్పటికే ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో.. ఏమాత్రం తేడా వచ్చినా అందుకు స్థానిక అధికారులదే బాధ్యత అని స్పష్టం చేయడంతో అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు.లెక్క తేలేది ఎలా?మొదట్లో మైనింగ్ అధికారులు రెండు రోజుల పాటు స్టాక్ పాయింట్ వద్ద ఉన్న ఇసుకను కొలతలు వేశారు. అలా మరో మూడు రోజులు లెక్కలు కట్టిన తర్వాతే ఇసుక నిల్వలను ప్రకటించారు. అయితే ఇప్పుడు వారి లెక్కలకు.. ఉన్న ఇసుకకు భారీగా తేడా రావడంతో.. ఇసుక ఏమైందో అర్థంకాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద ఇసుక ఎవరినీ బలి తీసుకుంటుందోనన్న ఆందోళనతో స్థానిక అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. టీడీపీ నేతతో చేతులు కలిపిన అధికారి?మోగులూరు స్టాక్ పాయింట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ పంచాయతీ అధికారి ఓ అధికారపార్టీ నాయకుడితో చేతులు కలిపి అక్రమార్జనకు పాల్పడ్డాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లారీకి 20 టన్నుల ఇసుక మాత్రమే తరలించేందుకు ప్రభుత్వం అనుమతులివ్వగా.. ఆ అధికారి కాసులకు కక్కుర్తిపడి అదే లారీకి అదనంగా ఐదు బొచ్చలు ఇసుక అదనంగా నింపుతున్నాడు. ఒక బొచ్చ (2.50 మెట్రిక్ టన్నులు) రూ.700 చొప్పున ఒక లారీకి అదనంగా రూ.3,500 ఆ అధికారికి అందుతున్నాయని సమాచారం. -
ఇసుక పేరుతో పచ్చ మోసం
తిరుపతికి చెందిన శ్రీనివాసరావు ఆటోనగర్ సమీపంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించింది కదా అని గురువారం ట్రాక్టర్ తీసుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి నదికి వెళ్లారు. అక్కడ ఇసుక తీసుకునేందుకు అనుమతి లేదని స్థానికులు చెప్పారు. దీంతో ఇసుక అనుమతి కోసం తిరుపతి, రేణిగుంట తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లారు. వెంకటగిరి లేదా నాగాలాపురం, పిచ్చాటూరు మండలాల్లోని అధికారిక రీచ్‌లకు వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక శుక్రవారం ఉదయం ముందుగా వెంకటగిరి మండలం మోగళ్లగుంటలోని రీచ్‌కు కారులో చేరుకున్నారు. అక్కడ ఇసుక నిల్వ లేకపోవడంతో దొరవారిసత్రం మండలం మావిళ్లపాడులోని ఇసుక రీచ్‌కు వెళితే మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో ఉసూరుమంటూ నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిగకు చేరుకున్నా అక్కడా ఇసుక లేదు. ఇక మిగిలిన పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్‌కు వెళితే ఇసుకైతే ఉంది కానీ.. డంప్ యార్డు వద్ద అధికారులెవ్వరూ లేరు. కాపలాగా ఓ కానిస్టేబుల్ ఉన్నారు. ఇసుక కోసం వచ్చిన సుమారు 100 టిప్పర్లు ఉదయం నుంచి వేచి ఉన్నాయి. రాత్రి వరకు ఎదురుచూసి తిరిగి తిరుపతికి వచ్చేశారు. శ్రీనివాసరావు తన కారుకి రూ.2,500 పెట్రోల్ పట్టుకుని రోజంతా సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించి తిప్పలు పడినా చివరకు ఇసుక దొరకలేదు. కుప్పం పట్టణానికి చెందిన మురుగప్ప అసంపూర్తిగా నిలిచిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకునేందుకు అప్పుచేశాడు. ఈనెల 9వ తేదీన పనులు ప్రారంభించాడు. నిర్మాణ పనుల కోసం ఇసుక తెచ్చుకునేందుకు ప్రయతి్నంచాడు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్కారు ఏర్పాటు చేసిన రీచ్‌ల వద్దే ఇసుక కొనుగోలు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. కుప్పానికి సమీపంలో ఇసుక తెచ్చుకునేందుకు అనుమతులు లేవని తెగేసి చెప్పారు. దీంతో సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌కు వెళ్లాడు. తీరా అక్కడ రీచ్‌లో ఇసుక లేదు. తిరిగి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉట్టి చేతులతో ఇంటికి వచ్చేశాడు. చివరకు చేసేది లేక కుప్పం సమీపంలో తయారుచేసే కృత్రిమ ఇసుకను అధిక ధరకు కొనుగోలు చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించుకున్నాడు.శ్రీకాళహస్తికి చెందిన రమేష్‌బాబు స్వగృహ నిర్మాణం చేపట్టాడు. పట్టణానికి సమీపంలోని విరూపాక్షిపురం, పెన్నలపాడులో ఇసుక దొరుకుతుందని తెలుసుకుని అక్కడికి చేరుకున్నాడు. టిప్పర్ ఇసుక తీసుకెళ్లేందుకు ప్రయతి్నంచాడు. వెంటనే అక్కడున్న టీడీపీ నేతల అనుచరులు అడ్డుకున్నారు. ‘మీరంతా నదిలో యంత్రాలతో తవ్వి ఇసుక తరలిస్తున్నారు కదా.’ అని రమేష్‌బాబు ప్రశ్నించడంతో కొట్టినంత పనిచేశారు. మరి ఇసుక కావాలంటే ఏం చేయాలని అడిగితే టిప్పర్ ఇసుకకు రూ.25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తాము అడిగినంత సొమ్ము ఇస్తే ఇసుకను ఇంటికే చేరుస్తామని స్పష్టం చేశారు. ఇసుక ఉచితమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కదా అని రమేష్‌బాబు అడిగితే.. అదంతా తమకు తెలియదని, నగదు కడితేనే ఇసుక పంపుతామని తేలి్చచెప్పారు. అక్కడి నుంచి పలువురికి ఫోన్‌చేసి ఇసుక గురించి ఆరా తీసినా ఎక్కడా ఉచిత ఇసుక దొరకదని, టీడీపీ వాళ్లే విక్రయిస్తున్నారని తెలియడంతో చేసేదిలేక రమేష్‌బాబు రూ.25వేలు చెల్లించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేసుకున్నాడు.‘‘మీ ఊరి దగ్గర వాగు ఉందా..? కాలువ ఉందా..? నది ఉందా..? అక్కడకు వెళ్లి తట్టలతో తెచ్చుకుంటారో.. ఎద్దుల బండిలో తెచ్చుకుంటారో.. కావాల్సినంత ఇసుకను ఉచితంగా తీసుకెళ్లండి.. ఎవరు వద్దంటారు..? పైసా చెల్లించాల్సిన అవసరం కూడా లేదు.’’ అని చాలా తేలిగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించేశారు. అంతలోనే బండిలో ఇసుక తరలించడం నిషేధం అంటూ ప్లేటు మార్చేశారు. ఎప్పటికప్పుడు ఉచిత ఇసుక అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు. దిగితే కానీ లోతు తెలియదు అన్నట్టు.. ఇసుక కోసం వెళ్లిన వారికే లోగుట్టు తెలుస్తోంది. ఉచితం పేరిట టీడీపీ నేతల అనుచిత వైఖరి అర్థమవుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రీచ్‌లలో మాత్రం ఇసుక రేణువు కూడా ఉండదు. అదే పచ్చమూక అనధికారికంగా పాగా వేసిన పాయింట్లలో మాత్రం కావాల్సినంత ఉంటుంది. అక్కడ వాళ్లు చెప్పిందే రేటు.. అడిగినంత చెల్లిస్తేనే పనవుతుంది. ఉచిత ఇసుక అంటూ ఊదరగొడుతూ జనం చెవిలో పువ్వులు పెడుతున్న కూటమి సర్కారు నాటకాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ప్రభుత్వం ఏడు ఇసుక రీచ్‌లను అధికారికంగా ఏర్పాటు చేసింది. అయితే వాటిలో కేవలం మూడు రీచ్‌లలో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. తిరుపతి జిల్లా పిచ్చాటూరు అడవికోయంబేడు, చిత్తూరు జిల్లా గంగవరం మండలం నాలుగురోడ్ల కూడలి, చిత్తూరు రూరల్ మండలం దిగువమాసపల్లె, పాలూరులో మాత్రమే ఇసుక నిల్వలు ఉన్నాయి. మిగిలిన నాలుగు రీచ్‌లలో ఇసుక డంప్‌లు లేవు. ప్రభుత్వం ఉచితమంటూ ప్రకటించిన రెండు రోజులు మాత్రమే ఇక్కడ ఇసుక డంప్‌చేశారు. తర్వాత ఖాళీ అయిన రీచ్‌లలో ఇసుకను మళ్లీ డంప్ చేయలేదు. యథేచ్ఛగా ట్రాక్టర్లతో ఇసుక తరలింపు అడిగినంత చెల్లిస్తేనే.. ప్రస్తుతం మూడు రీచ్‌లలో ఉన్న ఇసుక కోసం వెళ్లిన వినియోగ దారులకు నిర్వాహకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం టన్ను ఇసుక రూ.155 లెక్కన ట్రాక్టర్ (ఐదు టన్నులు)రూ.775 అవుతుంది. బాడుగ 0–10 కిలోమీటర్ల అయితే రూ.1,200. అదే టిప్పర్ ఇసుక అయితే రూ.1,550. దూరం పెరిగే కొద్దీ వాహనం బాడుగ పెరుగుతుంది. ఇదిలా ఉంచితే.. టీడీపీ నేతలు ఒక వాహనానికి అదనంగా రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని అధికారులతో కలిసి వాటాలు పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడులో అదనపు వసూళ్లకు పాల్పడడంతో వినియోగదారులు నిలదీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అధికారులు శుక్రవారం ఇసుకను విక్రయాలు నిలిపివేసినట్లు సమాచారం. ఫలితంగా వందలాది వాహనాలు రోజంతా వేచి ఉండాల్సి వచ్చింది. పిచ్చాటూరు మండలం అడవికోయంబేడు రీచ్‌లో ఇసుక నింపకపోవడంతో బారులు తీరిన వాహనాలు ఊరూరా అక్రమ రీచ్‌లు! ప్రభుత్వ రీచ్‌లలో ఇసుక లేకుండా చేసి.. కూటమి నేతలు సొంతంగా ఇసుక పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. చంద్రగిరి నుంచి నాయుడుపేట వరకు స్వర్ణముఖి నదీ తీరంలో టీడీపీ నేతల అనధికారికంగా రీచ్‌లే కనిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. కంటైనర్ల ద్వారా చెన్నై, బెంగుళూరుకు తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. మరో వైపు రైతులను బెదిరించి వారి భూముల్లోని ఇసుకను సైతం తవ్వేసి విక్రయించేస్తున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజక వర్గాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విచ్చలవిడిగా తవ్వకాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం తిరుపతి రూరల్ మండలం పాడిపేట వద్ద, ఏర్పేడు మండలం పెనుమల్లం వద్ద వెలుగుచూసిన టీడీపీ నేతల బాగోతమే ఇందుకు నిదర్శనం. డీకేటీ పట్టాలు పొందిన రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో టీడీపీ నేతలు దౌర్జన్యంగా భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి వందలాది వాహనాల ద్వారా తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తి మండల పరిధిలోనూ ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.7వేలకు విక్రయించి డబ్బులు పోగేసుకుంటున్నారు. టిప్పర్ అయితే రూ.25వేల నుంచి రూ.36వేలకు విక్రయించేస్తున్నారు. చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు అయితే లోడ్ ఇసుక రూ.లక్షపైనే ఉంటుందని అంచనా.పాడిపేట వద్ద స్వర్ణముఖిలో ఇసుక తవ్వకాలకు వచ్చిన టీడీపీ వారిని అడ్డుకున్న స్థానికులు(ఫైల్) వెలుగులోకి మరో మోసం ఇసుక ఉన్న రీచ్‌ల వద్ద అధికారులు, టీడీపీ నేతలు లాలూచీ పడి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమాలకు పాల్పడుతున్నారు. 10 టన్నులకు చలానా కట్టి టిప్పర్‌లో 15 టన్నులు ఇసుక నింపి సొమ్ముచేసుకుంటున్నారు. అలాగే 4 టన్నులకు రశీదు వేసి ట్రాక్టర్లో 5 టన్నుల ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు.తట్టలతో ఇసుక లోడ్ చేస్తున్న కూలీలు తమ్ముళ్లవైతే కేసే లేదు!టీడీపీకి చెందిన వారు ఎక్కడైనా ఇసుకను తవ్వి తరలించుకెళ్లినా అధికారులు పట్టించుకోరు. ఇంకొకరు చలానా కట్టి ఇసుక తీసుకెళుతున్నా కేసులు తప్పవు. శ్రీకాళహస్తి పరిధిలో ఓ వ్యక్తి రూ.1,200 చెల్లించి ట్రాక్టర్ ఇసుక తీసుకెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు పైసా కట్టకుండా రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ పట్టుబడ్డారు. ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాలను స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఒకరు పోలీసులకు ఫోన్ చేయటంతో తెలుగు తమ్ముళ్లను మాత్రం రాచమర్యాదలు చేసి విడిచిపెట్టేశారు. ప్రభుత్వానికి నగదు చెల్లించి ఇసుక తరలించిన వ్యక్తిపై మాత్రం కేసు నమోదు చేసి ట్రాక్టర్ సీజ్ చేయడం గమనార్హం.రాచ‘మార్గం’లో.. అక్రమార్జన కోసం టీడీపీ నేతల కుయుక్తులు అన్నీ ఇన్నీ కావు. ఇసుక తవ్వకాల కోసం ఏకంగా స్వర్ణముఖి నదిలోకి పలు ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేసేశారు. నేరుగా నది మధ్యలోకే వెళ్లేలా దారులు వేసేశారు. ఇసుక ట్రాక్టర్లు, టిప్పర్లు సులువుగా సజావుగా బయటకు వచ్చేలా ఆయా మార్గాలను రూపొందించారు. ఈ క్రమంలోనే యంత్రాలు అందుబాటులోని చోట్ల ఇసుక లోడ్ చేసేందుకు కూలీలను వినియోగిస్తున్నారు. ఒక్కో వాహనానికి ఇంత అని కూలి చెల్లించి.. అది కూడా ఇసుక కొనుగోలు చేసేవారిపైనే భారం మోపుతున్నారు. ఏది ఏమైనా కాసులు మూటగట్టుకోవడమే లక్ష్యంగా నదీమతల్లికి గర్భశోకం కలిగిస్తున్నారు. -
ఇసుక దొంగలకు జేసీ వార్నింగ్
-
బాబు అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
-
వాటాలు తేలకపోవటంతో ఇసుక దందా గుట్టు బయటపెట్టిన టీడీపీ నేతలు
-
నెల రోజుల్లో తిన్నది 40 లక్షల టన్నులు, కడుపు నిండిందా బాబు..
-
రాగానే మింగేశారు..'ఇసుక బకాసురులు'
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోంచేస్తున్నారు.. అది మామూలు భోజనం కాదు.. ఇసుక భోజనం.. ఇసుకనెలా తింటారు.. దానిని ఎలా అరిగించుకుంటారా.. అని ఆశ్చర్యపోకండి. ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను ఆరగించారు. ఇసుకను భోంచేయడం అంటే.. ఎక్కడికక్కడ డిమాండ్‌ను బట్టి అడ్డంగా అమ్మేసుకోవడం అన్నమాట.. ఆ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకున్నారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 170 స్టాక్ యార్డుల్లో 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మింగేశారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ఎక్కడికక్కడ టీడీపీ నేతలు ఇసుక నిల్వలపై పడ్డారు. స్టాక్ యార్డుల వద్దకెళ్లి ఇసుక కాంట్రాక్టు సంస్థల సిబ్బందిని బెదిరించి తరిమేశారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేసీకేసీ, ప్రతిమ ఇన్ఫ్రా ప్రతినిధులను వెళ్లగొట్టి అప్పటికప్పుడు స్టాక్ యార్డులను స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ నేతలు ఆ నిల్వలపై పడి ఇసుకను రాత్రింబవళ్లు తరలించేశారు. 5 వారాల తర్వాత తాపీగా ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించిన మైనింగ్ అధికారులు స్టాక్ యార్డుల వద్ద నిల్వలు మాయమైనట్లు గుర్తించి ముక్కున వేలేసుకున్నారు. ఇప్పుడు వారి లెక్కల ప్రకారం సుమారు 98 స్టాక్ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక మాత్రమే నిల్వ ఉంది. అంటే 70కిపైగా ఇసుక యార్డుల్లో ఇసుక నిల్వలను తరలించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. 70 స్టాక్ యార్డులు ఖాళీ తూర్పు గోదావరి జిల్లా చిడిపి స్టాక్ యార్డుల్లో ఎన్నికలకు ముందు 1.81 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేయగా ఇప్పుడు మైనింగ్ అధికారుల లెక్క ప్రకారం 35 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంది. 1.46 లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది. నిడదవోలు నియోజకవర్గంలోని పందలపర్రు, ఊసులమర్రు, పెండ్యాల స్టాక్ యార్డుల్లోనూ లక్షన్నర టన్నుల ఇసుకను పచ్చ ముఠాలు మింగేశాయి. రాజమహేంద్రవరం రూరల్ లాలా చెరువు యార్డులో 1.40 లక్షల టన్నుల ఇసుకను మాయం చేసి నామమాత్రంగా 7,500 టన్నుల ఇసుకను అమ్మకానికి పెట్టారు. నెల్లూరు జిల్లా పల్లిపాడు స్టాక్ యార్డులో 2.20 లక్షల టన్నుల ఇసుకకుగానూ 1.25 లక్షల టన్నులు మాత్రమే మిగిలింది. కొన్నిచోట్ల అసలు ఇసుక నిల్వలే లేకుండా చేసేశారు. కృష్ణా జిల్లా అప్పారావుపేట, లంకపల్లి, తోట్లవల్లూరు స్టాక్ పాయింట్లను పూర్తిగా ఎత్తివేశారు. ఎన్నికలకు ముందు అక్కడ లక్ష టన్నులకుపైగా ఇసుక ఉండగా మొత్తం కరిగించేశారు. ఇలా సుమారు 70 స్టాక్ యార్డుల్లో ఇసుక రేణువు లేకుండాపోయింది. కృష్ణా జిల్లాలో ఇసుక రీచ్‌లు ఉన్నా స్టాక్‌యార్డులో మాత్రం ఇసుక లేకుండాపోయింది. దీంతో స్థానికులు సుదూరం ప్రాంతాలకు వెళ్లి ఇసుకను కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.గోదావరిని గుల్ల చేసి..రాష్ట్రంలో రీచ్‌లు ఉన్నచోటల్లా టీడీపీ, జనసేన నేతలు అక్రమంగా ఇసుకను తరలించుకుపోయారు. ఓవైపు గోదావరిలో తవ్వకాలపై నిషేధం కొనసాగుతున్నా గుల్ల చేసేశారు. నిల్వలన్నీ దాదాపుగా ఇప్పటికే ఊడ్చేశారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, నిడదవోలు తదితర ప్రాంతాల్లో భారీగా ఇసుక నిల్వలు ఉన్నాయి. వీటిని మాయం చేసి ఇసుక ర్యాంపుల్లో గుట్టుచప్పుడు కాకుండా అనధికారిక తవ్వకాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 11 ఇసుక రీచ్‌లలో నామమాత్రంగానే ఇసుక ఉంది. మంత్రి కందుల దుర్గేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నిడదవోలు నియోజకవర్గంలో పందలపర్రు, కానూరు, పెండ్యాల, తీపర్రు ఇసుక ర్యాంపుల వద్ద ఉన్న గుట్టలను తరలించేశారు. రాజమహేంద్రవరం రూరల్ గాయత్రి ర్యాంపులో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అనుచరుడు, మండపేటకు చెందిన ఓ జనసేన నేత కోట్ల విలువ చేసే ఇసుక నిల్వలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. కాతేరు ఇసుక ర్యాంపుల్లో ఎమ్మెల్యే అనుచరుడు దగ్గరుండి వ్యవహారం నడుపుతున్నాడు. కడియపులంక, వేమగిరి ర్యాంపుల్లో రాత్రిళ్లు వందల ట్రాక్టర్లు, లారీల ఇసుక తరలిపోతోంది. కాకినాడ జిల్లా కరప మండలం ఉప్పలంక వద్ద అనధికారిక స్టాక్ పాయింట్ నుంచి 10 రోజుల క్రితం ఇసుకను భారీగా లారీల్లో తరలించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెంలో జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసిన రెండు స్టాక్ పాయింట్ల నుంచి భారీగా ఇసుకను తరలించారు. ఆత్రేయపురం మండలం పులిదిండిలో రాత్రి వేళల్లోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలంలోని మాన్సాస్ ట్రస్టు భూముల్లో ఇసుక అక్రమ తవ్వకాలకు రంగం సిద్ధమైంది. కపిలేశ్వరపురం, తాతపూడిలోనూ భారీగా ఇసుకను కొల్లగొట్టారు. బాలయ్య ఇలాకాలో యథేచ్ఛగా..టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు చిలమత్తూరు మండల పరిధిలో చిత్రావతి నది నుంచి రోజూ భారీఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. కర్ణాటకకు సైతం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొడికొండ, కోడూరు, మరువకొత్తపల్లి, లాలేపల్లి, దిగువపల్లి తండా సమీపంలోని చిత్రావతి నదిలో ఇసుక మేటలపైనా టీడీపీ నేతల కన్ను పడింది. నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో జేసీబీలను వినియోగించి ఇసుక తోడేస్తున్నారు. బత్తలపల్లి మండలం నల్లబోయలపల్లి వద్ద నిల్వ ఉంచిన ఇసుకను ఇటీవల అక్రమంగా తరలించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కడనూతల, నరసింహపురం, వెంకటాచలం, మర్రిపాడు, నెల్లూరుపాళెం, సంగం వద్ద ఇసుక డిపోలలో లక్షల టన్నుల ఇసుకను గతంలో నిల్వ చేయగా ప్రస్తుతం దాదాపుగా అడుగంటాయి.సీఎం రమేశ్, ఆది వర్గీయుల పోటాపోటీ..వైఎస్సార్ జిల్లాలోని 11 స్టాకు పాయింట్లలో లక్షలాది టన్నులను టీడీపీ నేతలు అక్రమంగా తరలించేశారు. పాపాఘ్ని, పెన్నా, చెయ్యేరు నదుల నుంచి గత రెండు వారాలుగా లక్షలాది టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. హనుమాన్‌గుత్తి వద్ద పెన్నాలో అక్రమంగా రోడ్డు ఏర్పాటు చేసి ఎంపీ సీఎం రమేశ్ వర్గీయులు ఇసుక తరలిస్తున్నారు. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు పోటీపోటీగా పొక్లెయిన్ల ద్వారా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇసుక టిప్పర్ల ధాటికి గ్రామస్తులు బెంబేలెత్తుతున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ యార్డులో నిల్వ చేసిన దాదాపు రెండు వేల టన్నుల కట్టుబడి ఇసుకను సైతం టీడీపీ నేతలు తరలించేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం స్టాక్ పాయింట్ వద్ద భారీ పరిమాణంలో ఇసుకను టీడీపీ నేతలు మాయం చేశారు. కంకిపాడు మండలం మద్దూరు వద్ద వందలాది వాహనాల్లో ఇసుకను తరలించేశారు. ఎన్టీఆర్ జిల్లా మోగులూరులోని ఇసుక నిల్వలు కూడా మాయమయ్యాయి.ఉత్తరాంధ్రలో నిరాటంకంగా చోరీ విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డు వద్ద నుంచి భారీగా తరలించారు. విశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ నేతలు లక్షలాది టన్నుల ఇసుకను తరలించేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో, నక్కపల్లి ఇసుక డిపో వద్ద నుంచి పెద్ద పరిమాణంలో ఇసుకను తరలించారు. బాపట్ల జిల్లాలో టీడీపీ నేతలు జువ్వలపాలెం పాయింట్ నుంచి అందినకాడికి అమ్ముకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లక్షలాది టన్నుల ఇసుకను టీడీపీ నేతలు కరిగించేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం తహసీల్దారు కార్యాలయానికి కూతవేటు దూరంలో వంశధార నది నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. రాజమార్గంలో తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వంశధారలో రోజూ అర్ధరాత్రి అక్రమ తవ్వకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లేనే వేలాది లారీల్లో ఇసుకను తరలించారు. -
మాయం మాయం 25 రోజుల్లో అంతా మాయం ఇదే చంద్ర తంత్రం
-
ఉచిత ఇసుక పేరుతో ప్రజలకు పంగనామాలు
-
35 లక్షల టన్నుల ఇసుక మాయం..
-
గబ్బాడ యార్డులో రూ.5 కోట్ల ఇసుక మయం
నర్సీపట్నం: కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు పాల్పడిన ఇసుక దోపిడీపై విచారణ చేపట్టి, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భారీఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలకు ముందు నర్సీపట్నం గబ్బాడ యార్డులో లక్ష టన్నుల ఇసుక ఉండేదన్నారు.ఫలితాలు వెలువడిన మరుసటి రోజే టీడీపీ నాయకులు యార్డును స్వా«దీనం చేసుకున్నారని చెప్పారు. లక్ష టన్నులు ఉండాల్సిన ఇసుక ప్రస్తుతం 48 వేల టన్నులే ఉందని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యార్డులోని రూ.5 కోట్లు విలువ చేసే ఇసుకను వాహనాల్లో తరలించి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు.యార్డులోని 60 వేల టన్నుల ఇసుకను మాయం చేశారన్నారు. గబ్బాడ ఇసుక దోపిడీపై అధికారులు సమగ్రమైన విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందని గణేష్ దుయ్యబట్టారు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న ఇసుక స్మగ్లర్లు
ముస్తాబాద్ (సిరిసిల్ల): ఇసుక స్మగ్లర్ల ఆగడాలు జిల్లాలో పరాకాష్టకు చేరుకున్నాయి. పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించే క్రమంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఇసుక స్మగ్లర్ దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలకు వెళ్లారు. రాంరెడ్డిపల్లె, నామాపూర్ గ్రామాల మధ్య ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని ఠాణాకు తరలిస్తుండగా, గోపాల్పల్లెకు చెందిన భూక్య గురుబాబు తన కారులో నామాపూర్ చేరుకున్నాడు. ‘నా బండినే పట్టుకుంటారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణపై దాడికి దిగాడు. దీంతో కానిస్టేబుల్ ఎదురుతిరిగి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. అక్కడికి చేరుకున్న ఎస్సై ట్రాక్టర్‌ను ఠాణాకు తీసుకెళ్లాలని హెచ్చరించాడు. దీంతో గురుబాబు ట్రాక్టర్‌ను నడిపాడు. ఆ సమయంలో కానిస్టేబుల్ సత్యనారాయణ ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చోగా, నామాపూర్ శివారులోని మేళ్ల చెరువు వద్దకు చేరుకోగానే గురుబాబు ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ చెరువులోకి తీసుకెళ్లి.. తాను కిందకి దూకి పారిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ చెరువులోని బండరాళ్లపై పడిపోగా నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ చెరువు నీటిలో మునిగిపోయింది. అటుగా వచ్చిన ఎస్సై వెంటనే కానిస్టేబుల్‌ను 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. అన్నిజిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు. గురవారం సీఎం రేవంత్ రెడ్డి.. గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాకు అడ్డాగా మారిందని తెలిపారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. రెండు రోజుల తర్వాత అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత వారం ఆకస్మిక తనిఖీలు చేస్తే 83 లారీల్లో 22 లారీలకు అనుమతి లేదన్నారు. దాదాపు 25 శాతం ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సీఎం రేవంత్ తెలిపారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె!
చిలుకూరు: చిలుకూరు గ్రామానికి చెందిన కొడారు శ్రీనివాస్‌రావు(41) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి కుమారులు లేరు. కుమార్తె మౌనిక మాత్రమే సంతానం. కొడుకులు లేకపోవడంతో మౌనిక తన తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఈ ఘటనను చూసి పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టారు. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం వలిగొండ: మండలంలోని ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాలమణి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు భర్త, కుమారుడు, కూమార్తె ఉన్నారు. వ్యవసాయ బావుల వద్ద ట్రాక్టర్ల అపహరణ ఆత్మకూరు(ఎం): వ్యవసాయ బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన తుమ్మల మహేందర్‌రెడ్డి ట్రాక్టర్ ఇంజన్‌తో పాటు లింగరాజుపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన శ్రీశైలం ట్రాక్టర్ ట్రాలీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీంతో బాధితులు బుధవారం ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇసుక డంపు సీజ్ నూతనకల్: మండల పరిధిలోని గుండ్లసింగారం ఆవాసంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం సీజ్ చేశారు. తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లసింగారం గ్రామ శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తోడి మామిడి తోటలో నిల్వ చేశారని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని సుమారు 80ట్రిప్పుల ఇసుకను నిల్వ చేసినట్లు నిర్ధారించి సీజ్ చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. చికిత్స పొందుతూవృద్ధుడి మృతి రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన అల్లం ముత్తయ్య(75) ఈనెల 2న తన మేనకోడలు ఊరైన పేరందేవిగూడేనికి ఆటోలో వెళ్తూ చిన్న సూరారం వద్ద దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా నల్లగొండ నుంచి నకిరేకల్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తయ్య తలకు, రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు అల్లం రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సింగం రామ్మూర్తి తెలిపారు. -
టీడీపీ హయంలో ఇసుక దోపిడీకి బరి తెగించిన బాబు
-
ఇసుక కుంభకోణం కేసు: చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా
సాక్షి, గుంటూరు: ఉచిత ఇసుక విధానంతో రాష్ట్ర ఖజానాకు నష్టం కలగజేసిన సీఐడీ అభియోగాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారాయన. బుధవారం హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగగా.. ఈ నెల 22వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది హైకోర్టు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే.. రాజకీయ కార్యకలాపాలకు తనను దూరంగా ఉంచాలని, న్యాయవిచారణ ప్రక్రియలో మునిగిపోయేలా చేయాలని, వేధించాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ నెల 20వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇసుక కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఉచితంగా ఇసుకను ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ. 1,300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సీఐడీ ఆరోపించింది. ఇసుక పాలసీపై కేబినెట్ లో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ తన అభియోగాల్లో.. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి ఇసుక కుంభకోణం సాగించారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నాగం పన్నారంటూ.. ఆధారాలతోసహా బయటపెట్టింది. -
ఇసుకలో నొక్కేశారు..అందుకే కేసు: బొత్స
సాక్షి, విజయనగరం : వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో సామాజిక న్యాయం చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం విజయనగరం జిల్లాలో సామాజిక సాధికారిత బస్సు యాత్రలో భాగంగా బొత్స మాట్లాడారు. రాష్ట్రంలో పేదలందరినీ అభివృద్ధి చేయాలని సీఎం జగన్ పనిచేస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఇటీవల జరిగిన రైలు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో సీఎం జగన్ ఎంతో మానవత్వం ప్రదర్శించారని చెప్పారు బొత్స. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దండుకున్నారన్నారు. ఇసుకలో అవినీతి జరిగినందునే కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో అవినీతి లేకుండా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ఇసుక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. కోర్టు తీర్పులను గౌరవిస్తూనే అన్ని అనుమతులు తీసుకొని విశాఖపట్నంలోని రుషికొండలో నిర్మాణాలు చేపట్టామని బొత్స తెలిపారు. -
టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు
-
ఉచితమంటూ.. ముసుగు దోపిడీ
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు మహిళా సంఘాల ముసుగులో అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి ఖజానాకు కన్నం వేశారు. ఒకే ఇసుక బిల్లుపై అక్రమంగా తరలించిన వేలాది టన్నులను అధిక ధరలకు విక్రయించి దోచుకున్నారు. మహిళ సంఘాల పేరుతో ఇసుక దందాపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో 2016 మార్చి 4న అప్పటి సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానం పేరుతో దోపిడీకి టీడీపీ నేతలకు రాచబాట వేశారు. అప్పటివరకు ఇసుక సరఫరా కోసం బుకింగ్ చేసుకుని డబ్బులు కట్టిన వారికి రూ.47.50 కోట్లను వెనక్కి చెల్లించలేదు. ఆ డబ్బులకు లెక్కలు చెప్పలేక గత ప్రభుత్వం నీళ్లు నమిలిందని 2018లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక పేర్కొంది. తద్వారా టీడీపీ నేతల ఇసుక దోపిడీని ఎండగట్టింది. ఎల్లో గ్యాంగ్ కనుసన్నల్లో రీచ్‌లు మహిళా సాధికారత పేరుతో రాష్ట్రంలో ఇసుక రీచ్‌ల నిర్వహణ, అమ్మకాలను స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలకు అప్పగిస్తూ 2014లో గత సర్కారు ఇసుక విధానాన్ని ప్రకటించింది. ఇసుక విక్రయాల కోసం రాష్ట్ర స్థాయిలో సెర్ప్ (పేదరిక నిర్మూలన సంస్థ) ఆధ్వర్యంలో, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ శాండ్ మైనింగ్ ఫెసిలిటీ ఏజెన్సీస్(డీఎస్‌ఎంఎఫ్‌ఏ)లను ఏర్పాటు చేశారు. వాటి పర్యవేక్షణలో ఇసుక అమ్మకాలకు పోర్టల్ ఏర్పాటైంది. ఇసుక కోసం పోర్టల్‌లో బుక్ చేసుకుని ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే మహిళా సంఘాలు ఇసుకను సరఫరా చేసేలా రూపొందించిన విధానం కాగితాలకే పరిమితమైంది. మహిళా సంఘాల ముసుగులో టీడీపీ నేతలు ఇసుక రీచ్‌లను తమ అధీనంలోకి తీసుకున్నారు. పోర్టల్‌లో ఇసుక కోసం బుక్ చేసుకున్న ఒకే బిల్లుపై వేలాది టన్నులు అక్రమంగా తరలించి అధిక ధరలకు విక్రయించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో 2016 మార్చి 4న దాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. అప్పటివరకు ఇసుక కోసం పోర్టల్‌లో బుక్ చేసుకుని సరఫరా చేయని వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం 2016–17లో సెర్ప్ రూ.35.52 కోట్లను విడుదల చేయగా రూ.13.57 కోట్లను రీఫండ్ చేశారు. అంటే మిగతా డబ్బులు మిగుల్చుకున్నట్లు స్పష్టమవుతోంది. 2017 ఫిబ్రవరిలో ఇసుక బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేసేందుకు మరో రూ.25.55 కోట్లను సెర్ప్ విడుదల చేసింది. వాస్తవానికి రీఫండ్ కోసం అప్పటికే విడుదల చేసిన నిధులు మిగిలి ఉండగా మళ్లీ డబ్బులు విడుదల చేయడాన్ని కాగ్ తప్పుబట్టింది. రీఫండ్‌కి సంబంధించి రూ.47.5 కోట్లకు లెక్కలు చెప్పాలని అడిగితే గత సర్కారు నీళ్లు నమిలిందని కాగ్ స్పష్టం చేసింది. దీన్ని బట్టి టీడీపీ నేతలే ఇసుక బుక్ చేసుకుని ఒకే బిల్లుపై వేలాది టన్నులు అక్రమంగా తరలించి డబ్బులు కాజేసినట్లు స్పష్టమవుతోంది. -
చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలోనే అడ్డగోలుగా దోచేశారు..
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నిబంధనలను ఉల్లంఘించి, జీవనదులను విధ్వంసం చేసి.. పర్యావరణాన్ని చావుదెబ్బ తీస్తూ అడ్డగోలుగా యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగిందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తేల్చి చెప్పింది. కృష్ణా నదీ గర్భంలో ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అప్పటి సీఎం చంద్రబాబు నివాసముంటున్న అక్రమ కట్టడానికి కూత వేటు దూరంలో పొక్లెయినర్లతో భారీ ఎత్తున ఇసుకను తవ్వి.. వందలాది ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్లలో ఇసుకను స్మగ్లర్లు తరలిస్తున్నా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించిందని మండిపడింది. ఈ మేరకు 2019 ఏప్రిల్ 4న స్పష్టం చేసింది. టీడీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని 2016 మార్చి 4 నుంచి అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఇసుక స్మగ్లర్లు విజృంభించారు. అప్పటి నుంచి ఒక్క ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో ఎనిమిది చోట్ల రోజూ 34 వేల టన్నుల ఇసుకను పొక్లెయిన్లతో తవ్వి 2,500 ట్రక్కుల్లో తరలించి.. ఒక్కో ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయించి రూ.1.25 కోట్ల చొప్పున ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్ల ముఠా ఆర్జించిందని ఎన్జీటీ తేల్చింది. శ్రవణ్‌కుమార్ అనే న్యాయవాది వేరే కేసులో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాల ద్వారా ఏడాదికి రూ.పది వేల కోట్లను స్మగ్లర్లు సంపాదిస్తున్నారని చెప్పడాన్ని ఎన్జీటీ ఎత్తిచూపింది. అక్రమంగా ఇసుకను తవ్వడం ద్వారా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని.. అందుకు రూ.వంద కోట్ల జరిమానాగా చెల్లించాలని గత ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ రూ.100 కోట్లను ఇసుక స్మగ్లర్ల నుంచే వసూలు చేయాలంటూ 2019 ఏప్రిల్ 4న పేర్కొంది. అప్పట్లో అధికారంలో ఉన్నది టీడీపీ సర్కారే. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలోనే 8 చోట్ల అక్రమంగా ఇసుకను తవ్వి, తరలించి, విక్రయించి ఏడాదికి రూ.450 కోట్లను ఇసుక స్మగ్లర్లు దోచేస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, చిత్రావతి సహా జీవనదులు, వాగులు, వంకల్లో ఇసుకను అడ్డగోలుగా దోచేయడం ద్వారా ఇంకెన్ని రూ.వేల కోట్ల దోచుకొని ఉంటారో అంచనా వేసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి, తరలించడం ద్వారా పర్యావరణానికి విఘాతం కలుగుతోందంటూ 2016లో ఎన్జీటీలో రైతులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలని ఆదేశిస్తూ 2017 ఫిబ్రవరి 23న ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కానీ.. ఎన్జీటీ ఆదేశాలను తుంగలో తొక్కిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలకు దన్నుగా నిలిచింది. ఇదే అంశాన్ని రైతులు మరోసారి ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో.. కృష్ణా నది గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలను నిగ్గు తేల్చాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ)లను 2018 డిసెంబర్ 21న ఎన్జీటీ ఆదేశించింది. సీపీసీబీ, పీసీబీలకు చెందిన ఏడుగురు అధికారులతో విచారణ కమిటీని నియమించింది. బాబు జమానాలో లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు చంద్రబాబు జమానాలో తవ్వినకొద్దీ లెక్కలేనన్ని ఇసుక అక్రమాలు బయటపడ్డాయి. చంద్రబాబు, లోకేశ్ కనుసన్నల్లో అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు సాగించి, ఇసుకను తరలించింది. అప్పటి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులైన దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, నక్కా ఆనందబాబు, జవహర్, చింతమనేని ప్రభాకర్, కూన రవికుమార్, పెందుర్తి వెంకటేష్, బూరుగుపల్లి శేషారావు, ముళ్లపూడి బాపిరాజు, శ్రావణ్ కుమార్, తంగిరాల సౌమ్య, కొమ్మాలపాటి శ్రీధర్, శ్రీరాం తాతయ్య, ఆలపాటి రాజా తదితరులు ఇసుక అక్రమాల్లో చెలరేగిపోయారు. ఈ ముఠా అంతా ఇసుక ద్వారా దోపిడి చేసిన మొత్తంలో నెలవారీ కమీషన్లు ఏకంగా రూ.500 కోట్లు లోకేశ్‌కు ముట్టజెప్పేవారనేది బహిరంగ రహస్యం. గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి, పెన్నా నదులతోపాటు తమ్మిలేరు తదితర నదులు, ఏరుల్లో సైతం అడ్డు అదుపులేకుండా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగించారు. స్వయం సహాయక బృందాల పేరుతో టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దందా నడిపారు. ఇసుక విధానంపై ఇష్టానుసారంగా తమకు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ దాదాపు 19 సార్లు జీఓలు ఇచ్చారు. వాస్తవానికి ఉచితంగా ఇసుక ఎవరికీ అందలేదు. అధిక ధర చెల్లించి కొనుక్కోవాల్సిన దుస్థితి కల్పించారు. పొరుగు రాష్ట్రాలకు సైతం పెద్ద ఎత్తున ఇసుకను లారీల్లో తరలించారు. అడ్డుకున్న వారిపై టీడీపీ నేతలు రెచ్చిపోయి దాడులు చేశారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధితులనే తప్పు పట్టడం అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. దోపిడీ గుట్టు రట్టు చేసిన కమిటీ ఎన్జీటీ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో కృష్ణా నది గర్భంలో ఇసుకను తవ్వుతున్న ప్రాంతంతోసహా ఎగువన మరో ఏడు రీచ్‌లను 2019 జనవరి 17, 18న క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. ఆ తనిఖీలో వెల్లడైన అంశాల ఆధారంగా 2019 జనవరి 21న ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. నివేదికలో ప్రధానాంశాలు.. ► ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో కృష్ణా నది గర్భంలో అనుమతి లేకుండా.. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా ఎనిమిది చోట్ల భారీ ప్రొక్లెయిన్లు, మర పడవల ద్వారా రోజుకు సుమారు 34,650 టన్నుల ఇసుకను తవ్వుతున్నారు. ఇలా తవ్విన ఇసుకను రోజూ 2,500 ట్రక్కులు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ట్రక్కు ఇసుకను కనీసం రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే రోజుకు ఇసుక అక్రమ అమ్మకాలతో రూ.1.25 కోట్లు ఆర్జిస్తున్నారు. ఏడాదికి ఈ 8 రీచ్‌ల నుంచే రూ.450 కోట్ల చొప్పున కొల్లగొట్టారు. ప్రకాశం బ్యారేజ్ జల విస్తరణ ప్రాంతంలో అడ్డగోలుగా ఇసుకను తవ్వేయడం వల్ల జీవనది కృష్ణా విధ్వంసమైంది. కృష్ణా నది గర్భంలో 25 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అందువల్ల ప్రవాహ దిశ మారే అవకాశం ఉంది. వరద గట్లు, భవానీ ద్వీపం దెబ్బతిన్నాయి. ► ఈ నివేదికను సమగ్రంగా పరిశీలించిన ఎన్జీటీ.. ఇసుక స్మగ్లర్లకు దన్నుగా నిలిచిన అప్పటి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. రూ.వంద కోట్లను జరిమానాగా విధించింది. ► ఇసుక దందా గురించి 2016 నుంచి హిందూ వంటి జాతీయ పత్రికలతోపాటు టీవీ ఛానెళ్లు వరుస కథనాలను ప్రసారం చేయడాన్ని ఎన్జీటీ తన తీర్పులో ప్రస్తావించింది. ఇసుక స్మగ్లర్లు తవ్వేసిన గుంతల్లో పడి.. ఇష్టారాజ్యంగా ట్రక్కులు నడపడం వల్ల వాటి కింది పడి 14 మంది చనిపోవడాన్ని ఎత్తిచూపింది. ఇసుక స్మగ్లర్లు అడ్డగోలుగా దోచేస్తున్నా.. దానికి అడ్డుకట్ట వేయకుండా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించడంలో ఔచిత్యం ఏమిటని చంద్రబాబు సర్కార్‌ను నిలదీసింది. -
ఇసుక దందాపై కొరడా
ఎంత ఇసుక అందుబాటులో ఉంది.. ఎంత ఇసుక తవ్వుతున్నాం.. ఎంతకు అమ్ముతున్నాం.. అనే సమాచారం ఏదీ రికార్డుల్లో చూపించాల్సిన అవసరం లేకుండా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు భారీ దోపిడీకి స్కెచ్ వేశారు. ఇందులో భాగంగా తెరపైకి తీసుకువచ్చిందే ‘ఉచిత ఇసుక విధానం’. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఉచితం అని భ్రమ కల్పించారు. కానీ వాస్తవంగా జరిగింది వేరు. ఈ విధానం ముసుగులో రాష్ట్రంలో ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్ర బాబు తనతోపాటు మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకొచ్చారు. తద్వారా వారి దోపిడీకి అంతేలేకుండా పోయింది. తక్కువలో తక్కువ బాబు అండ్ కో రూ.10 వేల కోట్లు కొల్లగొట్టింది. సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన ఇసుక దోపిడీపై సీఐడీ కొరఢా ఝళిపించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి, సాగించిన ఇసుక కుంభకోణంపై కేసు నమోదు చేసింది. ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో పచ్చ ముఠా బరితెగించి సాగించిన ఇసుక దోపిడీ గుట్టు రట్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం, గ్రీన్ ట్రిబ్యునల్ విధివిధానాలను ఉల్లంఘించి, కేబినెట్ ఆమోదం కూడా లేకుండా ‘ప్రత్యేక మెమో’ ద్వారా చంద్రబాబు పన్నిన పన్నాగం ఆధారాలతోసహా బట్టబయలు అయ్యింది. 2016 నుంచి 2019 వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల ఆదాయానికి గండి కొట్టడమే కాక, చంద్రబాబు ముఠా ఏకంగా రూ.10 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీకి పాల్పడిందన్నది విభ్రాంతి పరుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ–1గా పీతల సుజాత (టీడీపీ ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రి), ఏ–2గా చంద్రబాబు (అప్పటి ముఖ్యమంత్రి), ఏ–3గా చింతమనేని ప్రభాకర్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే), ఏ–4గా దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో జల వనరుల శాఖ మంత్రి)తోపాటు మరికొందరిని ఏ–5గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయాన్ని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానానికి తెలుపుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 120 బి, 409 రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 (1) (డి) రెడ్‌విత్ 13 (2) ప్రకారం అభియోగం నమోదు చేశారు. అంతులేని బాబు ధన దాహం పదేళ్ల తర్వాత 2014లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి బరితెగించారు. ఆ క్రమంలో ఆయన కన్ను రాష్ట్రంలో ఇసుక రీచ్‌లపై పడింది. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడాలని పన్నాగం రచించారు. అందుకోసం 2014 నుంచి 2016 వరకు ఓ విధానాన్ని తీసుకువచ్చి, అడ్డూ అదుపు లేకుండా అక్రమంగా ఇసుక తవ్వకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆయన ధన దాహం తీరలేదు. దాంతో మరింతగా బరితెగించి ఇసుక దోపిడీ సాగించేలా వ్యూహం పన్నారు. అందుకోసం ప్రభుత్వ ఇసుక విధానాన్ని పునఃసమీక్షించాలని కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. అనంతరం కొత్త ఇసుక విధానాన్ని నిర్ణయిస్తూ 2016 జనవరి 15న రెండు జీవోలు (జీవో నంబర్లు 19, 20) జారీ చేశారు. అయినప్పటికీ చంద్రబాబు ఇసుక దాహం తీరలేదు. బరితెగించి ఇసుక దోపిడీకి పాల్పడేందుకు మరో విధానాన్ని తీసుకురావాలని చంద్రబాబు భావించారు. ‘ఇసుకను ప్రభుత్వం అమ్మదు.. ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు.. ఎవరికి వారు ఇసుక రీచ్‌లకు వెళ్లి ఇసుక తవ్వుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. ప్రభుత్వం ఎలాంటి నిబంధనలుగానీ, ఆంక్షలు గానీ విధించదు’ అని చెప్పారు. ఈ మేరకు 2016 మార్చి 4న ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి దొరికిన చోట దొరికినట్లు దోచుకున్నారు. ఇసుక రీచ్‌లు అన్నింటినీ చంద్రబాబు తన చేతిలోకి, మంత్రివర్గ సభ్యులు, టీడీపీ ఎమ్మెల్యేల ఆధీనంలోకి తీసుకువచ్చారు. మెమో 3066తో కనికట్టు ► ‘ఉచిత ఇసుక విధానం’ ముసుగులో గత ప్రభుత్వ పెద్దలు మాయాజాలం చేసి, భారీ అవినీతికి పాల్పడ్డారు. కొత్త ఇసుక విధానాన్ని తీసుకువస్తూ టీడీపీ ప్రభుత్వం 2016 మార్చి 4న ప్రత్యేకంగా ‘మెమో నంబరు 3066’ను జారీ చేసింది. దీని ద్వారా రాష్ట్రంలోని ఇసుక రీచ్‌లన్నీ చంద్రబాబు, ఆయన మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హస్తగతం చేసుకున్నారు. ► రాష్ట్రంలో సహజ వనరులకు సంబంధించి, అందులో రాష్ట్ర ఖజానాకు కీలకమైన ఆర్థిక వనరుకు సంబంధించి కేబినెట్ ఆమోదం లేకుండా కేవలం ఒక మెమో ద్వారా కథ నడిపించడం చంద్రబాబు అవినీతికి పరాకాష్టగా నిలిచింది. ఈ మెమో ద్వారా 2016 నుంచి 2019 వరకు అడ్డూ అదుపు లేకుండా ఇసుకను కొల్లగొట్టారు. జిల్లాల వారీగా ఇసుక రీచ్‌లలో ఎవరెవరు తవ్వుకోవాలో చంద్రబాబు స్వయంగా తన బినామీలు, సన్నిహితులు, టీడీపీ ఎమ్మెల్యేలకు అప్పగించారు. ► అప్పటి వరకు కూలీలతో ఇసుక తవ్వకాలు సాగుతుండగా.. ఒక్కసారిగా భారీ యంత్రాలను ఇసుక తవ్వకాల కోసం తీసుకువచ్చారు. ఇతరులు ఎవరూ ఆ ఇసుక రీచ్‌ల వైపు కన్నెత్తి కూడా చూడకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ముఠా రోజూ వేల లారీల్లో లక్షల టన్నుల ఇసుకను తవ్వేసి.. అమ్ముకోసాగింది. రాష్ట్రంలో నదుల్లో అందుబాటులో ఉన్న ఇసుక ఎంత.. రోజుకు ఎంత ఇసుక తవ్వుతున్నారు.. ఎంతకు అమ్ముతున్నారు.. ఎన్ని వేల లారీల ఇసుక రోజూ రాష్ట్రం దాటుతోందన్న లెక్కలకు అంతూపొంతూ లేకుండా పోయింది. ► శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు అంతటా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడ్డారు. ఇసుకదోపిడీ కుట్రకు చంద్రబాబు సూత్రధారి కాగా, ఈ కుట్రలో అప్పటి గనుల శాఖ మంత్రి పీతల సుజాత, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు మరికొందరు ప్రధాన పాత్రధారులుగా వ్యవహరించారు. ► అక్రమ ఇసుక తవ్వకాలను ప్రశ్నించినందుకు తహశీల్దార్ వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడటం అప్పట్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఇది పచ్చ ముఠాల బరితెగింపునకు నిదర్శనం. అంతగా తహశీల్దార్‌పై దాడికి పాల్పడిన తన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను అప్పటి సీఎం చంద్రబాబు సమర్థించడం విస్మయ పరిచింది. తమ ఇసుక దోపిడీకి అడ్డు వస్తే ఎవరికైనా అదే గతి పడుతుందని స్పష్టమైన సందేశం ఇచ్చేందుకే చంద్రబాబు అలా వ్యవహరించారు. టీడీపీ పెద్దల జేబులోకి రూ.10 వేల కోట్లు 2016 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ పెద్దలు సాగించిన ఇసుక దోపిడీ విలువ ఎంతన్నది నిగ్గు తేల్చడం గనుల శాఖ అధికారులకే అంతుపట్టడం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల ప్రకారం ఇసుక తవ్వకాల ద్వారా ఖజానాకు నాలుగు రకాల ఆదాయం రావాలి. సీనరేజీ, కన్సిడరేషన్ చార్జీలు, డిస్ట్రిక్ట్ మైన్స్ ఫండ్, మెరిట్ ఫీజు చెల్లించాలి. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్మార్గదర్శకాలను పాటిస్తూ కొత్త ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ఆ ప్రకారం 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర ఖజానాకు రూ.766 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ ప్రకారం టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2019 వరకు కనీసం రూ.వెయ్యి కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు రావల్సి ఉంటుందని గనుల శాఖ అంచనా వేసింది. అంటే చంద్రబాబు ‘ఉచిత ఇసుక’ అనే మోసపూరిత విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.వెయ్యి కోట్ల గండిపడింది. ఇక రాష్ట్రంలో యథేచ్ఛగా తవ్విన ఇసుక ఎంతన్న అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. 2016 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఠా రాష్ట్రంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఇసుకను తవ్వి అమ్మేసుకుందన్నది విస్మయం కలిగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పక్కా ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో సీఐడీ తదుపరి చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిర్భీతిగా నిబంధనలు బేఖాతరు వేల కోట్ల రూపాయల ఇసుక దందా కోసం చంద్రబాబు అన్ని నిబంధనలను నిర్భీతిగా ఉల్లంఘించారు. కేవలం ఒక ‘మెమో’తో ఇసుక దోపిడీకి పాల్పడటం ఆయన కుతంత్రానికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడే రాష్ట్రాల్లో ఇసుక తవ్వకాల కోసం విధానాలు రూపొందించాలి. ఆ మేరకు జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. దాంతోపాటు మరో రెండు విధానాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కచ్చితంగా పాటించాలి. ► ఇసుక తవ్వకాల కోసం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ రూపొందించిన బిజినెస్ రూల్స్ (మార్గదర్శకాలు) అనుసరించాలి. ► అంతకంటే మెరుగైన విధానం రూపొందించామని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తే ఆమేరకు ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ► ఓ విధానాన్ని రూపొందించి అందుకు కేబినెట్ ఆమోదం పొందాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మోసపూరితంగా తీసుకువచ్చిన ‘ఇసుక విధానం’ కోసం ఈ మూడు విధానాల్లో ఏ ఒక్కటీ పాటించ లేదు. అంటే జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పాటించ లేదు. కొత్త విధానం కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు. అప్పటి కేబినెట్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదించ లేదు. -
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్‌లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్‌లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
ఇసుకాసురుడు ‘నారా’సురుడే..!
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఇసుక మీద మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శలు చేశారు. వంశధార, నాగావళి, పెన్నా నదుల్లో ఇసుకను టీడీపీ నేతలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. ప్రతీ నెల ఇసుక మీద నారా లోకేష్ ముడుపులు తీసుకునేవాడు అని అన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, మైనింగ్ శాఖల మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీపీటీ(పవర్ పాయింట్ ప్రజెంటేషన్) ద్వారా, ఇసుక పాలసీపై పూర్తి గణాంకాలతో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత ఇసుక పేరుతో జరిగిన దోపిడీ- సీఎం జగన్ ప్రభుత్వంలో అత్యంత పారదర్శకంగా అమలవుతున్న ఇసుక పాలసీ, తద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని వివరించారు. ఇసుకపై బాబు, లోకేశ్‌ల ఓవరాక్షన్ ఇసుక తవ్వకాలు, అక్రమాలంటూ చంద్రబాబు ఆయన కొడుకు లోకేశ్ ఇటీవల ఆరోపణలు చేస్తున్నారు. అనుమతులున్న ఓపెన్ రీచ్‌ల దగ్గరకు కూడా వెళ్లి సెల్ఫీలంటూ వాళ్లు ఓవర్ యాక్షన్ చేయడం అందరూ చూస్తున్నారు. ఇసుక దోపిడీపై మాకు గడువిచ్చామని.. 48 గంటల్లో సమాధానం చెప్పకపోతే.. తదుపరి చర్యలుంటాయని రంకెలేస్తున్నారు. అనుమతులున్న ఇసుక రీచ్‌ల దగ్గరకు పోయి టీడీపీ నేతలు ధర్నాలు చేయడాన్ని చూశాం. అందుకే, ఈ సందర్భంలో ఇసుక పాలసీకి సంబంధించి ఎవరి హయాంలో ఏం జరిగిందనేది నేను పీపీటీ ద్వారా వివరిస్తున్నాను. బాబు హయాంలో 19 జీవోలతో దోపిడీ ఇసుక గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. బాబు ఐదేళ్ల పాలనలో ఇసుక తవ్వకాలు ఇష్టానుసారంగా జరిగాయి. ఇసుక పాలసీకి సంబంధించి ఆయన హయంలో దాదాపు 19 సార్లు జీవోలు ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారికి అనుకూలంగా జీవోలను మార్చుకుని మైనింగ్ దోపిడీ ఎలా చేశారనేది.. అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు చేరిన ఆదాయమేంటి..? ఇప్పుడున్న ఆదాయమేంటనేది మేమూ పీపీటీ ద్వారా వివరిస్తున్నాం. పేరుకే ఉచితం.. బ్లాక్ మార్కెట్ తో రాష్ట్ర ఖజానాకు సున్నం చంద్రబాబు ఇసుక పాలసీపై మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఆయన నోటి వెంట ఇసుక దోపిడీ గురించి మాటలు వినిపిస్తుంటే.. దొంగే.. దొంగా దొంగా.. అని కేకలేసినట్లుగా ఉంది. 2014 నుంచి 2019 వరకు కృష్ణానది కరకట్ట మీదనున్న చంద్రబాబు ఇంటి వెనుకే కృష్ణా నదీ గర్భంలో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరగలేదా..? అని ప్రశ్నిస్తున్నాను. మొదట్లో డ్వాక్రా మహిళల ద్వారా ఇసుక సప్లై అన్నాడు. ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం అన్నాడు. పేరేమో ఉచితమన్నాడు గానీ.. ఇసుక బ్లాక్‌మార్కెట్ ను అమాంతం పెంచి ప్రభుత్వ ఖజనాకు సున్నంపెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు అని చెప్పుకోవాలి. నాడు పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే.. సామాన్యులకు ఇసుక దొరక్క, టీడీపీ నేతలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఉండేవి. టీడీపీ హయాంలో నెలవారీ మామూళ్ళు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాల్ని జరిపారు. నెలవారీగా తమకు ఆదాయవనరుల్లో ఇసుకను ఒక భాగంగా చేసుకున్నారు కనుకే.. పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పట్లో తహశీల్దార్ వనజాక్షి గారు ఇసుక అక్రమ తవ్వకాల్ని అడ్డుకుంటే ఆమెపై దాడిచేశారు. ప్రభుత్వ అధికారిణి అని కూడా చూడకుంటా ఆమెను టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చిపడేశాడు. అప్పట్లో వారిద్దర్నీ రాష్ట్ర సచివాలయానికి పిలిపించుకుని రాజీ చేసింది ఈ చంద్రబాబు కదా..? మహిళా అధికారిణిపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బాధితురాల్నే బెదిరించి రాజీచేసిన నీచుడు చంద్రబాబు అని గుర్తుచేస్తున్నాను. లోకేశ్‌కు ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం చంద్రబాబు హయాంలో, ఇసుక అక్రమ తవ్వకాలపై, ఎవరైనా ఫిర్యాదు చేయాలన్నా అది ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియకుండా చేశాడు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారి అనుచరుల్ని పెట్టి కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేశారు. ఇదంతా చంద్రబాబు కొడుకు లోకేశ్ కనుసన్నల్లోనే జరిగిందని.. ఆయనకు ఇసుక దోపిడీకి సంబంధించి ప్రతీనెలా రూ.500 కోట్లు కప్పం కట్టి మరీ ఇసుకమాఫియా ముఠా వ్యాపారం చేసిందని అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలుసు. బాబు హయాంలో ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా శ్రీకాకుళం దగ్గర్నుంచి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విచారణ కూడా జరిపింది. అప్పట్లో ఇసుక తవ్వకాలపై ఆధారాలు రుజువైనందునే చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్జీటీ తీర్పు సైతం వచ్చింది. దాదాపు రూ.100 కోట్ల జరిమానాను విధిస్తూ తీర్పిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు ఇంటి వద్ద కరకట్ట పక్కన జరిగిన ఇసుక తవ్వకాలకు సంబంధించిన ఆధారాల్ని కూడా అప్పట్లో ఎన్జీటీ పరిగణలోకి తీసుకుంది. మరి, ఎన్జీటీ విధించిన రూ.100 కోట్ల జరిమానాపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతాడు..? పారదర్శక ఇసుక పాలసీని సీఎం జగన్ తెచ్చారు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ఇసుకను బుక్ చేసుకుని కొనుగోలు చేసుకునే మెరుగైన పారదర్శక ఇసుక పాలసీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అమలు చేశాం. ప్రస్తుతం కూడా అమలు చేస్తున్నాం. సీఎం జగన్ ఇసుక తవ్వకాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది నూతన పాలసీని తేవడం జరిగింది. ఇసుకపై 04.09.2019న మెరుగైన నూతన పాలసీని తెచ్చారు. ఆ తర్వాత ఈ పాలసీపై 17.07.2020న మంత్రుల సబ్‌కమిటీ నియమించి ప్రజాభిప్రాయసేకరణ చేసి ప్రభుత్వానికి నివేదికనిచ్చారు. దీంతో మరింత మెరుగైన ఇసుక విధానంపై 12.11.2020న జీవో.నెం. 78ను జారీ చేశాం. పాలసీ అమలును పరిశీలిస్తూనే.. నిబంధనల్లో మార్పులు చేస్తూ మరలా 16.04.2021న జీవో నెం. 25ను తెచ్చాం. ప్రస్తుతం ఇదే జీవో ద్వారా ఇసుక పాలసీని కొనసాగిస్తున్నాం. కేంద్రప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే టెండర్లు ఇసుక తవ్వకాలకు సంబంధించి గతంలో టీడీపీ మాదిరిగా మేము దొంగచాటుగానో.. ఎవరికీ తెలియకుండానో టెండర్లు ప్రక్రియను పూర్తిచేయలేదు. కేంద్రప్రభుత్వానికి సంబంధించిన మెటల్ అండ్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంటీసీ) ద్వారా టెండర్లును ఆహ్వానించడం, నిర్వహణ, పర్యవేక్షణ జరుగుతుంది. ఎవరైనా ఈ టెండర్లలో పాల్గొనేలా అవకాశమిచ్చాం. అత్యంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి.. అత్యధిక బిడ్ కోట్ చేసిన జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీకి టెండర్‌ను ఖరారు చేయడం జరిగింది. చంద్రబాబు,రామోజీ టెండర్లలో పాల్గొనలేదేం..? ఇసుక తవ్వకాలకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తున్న చంద్రబాబు, రామోజీరావులు అప్పట్లో ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో ఎందుకు పాల్గొనలేదు..? రామోజీ కూడా పెద్ద వ్యాపార వేత్తనే కదా.. మరి ఆ టెండర్లో పాల్గొంటే.. ఎంత పారదర్శకంగా ఇసుక టెండర్ ప్రక్రియ జరుగుతుందో స్వయంగా తెలుసుకునే వారు కదా..? ఇలాంటి పారదర్శక పాలసీని చంద్రబాబు గతంలో ఏనాడైనా తెచ్చాడా..? అని నిలదీస్తున్నాను. దీనిపై దమ్ముంటే చంద్రబాబు, రామోజీ సమాధానం చెప్పాలి. టన్ను రూ. 475కే.. ఇంత పారదర్శకంగా ఇసుక పాలసీని తెస్తే చంద్రబాబు, పచ్చమీడియా కలిసి రోజుకో పిచ్చి ప్రేలాపన చేస్తుంది. రకరకాలుగా ఆరోపణలతో కథనాలు రాస్తున్నాయి. ఇసుక నూతన పాలసీ ప్రకారం ఒక కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఎక్కడ తవ్వకాలు జరిపినా అదే కంపెనీ బాధ్యత తీసుకుంటుంది. అలాంటప్పుడు ఆ కంపెనీ అక్కడ తవ్వుతుంది..? ఇక్కడ తవ్వుతుంది..? అన్న వాదనలకు ఆస్కారం ఎక్కడుందని అడుగుతున్నాం. ఈ కంపెనీ ప్రస్తుతం టన్నుకు రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై వారు రూ.100 కలుపుకుని టన్ను ఇసుకను రూ.475కు అమ్ముకుంటున్నారు. వారు కలుపుకుంటున్న రూ.100లోనే అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయం మొత్తాన్ని భరించుకోవాల్సి ఉంటుంది. మరి, టీడీపీ నేతలు, చంద్రబాబుతో సహా ఎల్లోమీడియా ఇసుకకు సంబంధించి ఏదో జరిగిపోతుందని ఎందుకు ఆరోపణలు చేస్తుంది..? అని అడుగుతున్నాను. ఇసుక సొమ్మంతా బాబు, లోకేష్ జేబుల్లోకే... ఇసుక నూతన పాలసీ ప్రకారం ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం వస్తుంది. అంటే, ఐదేళ్లకు రూ.3825 కోట్లు జమ అవుతున్నాయి. మరి, చంద్రబాబు హయాంలో ఇన్ని వేల కోట్లు ఏమయ్యాయి..? ఎక్కడ జమ అయ్యాయి..? లోకేశ్ జేబులోనా... చంద్రబాబు జేబులోనా..? అని నిలదీస్తున్నాను. ఇంత ఆదాయం ప్రభుత్వం కోల్పోయినప్పుడు ప్రశ్నిస్తానన్న నేతలు గానీ.. మీడియా గానీ ఎందుకు కళ్లుమూసుకుంది. అప్పట్లో టెండర్లు ఎందుకు పిలవలేదు..? ఇలాంటి మెరుగైన పారదర్శక విధానాన్ని చంద్రబాబు ఎందుకు తేలేదు..? దీనిపై వారు సమాధానం చెప్పాలి. ఇసుక తవ్వకాల అక్రమాలపై ఉక్కుపాదం ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్రమాలు ఎక్కడైనా జరిగితే... ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందుకు కఠిన చట్టాల్ని సైతం అమలు చేస్తున్నాం. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే ఎవరైనా ఎక్కువ అమ్మితే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా వ్యవస్థను నడిపిస్తున్నాము. అటువంటివారికి రూ.2 లక్షల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా కఠిన చట్టాన్ని తెచ్చాం. అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలన్నా టోల్‌ఫ్రీ నెంబర్ 14500ను అందుబాటులో ఉంచి ప్రచారం కూడా చేయిస్తున్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ద్వారా ఇప్పటికే 18వేల కేసులు నమోదు చేశాం. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేయడం జరిగింది. చాలామందికి శిక్షలు కూడా పడటం జరిగింది. మరి, చంద్రబాబు హయాంలో ఇలాంటి కఠిన చట్టాలు అమలు చేయడం, జరిమానాలు, శిక్షలు విధించడం చేశారా..? నాడు ఆయన హయాంలో పట్టాభూముల్లో కూడా ఇసుకను యథేచ్ఛగా తవ్వుకుని అమ్ముకున్న దాఖలాలున్నాయి. ఇసుక కొరత లేకుండా చూస్తున్నాం... ఇసుక కొరత, అక్రమ తవ్వకాలు అంటూ.. చంద్రబాబు చేస్తున్న తప్పుడు ఆరోపణల్ని మేం ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి గారు రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అండగా ఉన్నారు. వర్షాకాలంలో కూడా ఎక్కడా ఇసుక కొరత రాకుండా అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టి.. ఎండాకాలంలోనే స్టాక్‌యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచేలా ఆదేశాలిచ్చారు. కనుకే, ఇప్పటి వరకు మాకు ఇసుక దొరకడం లేదని ఎవరూ చిన్నపాటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఇసుక కొరత రాష్ట్రంలో లేనేలేదు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపుపై చెక్‌పోస్టుల ద్వారా ప్రత్యేక నిఘాను కట్టుదిట్టం చేశాం. చంద్రబాబుకు బంపర్ఆఫర్ ఇసుకపై చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంబంధంలేని అంశాలతో శిరోముండనం అంటూ ముడేస్తాడు. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇసుకకు ఏం సంబంధం ఉంది. ఆయన మతిచలించి మాట్లాడుతున్నాడు..? ఒక్కపక్కన లోకేశ్ ఏమో ఇసుక దోపిడీ రూ.4వేల కోట్లంటాడు. చంద్రబాబునేమో రూ.40వేల కోట్ల ఇసుక అక్రమాలంటాడు. కనుక, ఈ ఆరోపణలన్నీ పక్కనబెడితే.. ప్రభుత్వానికి రూ.4వేల కోట్లు ఇస్తే ఇసుక కాంట్రాక్ట్‌ను మొత్తం చంద్రబాబుకే అప్పగిస్తాం. ఆయనకు ఇది మా బంపర్ ఆఫర్. బాబూ.. వాస్తవాలివిగో.. ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70 కోట్ల టన్నులు ఇసుకను తవ్వితే మొత్తం రూ.2300 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. బాబు అడుగుతున్న జీఎస్టీ లెక్కలతో ప్రభుత్వానికేం సంబంధం ఉంటుంది. ఆ కాంట్రాక్టు సంస్థ కేంద్రానికి చెల్లిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 136 స్టాక్ పాయింట్లు ఉంటే.. వాటిల్లో ఇప్పుడు సుమారు 64 లక్షల టన్నుల ఇసుక నిల్వలున్నాయి. ప్రస్తుతం 110 ఓపెన్రీచ్ల్లో సుమారు 77 లక్షల టన్నుల తవ్వకాలకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్లున్నాయి. కానీ, వరదలు, వర్షాల కారణంగా కొన్నిచోట్ల తవ్వకాలు నిలిచిపోయాయి. 42 డీసెల్టింగ్ పాయింట్లలో జరుగుతున్న ఇసుకకు సంబంధించి 90 లక్షల టన్నులకు అనుమతులున్నాయి. మైనింగ్ ఆదాయంలో పురోగతి మైనింగ్ రెవెన్యూ విషయానికొస్తే జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన నూతన సంస్కరణలు మెరుగైన ఫలితాల్ని తెచ్చిపెట్టాయి. చంద్రబాబు పాలనలో కంటే ఇప్పుడు మైనింగ్ రెవెన్యూలో చాలా పురోగతిని సాధించామని చెబుతున్నాం. 2018–19లో అంటే చంద్రబాబు హయాంలో రూ.1950 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి వస్తే.. 2022–23 నాటికి అంటే, ఇప్పుడు జగన్ గారి హయాంలో రూ.4756 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఏపీఎండీసీ విషయానికొస్తే చంద్రబాబు ఉన్నప్పుడు (2018–19) రూ.833 కోట్లు వస్తే.. మా హయాంలో (ప్రస్తుతం) రూ.1806 కోట్లు ఆదాయం ప్రభుత్వానికి చేరింది. -ఇలా మేము ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సంస్కరణలతో ముందుకు పోతున్నాం. మరోవైపు చంద్రబాబు మాత్రం అసత్యాల్ని అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లే ఆరోపణలు చేస్తున్నారు. ఆయనకు అధికారం లేదనే తీవ్రమైన ఫ్రస్టేషన్‌తో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా ఉన్నాడు. -ఇసుక తవ్వకాలపై గతంలో పవన్‌కళ్యాణ్, లోకేశ్‌లు కూడా మాట్లాడినప్పటికీ.. వారిద్దరికీ ఈ విషయంపై అంతగా అవగాహన ఉండదు కనుక పెద్దగా పట్టించుకునేదిలేదు. చంద్రబాబు ఊహాజనితమైన లెక్కలతో ఆరోపణలు చేసి తన స్థాయిని మరింత దిగజార్చుకోవద్దని.. ఇలాగే మాట్లాడితే.. ప్రజల చేతుల్లో పరాభవం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నాను. మీడియా ప్రశ్నలకు సమాధానంగా.. జేపీ కాంట్రాక్టు కాలపరిమితి ఏడాది పెంపు జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ కాంట్రాక్టు కాలపరిమితిని మరో ఏడాదికి పొడిగించాం. ఆ ఉత్తర్వులతోనే ప్రస్తుతం జేపీ సంస్థ తవ్వకాలు జరుపుతుంది. సబ్ కాంట్రాక్టు అగ్రిమెంట్లతో ప్రభుత్వానికి ఏమీ సంబంధంలేదు. ప్రభుత్వంతో కాంట్రాక్టు కుదుర్చుకున్న కంపెనీ, వారికి అనుబంధంగా ఇతర సంస్థలకిచ్చిన సబ్‌కాంట్రాక్టుల వ్యవహారాలు కూడా మా దృష్టికి రాలేదు. ఇది కూడా చదవండి: వైఎస్సార్ సీపీలో చేరిన జనసేన అభ్యర్థి -
ప్చ్.. అవినీతిని గుర్తు చేసుకుంటున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ మధ్య ప్రజెంటేషన్ ల మీద ప్రజెంటేషన్ లు ఇచ్చేస్తున్నారు. మొత్తం మీద తనకు రాజకీయ సలహా సంస్థ ఏమి చెబితే అది చేస్తున్నట్లు ఉన్నారు. కాకపోతే అప్పడప్పుడు పప్పులో కాలు వేస్తున్నారనిపిస్తుంది. ఉదాహరణకు ఇసుకాసురుడు జగన్ అంటూ ఇచ్చిన ప్రజెంటేషన్ తీసుకోండి. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉందా?లేదా? అన్నది పక్కనబెడితే, ఆయన చెప్పిన విషయాలు వింటే అవన్నీ ఆయన ప్రభుత్వానికి కూడా వర్తిస్తాయన్న సంగతి మర్చి పోయి మాట్లాడేస్తున్నారని స్పష్టం అవుతుంది. ఎవరైనా కాస్త ఆలోచనపరులు ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. సహజంగానే తెలుగుదేశం మీడియాగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు విపరీతమైన ప్రాముఖ్యతను ఇచ్చి ఆయన ప్రజెంటేషన్ ను ప్రచారం చేశాయి. వాటిలో వచ్చిన వార్తలను చదివితే కొన్ని సందేహాలు వచ్చాయి. అన్నిటికన్నా ముందుగా గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారిక నివాసానికి సమీపంలోనే అనుమతులు లేకుండా ఇష్టారీతిన ఇసుక తవ్వి తరలించినందుకు హరిత ట్రిబ్యునల్ వంద కోట్ల జరిమానా విధించిందా? లేదా? అంటే దాని అర్దం అక్కడ జరిగిన ఇసుక తవ్వకాలలో ఆయనకు వాటా ఉందని ఒప్పుకుంటారా?. ఆయన టరమ్‌లో ఇసుకను పేరుకు ఉచితంగా ఇచ్చారు తప్ప, ప్రజలకు ఒరిగింది పెద్దగా ఏమీ లేదు. తెలుగుదేశం నేతలు ఇసుక మాఫియాగా మారి ప్రజలను వేధించడం కూడా ప్రభుత్వ ఓటమికి ఒక కారణం అని అందరికి తెలుసు. తన పార్టీ ఎమ్మెల్యేలు ఎలాగైతే అరాచకాలు చేసి అప్రతిష్టపాలయ్యారో, అదే మాదిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా బదనాం చేయాలన్న లక్ష్యంతో మాట్లాడినట్లు అనిపిస్తుంది. ✍️ ఏ ప్రభుత్వం ఉన్నా ఇసుకను అక్రమంగా తవ్వితే తప్పు పట్టవలసిందే. ఈ ప్రభుత్వం అతీతమని ఎవరూ చెప్పరు. కానీ.. ప్రతిపక్ష నేతగా ఉన్నవారు కనుక తోచిన కాకిలెక్కలు చెప్పి జనాన్ని మాయ చేయాలనుకోవడమే పెద్ద తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ఎపిలో ఇసుక కొత్త విధానం తీసుకురావడానికి గాను కొద్దికాలం ఇసుక తవ్వకాలను ఆపితే..ఇంకేముంది.. రాష్ట్రంలో అభివృద్ది అంతా ఆగిపోయిందని ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రచారం చేశారు. ఎవరు ఎలా చనిపోయినా దానిని ఇసుక లేకపోవడం వల్ల జరిగిన ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేశారు. ఆ విషయాలు అప్పట్లోనే సాక్ష్యాలతో సహా వెలుగులోక వచ్చాయి. తదుపరి ప్రభుత్వం ఇసుక విదానం తీసుకువచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టి. కొంత నిర్దిష్ట రేటు పెడితే దానిపై కూడా విమర్శలు చేశారు. ఏడాదికి ఇప్పుడు 700 కోట్లకు పైగా ప్రభుత్వాన్ని ఆదాయం ఇసుక ద్వారా సమకూరుతోంది. అందరికి అందుబాటులో ఇసుక నిల్వలు ఉంచారు. గతంలో ఇలా ఎన్నడూ తేలికగా దొరికేది కాదు. అదే సమయంలో బలహీనవర్గాలవారి ఇళ్లకు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు నిలిపినప్పుడు గగ్గోలు పెట్టిన ప్రతిపక్షం, ఇప్పుడు అందరికి ఇసుక అందుబాటులో తేవడంపైన ద్వజమెత్తుతోంది. ఇందులో అవినీతి ఉందని, తవ్వకాలు అక్రమంగా జరుగుతున్నాయని ఆరోపిస్తోంది. ప్రభుత్వం నిర్దిష్ట విదానంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా టెండర్ పిలిచి ఒక సంస్థకు ఇసుక తవ్వకం, అమ్మకం బాధ్యతలు అప్పగించింది. ఆ సంగతి దాచిపెట్టి ఆ ప్రైవేటు సంస్థకు ఏదో నేరుగా జగన్ పిలిచి కాంట్రాక్టు ఇచ్చినట్లు చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. ఆయన కాకిలెక్కలు చూద్దాం. ✍️ నాలుగేళ్లలో ఇసుక పేరుతో నలభైవేల కోట్ల దోపిడీ జరిగిందని చంద్రబాబు అంటున్నారు. నలభై కోట్ల టన్నుల ఇసుకను అక్రమంగా తవ్వారని ఆయన అంటున్నారు. పోనీ కొద్ది సేపు దీనిని నిజం అని అనుకుంటే చంద్రబాబు గతంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అంగీకరిస్తారా?. ఏపీలో అసలు ఇసుకే దొరకడం లేదని, తద్వారా అభివృద్ది నిలిచిపోయిందని చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇబ్బడి,ముబ్బడిగా ఇసుక ఎపిలో దొరుకుతోందని చెప్పినట్లే కదా?ఆ మేరకు రాష్ట్రంలో భవన నిర్మాణం, ఇతర నిర్మాణ పనులు, అభివృద్ది జరుగుతున్నట్లు ఒప్పుకున్నట్లే అవుతుంది కదా?. అంతేకాదు. నిజంగానే నలభై కోట్ల టన్నుల ఇసుక నాలుగేళ్లలో తీసి ఉంటే, చంద్రబాబు పాలన ఐదేళ్లలో అసలు లెక్కాపత్రం లేకుండా సాగిన ఇసుక తవ్వకాలలో అంతమేర దోపిడీ జరిగినట్లు ఆయన చెప్పకనే చెబుతున్నారు కదా? ఆ రోజుల్లో ఒకసారి పొరపాటున ఈనాడు పత్రిక లోపలి పేజీలో ఇసుక దోపిడీ ఎలా సాగుతోందో.. టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు రాయకుండా ఇచ్చిన కథనాన్ని ఆయన ఒప్పుకున్నట్లే కదా?. అప్పట్లో ఎమ్మెల్యేలు ప్రైవేట్ టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశారా? లేదా?. డ్వాక్రా మహిళల పేరుతో ఇసుక రీచ్ లు తీసుకుని ,వారికి తృణమో,పణమో అప్పగించి మొత్తం ఇసుకను దోచేసిన మంత్రులు కూడా టిడిపి పాలనలో ఉన్నారు కదా?. ఆ అనుభవంతోనే చంద్రబాబు ఇప్పుడు మాట్లాడుతున్నారా? అప్పుడు అలా జరిగింది కనుక, ఇప్పుడు ఈ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారా?. ✍️ ఎక్కడైనా ఒకటి,అరా జరిగితే దాని గురించి ప్రతిపక్ష నేతగా విమర్శించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. కాని అడ్డగోలు ఆరోపణలు చేయడం వల్ల ఆయన చెప్పేవాటికి విలువ లేకుండా పోతుంది కదా! ఇప్పటికే ఈనాడు వంటి పత్రికలు రాస్తున్న అడ్డగోలు కథనాలను ఎవరూ నమ్మడం లేదు. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంటుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా, టీడీపీ నేతలు ఇష్టానుసారం దోచుకున్న విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. చంద్రబాబు ఇప్పుడు కాకిలెక్కలు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక ఇసుక రీచ్ లో రోజుకు పదివేల టన్నుల ఇసుక తవ్వకం జరుగుతోందని ,దానిని స్వయంగా చూశానని ఆయన అంటున్నారు. దాని వెనుక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉన్నారని ఆయన ఆరోపించారు నిజానికి ఒక రీచ్‌లో రోజుకు పదివేల టన్నుల ఇసుక తీయడం ఎంతవరకు సాధ్యమో ఆయనకే తెలియాలి. అక్కడ పెద్ద కొండలా తీసి పోశారని ఆయన అన్నారు. అందులో తప్పు ఏమి ఉంది? వానాకాలంలో ఇబ్బంది రాకుండా ఉండడానికి ఇసుక నిల్వ చేస్తే నష్టం ఏమిటి?. నలభై కోట్ల టన్నులు, నలభైవేల కోట్ల రూపాయలు అంటూ చెబుతున్నవన్ని పిచ్చి లెక్కలే అని తేలిపోతోంది. ఈయనకు ఇది అలవాటే. గతంలో జగన్ పై కక్ష కట్టి కేసులు పెట్టిన సందర్భంలో ఎంత ఆరోపణ చేయాలన్నదానిపై పార్టీలో చర్చ జరిగిందట. అప్పుడు మాజీ ఎంపీ మైసూరారెడ్డి రెండు,మూడువేల కోట్లు అందామని సూచించారట. దానికి నో చెప్పిన చంద్రబాబు ‘‘లక్ష కోట్లు’’ అని ఆరోపిస్తూ ప్రకటన చేయాలని అన్నారట. ఈ విషయాన్ని ఆ తర్వాత రోజుల్లో మైసూరానే టీవీ చర్చలలో చెబుతుండేవారు. ఇదే కాదు.. దేనినైనా అతిగా చెప్పడం , తన గురించి అతిశయోక్తులు చెప్పుకోవడం ఆయనకు అలవాటే. ఇప్పుడు అదే రీతిలో చంద్రబాబు మరోసారి ఇసుక పై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా ఉంది. తద్వారా తన పాలనలో జరిగిన అక్రమాలన్నింటిని ఆయనే గుర్తు చేసినట్లు అనిపించడం లేదూ! :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఇసుకాసురులు.. భారీగా ఇసుక అక్రమ రవాణా
వనపర్తి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంటూ అధికారులు ఇరవై రోజులుగా బిజీగా ఉండటంతో ఇదే అదనుగా భావించిన ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఉదయమంతా కృష్ణానది నుంచి ఇసుకను తోడి రాంపూర్, రంగాపూర్ శివారులోని పొలాల్లో నిల్వ చేయటం, అర్ధరాత్రి సమయంలో టిప్పర్లు, ట్రాక్టర్లలో వివిధ ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు తెర వెనుక ఉంటూ దందాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలో ఎంత తవ్వినా.. ఎగువ నుంచి వరద వస్తే మట్టి, ఇసుక కొట్టుకొస్తుండటంతో గుంతలన్నీ మూసుకుపోతాయి. దీంతో ఏటా వేసవిలో ఈ ప్రాంతాల నుంచి భారీగా ఇసుకను తోడుతూ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. మొక్కుబడి చర్యలేనా? గతంలోనూ ఇదే ప్రాంతంలో పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఇసుక డంపులను సీజ్ చేసినా.. ఏనాడు ప్రభుత్వం వేలం వేయలేదు. తూతూమంత్రంగా ఇసుక డంపులను సీజ్ చేయటం, తర్వాత వదిలేయటంతో అక్రమార్కులు సైతం ఇందుకు అలవాటు పడినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సీజ్ చేసినట్లు పత్రికల్లో వార్తలు రాయించుకోవటం మినహా చేసేదేమీ లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీజ్ చేసిన కొన్నాళ్లకు డంపులను అధికారుల కళ్లుగప్పి అక్రమార్కులు విక్రయించుకోవటం పరిపాటిగా మారిందనే వాదనలు లేకపోలేదు. ఇసుక నిల్వలు సీజ్.. రంగాపూర్ శివారులోని ఇసుక డంప్‌లను స్థానికుల ఫిర్యాదు మేరకు సోమవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్డీఓ పద్మావతి మంగళవారం రంగాపూర్, రాంపూర్ శివారు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి మూడు భారీ ఇసుక డంపులు గుర్తించి సీజ్ చేశారు. మొత్తంగా ఇటీవల అధికారులు సీజ్ చేసిన ఇసుక సుమారు వెయ్యి ట్రాక్టర్ల వరకు ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కలిసొచ్చిన పుష్కర రోడ్లు.. కృష్ణా పుష్కారాల సమయంలో నిర్మించిన రోడ్లు అక్రమార్కులకు కలిసొచ్చిన అంశంగా చెప్పువచ్చు. ప్రజల సౌకర్యార్థం వేసిన రోడ్లు వాహనాలు (జేసీబీ, ట్రాక్టర్లు) నేరుగా నది వరకు వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయి. పెబ్బేరు మండలం రాంపూర్ శివారు నుంచి గద్వాల జిల్లా గుర్రంగడ్డ ప్రాంతానికి వంతెన నిర్మాణానికి గుర్తించిన ప్రాంతం నుంచి జేసీబీ సాయంతో నదిలో పెద్దఎత్తున తవ్వకాలు చేపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ దందాకు సహకరిస్తుండటంతో కిందిస్థాయి సిబ్బంది జోక్యం చేసుకునేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నెలరోజులుగా విచ్ఛలవిడిగా ఇసుక రవాణా పెబ్బేరు మండలంలోని కృష్ణానది కేంద్రంగా సాగుతూ.. ఇతర జిల్లాలకు సైతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాల మేరకు.. మంగళవారం నాలుగు ఇసుక డంప్‌లతో పాటు ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశాం. కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ దందాలో ప్రజాప్రతినిధులు, అధికారుల పాత్ర ఉన్న విషయం మా దృష్టికి రాలేదు. – పద్మావతి, ఆర్డీఓ, వనపర్తి -
మంచిర్యాల జిల్లాలో అక్రమ ఇసుక రవాణా
జిల్లా కేంద్రంలోనూ... జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్డు, పాత మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి తెల్ల వారు జామున, రాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గోదావరి రోడ్డు కాలనీ వాసులు కొందరు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెల్లవారు జామున కూలీలతో ఇసుకను ట్రాక్టర్లలో నింపుతూ పట్టణంలో నిర్మాణాలు జరిగే ప్రాంతానికి చేరవేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిపై పోలీసులు, గనుల శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా జరిమానాలు కట్టి అక్రమ రవాణా సాగిస్తూనే ఉన్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు గోదావరి పుష్కరఘాట్ నుంచి నేరుగా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. చెన్నూరు పట్టణం, హాజీపూర్, వేంపల్లి, గుడిపేట గోదావరి తీరాల నుంచి గ్రామాల్లోనూ ఇసుక రవాణా జరుగుతోంది. దండేపల్లి మండలం కాసిపేట గోదావరి తీరంలో బ్యాక్ వాటర్ తగ్గినప్పుడల్లా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు గోదావరి తీరం వెంట నిఘా ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గోదావరిలో ఇసుక ఖాళీ అవుతోంది. నగదుగా మారి అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోంది. జిల్లాలోని నదీ తీర గ్రామాల్లో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. భారీ యంత్రాలను నదిలో దించి ఇసుకను తోడుకుపోతున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతేడాది అధిక వర్షాలతో దొరకని ఇసుక.. గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి వరకు మండు వేసవిలోనూ నది నిండుగా ఉంది. దీంతో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. స్థానిక అవసరాల కోసం హాజీపూర్ మండలం వేంపల్లిలో అధికారులు ఇసుక రీచ్ ఏర్పాటు చేశారు. అయితే వర్షాలు కురిసి నీరు రావడంతో అక్కడ ఇసుక తీయడం లేదు. జిల్లాలో గోదావరి పొడవునా ఇసుక లభించని పరిస్థితి నెలకొంది. అవసరం మేరకు అనుమతి.. ఈ క్రమంలో టీఎస్ఎండీసీ(తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అవసరం మేరకు ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తోంది. కాళేశ్వరం ముంపు ప్రాంతంగా ఉన్న నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మేటలు తోడేందుకు గతేడాది మార్చిలో టెండర్లు పిలిచి కొత్త అగ్రిమెంట్లు చేశారు. ఇందులో కొన్ని పట్టాభూముల్లో ఉన్నాయి. ఇక కోటపల్లి మండలం కొల్లూరులో మాత్రమే ప్రస్తుతం ఒక ఇసుక రీచ్ నడుస్తోంది. దూర భారంతో రీచ్‌కు రాని లారీలు.. అయితే కొల్లూరు రీచ్ దూరంగా ఉండడంతో హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల వారికి ఇక్కడి నుంచి ఇసుక తీసుకెళ్లడానికి లారీలు రావడం లేదు. ఎండ తీవ్రత కూడా రవాణాకు ఆటంకంగా మారుతోంది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాలకు మాత్రం ఇక్కడి నుంచే ఇసుక రవాణా జరుగుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా రాత్రి వేళల్లో ఇసుక తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం పగటిపూటనే ఇసుక రవాణా చేయాలి. ‘అదనపు’ బకెట్ దందా... ప్రభుత్వం అధికారికంగా అనుమతులు ఇచ్చిన కొల్లూరు క్వారీలో యథేచ్చగా అదనపు బకెట్ దందా కొనసాగుతూనే ఉంది. వినియోగదారులు టీఎస్ఎండీసీ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకున్న క్యూబిక్ మీటర్ల మేరకు లారీల్లో ఇసుక నింపాలి. అయితే కాంట్రాక్టర్లు, జేసీబీ ఆపరేటర్లు, అక్కడి సిబ్బందిని మేనేజ్ చేస్తూ లారీల్లో జేసీబీ అదనపు బకెట్ ఇసుక నింపుతున్నారు. అదనంగా పోసిన ఇసుకకు డబ్బులు అక్కడే వసూలు చేస్తున్నారు. చలానా రూపంలో కట్టినవి మాత్రం టీఎస్ఎండీసీకి జమ అవుతున్నాయి. అదనపు బకెట్ ఇసుకతో వాహన పరిమితి మించి ఓవర్‌లోడ్‌తో ఇసుక లారీలు వెళ్తున్నాయి. నిబంధనల ప్రకారం ఆన్లైన్లో కట్టిన చలానా ప్రకారమే వేబ్రిడ్జిలో ఇసుక తూకం వేయాలి. అయితే ఈ నిబంధనలేమి అమలు కావడం లేదు. రీచ్ వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అదనపు బకెట్ దందా ఆగడం లేదు. రోజూ పరిమితి మించి గోదావరి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీలతో చెన్నూరు, జైపూర్, ఇందారం వరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ‘సాక్షి’లో కథనం రావడంతో టీఎస్ఎండీసీ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేశారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో మళ్లీ అదనపు బకెట్ దందా ఊపందుకుంది. -
ఇసుక దోపిడీ రూ.100 కోట్లు.. పట్టించుకోని టీఎస్ఎండీసీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో నకిలీ వే బిల్లులతో రీచ్‌ల నుంచి ఇసుక అక్రమ మార్గంలో తరలిపోతోందని వరంగల్ కమిషనరేట్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. యథేచ్ఛగా సాగుతున్న ఈ దందా మూలంగా రెండున్నరేళ్లలో సుమారు రూ.100 కోట్లకుపైగా ఆదాయం పక్క దారి పట్టినట్లు తెలుస్తోంది. టీఎస్ఎండీసీ పర్యవేక్షణలోనే నకిలీ వే బిల్లుల దందా సాగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కొందరు ఇసుక రవాణాదారులు, టీఎస్ఎండీసీ అధికారులు కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ములుగు నుంచి తీగలాగితే... రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 34 యాక్టివ్ ఇసుక రీచ్‌ల నుంచి ఇసుక రవాణా సాగుతోంది. ఇసుక లభ్యత ఉన్నచోట స్థానికులకు భాగస్వామ్యం కల్పించి టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ములుగు జిల్లాలోని మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో 6 ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. వీటి నుంచి నిత్యం 300 నుంచి 600 లారీలు లోడింగ్ అవుతున్నాయి. 15 రోజుల క్రితం ములుగు జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఇసుక లారీని వరంగల్‌లో పోలీసులు తనిఖీ చేశారు. నకిలీ వేబిల్లులతో తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్‌ను విచారించగా.. యజమానికి 8 లారీలు ఉన్నాయని, ఏటూరునాగారం, వాజేడు ప్రాంతాల్లో యజమాని చెప్పిన చోటుకు వెళ్లి లోడింగ్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో స్లాట్ బుకింగ్ చేసుకోకుండా నేరుగా లోడింగ్ చేసుకోవడం,, డబ్బులు చెల్లించడమేంటని పోలీసులకు అనుమానం వచ్చి టాస్‌్కఫోర్స్ అధికారులకు కేసును అప్పగించారు. రూపాయి చెల్లించకుండా 30 టన్నుల ఇసుక ములుగు, ఏటూరు ప్రాంతంనుంచి వచ్చే ఇసుక లారీలపై పోలీసులు నిఘా పెట్టారు. వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జనగాం తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి దాదాపు 40 లారీలను స్వాదీనం చేసుకున్నారు. 12 టైర్ల లారీలో 26 టన్నుల ఇసుక నింపుకుంటే రూ.10,500 చెల్లించాల్సిన కొందరు లారీ యజమానులు నకిలీ వేబిల్లులతో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా 26 నుంచి 30 టన్నులు తీసుకెళ్లినట్లు తేలింది. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి వారినుంచి 16 లారీలు, 65 నకిలీ వే బిల్లులు, 16 టీఎస్ఎండీసీ స్టాంపులు, 1 లాప్ టాప్, 11 సెల్ఫోన్లు, రూ. 41,000ల నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఈ దందా వెనుక కొందరు టీఎస్ఎండీసీ అధికారుల పాత్ర కూడా ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతి క్వారీ వద్ద టీఎస్ఎండీసీకి చెందిన సూపర్వైజర్ ఉంటారు. వీరి ప్రమేయం లేకుండా ఇసుక లారీ బయటకు వెళ్లే ప్రసక్తే ఉండదు. కొందరు అధికారులు, క్వారీ నిర్వాహకులు, లారీల యజమానులు కలిసే అక్రమ దందా కొనసాగిస్తున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 3 నెలల్లో 1800 లారీల ఇసుక అక్రమ తరలింపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మంచిర్యాల, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచే మూడు నెలల్లో 1800 లారీల ఇసుక ఎలాంటి సొమ్ము చెల్లించకుండా తరలినట్లు పోలీ సు విచారణలో తేలగా, రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 యాక్టివ్ రీచ్‌ల నుంచి రూ.100 కోట్లకు పైగా వి లువచేసే ఇసుక తరలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
సూర్యాపేటజిల్లా తుంగతుర్తిలో ఇసుక మాఫియాపై స్థానికుల ఆగ్రహం
-
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి/ కాకినాడ: కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందినట్లు చెప్పుకుంటూ.. జిల్లాల వారీగా అక్రమ విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వివిధ జిల్లాలకు చెందిన ఎస్పీలు హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలను నిర్వహించేందుకు మెస్సర్స్ జయప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (జేపీవీఎల్) టెండర్ల ద్వారా అనుమతి పొందిందినట్లు చెప్పారు కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు. ‘జేపీవీఎల్ వారు అనుమతించిన వ్యక్తులకు మాత్రమే రాష్ట్రంలో ఇసుక విక్రయాలను నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇతరులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా ఇతర పేర్లతో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. అక్రమార్కులు ఎవరైనా తాము ఇసుక సబ్ కాంట్రాక్టర్, లేదా వివధ పేర్లతో కాకినాడ జిల్లా పరిధిలో ఎటువంటి ఇసుక లావాదేవీలు జరిపినా చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తాం.’ అని గట్టి హెచ్చరికలు జారి చేశారు. అక్రమ రవాణా అడ్డుకట్టకు ఎస్ఈబీ ఏర్పాటు.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రత్యేకంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను నెలకొల్పడం జరిగిందన్నారు ఎస్పీ. ఎస్.ఇ.బి అధికారులు జిల్లాలో నిత్యం వాహన తనిఖీలు చెక్ పోస్టుల వద్ద నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు, అక్రమ రవాణా నిర్మూలన కొరకు SEB అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ 14500 ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎవరైనా అక్రమ రవాణా సమాచారాన్ని నిర్భయంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియచేయవచ్చునని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఖండించిన జేపీవీఎల్.. కొందరు వ్యక్తులు తాము సబ్ కాంట్రాక్ట్‌లు పొందారని, జిల్లాల వారీగా విక్రయాలను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న వార్తలను జేపీవీఎల్ పత్రికా ప్రకటన ద్వారా ఖండించింది. ‘కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి ద్వారా నిర్వహింపచేసిన టెండర్లలో జయప్రకాశ్ పవర్ వెంచర్స లిమిటెడ్ (జేపీవీఎల్) ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకుంది. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జేపీవీఎల్ సాంకేతికంగానూ, ఆర్థికంగానూ తన సామర్థ్యంను చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్ట్ పొందింది. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జేపీవీఎల్ సంస్థ పాటిస్తోంది. జేపీవీఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ. జేపీవీఎల్ సంస్థకు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ ఎలాంటి సంబంధాలు లేవు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా జేపీవీఎల్ సంస్థపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా అసత్యాలతో కూడిన వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి అసత్య ప్రచారాలను, తప్పుడు వార్తలను జేపీవీఎల్ సంస్థ తీవ్రంగా ఖండిస్తోంది.’ అని పత్రిక ప్రకటన విడుదల చేశారు జేపీవీఎల్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ గౌర్. ఇదీ చదవండి: పారదర్శకంగా ఇసుక విధానం -
ఇసుక పేరుతో దోచుకున్న వ్యక్తి చంద్రబాబు: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, తిరుపతి: మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసులో దొరికిన నేత చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలో చంద్రబాబు తన అనుచరులకు దోచిపెట్టారు. టీడీపీ ప్రభుత్వం ఇసుక పేరుతో దోచుకుంది. ఇసుక కాంట్రాక్టు, మైనింగ్ విషయంలోనూ పారదర్శకంగా ఇస్తున్నాము. మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 98 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. సీఎం వైఎస్ జగన్ పారదర్శక పాలన అందిస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి సంబంధం ఏంటి?. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు’ అని విమర్శలు చేశారు. -
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. 12 ట్రాక్టర్లతో బీభత్సం
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను ట్రాక్టర్లతో బద్దలుకొట్టింది. 12 మంది ట్రాక్టర్ డ్రవైర్లు టోల్ రుసుం చెల్లించకుండానే మెరుపువేగంతో దూసుకెళ్లారు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోకుండా ట్రాక్టర్లను వేగంగా నడుపుతూ ముందుకెళ్లారు. ఆగ్రాలో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. #WATCH | Uttar Pradesh: At least 12 sand-laden tractors, belonging to the sand mafia, break toll barricading and speed past, in Saiyan Police Station area in Agra on 4th September. (Source: CCTV) pic.twitter.com/p2mfPseths — ANI UP/Uttarakhand (@ANINewsUP) September 5, 2022 ఈ ఘటనపై ఎస్ఎస్పీ ప్రభాకర్ చౌదరీ స్పందించారు. వారం క్రితం ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. 51 ట్రక్కులను సీజ్ చేసి కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఈ చర్యలతో మాఫియా మకాం మార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే హైడ్రాలిక్ ట్రాలీలతో టోల్ ప్లాజా గేట్లను ధ్వంసం చేసి ఉండవచ్చని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ ఘటనపై ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు ఎస్ఎస్పీ వివరించారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితులందరూ ధోల్పూర్ ప్రాంతానికే చెందినవారని, అక్కడి పోలీసుల సహకారంతో అందర్నీ పట్టుకుంటామన్నారు. చదవండి: బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం -
అక్రమ దందాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ప్రభుత్వం మరింత పటిష్టపరుస్తోంది. గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర దందాలను మరింత సమర్థంగా కట్టడిచేసేందుకు సెబ్‌కు సాంకేతిక సాధన సంపత్తిని సమకూరుస్తోంది. నేరపరిశోధనలో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) పరిధిలోకి సెబ్‌ను తీసు కొచ్చింది. మరోవైపు గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాలు, నేరస్తుల డేటాను సమగ్రంగా రికార్డు చేయనుంది. తాజా విధాన నిర్ణయంతో శాంతిభద్రతల పోలీసు విభాగం, సెబ్లను అనుసంధానించనుంది. సమర్థంగా నేరపరిశోధన, నేరాల కట్టడి నేరపరిశోధనలో సీసీటీఎన్ఎస్ అత్యంత కీలక విభాగం. వివిధ నేరాలు, ఆ కేసుల పరిశోధన, ఆ నేరాలకు పాల్పడిన వారి వివరాలు అన్నింటినీ సీసీటీఎన్ఎస్లో సమగ్రంగా రికార్డు చేస్తారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భద్రపరిచే ఈ వ్యవస్థ నేరపరిశోధనలో పోలీసు అధికారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటువంటి వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసింది. అనంతరం కేంద్ర హోంశాఖ ఇదే వ్యవస్థను జాతీయస్థాయిలో నెలకొల్పింది. అటువంటి సమర్థమైన సీసీటీఎన్ఎస్ పరిధిలో ప్రస్తుతం శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు విభాగమే ఉంది. గంజాయి, అక్రమ ఇసుక, అక్రమ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాల కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన సెబ్‌ను సీసీటీఎన్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని పోలీసు శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, ఆ నేరస్తుల వివరాలన్నీ సీసీటీఎన్ఎస్లో నమోదు చేస్తారు. ఆ నేరస్తుల స్వభావం, నేరాల చరిత్ర, పెండింగ్‌లో ఉన్న కేసులు తదితర సమాచారమంతా సెబ్ అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఆ కేసుల పరిశోధన కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేరస్తులు, సిండికేట్లతో ఉన్న సంబంధాలు, వ్యాపార, ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ పోలీసులకు అందుబాటులోకి వస్తాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో వ్యవస్థీకృతమైన ముఠాలు అక్కడి నుంచి మన రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి దందాలకు పాల్పడుతున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై ప్రస్తుతం సెబ్ దాడులు చేసి కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి రావడంతో ఇతర రాష్ట్రాల్లోని ముఠాలపై కూడా కేసులు నమోదు చేసేందుకు, అక్రమ దందాను మూలాలతోసహా పెకలించేందుకు మార్గం సుగమమైంది. కేసు దర్యాప్తునకు దేశంలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో తెలియడంతోపాటు సంబంధిత రాష్ట్రాల పోలీసు, దర్యాప్తు సంస్థల సహకారం పొందడం సులభతరమవుతుంది. పోలీసు, సెబ్ వ్యవస్థల అనుసంధానం అక్రమ దందాలను అరికట్టడంతో పోలీసు, సెబ్ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీసీటీఎన్ఎస్ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. అంటే సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసుస్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీనే సెబ్‌కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదే రీతిలో జిల్లాస్థాయిలో ఎస్పీల పర్యవేక్షణలోనే ఏఎస్పీల నేతృత్వంలో సెబ్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసు, సెబ్ విభాగాల మధ్య సాంకేతిక అంశాల్లో కొంత సందిగ్ధత ఉంది. ప్రస్తుతం ఈ రెండు విభాగాలు కూడా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి చేరడంతో వాటిమధ్య పూర్తి సమన్వయం సాధించినట్లయింది. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా కట్టడిచేసేందుకు అవకాశం ఏర్పడిం ది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగను న్నాయి. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేర స్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. -
మట్టిమాఫియా దాడి ఘటనలో కొత్త ట్విస్ట్
-
ఎస్ఐ అవినీతి ‘గట్టు’
గట్టు: ఓ ఎస్ఐ అవినీతి గుట్టు రట్టయింది. ఇసుక తరలించేందుకు, జాతరలో జూదానికి అనుమతిచ్చేందుకు మామూళ్లు తీసుకున్నారనే వ్యవహారం తాజాగా రచ్చకెక్కింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై సీఐ విచారణ చేపట్టారు. గత నవంబర్ 24న గట్టులో జాతర నిర్వహించారు. ఆ సమయంలో జూదానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్వాహకులు పోలీస్ జీపు డ్రైవర్‌గా పనిచేస్తున్న భీమేష్ సాయం కోరారు. దీంతో ఆయన వారి తరఫున ఎస్ఐ మంజునాథరెడ్డితో సెటిల్మెంట్ కోసం ఫోన్లో మాట్లాడారు. ఎస్ఐ రూ.50వేలు డిమాండ్ చేయగా.. రూ.40వేలు ఇస్తానని సదరు డ్రైవర్ చెప్పారు. ఈ డబ్బులు పైఅధికారులకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చుకోవాలో ఎస్ఐ వివరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇసుక వ్యవహారంలో.. ఇదిలాఉండగా, మండలంలోని ఇందువాసికి చెందిన ఓ ఇసుక ట్రాక్టర్‌ను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక తరలించడానికి ఇది వరకే ఎస్ఐకి రూ.20వేలు ఇచ్చానని గ్రామానికి చెందిన నర్సప్ప తెలిపారు. డబ్బులు తీసుకుని తిరిగి పట్టుకోవడాన్ని ఆక్షేపిస్తూ కొంతమంది ట్రాక్టర్ల యజమానులు గురువారం పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. ఇసుక తరలింపునకు ప్రత్యేక అనుమతుల పేరుతో ప్రతి నెలా ట్రాక్టర్ల యజమానుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బయటికి రావడంతో గద్వాల సీఐ బాష గట్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. ఎస్ఐ మంజునాథరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నట్లు తెలిపారు. భీమేష్‌తోపాటు మరికొందరిని విచారించారు. ఇసుక అనుమతుల వ్యవహారంపైనా ట్రాక్టర్ల యజమానులతో ఆరా తీశారు. ఉన్నతాధికారులకు వసూళ్ల వ్యవహారంతో సంబంధం లేదని బాష చెప్పారు. -
నిజామాబాద్: ఇసుక మాఫియా ముఠా దాడి.. వీఆర్ఏ మృతి
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుకు మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ముఠా.. సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రయత్నించారు. (చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..!) వీరిని అడ్డుకునేందుకు వీఆర్ఏ గౌతమ్ ప్రయత్నించగా.. ఇసుక మాఫియా ముఠా వీఆర్ఏను చితకబాదింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీఆర్ఏ గౌతమ్‌ను ప్రభుత్వ ఆసుస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. దీంతో వీఆర్ఏ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. చదవండి: తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం -
ఇసుక మాఫియాకు అడ్డాగా తెలంగాణ: వైఎస్ షర్మిల
సాక్షి, కామారెడ్డి: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల శుక్రవారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం షెట్లూర్ గ్రామంలో పర్యటించారు. మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు (అంజవ్వ, జ్యోతి, గంగోత్రి, ప్రశాంత్) మృతిచెందగా.. బాధిత కుటుంబాన్ని, బంధువులను పరామర్శించారు. అనంతరం మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం మంజీరా నదిలో మూడు మీటర్లలోపు ఇసుక తొవ్వాల్సి ఉండగా, ఇందుకు విరుద్ధంగా 10 మీటర్ల వరకు తవ్వుతున్నారని వైఎస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టారీతిన గుంతలు తీయడం వల్లనే వాటిలో నీళ్లు నిండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు అతి వేగంగా నడపడంతో గ్రామానికి చెందిన ఓ యువకుడి కాలు కూడా విరిగిందని తెలిపారు. చదవండి: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల, టాప్ 10 ర్యాంకులు వీరికే అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఇసుక మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు అక్రమ ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తూ కోట్లు దండుకుంటున్నారని, నిబంధనలను విరుద్ధంగా వాగులు, నదులను తోడేస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదవశాత్తు గుంతల్లో పడి, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబంలో నలుగురు చనిపోతే కేసీఆర్ కనీసం పరామర్శించలేదని, వీరి మృతికి కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంజీరా నదిని అక్రమ తవ్వకాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. -
తొలి మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురైన సీఎం
చండీగఢ్: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చరణ్‌జిత్ సింగ్ చన్నీ తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఒక సామాన్య వ్యక్తిని సీఎంగా చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రానికి మొదటి దళిత సీఎంగా చన్నీ నిలిచిన సంగతి తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్‌మధ్య నెలరోజుల పాటు సాగిన సంకక్షోభం నేపథ్యంలో కెప్టెన్ పదవినుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అనూహ్యంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. దీంతో చన్నీ సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తక్షణమే సాండ్ మాఫియాపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతేకాదు రైతు పోరాటానికి పూర్తిగా మద్దతు ప్రకటించారు. స్వయంగా రిక్షా పుల్లర్‌ని అయిన తాను వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే నల్ల చట్టాలను రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తానన్నారు. అటు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరైన ఈ వేడుకకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ కాకపోవడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చన్నీకి కాంగ్రెస్ పెద్దలు, పలువురు నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకూడా శుభాకాంక్షలు అందజేశారు. #WATCH Punjab CM Charanjit Singh Channi gets emotional while addressing his first press conference in Chandigarh says "Congress has made a common man the chief minister." pic.twitter.com/4QNV990OR7 — ANI (@ANI) September 20, 2021 Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab. — Narendra Modi (@narendramodi) September 20, 2021 -
రెచ్చిపోయిన ఇసుక స్మగ్లర్లు
మల్లాపూర్ (కోరుట్ల): ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో స్మగ్లర్లు ఏకంగా పోలీసులపైనే దాడి చేశారు. రాళ్లు, కర్రలు, పారలతో ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వేంపల్లి శివారు పెద్దవాగులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రాయికల్ మండలం కొత్తపేట వడ్డెర కాలనీ గ్రామానికి చెందిన కొందరు వేంపల్లి పెద్దవాగులోంచి ఇసుక అక్రమంగా తరలించేందుకు మూడు, నాలుగు రోజులుగా యత్నిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 20 ట్రాక్టర్లలో, సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు పెద్దవాగులోకి చేరుకుని ఇసుకను తోడుతున్నారు. సమాచారం అందుకున్న ట్రైనీ ఎస్సై వెంకటేశ్, పోలీస్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజ్‌కుమార్ అక్కడకు వెళ్లి రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో సుమారు 40 మందికి పైగా దుండగులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ రాళ్లు, కర్రలు, పారలతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ట్రైనీ ఎస్సైకి స్వల్ప గాయాలయ్యాయి. ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో మెట్పల్లి డీఎస్పీ గౌస్‌బాబా, సీఐ శ్రీనివాస్, సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్సైలు, పోలీసులతో వేంపల్లికి చేరుకున్నారు. గాయపడ్డ కానిస్టేబుళ్లకు వైద్యసేవలు అందించారు. అనంతరం ఇసుక ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా పోలీసులపై దాడి చేసిన 24 మందిపై కేసు నమోదు చేశామని, 10 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. ట్రైనీ ఎస్సైపై దాడి జరగలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లపై దుండగులు దాడి చేసి గాయపరిచారని సీఐ వివరించారు. -
జగిత్యాలలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
-
చంద్రగిరిలో టీడీపీ ఇసుక దందా..
సాక్షి,చంద్రగిరి: మండలంలో టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు హయాం నుంచి అలవాటైన అక్రమ రవాణా నేటికీ కొనసాగుతోంది. స్థానికులెవరైనా ఫిర్యాదు చేస్తే వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. చంద్రబాబు సొంత పంచాయతీ కందులవారిపల్లి కేంద్రంగా టీడీపీ మాఫియా ఏర్పాటైంది. శేషాపురానికి చెందిన టీడీపీ నాయకులు, నారావారిపల్లికి చెందిన చంద్రబాబు బంధువుతో కలసి, బుధవారం రాత్రి నుంచి బీమానదిలో ఇసుక తవ్వకం మొదలుపెట్టారు. రెండు జేసీబీలు, పది ట్రాక్టర్లను ఉపయోగించి కందులవారిపల్లి నుంచి పులిచెర్లకు ఇసుకను తరలిస్తున్నారు. మరికొన్ని ట్రాక్టర్ల ద్వారా ఇసుకను కొత్తపేటకు తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలు చొప్పున విక్రయిస్తున్నారు. వాగులు, వంకల్లో ఇసుక ఖాళీ భీమా నది పరిసర ప్రాంతాల్లోని వంకలు, వాగుల్లో ఇప్పటికే ఇసుకను తోడేశారు. దీంతో సమీప బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. పంటల సాగుకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. అక్రమ రవాణాదారులపై ఫిర్యాదు చేస్తే దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారన్న భయంతో వెనకడుగు వేస్తున్నారు. నాలుగు రోజుల నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతుండడం గమనార్హం. పట్టించుకోని యంత్రాంగం అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉన్నప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్ఓ, వీఆర్ఏలతో పాటు గ్రామ పోలీసులు సైతం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల్లో కొందరు గుట్టుగా అక్రమ రవాణాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ ఇసుక అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డీఎస్పీ నరసప్ప బుధవారం రాత్రి స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి ఇసుక తవ్వుతున్న వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. అయితే డీఎస్పీ ఆదేశాలు బేఖాతర్ చేస్తూ నిమిషాల వ్యవధిలో ఇసుక స్మగ్లర్లకు సమాచారం అందించారు. హుటాహుటిన బీమానది నుంచి జేసీబీలు, ట్రాక్టర్లను మళ్లించేశారు. వారు వెళ్లిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ ఏమీ లేదంటూ చేతులు దులుపుకుని వెనుదిరగడం కొసమెరుపు. -
ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా విజృంభిస్తోంది. అక్రమ రవాణాను అడ్డుకున్న వారు ఎవరైనా సరే.. అడ్డుతొలగించుకోవడమే లక్ష్యంగా రోజురోజుకూ రెచ్చిపోతోంది. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని మిడ్జిల్ మండలం వాడ్యాల్ శివారులో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ వ్యక్తిపై ఇసుకాసురులు కత్తితో దాడి చేయడం ఇందుకు మరో నిదర్శనం. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. వాడ్యాల్‌కు చెందిన ట్రాక్టర్ల యాజమానులు రాత్రివేళ అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. గురువారం రాత్రి కూడా రెండు ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తుండగా.. అనేగళ్ల జంగయ్య, భాస్కర్‌తో పాటు కొందరు రైతులు అడ్డుకున్నారు. వారితో ట్రాక్టర్ యాజమానులు బీర్ల రమేష్, బీర్ల రామకృష్ణ, బెల్లె భీరయ్య, సిద్దపురం శ్రీశైలం, శ్రీను ఘర్షణకు దిగారు. దీనిపై జంగయ్య, భాస్కర్ అదేరోజు రాత్రి మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాక్టర్ యజమానులు ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. అనంతరం జడ్చర్ల పట్టణంలో ఉన్న వాడ్యాల్‌కు చెందిన మధు అనే యువకుడికి ట్రాక్టర్ యాజమాని భీరయ్య ఫోన్ చేశాడు. మధు, తదితరులు ఇసుక రవాణాను అడ్డుకుంటున్నారనే కోపంతో.. ‘ఇసుక ఆపేందుకు వస్తే మంచిగా ఉండదు.. మీ వాళ్లు అడ్డం వస్తే బెదిరించాం.. నీవు వస్తే నీ అంతుచూస్తాం..’అని హెచ్చరించారు. ఈ క్రమంలోనే మధు శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రైతులతో కలిసి దుందుభీ వాగువైపు వెళ్తుండగా.. అప్పటికే కాపు కాసిన ట్రాక్టర్ యాజమానులు కత్తితో దాడికి దిగారు. చేతులు వెనక్కి విరిచి... ధును ట్రాక్టర్ యజమాని భీరయ్య రెండు చేతులు వెనక్కి విరిచి పట్టుకోగా.. మరో ట్రాక్టర్ యజమాని రమేష్ కత్తితో చేతి భుజంపైన, కడుపులో పొడిచి పారిపోయారు. గాయపడిన మధును అతడితో వచ్చిన వారు 108లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని కాలి తొడ భాగంలో ఆరు, చేతికి పది, కడుపులో నాలుగు కుట్లు పడ్డాయి. మధు సోదరుడు రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఎస్పీ వెంకటేశ్వర్లు మిడ్జిల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఘటనపై విచారించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి వాడ్యాల్‌కు చెందిన బీర్ల రామకృష్ణ, బీర్ల రమేష్, బెల్లె భీరయ్య, సిద్దపురం శ్రీశైలంను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. వీరిని కల్వకుర్తి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్ఐ జయప్రసాద్ తెలిపారు. గతంలోనూ దురాగతాలు గతంలో అల్లీపూర్ వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా.. ఆత్మకూరు మండలం పిన్నంచెర్లకు చెందిన ఓ రైతు అడ్డుకున్నాడు. అతడిని ఇసుకాసురులు ట్రాక్టర్ టైర్లతో తొక్కించి చంపి వేశారు. మక్తల్ మండలంలోని వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాలను అడ్డుకున్నందుకు షాద్‌నగర్‌కు చెందిన ఓ ఇసుక వ్యాపారి ఏకంగా ఎమ్మెల్యేనే బెదిరించాడు. కోయిల్‌కొండ మండలంలోని అంకిళ్లవాగు నుంచి టిప్పర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డుకున్నాడు. దీంతో ఇసుకాసురులు రెచ్చిపోయి అతడిపై దాడి చేశారు. అదేవిధంగా సూరారంంలో ఇసుక రవాణాకు అడ్డుపడుతున్నారనే కారణంతో బైక్‌పై వెళ్తున్న వీఆర్ఏ, వీఆర్ఓలను టిప్పర్లతో తొక్కించేందుకు యత్నించగా.. వారు ఎలాగో తప్పించుకుని బయటపడ్డారు. ఇలాంటివి మరెన్నో ఘటనలు ఈ ప్రాంతంలో జరిగాయి. రాజకీయ నేతల అనుచరులే..! జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోవడానికి రాజకీయ నేతల అండదండలే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాజకీయ నేతల ఒత్తిళ్లు, నెలవారీగా మామూళ్లు అందుతుండడంతో అధికార యంత్రాంగం కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. మిడ్జిల్ మండలంలో రెచ్చిపోయిన ఇసుకాసురులు అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనుచరులేననే ఆరోపణలు విన్పిస్తున్నాయి. చదవండి: తన దోషం పోతుందని బిడ్డను బలిచ్చింది -
ఇసుక రీచ్‌లు అక్రమ రవాణాకు అడ్డా..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాల పేరిట నదులు, వాగుల నుంచి జరుగుతున్న ఇసుక అక్రమ దందాలో తవ్వేకొద్దీ అవకతవకలు బయటపడుతూనే ఉన్నాయి. ఇసుక దోపిడీపై ‘మారీచులు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన పరిశోధనాత్మక కథనానికి స్పందించిన టీఎస్ఎండీసీ నిబంధనల మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చింది. కానీ అటు టీఎస్ఎండీసీ, ఇటు జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఉండే ఇసుక వనరులన్నీ అక్రమ రవాణాకు అడ్డాగా మారాయి. స్థానిక అవసరాల కోసం ఒకటి, రెండు, మూడో కేటగిరీ వనరుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తున్న జిల్లా యంత్రాంగం.. అక్రమ రవాణాను పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల ప్రజాప్రతినిధులే ఇసుక అక్రమ రవాణా దందా సాగిస్తుండగా.. ప్రభుత్వ శాఖల సిబ్బంది చూసీ చూడనట్టు ఉంటున్నారు. ముఖ్యంగా కొందరు కిందిస్థాయి పోలీసు, రెవెన్యూ అధికారులు అక్రమ వ్యాపారానికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది పోస్టింగుల్లో కొందరు ప్రజాప్రతినిధులు చక్రం తిప్పుతున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. రీచ్‌ల నుంచి మొదలుకుని.. టీఎస్ఎండీసీ 4, 5 కేటగిరీ క్వారీల ద్వారా ఇసుకను వెలికితీస్తూ.. ‘శాండ్ సేల్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్’ ద్వారా విక్రయిస్తోంది. ఆన్ లైన్ చెల్లింపులు, అనుమతులు జారీ చేస్తున్నా స్టాక్ పాయింట్లు, వేబ్రిడ్జీల వద్ద కొందరు సిబ్బంది.. ఈ వ్యవస్థ లోని లోపాలను అనువుగా మల్చుకుం టున్నారు. రీచ్‌లు, స్టాక్ పాయింట్ల వద్ద ప్రాజెక్టు అధికారులు (పీవోలు) ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వసూళ్లు సాగిస్తున్నారు. బినామీల చేతుల్లో సొసైటీలు, రీచ్‌లు అన్ని కేటగిరీలకు చెందిన ఇసుక రీచ్‌లు కూడా ప్రజాప్రతినిధులు లేదా వారి బినామీల కనుసన్నల్లోనే కొనసాగుతున్నట్టు ‘సాక్షి’ పరిశోధనలో వెల్లడైంది. గిరిజన సహకార సొసైటీల పేరిట కొన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థలు ఇసుకను లూటీ చేస్తున్నాయి. అంతేకాదు గిరిజన సొసైటీలకు కేటాయించిన రీచ్‌లలో యంత్రాలను వినియోగించకూడదన్న నిబంధన కూడా అమలు కావడం లేదు. జియో కోఆర్డినేట్స్ ప్రకారమే తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నా.. ప్రభుత్వపరంగా తవ్వకాలపై పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంది. చాలాచోట్ల రీచ్‌ల వద్ద ప్రైవేటు వ్యక్తులు కాపలాగా ఉంటూ అటువైపు ఎవరూ వెళ్లకుండా చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అటువైపు వెళ్లినవారిపై దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అక్రమ ఇసుక వ్యాపారులు.. తమను అడ్డుకున్న వారిని వాహనాలతో ఢీకొట్టించి, చంపారన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు నామ్కేవాస్తేనే.. స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని టీఎస్ఎండీసీ చెప్తోంది. కానీ చాలాచోట్ల సీసీ కెమెరాల వ్యవస్థ నామ్‌కే వాస్తేగా మారింది. పీవోలు లారీలు, ట్రాక్టర్లలో అదనపు బకెట్లు ఇసుక నింపడం, సీరియల్ నంబర్ ముందు వచ్చేలా చూడటం ద్వారా జేబులు నింపుకొంటున్నారు. అనుమతి పొందిన పరిణామం కంటే ఎక్కువ ఇసుక నింపడం ద్వారా రూ.2 వేల వరకు, సీరియల్ నంబర్ త్వరగా వచ్చేందుకు రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. తగిన సంఖ్యలో టీఎస్ఎండీసీ అధికారిక వేబ్రిడ్జిలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. ఒకే నంబరు కలిగిన లారీలు, నకిలీ వేబిల్లుల ద్వారా రవాణా వంటి ఘటనలపై ములుగు, మహదేవపూర్, కాటారం, స్టేషన్ ఘనపూర్ పోలీసు స్టేషన్ల పరిధిలో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ప్రాజెక్టుల పేరిట తరలివెళ్తున్న ఇసుక గమ్యస్థానానికి చేరుతుందో, లేదో తెలుసుకునే పటిష్ట పర్యవేక్షక వ్యవస్థ కొరవడింది. మైనింగ్, రెవెన్యూ, పోలీసు, రవాణా అధికారుల నడుమ సమన్వయ లోపం అక్రమార్కులకు అనుకూలంగా మారింది. చదవండి:కేపీహెచ్‌బీ–హైటెక్‌సిటీ ఆర్యూబీని ప్రారంభించిన కేటీఆర్ -
ఇసుక, మద్యం అక్రమాలకు ఆస్కారం ఇవ్వొద్దు
మద్యం, ఇసుక, ఇతర అక్రమాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు ఉధృతం చేయాలి. సరిహద్దు రాష్ట్రాల నుంచి వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. రాష్ట్రంలోకి అక్రమంగా మద్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం విషయంలో ఎక్కడా అక్రమాలకు ఆస్కారం ఉండకూడదని, అక్రమ రవాణా చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. అక్రమాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిని ఉపేక్షించవద్దని, వ్యవస్థీకృతంగా అవినీతికి అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. మద్యం, ఇసుక అక్రమాల నిరోధానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పనితీరుపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా సమాచారం రాగానే దానిపై కచ్చితంగా దృష్టిపెట్టి పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవస్థీకృతంగా ఎస్ఈబీలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని, ఎక్కడైనా తప్పులు జరిగాయన్న సమాచారం రాగానే కచ్చితంగా దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పుడున్న వారే కాకుండా సమర్థత, నిజాయితీపరులైన అధికారులకు ఎస్ఈబీలో స్థానం కల్పించాలని సూచించారు. ఇందులో పని చేసే వారికి ఇన్సెంటివ్‌లు కూడా ఇచ్చి ప్రోత్సహించాలని, ఎస్ఈబీకి కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఎస్ఈబీ పనితీరుపై ప్రతివారం సమావేశమై సమీక్ష నిర్వహించాలని, వచ్చే 15 రోజుల్లో కచ్చితంగా మెరుగైన ఫలితాలు రావాలన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్‌లాల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదీ ఎస్ఈబీ పురోగతి ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ఏర్పాటైన గతేడాది మే 16వ తేదీ నుంచి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► మద్యం అక్రమాలపై 79,632 కేసులు నమోదు. 4,85,009 లీటర్ల మద్యం, 12,766 లీటర్ల బీరు, 4,54,658 లీటర్ల నాటుసారా పట్టివేత. 1,12,70,123 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం. 2,85,142 కేజీల నల్లబెల్లం, 22,715 వాహనాలు స్వాధీనం. మద్యం అక్రమాలకు పాల్పడ్డ 240 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కూడా కేసులు నమోదు. ► ఇసుక అక్రమాలపై 7,244 కేసులు నమోదు. 4,79,692 టన్నుల ఇసుక స్వాధీనం. 9,689 వాహనాలు సీజ్. ► ఇసుక విషయంలో అక్రమాలకు పాల్పడ్డ 22 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు. మద్యం, ఇసుక అక్రమాలకు పాల్పడ్డ 82 మంది పోలీసులపై కూడా కేసులు నమోదు. ► ఇతర అక్రమాలపైనా ఎస్ఈబీ కొరడా ఝళిపించింది. 1,00,979 కేజీల గంజాయి, 90,97,628 గుట్కా ప్యాకెట్లు, 1,120 ఎర్రచందనం దుంగలు పట్టివేత. పేకాట శిబిరాలపై దాడులు.. రూ.4.92 కోట్లు స్వాధీనం. -
‘కాలవ’ డైరెక్షన్.. ఖాకీ దందా
డీ.హీరేహాళ్ మండలంలోని కూడ్లూరు గ్రామ సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమి కొనుగోలు చేసిన ఓ పోలీసు అధికారి.. పక్కనే ఉన్న మరో 20 సెంట్ల ప్రభుత్వ భూమిని కలిపేసుకున్నాడు. తన మామ, టీడీపీ నాయకుడి అండతో బినామీ హరిజన హనుమంతప్ప పేరిట 3.79 ఎకరాలకు పట్టా చేయించుకున్నాడు. ఈ భూమిలో ఇసుక లేకపోయినా రీచ్‌కు అనుమతి పొంది.. పక్కనే ఉన్న దళితుల శ్మశానం, వంక పరంబోకులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడు. సదరు పోలీసు అధికారి సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ దందా వెనుక ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం. సాక్షి, రాయదుర్గం: సహజ వనరులను దోచుకోవడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో రూ.కోట్లు సంపాదించిన నేతలు.. ఇప్పుడూ అదేబాటలో వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు దళితులను అడ్డుపెట్టుకుని ఇసుక దందా సాగిస్తున్నారు. అక్రమం బయటపడితే తమ చేతికి మట్టి అంటుకోకుండా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలో ఇసుక రీచ్‌కు అనుమతి పొంది సమీప ప్రాంతాల్లోని వంక పరంబోకును తోడేస్తున్నారు. ఈ దందా బయటపడటంతో టీడీపీ నేతలు దళిత రైతును ముందు పెట్టి నాటకం ఆడించడం విమర్శలకు తావిస్తోంది. (మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి బిగుస్తున్న ఉచ్చు!) ఖాకీ అల్లుడు.. బినామీల పర్వం రాయదుర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమార్తెను వివాహం చేసుకున్న ఓ పోలీసు అధికారి తన మామ పలుకుబడి ఉపయోగించి డీ.హీరేహాళ్‌లో పోస్టింగ్ వేయించుకున్నాడు. దాదాపు రెండున్నరేళ్లు ఇక్కడే పనిచేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా.. తన సామాజిక వర్గానికే చెందిన మాజీ మంత్రి ఆశీస్సులు పొంది భారీగా సంపాదించాడు. అనతి కాలంలోనే సుమారు 80 ఎకరాలకుపైగా భూములు కొనుగోలు చేసి బినామీల పేరిట పట్టాలు చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మాజీ మంత్రి అండతో తన భూముల పక్కనే ఉన్న అసైన్డ్ భూములను కూడా కలిపేసుకుని పట్టాలు పొందాడు. ఇలా డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 201లో 3.59 ఎకరాల భూమిని ఇతరుల ద్వారా కొనుగోలు చేసి ఆ పక్కనే ఉన్న మరో 20 సెంట్ల అసైన్డ్ భూమిని ఆక్రమించి మొత్తంగా 3.79 ఎకరాలకు తన మామ నమ్మిన బంటుగా ఉన్న హరిజన హనుమంతప్ప పేరిట పట్టా చేయించాడు. ఇసుక లేకపోయినా రీచ్‌కు అనుమతి తన బినామీ హరిజన హనుమంతప్ప పేరిట చేయించిన భూమిలో ఇసుక లేకపోయినప్పటికీ సదరు పోలీసు అధికారి, ఆయన మామ రీచ్ కోసం మంత్రాంగం నడిపించారు. కొందరు అధికారుల అండతో ఇసుక రీచ్‌కు అనుమతులు పొందారు. టన్ను ఇసుకకు రూ.60 చెల్లించేలా తొలుత అధికారులతో ఒప్పందం చేసుకుని ఆ తర్వాత నష్టం వస్తుందని సాకుగా చూపి టన్ను ఇసుకకు రూ.100 ఇచ్చేలా అనుమతి పొందారు. అలాగే ఇసుక రవాణా కాంట్రాక్టర్‌ను సైతం తమ వారినే నియమించుకుని ఇసుక దందా ప్రారంభించారు. (తిరుపతిలో మకాం వేసిన బీజేపీ నేత విష్ణు) శ్మశానంలో తవ్వకాలు.. పట్టాభూమిలో ఇసుక లేకపోవడంతో పక్కనే ఉన్న దళితుల శ్మశానం, ఆ పక్కనే ఉన్న చిన్న హగరిలోని పరీవాహకంలోని 14 ఎకరాల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వేసి విక్రయించుకున్నారు. ఈ క్రమంలో 4 అస్థిపంజరాలు బయట పడినా గుట్టుగా వేరే ప్రాంతంలో పూడ్చినట్లు గ్రామానికి చెందిన దళితులు చెబుతున్నారు. ఇసుక రవాణా కాంట్రాక్టర్ కూడా తమవాడే కావడంతో ఇసుక అక్రమ దందాను నిరాటంకంగా కొనసాగించారు. అక్రమం బయట పడటంతో కాలవ ఎదురుదాడి డీ.హీరేహాళ్ మండలం కూడ్లూరు ఇసుక రీచ్ అక్రమాలు బయటపడటంతో కాలవ బయటకొచ్చారు. ఈ దందా వెనుక ఉన్న తన పేరు ఎక్కడ బయటకు వస్తుందోనని ప్రభుత్వంపై, స్థానిక ప్రజాప్రతినిధిపై ఎదురుదాడికి దిగారు. తన సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, అతని అల్లుడు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అయితే విప్ కాపు రామచంద్రారెడ్డి దీనిపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో అధికారులు ఇప్పుడు తీగలాగుతున్నారు. -
రూటు మార్చిన అక్రమార్కులు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సెబ్, సివిల్ పోలీసుల దాడులతో ఇసుక మాఫియా రూటు మారింది. ఇన్నాళ్లూ అధికారుల కళ్లుగప్పి అర్ధరాత్రి ఇసుకను తరలించిన వారు.. ఇప్పుడు దర్జాగా అధికారికంగానే తెప్పిస్తున్నారు. ఇతరుల ఆధార్ కార్డులు వినియోగించి ఇసుక బుక్ చేసి.. దాన్నంతా ఒకేచోట డంప్ చేసి ఆ తర్వాత అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంతో ఇసుకాసురులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. గతంలో రీచ్ నుంచి డిపోలకు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలించుకుని విక్రయించేవారు. అయితే దీనిపై సెబ్ నిఘా ఉంచి సదరు కాంట్రాక్టర్లపై ఏకంగా కేసులు పెట్టడంతో ఇసుక అక్రమ రవాణా తగ్గిపోయింది. దీంతో ఇసుక అక్రమ రవాణాపైనే ఆధారపడి బతుకున్న వారు మరో కొత్తదారిలో అక్రమాలకు తెరలేపారు. ఇతరుల ఆధార్‌కార్డులతో ఇసుకను ఒకే ప్రాంతానికి బుక్ చేసుకుని.... అక్కడే డంప్ చేసేస్తున్నారు. అక్కడి నుంచి దర్జాగా అధిక ధరకు విక్రయిస్తున్నారు. వానాకాలంలోనూ పెరిగిన డిమాండ్ మామూలుగా వర్షాకాలం నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగిపోతాయి. దీంతో ఇసుక డిమాండ్ బాగా తగ్గిపోతుంది. కానీ జిల్లాలో ఇసుక డిమాండ్ గతంతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువగా ఉంటోంది. వాస్తవానికి ఇసుక రీచ్ నుంచి డిపోకు.. అక్కడి నుంచి వినియోగదారుల చేరే వరకూ నిఘా ఉంచేందుకు వాహనాలకు ఇప్పటికే జీపీఎస్ పరికరాలను అమర్చారు. ఈ నేపథ్యంలోనే ఇసుకాసురులు కొత్త మార్గాన్ని వెతుక్కున్నారు. బుకింగ్ సమయంలోనే అక్రమాలు చేయడం ద్వారా ఆదాయార్జనకు తెరలేపారు. గతంలో రోజువారీగా వర్షాకాలంలో కేవలం 1,000 టన్నుల మేరకు ఇసుక డిమాండ్ ఉండేది. అయితే, ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా 4 వేల నుంచి 5 వేల వరకూ డిమాండ్ ఉంటోంది. దీంతో అధికారులు అప్రమత్తమై మొత్తం ఇసుక బుకింగ్స్‌పై కూపీలాగటం మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. ఇంత డిమాండ్ ఉందా.! వాస్తవానికి జిల్లాలో రోజూ 4 వేల టన్నుల వరకూ ఇసుక బుకింగ్ జరుగుతోంది. కొన్ని రోజుల్లో ఇది కాస్తా 5వేల టన్నులకు చేరుకుంటోంది. అయితే, వాస్తవ వినియోగం ఇంత ఉందా! లేదా? అనే అనుమానం కలుగుతోంది. ఈ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్నాయా అనే అనుమానం అధికారులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎక్కడి నుంచి బుకింగ్ జరుగుతోంది? నిజంగా వారి కోసమే ఇసుకను బుకింగ్ చేసుకున్నారా....? వారి ఆధార్‌కార్డుతో ఇతరులు బుక్ చేసి... పక్కదారి పట్టిస్తున్నారా....? అనే కోణంలో అధికారులు విచారణ ప్రారంభించారు. ప్రధానంగా అనంతపురం పట్టణంతో పాటు కదిరి, హిందుపురం, మడకశిర ప్రాంతాల్లో ఈ విధంగా ఇతరుల ఆధార్‌కార్డులతో బుకింగ్ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరా తీస్తున్నాం ఇటీవల వర్షాలు బాగా కురిశాయి. మామూలుగా నిర్మాణాలన్నీ ఆగిపోతాయి. అయినప్పటికీ ఇసుకకు డిమాండ్ తగ్గలేదు. అందుకే పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. కొంతమంది ఇతరుల ఆధార్లతో ఇసుకను బుక్ చేసుకుని.. డంప్ చేసి విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆ మేరకు విచారణ చేస్తున్నాం. – నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ -
అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కేస్తాం!
మరికల్ (నారాయణపేట): ‘ఇసుక ట్రాక్టర్లకు అడ్డువస్తే వాటితోనే తొక్కించుకుంటూ వెళ్తాం..’అంటూ గ్రామస్తులను ఇసుక మాఫియా హెచ్చరించింది. అయితే.. వారి తాటాకు చప్పుళ్లకు భయపడకుండా గ్రామస్తులు తిరగబడడంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ సంఘటన శనివారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారంలోని మన్నెవాగు వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. మన్నెవాగు నుంచి నెల రోజుల నుంచి ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. సమీపంలోని మన్నెవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపుతో చుట్టుపక్కల వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పడిపోతోంది. కాగా, శనివారం ఉదయం ఇసుక కోసం ఈ వాగులోకి వచ్చిన సుమారు పది ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. రెచ్చిపోయిన ఇసుక వ్యాపారులు ‘మంచి మాటలతో చెబుతున్నాం. అడ్డు రాకండి.. అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తాం..’అంటూ బెదిరించారు. అయితే గ్రామస్తులు తిరగబడటంతో ట్రాక్టర్లను వదిలి పరారయ్యారు. ఈ క్రమంలో వాగులోని నీటిగుంతలో కొన్ని వాహనాలు ఇరుక్కుపోయాయి. ఈ విషయాన్ని తహసీల్దార్, పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎవరు అక్కడికి రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాగులో నుంచి ఇసుకను అమ్ముకుంటున్న వారితో పాటు అనుమతి లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్న వారిపైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా తరలిస్తే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతువేదికలు, శ్మశానవాటికలకు మాత్రమే ఇసుకకు అనుమతి ఇచ్చాం. ఒకవేళ ఇసుకను అక్రమంగా తరలిస్తే ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గ్రామస్తులను భయాందోళనలకు గురిచేసే వారిపై కేసులు నమోదు చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, మరికల్ -
అక్రమార్కులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అందుకోసం ఏర్పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ) దూకుడు మీద ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ సమాచారం... ప్రత్యేక చెక్‌పోస్టుతో నిఘా... ఆకస్మిక తనిఖీలతో ఎడాపెడా దాడులు చేస్తూ అక్రమ రవాణాదారుల ఆటకట్టిస్తోంది. ఇసుక, మద్యం అక్రమ రవాణాదారులపై గత మూడు నెలల్లోనే రికార్డుస్థాయిలో కేసులు నమోదు చేసి... అరెస్టులు చేసింది. విస్తృతంగా ఎస్ఈబీ దాడులు ఈ ఏడాది మే 16 నుంచి సెప్టెంబరు 7 వరకూ రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దాడులు నిర్వహించింది. రికార్డుస్థాయిలో కేసులు నమోదు, అరెస్టులతో ఇసుక, మద్యం అక్రమరవాణాదారులను గడగడలాడించింది. ► ఎస్ఈబీ ఇసుక అక్రమరవాణాపై దాడులు నిర్వహించి 3,570 కేసులు నమోదు చేసి 6,863 మందిని అరెస్టు చేసింది. 4,765 వాహనాలను, 4,28,127.71టన్నుల ఇసుకను జప్తు చేసింది. ► సారా తయారీ, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్ఈబీ విస్తృతంగా దాడులు నిర్వహించింది. మూడు నెలల్లో 36,895 కేసులు నమోదు చేసింది. 47,695 మందిని అరెస్టు చేసి13,675 వాహనాలను జప్తు చేసింది. 265.22 లీటర్ల అక్రమంగా రవాణా చేస్తున్న 265.22లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. 202.86 లీటర్ల సారాను జప్తు చేయడమే కాకుండా 4,303 లీటర్ల కాపు సారాను ధ్వంసం చేసింది. పటిష్ట నిఘా... ప్రత్యేక బృందాలు ఇసుక, మద్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎస్ఈబీ వ్యవస్థాగతంగా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయిలో ఐదు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉండనే ఉన్నాయి. ఇక అనంతపురం జిల్లాల్లో ఎస్పీ స్పెషల్ ఆపరేషన్ బృందాలను ఏర్పాటు చేశారు కూడా. ► రాష్ట్రవ్యాప్తంగా 289 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అక్రమ రవాణాపై పూర్తి సమాచారం వచ్చేలా నిఘా వ్యవస్థను పటిష్టపరిచారు. ► ఇంటెలిజెన్స్‌వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు. ► జిల్లా స్థాయిలో నోడల అధికారి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ► రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఏపీఎండీసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమన్వయం సాంకేతిక అంశాలపరంగా కూడా సమగ్రంగా కేసు నమోదు చేస్తున్నారు. పటిష్ట చర్యలు చేపడుతున్నాం ఇసుక, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నాం. సీబీఐ తరహాలో మూడు నెలలోకోసారి సమీక్షించుకుంటూ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నాం. – వినీత్ బ్రిజ్‌లాల్, ఎస్ఈబీ కమిషనర్ -
చీఫ్ మినిస్టర్ ఈజ్ విత్ యూ
సాక్షి, అమరావతి: ఇసుక, మద్యం అక్రమాలతో పాటు అక్రమ రవాణాకు ఎవరు పాల్పడినా ఉపేక్షించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇసుక, మద్యం అక్రమాలపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు. మద్యం, ఇసుకపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందన్న సీఎం, వాటిపై జిల్లా ఎస్పీలు, ఎస్ఈబీ సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని ప్రశంసించారు. మద్యం ధరలను తగ్గించడం వల్ల స్మగ్లింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నప్పటికీ, ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ► ఎవరైనా మద్యం, ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరించాలి. వాటిపై రాజకీయంగా ఎటువంటి ఒత్తిళ్లు రావు. ► క్రితంసారి కొన్ని విషయాలు ప్రస్తావించాను. కొన్ని సున్నిత అంశాల మీద, ముఖ్యంగా అట్టడుగు వర్గాల కేసులకు సంబంధించి, పోలీసులు అనుసరించిన విధానం, వ్యవహరించిన తీరు బాగుందని పత్రికల్లో చదివాను. ► వాటికి సంబంధించి సీఐ, ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు స్పష్టమైన మెసేజ్ వెళ్లాలి. లేదంటే మంచి ఫలితాలు రావు. ఆ దిశలో సిబ్బందిని బాగా సెన్సిటైజ్ చేశారు. ఎస్పీలకు అభినందనలు. -
లారీతో తొక్కించేశారు!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ రాజాపూర్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. తమ పొలాల మీదుగా ఇసుక వాహనాలు నడపొద్దన్న పాపానికి ఓ పేద రైతును ఇసుకాసురులు లారీ టైర్ల కింద తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రాజాపూర్ మండలం తిర్మలాపూర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తిర్మలాపూర్‌కు చెందిన గుర్రంకాడి నర్సింలు(38)కు గ్రామశివారులో ఎకరం పొలం ఉంది. దాని పక్కనే దుందుభి వాగు ఉంది. ఇసుక మాఫియా అక్కడ ఇసుకను తీసి ఫిల్టర్ చేసి టిప్పర్లు, లారీల ద్వారా రైతుల పొలాల మీదుగా హైదరాబాద్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ పది ట్రిప్పుల ఇసుక తరలుతోంది. ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు పడిపోయి సాగుకు నీరందని పరిస్థితి నెలకొనడంతో పరిసర పొలాల రైతులు గతంలో ఎన్నోమార్లు ఇసుక వాహనాలను అడ్డుకున్నారు. అధికారులకు సైతం ఎన్నోమార్లు íఫిర్యాదు చేసినా అక్రమరవాణాకు అడ్డుకట్ట పడలేదు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తన పొలం మీదుగా వెళ్తున్న టిప్పర్‌ను నర్సింలు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఇసుక అక్రమార్కులు అదే వాహనం టైర్ల కింద నర్సింలును తొక్కించేసి హత్య చేశారు. హత్యపై భగ్గుమన్న మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నర్సింలు చావుకు కారణమైనవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సంఘటనాస్థలాన్ని డీఎస్పీ శ్రీధర్ పరిశీలించారు. హంతకులను చట్టపరంగా శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. రంగంలో అధికార పార్టీ నాయకుడు? నర్సింలు హత్యపై కోపోద్రిక్తులైన గ్రామస్తులు, మృతుడి కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకునేందుకు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు పావులు కదపడం చర్చనీయాంశంగా మారింది. సంఘటనాస్థలానికి చేరుకున్న సదరు నాయకుడు మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై కేసు కాకుండా చూసేందుకు యత్నిస్తున్నాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మూడేళ్లుగా వ్యవసాయ బోర్లు ఎండిపోతున్నాయని మండిపడిన గ్రామస్తులు ఇసుక రవాణా వద్దని వారించిన తమపై మాఫియా అనేకసార్లు దౌర్జన్యం చేసిందని భగ్గుమన్నారు. అదే గ్రామానికి చెందిన తో నేత అండదండలు ఇసుక మాఫియాకు పుష్కలంగా ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఇసుక లారీ యజమానులు మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు ఉన్నతాధికారుల అండదండలతోనే ఇసుక మాఫియా బరితెగిస్తోందనే ఆరోపణలున్నాయి. -
ఇసుక మాఫియా బరితెగింపు
-
దారుణం.. ఇసుక మాఫియా బరి తెగింపు
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. రాజాపూర్ మండలం తిరుమలాపూర్లో తన పంట పొలాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతు గుర్రం కాడి నరసింహులును లారీతో ఢీకొట్టి.. ఇసుక మాఫియా ఆయన ప్రాణాలు బలిగొంది. గత ఏడాది అదే గ్రామంలో ఒక రైతుని కూడా అడ్డు వచ్చాడనే నెపంతో ఇసుక మాఫియా ఇసుక దిబ్బ కూల్చి రైతుని హత్య చేసినట్టు కూడా తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి లారీ అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక ప్రజా ప్రతినిధితో ఇసుక మాఫియా సెటిల్ మెంట్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. -
ఎస్ఈబీకి ఆర్థిక అధికారాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)కు ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలతో సహా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్‌వోడీ) హోదాను కల్పించింది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ఎక్స్అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఈబీ విభాగం మెరుగైన ఫలితాలు సాధించేలా పోలీసు శాఖను సమన్వయం చేసేందుకు డీజీపీకి ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కల్పించారు. ఏపీ జీఏడీ పరిధిలోకి ఎస్ఈబీ వింగ్‌ను తీసుకొచ్చారు. ఐజీ, అంతకంటే పై స్థాయి ఐపీఎస్ అధికారి ఎస్ఈబీకి కమిషనర్, హెడ్‌గానూ వ్యవహరిస్తారు. -
వివాదాస్పదంగా పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం
చంఢీగఢ్: ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేందుకు 40 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను కపుర్తాలా జిల్లాలోని ఫగ్వారా చెక్‌పోస్టుల వద్ద కాపలాగా ఉంచనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. ఫగ్వారా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, సివిల్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నతాధికారులు, కమ్యూనికేషన్ ఎక్సెంజ్లతో పాటు ఉపాధ్యాయులు కూడా రాత్రి 9 గంటల నుంచి 1 గంటల మధ్య చెక్ పాయింట్ల వద్ద డ్యూటీ చేయాలంటూ శుక్రవారం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం 24 మంది పాఠశాల ఉపాధ్యాయులను డిస్టిలరీలకు కాపాలాగా నియమించింది. కానీ దీనిని ఉపసంహరించిన నెల రోజులకే ప్రభుత్వం మరోసారి ఈ ఉత్తర్వును జారీ చేసింది. (వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ పెట్టారు) దీనిపై శిరోమణి అకాలీదళ్(ఎస్ఎడీ) పార్టీ ప్రతినిధి, మాజీ మంత్రి డల్జిత్ సింగ్ చీమా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ‘డిస్టిలరీల తరువాత ఇసుక తవ్వకాలను ఆపడానికి పంజాబ్ ప్రభుత్వం వివిధ పోలీసు చెక్‌పోస్టు వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించింది. ఉపాధ్యాయులను మద్యం, ఇసుక మాఫియా కోసం ఎందుకు నియమిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇది ఒక సిగ్గుమాలిన నిర్ణయం. ప్రభుత్వం వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. కాగా గత నెలలో గురుదాస్‌పూర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం జారీ చేసిన ఈ వివాదాస్పద ఉత్తర్వుపై ప్రభుత్వం ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంది. మద్యం సరఫరాపై నిఘా పెట్టడానికి 24 మంది ఉపాధ్యాయులను కర్మాగారాల్లో మోహరించింది. అయితే ప్రతిపక్షం ఆందోళనలతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. (ఎగువసభ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్) -
పోలీసులకు టీడీపీ నేత విందు..
రాయదుర్గం రూరల్: రాయదుర్గం ప్రాంతంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ విక్రయాలను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్) ఏర్పాటు చేసింది. సెబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ దాడులు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ అక్రమార్కులకు చెక్‌పెడుతున్నారు. అయితే మూడు రోజుల కిందట రాయదుర్గం మండలం జుంజురాంపల్లి సమీపంలోని వేదావతి హగరి వద్ద గల రీచ్ నుంచి టీడీపీ నాయకుడు వీరేష్‌కు చెందిన ట్రాక్టర్లో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. అనంతరం పలువురు టీడీపీ నాయకులు తమ గ్రామంలోని ఇసుకను తమ అవసరాలకు వినియోగించుకునేందుకు అనుమతివ్వాలని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను కలిసి కోరారు.(ఇసుకకు ఇక్కట్లే!) విచారణకు వచ్చి విందు.. డీఎస్పీ వెంకటరావు జుంజురాంపల్లికి విచారణ నిమిత్తం వచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో మూసి ఉన్న ప్రభుత్వ పాఠశాల తలుపును టీడీపీ నేత విజయసింహచౌదరి (లచ్చన్న) తెరిపించి, అక్కడ డీఎస్పీ, సిబ్బందికి విందు ఏర్పాటు చేసి.. స్వయంగా వడ్డించారు. టీడీపీ నేతల ఇసుక దందా సజావుగా సాగేలా చూడాలని పోలీసు అధికారులను ప్రసన్నం చేసుకున్నట్లు తెలిసింది. అభ్యంతరం తెలిపిన వారిపై ఆగ్రహం అనధికారికంగా పాఠశాల తలుపులు తెరిచి విందు ఏర్పాటు చేయడంపై పేరెంట్స్ కమిటీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఏమైనా జరిగితే ప్రజలు తమను నిలదీస్తారని, ఇలా చేయడం మంచిది కాదని చెబితే పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడి వారిని వెనక్కు పంపారు. అక్రమ ఇసుక రవాణా, దందాను అరికట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాంత పోలీసులు గండి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై డీఎస్పీని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఇసుక అక్రమ రవాణాపై విచారణ నిమిత్తం జుంజురంపల్లి గ్రామానికి వచ్చినది వాస్తవమేనని, మధ్యాహ్నం వేళ అక్కడే భోజనం కూడా చేశామని చెప్పారు. -
వసూల్ రాజా..!
మహబూబ్‌నగర్ క్రైం: దేవరకద్ర నుంచి మహబూబ్‌నగర్ వైపు వస్తున్న ఇసుక టిప్పర్లను సీఐ స్థాయి పోలీసు అధికారి చెప్పాడని రోడ్డుపై నిలుపుతున్నాడు ఓ ప్రైవేటు వ్యక్తి. అనంతరం టిప్పర్ నంబర్, యజమాని సెల్‌ఫోన్ నంబర్ తీసుకోవటం మరుసటి రోజు నుంచి ఫోన్లు చేస్తూ.. ‘డబ్బులు అందలేదు.. సార్‌కు చెప్పాలా? రేపటి నుంచి ఈ రూట్లో టిప్పర్ కనిపించదు’ అంటూ వార్నింగ్ ఇవ్వటం, డబ్బులు వసూలు చేసే వరకు ఫోన్లు చేస్తూనే వేదిస్తున్నాడని టిప్పర్ యజమానులు వాపోతున్నారు. ఒక్కో టిప్పర్ నుంచి రూ.6 వేలు.. మక్తల్ సమీపంలోని ఓ వాగు నుంచి మహబూబ్‌నగర్‌కు టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారు. 100 నుంచి 130 టిప్పర్ల ఇసుక జిల్లాకేంద్రానికి వచ్చింది. ఈ క్రమంలో దేవరకద్ర – మహబూబ్‌నగర్ రహదారిలో ఓ పోలీసు అధికారి మనిషిని అంటూ ఓ వ్యక్తి దర్జాగా వాహనంపై పోలీస్ అని రాసుకొని టిప్పర్లు నిలుపుతున్నాడు. డ్రైవర్లు గట్టిగా ప్రశ్నిస్తే నేను ఫలనా సార్ మనిషిని, ఆయన పంపించాడు. అందుకే వచ్చానని సమాధానం ఇస్తున్నాడు. యాజమాని ఫోన్‌నంబర్, టిప్పర్ నంబర్ రాసుకొని మరసటి రోజు ఫోన్ చేసి రూ.6 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరికొందరు అధికారులు యాజమానులతో నేరుగా రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకం. విచారణ జరిపిస్తాం.. ప్రైవేట్ వ్యక్తులు పోలీసుశాఖ పేరుచెప్పి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక టిప్పర్లు నిలిపి డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయంపై విచారణ జరిపిస్తాం. పోలీసుశాఖలో ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడరు.–శ్రీధర్, డీఎస్పీ, మహబూబ్‌నగర్ -
మద్యం, ఇసుక మాఫియాలపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: మద్యపాన నియంత్రణ ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇసుక అక్రమాలు, మాఫియాలను నివారించేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. తాజాగా ఈ రెండు విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (మద్యం, ఇసుక)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సరిహద్దుల రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా.. రాష్ట్రంలో నాటుసారా రూపంలో మద్యం తయారు కాకుండా చూడటం, ఇసుక అక్రమాలను నిరోధించడమే లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనిచేస్తుంది. ఈ రెండు అంశాలపై ఉక్కుపాదం మోపేలా ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని, దాని రూపురేఖలపై ఎక్సైజ్ శాఖ మంత్రి, సీఎస్, డీజీపీ సహా కీలక అధికారులతో నాలుగు రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనిపై సరైన ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. శుక్రవారం మరోసారి అధికారులతో సమావేశమై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వరూపం ఇలా.. ► ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సాధారణ పరిపాలన శాఖలో భాగంగా ఉంటుంది. ► ఈ విభాగానికి అధిపతిగా డీజీపీ వ్యవహరిస్తారు. ఎక్స్ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా కూడా ఆయనే ఉంటారు. ► ఎక్స్ ఆఫీషియో ముఖ్య కార్యదర్శికి విధుల్లో సహకారం అందించేందుకు మధ్య స్థాయి అధికారి ఒకరు, సహాయ అధికా రి ఒకరు, రెండు సెక్షన్లు ఉంటాయి. ► స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు కమిషనరేట్ కూడా ఉంటుంది. దీనికి అధిపతిగా ఐజీ స్థాయి ఆపై అధికారి ఉంటారు. ► ప్రతి జిల్లాలో అదనపు ఎస్పీ లేదా ఏఎస్పీతో ఈ బ్యూరో ఉంటుంది. ఇందులో 18 మంది పోలీసు అధికారులు ఉంటారు. ఏడుగురు కేడర్ స్థాయి అధికారులు, మిగిలిన వారు నాన్ కేడర్ స్థాయి వారు ఉంటారు. ► కమిషనరేట్ స్ట్రక్చర్, ఉద్యోగులు, 18 మంది పోలీసు అధికారులకు సంబంధించి విధి, విధానాలను నిర్ధారిస్తూ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ► కొత్తగా ఏర్పాటు చేసిన ఈ శాఖకు సంబంధించి అవసరమైన చట్టాలను సవరిస్తారు. దీనికి సంబంధించి రెవెన్యూ, పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలు చర్యలు తీసుకోవాలి. -
మద్యం, ఇసుక అక్రమాలకు చెక్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణా, తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇసుక అక్రమ రవాణాను నిరోధించడంపై దృష్టి సారించింది. ఈ మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) ఏర్పాటు కానుంది. రాష్ట్ర సరిహద్దుల నుంచి మద్యం అక్రమంగా రవాణా కాకుండా, రాష్ట్రంలో సారా రూపంలో మద్యం తయారు కాకుండా, ఇసుక అక్రమాలను నిరోధించేలా బలోపేతమైన స్వతంత్ర వ్యవస్థ కార్యరూపంలోకి రానుంది. ఇదే విషయమై మూడు రోజుల క్రితం ఎక్సైజ్ శాఖా మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలతో సహా కీలక అధికారులు హాజరైన సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఈ ప్రత్యేక వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని సూచించారు. దీనికి అవసరమైన రూపురేఖలపై అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. దీనిపై సరైన ప్రణాళికను తీసుకురావాలని ఆదేశించారు. మళ్లీ శుక్రవారం అధికారులతో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మద్య నియంత్రణ దిశగా అడుగులు ► మద్య నియంత్రణ దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగుల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేయడానికి, రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయని సీఎం ప్రస్తావించారు. ► గత ప్రభుత్వంలో మద్య నియంత్రణ, ఎన్ఫోర్స్మెంట్ లాంటి అంశాల్ని పూర్తిగా వదిలేశారని, పర్మిట్ రూమ్స్, బెల్టుషాపుల రూపంలో ఎక్కడపడితే అక్కడ మద్యాన్ని విక్రయించారని సీఎం గుర్తు చేశారు. ► తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 20 శాతం దుకాణాలను తగ్గించడమే కాకుండా ధరలను కూడా పెంచామన్నారు. గ్రామాల్లో దాదాపు 43 వేల బెల్టుషాపులను ఏరివేయడమే కాకుండా, 4,500 పర్మిట్ రూంలను పూర్తిగా ఎత్తివేశామన్నారు. ఈ చర్యలతో మద్య నియంత్రణ విషయంలో కీలక అడుగులు ముందుకేశామని చెప్పారు. ► తాజాగా మద్యం ధరలను 75 శాతం పెంచడమే కాకుండా.. మరో 13 శాతం దుకాణాలను తగ్గించడానికి నిర్ణయించామన్నారు. దీనివల్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 33 శాతం మద్యం దుకాణాలను తొలగించినట్టు అవుతుందన్నారు. ► రానున్న రోజుల్లో మద్యం నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని, దీనివల్ల ప్రభుత్వ ఉద్దేశాలను దెబ్బతీయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అక్రమ రవాణా, ఇసుక అక్రమ రవాణా జరక్కూడదని చెప్పారు. స్వతంత్ర వ్యవస్థకు తుదిరూపు ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అధికారులు స్వతంత్ర వ్యవస్థకు తుది రూపు ఇచ్చారు. గతంలో ఎక్సైజ్ కమిషనర్ కింద డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్టు ఉండేది. మద్యం అక్రమ రవాణా, తయారీలను అడ్డుకోవడం దీని పని. అయితే గత ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహించడంతో ప్రొహిబిషన్ కార్యకలాపాలు పూర్తిగా మూలనపడ్డాయి. ► తాజా నిర్ణయం ప్రకారం ఎక్సైజ్ కమిషనర్ కింద ఉన్న డైరెక్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ పోస్టు స్థానంలో స్వతంత్రంగా పనిచేసే కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) పోస్టు వస్తుంది. ఇది డీజీపీ పర్యవేక్షణలో ఉంటుంది. ► ఎక్సైజ్ విభాగంలో ఉన్న సిబ్బందిలో కొద్ది మంది ఎక్సైజ్ కమిషనర్ విభాగం కిందకు వస్తారు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నందున లైసెన్స్‌లు, స్టాకు, విక్రయాలు, ప్రొడక్షన్ లాంటి రోజువారీ పాలనా అంశాలను మాత్రమే ఎక్సైజ్ కమిషనర్ చూసుకుంటారు. ► ఎక్సైజ్ విభాగంలో మిగిలిన సీఐలు, ఎస్సైలు, మిగిలిన సిబ్బంది అంతా కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కిందకు వస్తారు. మద్యం అక్రమ తయారీ, రవాణాను అడ్డుకోవడం వీరి ప్రధాన విధి. ఇసుక అక్రమాలను నిరోధించడం వీరి విధుల కిందకే వస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు ► అక్రమ రవాణాకు ఆస్కారం ఎక్కువగా ఉన్న రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కోసం ఐపీఎస్ స్థాయి అధికారులు ఉంటారు. వీరంతా కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్)కు రిపోర్టు చేస్తారు. ► కమిషనర్, స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) కింద జిల్లాల్లో ఏఎస్పీలు కూడా పని చేస్తారు. ఒక్కో ఏఎస్పీ కింద కనీసం 20 నుంచి 30 మంది సిబ్బంది ఉంటారు. జిల్లా ఎస్పీలతో వీరు సమన్వయం చేసుకుంటారు. ► ఈ కొత్త వ్యవస్థకు మెరుగైన మౌలిక సదుపాయాలు, వాహనాలు కల్పించి గట్టిగా పనిచేసేలా చూడాలని, అప్పుడే ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరుతాయని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఎలా స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్నాయో.. అదే మాదిరి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (లిక్కర్ అండ్ శాండ్) పని చేయాలి. మద్యం అక్రమ తయారీ.. మద్యం, ఇసుక అక్రమ రవాణాలను అడ్డుకోవడమే దీని ప్రధాన విధి. -
సంక్షేమాభివృద్ధి పథకాలకు మట్టి డబ్బులు
సాక్షి, అమరావతి: పోలవరం కుడి, ఎడమ కాలువల పనుల్లో లభ్యమైన మట్టిని పారదర్శకంగా ఆన్లైన్ టెండర్ల ద్వారా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మట్టి మాఫియాకు చెక్ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విక్రయించడం ద్వారా లభించే ఆదాయాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాలని నిర్ణయించింది. తొలిదశ విక్రయాలకు టెండర్ నోటిఫికేషన్ జారీ తొలి దశలో తూర్పు గోదావరి జిల్లాలోని గండేపల్లి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, తొండంగి, శంఖవరం మండలాలతోపాటు విశాఖ పట్నం జిల్లా కసింకోట మండల పరిధిలోని పోలవరం ఎడమ కాలువ పది రీచ్‌ల్లో 32,79,432 క్యూబిక్ మీటర్ల మట్టిని విక్రయిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని దేవరపల్లి, నల్లజర్ల, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మండలాలు, కృష్ణా జిల్లాలోని ఆగిరిపల్లి, బాపులపాడు, గన్నవరం, విజయవాడ మండలాల పరిధిలోని ఎనిమిది రీచ్‌ల్లో 25,72,294 క్యూబిక్ మీటర్ల మట్టి విక్రయానికి ఏపీఎండీసీ ఇటీవల టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 19న టెండర్లు ఖరారు క్యూబిక్ మీటర్ మట్టి ధర రూ.86 కాగా, గ్రావెల్ రేటు రూ.113 చొప్పున నిర్ణయించారు. టెండర్లో పేర్కొన్న ధర కంటే ఎవరు అధికంగా కోట్ చేస్తే వారికి మట్టిని విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తుంది. తొలి దశ మట్టి విక్రయ టెండర్లను ఈనెల 19న ఖరారు చేయనున్నారు. మట్టిని మింగిన టీడీపీ నేతలు పోలవరం కాలువ గట్లపై నిల్వ చేసిన మట్టిని టీడీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో పోలవరం మట్టిని దోచేశారు. కొన్ని చోట్ల కాల్వ గట్లపై కొండలను తలపించే రీతిలో నిల్వ చేసిన మట్టి సైతం మాయమైంది. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మట్టి దోపిడీలో చెలరేగిపోయారు. మిగిలింది 12 కోట్ల క్యూబిక్ మీటర్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మట్టి మాఫియాకు చెక్ పెట్టింది. పోలవరం మట్టిని ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. జలవనరులు, గనుల శాఖల అధికారులతో పోలవరం కుడి, ఎడమ కాలువ గట్లపై సర్వే చేయించింది. టీడీపీ నేతలు దోచేయగా కాలువ గట్లపై 12 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర మట్టి నిల్వ ఉన్నట్లు తేలింది. - ప్రస్తుత ఎస్ఎస్ఆర్ (స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం పోలవరం మట్టి విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో జలవనరుల శాఖకు రూ.700 కోట్లు, గనుల శాఖకు సీనరేజీ కింద రూ.300 కోట్ల ఆదాయం వస్తుందని లెక్క కడుతున్నారు. - మట్టి విక్రయం ద్వారా పోలవరం కుడి, ఎడమ కాలువల గట్లు ఖాళీ కావడంతో సుమారు ఐదు వేల ఎకరాల భూమి అందుబాటులోకి రానుంది. దీన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. -
చెక్‌పోస్టుల వద్ద పటిష్ట నిఘా
కర్నూలు: ఇసుక, మద్యం అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 10 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాటి వద్ద సీసీ కెమెరాలు కూడా అమర్చుతున్నారు. అక్కడ గార్డులుగా విధులు నిర్వర్తించేందుకు మాజీ సైనికులు (మిలటరీ, పారా మిలటరీ) 60 మందిని ఎంపిక చేశారు. వీరికి నెలసరి వేతనం రూ.15 వేల చొప్పున చెల్లించనున్నారు. 60 గార్డుల పోస్టుల ¿భర్తీకి మాజీ సైనికుల నుంచి దరఖాస్తులు అహ్వానించగా..మొత్తం 108 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిని మంగళవారం పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియానికి పిలిపించారు. ధ్రువ పత్రాలు పరిశీలించిన తర్వాత లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. ఇవీ చెక్‌పోస్టులు.. మాధవరం (మాధవరం పోలీసుస్టేషన్ పరిధి), క్షేత్రగుడి (హాలహర్వి పీఎస్), బాపురం (కౌతాళం పీఎస్), పంచలింగాల, ఈ తాండ్రపాడు, మునగాలపాడు, దేవమడ (కర్నూలు తాలూకా పీఎస్), సుంకేసుల (గూడూరు పీఎస్), మార్లమడికి (హోళగుంద పీఎస్), పెద్దహరివనం (ఇస్వీ పీఎస్). ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయండి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విధులు నిర్వహించాలని మాజీ సైనిక ఉద్యోగులకు ఎస్పీ ఫక్కీరప్ప సూచించారు. ప్రస్తుతం ఎంపిక కాని 48 మందిని కూడా చిత్తూరు, అనంతపురం జిల్లాలకు పంపించి అక్కడ సేవలందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో వేతనాలు పెరుగుతాయని, వారానికి రెండు రోజుల ఆఫ్‌లు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రమణమూర్తి, సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వండి: ఎన్జీటీ
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) గురువారం విచారణ చేపట్టింది. ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం 20 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది. కాగా తెలంగాణలో అక్రమ ఇసుక తవ్వకాల జరుగుతున్నాయని.. రేలా సంస్థ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్జీటీ విచారణ చేపట్టింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ జరిపింది. నెల రోజుల్లో ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. లేదంటే రూ.100 కోట్లు జరిమానాను సీపీసీబీ ఖాతాలో వేయాల్సి ఉంటుందని ఏపీకి ఎన్జీటీ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 14కు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) పేర్కొంది. -
టీడీపీ వాళ్లే ఇసుక దొంగలు
శృంగవరపుకోట రూరల్: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇసుక దోపిడీతో కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం గౌరీపురం వద్ద కృష్ణమహంతిపురం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన పెట్రోల్ బంకును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50శాతం పదవులు ఇస్తూ జీఓ తెచ్చామని, ఆ పదవుల్లో నియమించిన వారిని తొలగించే వీలులేకుండా చర్యలు కూడా తీసుకుంటున్నామన్నారు. -
ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది..
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.63 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడాది అంతా చూస్తే ఇది వేల కోట్లకు వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది చంద్రబాబు’ అంటూ ప్రశ్నిస్తూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. పచ్చ ఇసుక మాఫియా ద్వారా ఇన్నాళ్లు మీకు వాటా ముట్టిందని, అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటువంటి సాహసం ఎవరూ చేయలేదు.. ‘దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 14400 కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయింది. ఎవరు లంచం అడిగినా, డబ్బులివ్వందే పని జరగదని చెప్పినా ఫోన్ చేయొచ్చ’ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
అవినీతిపై 14400కు కాల్ చేయండి
సాక్షి, అమరావతి : అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. పౌరుల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14400 కాల్ సెంటర్‌ను సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ‘ఎప్పుడైనా ఎక్కడైనా అవినీతి మీ దృష్టికి వస్తే వెంటనే గళం ఎత్తండి.. 14400 నంబర్‌కు ఫోన్ చేయండి’ అనే నినాదం ఉన్న పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి, ఫిర్యాదులను స్వీకరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలు, కాలవ్యవధి, తదితర విషయాల గురించి కాల్ సెంటర్ ఉద్యోగితో మాట్లాడారు. కొన్ని సూచనలు కూడా చేశారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి 30 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి దానిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బాధితుల ఫిర్యాదులపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం తగదని, కచ్చితంగా జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. వ్యవస్థపై నమ్మకం కలగాలంటే కాల్‌సెంటర్‌కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే స్పందించడంతోపాటు సంబంధిత శాఖల అధికారులు కూడా వాటిని పరిష్కరించడంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ డీజీ కుమార విశ్వజిత్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్‌కుమార్‌రెడ్డి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణమూర్తి, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అవినీతి నిర్మూలనకు పలు చర్యలు పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. ప్రజలకు నేరుగా సత్వరమే పనులు జరిగేలా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను.. గ్రామాల్లో, పట్టణాల్లో వలంటీర్లను నియమించింది. ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసేందుకు జ్యుడీషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇసుక అక్రమాలపై 14500 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తప్పిదాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంది. ఇసుక అక్రమాలను అరికట్టడానికి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని తగ్గించడానికి అధ్యయనం, సిఫార్సుల కోసం ప్రతిష్టాత్మక మేనేజ్మెంట్ సంస్థ అహ్మదాబాద్ ఐఐఎంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
ఇసుక అక్రమ రవాణాకు జీపీఎస్‌తో 'చెక్'!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేయగా.. ఇసుకను వినియోగదారులకు చేరవేసే వాహనాలకు జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను తప్పనిసరి చేయనుంది. రీచ్ నుంచి ఇసుకను తీసుకెళ్తున్న వాహనం స్టాక్ పాయింట్‌కు వెళుతుందా? లేక పక్కదారి పట్టిందా? అనే వివరాలను ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసేందుకు వీలు కలగనుంది. జీపీఎస్‌ను తప్పనిసరిగా సోమవారం(25వ తేదీ) నుంచి అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జీపీఎస్ అమర్చుకోవాల్సిందే.. ‘‘ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్‌కు ఇసుకను తీసుకెళ్లే అన్ని వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చాలని ఆదేశాలు అందాయి. స్టాక్ పాయింట్ నుంచి బల్క్ ఆర్డర్లకు సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశాం’’ – మునిస్వామి, ఏపీఎండీసీ జిల్లా మేనేజర్, అనంతపురం జీపీఎస్‌తో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ నదుల్లో వరదలు తగ్గిపోవడంతో ప్రస్తుతం రీచ్‌ల్లో పూర్తిస్థాయిలో ఇసుక వెలికితీసేందుకు అవకాశం ఏర్పడింది. రీచ్ నుంచి వెలికితీసిన ఇసుకను మొదట స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నారు. ఏయే స్టాక్ యార్డు నుంచి ఏయే స్టాక్ పాయింట్‌కు ఇసుకను తరలించాలనేది అధికారులు నిర్ణయిస్తున్నారు. ప్రధానంగా దగ్గరలోని స్టాక్ పాయింట్లను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం ఇసుక యార్డు నుంచి ఇసుకను తీసుకెళ్లిన టిప్పర్లు నేరుగా స్టాక్ పాయింట్‌కు వెళుతున్నాయా? లేక పక్కదారి పడుతున్నాయా అనేదానిపై పర్యవేక్షణ నిరంతరం జరగడం లేదు. ఈ నేపథ్యంలో సదరు వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చడం ద్వారా ఎప్పటికప్పుడు దాన్ని ట్రాక్ చేసే వీలుంటుంది. రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను తీసుకెళ్లే వాహనాలను అమరావతిలోని కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. తద్వారా రీచ్‌లో వెలికితీసిన ఇసుక కచ్చితంగా స్టాక్ పాయింట్‌కు చేరనుంది. అంతేకాకుండా బల్క్ ఆర్డర్లకు ఇసుక సరఫరా చేసే వాహనాలకు కూడా జీపీఎస్ అమర్చడం ద్వారా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నేరుగా వినియోగదారుడికే ఇసుక చేరనుంది. -
ఇసుక మాఫియాకు చెక్
సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెట్టే దిశగా చర్యలు తీసుకుంటు న్నామని పంచాయతీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక మాఫియాను నియంత్రించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసేవారికి రూ.2 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష పడేలా చట్టాన్ని రూపొందిస్తున్నామన్నారు. ఇసు కకు ఎక్కడా కొరత లేదని, పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిందన్నారు. -
డిమాండ్‌కు మించి ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: నదుల్లో వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొరతను అధిగమించడం, మాఫియాను అరికట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం కావడంతో నిర్మాణ రంగ పనులు ఊపందుకున్నాయి.వచ్చే ఐదేళ్లకు సరిపడా ఇసుక మేటలు నదుల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. అక్రమ తవ్వకాలు, అధిక ధరలకు విక్రయం లాంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ జీవో జారీ చేసింది. నూతన విధానం నేపథ్యంలో ఈనెల 14నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాల సందర్భంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఇసుక కొరత పరిష్కారమై ప్రస్తుతం స్టాక్ యార్డుల నిండా నిల్వలున్నాయి. అధిక ధరలకు కళ్లెం రివర్స్ టెండర్ల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రేవుల నుంచి ఇసుక డిపోల దూరాన్ని బట్టి రవాణా చార్జీలను లెక్కించారు. ప్రాంతాలవారీగా ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రకటించారు. ఫలితంగా ప్రధాన నగరాల్లో ఇసుక ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఫుల్ ‘స్టాక్!’ ఇసుక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈనెల 14వ తేదీన 1.61 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులకు చేరింది. వారోత్సవాల ముగింపు రోజైన గురువారం ఏకంగా 2.82 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉండటం గమనార్హం. ఫిర్యాదుల కోసం 14500 అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా 35కిపైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టారు. తొలిరోజే లక్ష్యాన్ని అధిగమించి... రాష్ట్రంలో రోజువారీ ఇసుక డిమాండ్ గరిష్టంగా 80 వేల టన్నులు కాగా వారోత్సవాల మొదటి రోజే ఈ లక్ష్యాన్ని అధిగమించడం విశేషం. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు కొత్తగా 17 రీచ్‌లను ప్రారంభించారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు 12 పట్టా భూముల్లో అనుమతులు మంజూరు చేశారు. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని జలాశయాల్లో మేట వేసిన ఇసుకను వెలికి తీసేందుకు రెండు చోట్ల అనుమతులిచ్చారు. 13 జిల్లాల పరిధిలో అదనంగా 34 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
స్టాక్ యార్డుల్లో నిండుగా ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక స్టాక్ యార్డులు, డిపోలు నిండుగా ఇసుక రాశులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి ఇసుక సరఫరా భారీగా పెరిగింది. 20 రోజుల క్రితం వరకూ రోజుకు సగటున 22 వేల నుంచి 23 వేల టన్నుల దాకా ఉన్న ఇసుక సరఫరా బుధవారానికి ఏకంగా 2.66 లక్షల టన్నులకు పెరిగింది. ఈనెల 13వ తేదీన ఇసుక సరఫరా 1.44 లక్షల టన్నులు, బుకింగ్ 37,789 టన్నులు ఉండగా.. బుధవారానికి సరఫరా 2.66 లక్షల టన్నులకు, బుకింగ్ 67,806 టన్నులకు చేరింది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టడం, ప్రజలకు అవసరమైనంత ఇసుక అందజేయడమే లక్ష్యంగా నవంబరు 14వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం అయ్యాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. వినియోగదారులకు 56,499.5 టన్నుల ఇసుక ఇసుక వారోత్సవాలు ముగిసే సరికి ఇసుక సరఫరా లక్ష్యాన్ని రోజుకు సగటున రెండు లక్షల టన్నులకు చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించగా... అధికారులు కేవలం 48 గంటల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా రీచ్‌ల నుంచి 2.66 లక్షల టన్నుల ఇసుకను స్టాక్ యార్డులకు చేరవేయగా.. 67,806 టన్నుల ఇసుక బుకింగ్ అయింది. ఇదే సమయంలో 56,499.5 టన్నుల ఇసుకను స్టాక్ యార్డులు/స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారులకు పంపించారు. ఇవి సాధారణ వినియోగదారులకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. బల్క్ బుకింగ్ చేసుకున్న వారికి అందించిన ఇసుక దీనికి అదనమని సంబంధిత అధికారులు తెలిపారు. ఇసుక వారోత్సవాలు గురువారంతో ముగియనున్నాయని చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు నిఘాను పటిష్టం చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే స్టాక్ యార్డులు/రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని చెక్‌పోస్టుల వద్ద రాత్రిపూట కూడా పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సరిహద్దుల్లో ఇసుక అక్రమ రవాణాకు చెక్ ఏడుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చింతూరు (రంపచోడవరం): రాష్ట్రం నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 13 ఇసుక ర్యాంపులను అధికారులు గుర్తించారు. సరిహద్దుల వెంబడి ఏడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. ఆంధ్రా నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఇసుక అక్రమంగా తరలి వెళ్లకుండా చింతూరు మండలం చిడుమూరు సరిహద్దుల్లో, ఒడిశాకు తరలి వెళ్లకుండా చింతూరు మండలం కల్లేరులో చెక్‌పోస్టులు ఏర్పాటు కానున్నాయి. ఆంధ్రా నుంచి తెలంగాణకు అక్రమ రవాణాను అరికట్టేందుకు మేడువాయి, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, తునికిచెరువు, లక్ష్మీపురంలో చెక్‌పోస్టులు పెడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఈ నెల 24లోపు ఏడు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్ డీఈ మోహనరెడ్డి సాక్షికి తెలిపారు. -
ఇసుక అక్రమాల అడ్డుకట్టకు పకడ్బందీ చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటుపై సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, పోలీస్ తదితర శాఖల అధికారులతో మంగళవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆయా శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఎంపిక చేసిన ముఖ్య ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద వాహనాలను నిరంతరం తనిఖీలు చేయడంతో పాటు సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక రాష్ట్రందాటి వెళ్లకుండా చర్యలు తీసుకోవా లన్నారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్య దర్శి గోపాల కృష్ణ ద్వివేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ సురేంద్రబాబు, గనులశాఖ కార్యదర్శి రాంగోపాల్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ పాల్గొన్నారు. సచివాలయాల్లో ఉద్యోగాలను వేగంగా భర్తీ చేయండి గ్రామ, వార్డు సచివాలయాల్లో క్రీడా కోటా, ఇతర కేటగిరీల్లో భర్తీ కావాల్సిన పలు ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని అధికారు లను ఆదేశించారు. సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియపై ఆమె సమీక్షించారు. -
ఇసుక అక్రమాలపై నిఘా పెంపు
సాక్షి, అమరావతి: ఇసుక అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇసుక అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా, పరిమితికి మించి నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన శిక్షలు అమలు చేస్తామంటూ ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. తాజాగా ఇలాంటి అక్రమాలపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబరును కూడా అందుబాటులోకి తెచ్చింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ 14500 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రారంభించారు. ఈ నంబర్‌కు కాల్చేసి కాల్ సెంటర్ ఉద్యోగులతో సీఎం మాట్లాడారు. టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్‌చేసి ఫిర్యాదులు చేసేవారి నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలన్న అంశంపై కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం కొన్ని సూచనలు చేశారు. మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, టాస్‌్కఫోర్స్ చీఫ్ సురేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని టాస్క్‌ఫోర్స్ చీఫ్ సురేంద్రబాబును సీఎం ఆదేశించారు. ఎవరు తప్పు చేసినా తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు. వారోత్సవాలు విజయవంతం వరద తగ్గడంతో అవసరాల మేరకు ఇసుకను అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు సక్సెస్ అవుతున్నాయి. రోజువారీ ఉత్పత్తిని లక్ష టన్నుల నుంచి 2 లక్షల టన్నులకు పెంచాలన్న లక్ష్యాన్ని వారోత్సవాలు ప్రారంభమైన 48 గంటల్లోనే అధికారులు అధిగమించారు. వరదలు తగ్గుముఖం పట్టడం, ఉత్పత్తికి అనుగుణంగా రవాణాకు తగినన్ని వాహనాలను అందుబాటులోకి తేవడంతో ఇది సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే 2,03,387 టన్నుల ఇసుకను అందుబాటులోకి తేగా కేవలం 50,086 టన్నుల మేరకు మాత్రమే బుకింగ్‌లు వచ్చాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఆదివారం డిమాండ్ సగానికి తగ్గిపోయిందని వివరించారు. ఇక నుంచి రోజుకు సగటున 40వేల టన్నుల మేరకు ఇసుక డిమాండు ఉంటుందని భావిస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. -
ఇసుకాసురులే రోడ్డెక్కారు..
సాక్షి, తిరుపతి: దొంగే.. దొంగ దొంగ అన్న చందంగా టీడీపీ హయాంలో ఇసుక మాఫియాను నడిపిన వ్యక్తులే నేడు ఇసుక కొరతంటూ ఆందోళనకు దిగటం చర్చనీయాంశమైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమరవాణాను అరికట్టండి మహాప్రభో అంటూ ఇసుకాసురులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న 16 మంది ప్రాణాలు పోవటానికి కారకులైన వ్యక్తులు నేడు ఇసుక సమస్యపై ధర్నా చేయటం స్థానికులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ నాయకులతో కలిసి శనివారం చిత్తూరు జిల్లా ఏర్పేడులో రోడ్డుపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఏర్పేడు మండలం గోవిందవరం–మునగళపాలెం స్వర్ణముఖి నది నుంచి ఇసుకను స్థానిక టీడీపీ నాయకులు మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు, నాగరాజునాయుడు, చిరంజీవులునాయుడు విచ్చలవిడిగా తవ్వి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకునేవారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని స్థానికులు పలుమార్లు అడ్డుకున్నారు. అయినా టీడీపీ నాయకులు లెక్కచెయ్యలేదు. దీంతో రెవిన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చెయ్యాలని మునగళపాలెం, గోవిందవరం పరిసర ప్రాంతాలకు చెందిన వారు మూకుమ్మడిగా 2017 ఏప్రిల్ 21న ట్రాక్టర్లలో ఏర్పేడుకు చేరుకున్నారు. రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఆ సమయంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న లారీ వారిపై దూసుకెళ్లింది. 16 మంది మృతి చెందారు. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారి వల్లే ఇది జరగడంతో టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తర్వాత వారు బెయిల్‌పై వచ్చారు. ఇసుకాసురులే ధర్నా: టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఇసుక కొరతపై ధర్నా చేపట్టారు. ఏర్పేడులో చేపట్టిన ధర్నాలో 16 మంది ప్రాణాలు కోల్పోవటానికి ప్రధాన కారకులైన మాజీ జడ్పీటీసీ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో నాగరాజు నాయుడు, చిరంజీవులు ముందు నిలబడ్డారు. అప్పట్లో ఇసుకను యధేచ్ఛగా తోడేసిన వారే ఈ ధర్నాలో పాల్గొనడంపై స్థానికులు విస్తుపోయారు. -
టీడీపీ నేతల వింత నాటకాలు
అధికారంలో ఉన్నంత కాలం ఇసుకను మింగేసి, వేల కోట్లు ఆర్జించిన టీడీపీ నేతలే ఈ రోజు ఇసుక కోసం వింత నాటకాలు, కొంగ జపాలు చేస్తున్నారు. ఐదేళ్లపాటు నదులు, వాగులు, వంకలను గుల్ల చేసేసి రూ.3 వేల కోట్లకు పైగా దోచుకుని... ఇప్పుడేమో ఇసుక దోపిడీకి గురువుతుందని ఎదురుదాడికి దిగుతున్నారు. టీడీపీ హయాంలో ఎంత ఇసుకను దోచుకున్నారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. రాత్రి, పగలని చూడకుండా వేలాది లారీలతో ఇసుక తరలించిన సందర్భాలు కళ్లారా చూశారు. ఆ రకంగా దోపిడీకి గురి కాకూడదని, తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందిస్తే తట్టుకోలేకపోతున్నారు. వరదల కారణంగా చేరిన నీటితో ఇసుకను తీయలేని పరిస్థితులను కూడా రాజకీయంగా వాడుకుని తమ అనుభవాలను ఎదుటి వారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ∙ సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయతోపాటు కాలువలు, వాగులను సైతం తవ్వేసి ఇసుకలో సైతం తైలం తీయవచ్చని టీడీపీ నేతలు నిరూపించారు. గత ఐదేళ్ల కాలంలో నీటి వనరులన్నీ ధ్వంసమైపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి బక్కచిక్కిపోయాయి. టీడీపీ నాయకులు మాఫియాగా తయారై ఇసుకను దోచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానం సామాన్యులకు ఉపయోగపడలేదు గాని టీడీపీ నేతలకు మాత్రం వందల కోట్లు కురిపించింది. ఇసుక ర్యాంపుల ద్వారా దోచుకున్నదెవరంటే టీడీపీ నాయకుల వైపు ప్రజల వేళ్లు చూపిస్తాయి. జిల్లా శాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలున్నా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేశారు. వంతెనలకు, ఇరిగేషన్ పంపులు, వాటర్ ఫిల్టర్ సంపులకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాలు వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలను వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోయారు. రీచ్‌ల వద్ద లారీకి రూ.20 వేలు, 30 వేలు వసూలు చేశారు. ఉల్లం‘ఘనుడు’ అచ్చెన్న మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు దందా అంతా ఇంతా కాదు. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం దగ్గరి నుంచి రోజుకు వందలాది లారీల ద్వారా విశాఖకు ఇసుక తరలించారు. శ్రీకాకుళం కొత్త రోడ్డు నుంచి మడపాం బ్రిడ్జి వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 3 వరకు స్టాక్ పెట్టుకుని రోజుకు నాలుగైదు వందల లారీల ద్వారా తరలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో అచ్చెన్నాయుడు అనుచరులు దందా చేశారన్న వాదనలు ఉన్నాయి. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా నడిచిన ర్యాంపులకు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లను బిగ్బాస్లనేవారు. ఇక, శ్రీకాకుళం రూరల్ బట్టేరు వద్ద అయితే ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు గ్రామ రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. కల్లేపల్లి, భైరీ ర్యాంపుల్లో టీడీపీ నేతల ఆగడాలు తెలిసిందే. అతని కంటే ఘనుడు కూన ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న వంశధార, నాగావళి నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధువులు, అనుచరగణం పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పోతయ్యవలస ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే లారీలు రాకపోకలు సాధించాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు వద్ద ఇసుక కోసం వందల సంఖ్యలో లారీలు బారులు తీరిన సందర్భాలుండేవి. ఆమదాలవలస మండలం దూసి రైల్వే వంతెన సమీపంలో నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన దాఖలాలున్నాయి. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ఇసుక ర్యాంపు కూన రవికుమార్‌కు బంగారు గని మాదిరిగా ఉపయోగపడిందని అప్పట్లో కోడై కూసింది. 90 రోజుల కాలంలో రూ.10 కోట్ల వరకు ఆర్జించారని అప్పట్లో విపరీతమైన చర్చ నడిచింది. చివరికీ పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోనైతే 25 లారీలతో పాటు నాలుగు జేసీబీలు వరద పోటుకు మునిగిపోయాయి. డ్రైవర్లు, క్లీనర్లు వరదల్లో చిక్కుకున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తవ్వకాలు చేస్తుండగా వరద ముంపునకు గురయ్యారు. ఆ వాహనాలన్నీ కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ ప్రధాన అనుచరులవే అన్నది అందరికీ తెలిసిందే. పొందూరు మండలం సింగూరు పేరుతో అనుమతులు ఇచ్చిన ర్యాంపును చూపించి నాగావళికి అవతల ఇసుక తవ్వేసి దూసి గ్రామం మీదుగా అక్రమ రవాణా చేయించారు. ఆమదాలవలస మండలంలోని నిమ్మ తొర్లాడ, జీకేవలస, కొత్తవలస, దూసిపేట, ముద్దాడపేట, తొగరాం, గోపినగర్ ప్రాంతాల్లో కూడా ఇసుకను అక్రమంగా దోచుకున్నారు. విశాఖ అవసరాల పేరుతో ఇసుక మాఫియాను ప్రోత్సహించి, పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు భారీగా వసూళ్లు చేశారన్న వాదనలు ఉన్నాయి. నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాల్లో వంశధార నదికి ఆనుకుని ఉన్న ఇసుక టీడీపీ నేతలకు బంగారు బాతులా ఉపయోగపడింది. నరసన్నపేట మండలం లుకలాంలో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుకను గుర్తించి 2016లో నాటి ఆర్డీవో దయానిధి, డీఎస్పీ భార్గవనాయుడు, అప్పటి మైన్స్ ఏడీలు లుకలాం మాజీ సర్పంచ్ సూర్యనారాయణపై కేసు నమోదు చేసేందుకు యత్నించగా, నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అడ్డుకుని ఇసుకాసురులకు కాపు కాశారు. గోపాలపెంట, మడపాంలో జన్మభూమి కమిటీ సభ్యులు, నాటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున దందా నడిపారు. గోపాలపెంట, మడపాం, చేనులవలస, బుచ్చిపేటలో అనధికారిక ర్యాంపు నిర్వహించి బగ్గు రమణమూర్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందారన్న ఆరోపణలొచ్చాయి. పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న వంశధార, మహేంద్ర తనయ నదుల నుంచి ఇసుక వ్యాపారం యథేచ్ఛగా సాగింది. వరదల కారణంగా వంశధారలో మేట వేసిన పొనుటూరు, మాతల వద్ద నాటి ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే. పొలాల్లోని ఇసుక తొలగించి అమ్ముకునేందుకు అనుమతి కావాలని రైతుల పేరుతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవడం, అధికారం అండతో అనుమతులు పొంది పొలాల్లోని మేటను వదిలేసి ఇసుకను అక్రమగా తోడేసిన దాఖలాలు ఉన్నాయి. వంశధార రిజర్వాయర్ నిర్మాణ అవసరాల పేరిట హిరమండలంలోని భగీరథపురం, పిండ్రువాడ, అక్కరాపల్లి, అంబావలి, రుగడ కొమనాపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుకను బహిరంగంగా తరలించారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో తమ్మినాయుడుపేట, ముద్దాడ పేట, పొన్నాడలో అనధికార ఇసుక ర్యాంపులు నడిచాయి. నాటి జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నాటి మంత్రి కళా వెంకటరావు మధ్య వివాదం కూడా నడిచింది. ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నేతలు గొడవకు దిగిన దాఖలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారు. బాహుదా నదిలో నిషేధిత ప్రాంతాలన్నింటిలోనూ ఇసుకను ట్రాక్టర్లతో తరలించారు. రోజుకు సగటున 1000 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలించారు. ట్రాక్టర్లతో తరలించిన ఇసుకను దూరంగా మైదాన స్థలాల్లో పోగేసి, అక్కడ నుంచి జేసీబీ సాయంతో లారీల్లో లోడ్ చేయించి, వివిధ ప్రాంతాలకు అమ్మకాలు సాగించారు. ఇచ్ఛాపురం పట్టణ సరిహద్దులో బ్రిడ్జితోపాటు ఇటు ఈదుపురం నుంచి అటు బొడ్డబడ వరకు నదీ తర గ్రామాలన్నింటిలోనూ తవ్వకాలు చేపట్టారు. ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అండదండలతో, కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. టీడీపీ రాక ముందు... అధికారంలోకి వచ్చాక... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజి వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరేజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.50 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను స్థానిక సంస్థల మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు పెట్టేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ ప్రతీ రోజూ వేలాది లారీలు, ట్రాక్టర్ల ద్వారా అటు ఒడిశా, ఇటు విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా సాగించాయి. -
ఇసుకపై చంద్రబాబు దగుల్బాజీ రాజకీయాలు
-
నాడు దోపిడీ..నేడు దీక్షలు..
-
పచ్చ గద్దలు: కృత్రిమ కొరతంటూ వికృత ఆరోపణలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల కారణంగా నెలకొన్న తాత్కాలిక ఇసుక కొరత సమస్యను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీతో ఉన్న అవగాహన మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా లాంగ్ మార్చ్ అంటూ ఆరోపణలకు దిగుతున్నారు. మరికొద్దిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఇసుక సమస్యే ఉండదని ప్రభుత్వం చెప్తోంది. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం బురద రాజకీయాలకు పాల్పడ్డం దారుణమని సర్కార్ ఆక్షేపిస్తోంది. ఐదేళ్ల టీడీపీ పాలనలో వర్షాలు లేక, వరదలు రాక ఆంధ్రప్రదేశ్‌లో కరువు కరాళనృత్యం చేసింది. నదులన్నీ జలకళ కోల్పోయాయి. నీళ్లులేక ఎడారులుగా మారిన నదులపై టీడీపీ అగ్రనేతలు కన్నేశారు. నిబంధనలకు నీళ్ళొదిలేసి.. టీడీపీ నేతలు ఇసుక రీచ్‌లను పంచుకున్నారు. ఇసుక సామ్రాజ్యాన్ని స్థాపించుకొన్నారు. యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టి కోట్లకు పడగలెత్తారు. అడ్డగోలు దందాను అడ్డుకొన్న అధికారులపై ఒంటికాలుమీద లేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాక్షాత్తు టీడీపీ శాసనసభ్యుడే మహిళా తాహశీల్దార్ వనజాక్షిపై దాడిచేసాడు. మహిళా అధికారి అని కూడా చూడకుండా జుట్టు పట్టుకుని కాలితో కడుపులో తన్నాడు. నా అడ్డాలోకే వస్తావా అంటూ రాయలేని భాషలో దుర్భాషలాడాడు. ఇసుక కాసులకోసం పసుపు తమ్ముళ్ల బరితెగింపు బజారునపడ్డా అధినేత చంద్రబాబు చలించలేదు. పైగా ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు లేకుండా రాజీ కుదిర్చి అధికారుల నోళ్లు మూయించారు. దాంతో తెలుగు తమ్ముళ్లు మరింత రెచ్చిపోయారు. ఇసుకను యథేచ్ఛగా రాష్ట్ర సరిహద్దులు దాటించారు. ఇసుక డిమాండ్ ఉన్న బెంగళూరు, చెన్నై నగరాలకు తరలించి సొమ్ముచేసుకొన్నారు. ఇంత దారుణంగా మహిళా అధికారిపై దాడి జరిగితే పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపలేదు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కూడా ఆయనకు అనిపించలేదు. ఇరవై ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక స్మగ్లర్లుగా మారి దొంగ వ్యాపారం చేశారు. రాజధాని నడిబొడ్డులో చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో నదీపరీవాహక చట్టాలకు తూట్లు పొడిచారు. డ్రెడ్జర్ల ద్వారా నదిలోని ఇసుక తోడి అమరావతి నిర్మాణాలకంటూ కవరింగ్ ఇచ్చారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇసుక అక్రమ తవ్వకాల గురించి అస్సలు పట్టించుకోలేదు. టీడీపీ ఇసుకాసురులకు చెక్ పెట్టాలని భావించి పర్యావరణహితం కోరే ఓ సామాజికవేత్త జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. దాంతో విచారణ చేసిన గ్రీన్ ట్రిబ్యునల్ చంద్రబాబు ప్రభుత్వానికి వందకోట్ల జరిమానా విధించింది. ఇప్పటికీ ఈ వివాదం చంద్రబాబు మెడకు చుట్టుకొనే ఉంది. టీడీపీ నేతలు సృష్టించిన ఇసుక సామ్రాజ్యానికి అండగా నిలిచిన చంద్రబాబు ఇప్పుడు నీతులు వల్లించటం దెయ్యాలు వేదాలు వళ్లించటమేనని అధికారపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇసుక మాఫియా ఆగడాల పాపం పండటంతోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీని పక్కన పెట్టారు. టీడీపీకి కేవలం 23 స్థానాలు దక్కాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పట్టంకట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే పదేళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురిశాయి. నదులన్నీ జలకళతో మెరిశాయి. చెరువులకు సమృద్ధిగా నీరు రావటంతో నిండు కుండల్ని తలపిస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వ్యవసాయానికి పుష్కలంగా సాగునీరు అందుతోంది. నీటి చుక్కకోసం ఐదేళ్లు ఎదురుచూసిన నేలతల్లి ఇప్పుడు పులకరించిపోతోంది. పల్లెల్లో ప్రశాంతత నెలకొంది. అదే సమయంలో నదుల్లో వరద ప్రవాహం ధాటికి ఇసుక తవ్వకాలకు వీలుపడని పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగానే ఇసుక కొరత నెలకొంది. ఇపుడీ కొరతనే భూతద్దంలో చూపించి రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు చంద్రబాబు. వర్షాలు, వరదలు కొనసాగుతుండటంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల మాత్రమే కొత్త రీచ్‌లు ప్రారంభించారు. కొంతమేర ఇసుక సేకరించి నిర్మాణ పనులకు అప్పగించారు. అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్ష ప్రభావం పెరిగి ఇసుక సేకరణ పూర్తిగా నిలిచిపోయింది. తమ ఇసుక దందాకు చెక్ పెట్టేలా కొత్త పాలసీ తెచ్చారన్న అక్కసుతో పచ్చనేతలు ఇసుకను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ప్రకృతి వల్ల ఇసుక కొరత ఏర్పడితే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారంటూ వికృత ఆరోపణలు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆందోళనలు చేసినా భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారు. మహిళా అధికారిపై దాడి చేసిన ఇసుకాసురుడిని జైలుకెళ్లి కలిసొచ్చిన చినబాబు లోకేష్ ఇసుక సమస్యపై తాను పరాజయం పాలైన మంగళగిరిలో వీధినాటకాన్ని రక్తి కట్టించారు. విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేత లాంగ్ మార్చ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబే ప్లాన్ చేశారు. వరదలు తగ్గతే ఇసుక వారోత్సవాలు నిర్వహించి ఇసుక కొరత లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరదల కారణంగానూ నదుల్లో విపరీతమైన ప్రవాహాల కారణంగానూ తాత్కాలికంగా ఇసుక కొరత ఉన్న విషయం వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరిస్తోంది. కొద్దిరోజుల్లోనే ఈ సమస్య శాస్వతంగా పరిష్కారం అవుతుందని భరోసా ఇస్తోంది కూడా. ఈ లోపే టీడీపీ-జనసేన పార్టనర్షిప్ సమ్మిట్‌లా లాంగ్ మార్చ్ కు స్కెచ్ గీశాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలంటున్నారు. -
పచ్చ గద్దలు..!
-
పచ్చ మాయ
-
బాబు పాలనంతా ఇసుక దోపిడీ!
-
ఇసుక కోసం దీక్ష చేయడం హాస్యాస్పదం
-
ఐదేళ్లలో ఇసుకను దోచేశారు
-
ఇసుకతో పార్టీల విషరాజకీయం
-
ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం
సాక్షి, అమరావతి: ఇసుక బుకింగ్ మాటున కొందరు సాగిస్తున్న ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెట్టింది. ఇసుక అక్రమార్కులపై కొరడా ఝుళిపించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోసపూరిత మార్గాలను అనుసరించిన వ్యక్తుల నుంచి ఇసుకను, వాహనాలను స్వాదీనం చేసుకుని వారిపై క్రిమినల్ కేసులు బనాయించింది. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా పూర్తి పారదర్శకంగా ఇసుకను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించిన విషయం విదితమే. అయితే, కొందరు దళారులు అక్రమార్జనే లక్ష్యంగా వేర్వేరు వ్యక్తులు, చిరునామాలతో ఐడీలు సృష్టించి పెద్ద పరిమాణంలో ఇసుక బుక్ చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో ఇసుక లోడుతో వెళ్లే వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. ఇసుక బుకింగ్‌లో అక్రమాలు సాగుతున్న వైనం బట్టబయలైంది. తప్పుడు ఐడీల స్కాన్ కాపీ - గుంటూరుకు చెందిన బి.కిషోర్ అనే వ్యక్తి వేర్వేరు పేర్లతో గుంటూరులోని వేర్వేరు చిరునామాలతో, వేర్వేరు ఐడీ నంబర్లతో ఆన్లైన్ ద్వారా రూ.1.27 లక్షల విలువైన ఇసుక బల్క్ బుకింగ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను సీజ్ చేసి అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. - కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. బినామీ పేర్లతో రూ.3.80 లక్షల విలువైన ఇసుకను అతడు ఆన్లైన్లో బుక్ చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. మీ–సేవ కేంద్రం ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మక్కై ఈ మోసాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించి క్రిమినల్ కేసు నమోదు చేశారు. దొరికిందిలా.. సబ్ ఇన్స్పెక్టర్ వాసిరెడ్డి శ్రీను సిబ్బందితో కలిసి గన్నవరంలోని కొనాయి చెరువు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీని రోడ్డు పక్కన నిలిపేసి డ్రైవర్, క్లీనర్ పారిపోయే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు అంగీకరించారు. గన్నవరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన బొజ్జగాని వీరాస్వామి, దావాజీగూడెంలోని మసీదు ఎదురుగా ఉన్న ‘మీసేవ’ సెంటర్ ఆపరేటర్ సింగలపల్లి దుర్గారావు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఐపీ నంబర్లు సృష్టించి ఇసుక బుక్ చేసుకుని లారీలు, ట్రాక్టర్లలో తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నారని డ్రైవర్, క్లీనర్ అంగీకరించారు. ‘మీసేవ’ ఆపరేటర్ దుర్గారావును అదుపులోకి తీసుకుని విచారించగా అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఇసుకను మోసపూరితంగా బుకింగ్ చేసినందుకు బ్రోకర్లు, లారీ యజమానుల నుంచి దుర్గారావు రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకు వసూలు చేసినట్లుగా తేలింది. -
ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా..!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో నూతన ఇసుక పాలసీ ద్వారా పారదర్శకంగా వినియోగదారులకు ఇసుకను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని కొందరు ఆన్ లైన్ మోసం ద్వారా పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు. ఆన్లైన్ లో బల్క్ బుకింగ్‌లలో పలువురు బ్రోకర్లు వేర్వేరు అడ్రస్‌లతో ఇసుకను బుక్ చేస్తూ.. అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా నకిలీ ఐడిలతో ఇసుకను బుకింగ్ చేస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం దృష్టిసారించింది. దీనిపై పోలీస్, మైనింగ్ అధికారులు జరిపిన విచారణలో గుంటూరు కేంద్రంగా కిషోర్ అనే వ్యక్తి ఆన్లైన్లో ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడయ్యింది. సుమారు రూ.1.27 లక్షల విలువైన ఇసుకను కిషోర్ నకిలీ ఐడిలతో బుక్ చేసినట్లు గుర్తించారు. అక్రమంగా తరలించేందుకు సిద్దం చేసిన 27 టన్నుల ఇసుకను, 7 ట్రాక్టర్లను మైనింగ్ అధికారులు సీజ్ చేశారు. అలాగే గన్నవరంకు చెందిన దుర్గారావు అనే వ్యక్తిని కూడా గుర్తించారు. బినామీ పేర్లతో రూ. 3.80 లక్షల విలువైన ఇసుకను దుర్గారావు ఆన్లైన్లో బుక్ చేశారు. మీసేవ ఆపరేటర్‌గా పనిచేస్తున్న దుర్గారావు బ్రోకర్లతో కుమ్మకై ఈ మేరకు మోసానికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. దీనిపై కిషోర్, దుర్గారావులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆన్లైన్ ద్వారా వస్తున్న దరఖాస్తులకు సంబంధించి ఐపీ అడ్రస్‌లను గుర్తించడం ద్వారా ఇటువంటి మోసాలకు చెక్ పెట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. -
కొత్త తరహా దందాకు తెరలేపిన ఇసుకాసురులు
సాక్షి, మునుగోడు: ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. చట్టాలు, విధానాల్లోని లొసుగులను ఆసరగా చేసుకుని ఇసుక వ్యాపారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమ దందాను దర్జాగా సాగిస్తున్నారు. ఇటీవల మునుగోడు మండలంలో కొంపెల్లికి చెందిన ఓ వ్యాపారి, నారాయణపురం మండలానికి చెందిన మరో వ్యాపారి బినామీల పేరిట ఇసుకను బుకింగ్ చేసుకుని రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడడంతో దందా వెలుగులోకి వచ్చింది. సాండ్ టాక్స్ విధానంతో.. ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఏడాది క్రితం సాండ్ టాక్స్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విధానాన్ని అధికారులు పకడ్బందీగా అమలు చేయడంతో ఇసుకాసురుల ఆటలు సాగలేదు. ఈ విధానంలో ఇసుక అవసరమైన వ్యక్తులు ఆన్లైన్లో బుక్‌చేసుకుని డబ్బులు చెల్లిస్తే.. ఇసుక రవాణాచేసే ట్రాక్టర్ నంబర్‌తో పాటు ఓటీపీ నంబర్ ఆ వ్యక్తి సెల్‌కు మేసేజ్ వస్తుంది. వచ్చిన ఇసుకని అన్‌లోడు చేయించుకున్న వ్యక్తి ఆ ఓటీపీ నంబర్ ట్రాక్టర్ యజమానికి ఇస్తే దానిని ఆయన ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ట్రాక్టర్ రవాణా చార్జి ఆన్లైన్లో చెల్లిస్తారు.అయితే ఇలా జిల్లా వ్యాప్తంగా కొనసాగిస్తుండడంతో కొంత కా లంగా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. బినామీ పేర్లతో.. సాధారణంగా ఇసుక అవసరమైన వారు మాత్ర మే సాండ్‌టాక్స్ పద్ధతిన ఆన్లైన్లో బుక్ చేసుకుని డబ్బులు చెల్లిస్తారు. కానీ మునుగోడు మం డలంలోని వ్యాపారులు ఇసుక అవసరం లేని వారి పేరు మీద ఆన్లైన్ బుక్ చేసి డబ్బులు చెల్లిస్తున్నారు. వచ్చిన ఇసుకను గ్రామ శివార్లలో ఎనిమిది ట్రాక్టర్ల చొప్పున డంప్ చేసి రాత్రి వేళల్లో జేసీబీల సహాయంతో లారీల్లో లోడ్ చేసుకుని దర్జాగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో ఉదయం సమయంలో అధికారికంగా అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లని అడ్డుకునే నాథుడే కరువయ్యాడు. ఇసుక ధరకు రెక్కలు ప్రస్తుతం వర్షాలు సంవృద్ధిగా కురిసి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక తోడే పరిస్థితి లేదు. ప్రధానంగా కాళేశ్వరంలో ఇసుక తోడేందుకు ఇబ్బం దిగా మారండంతో ఒక్కో లారీకి నెలలో ఒకటి రెండు ట్రిప్పులు మాత్రమే అవకాశం వస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇసుక ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో టన్ను ఇసుక రూ. 1300కు విక్రయించగా ప్రస్తుతం రూ.1800ల నుంచి రూ.2500ల వరకు అమ్ముతున్నారు. ఒక్కో లారీ ఇసుకకు రూ. 30వేలకు పైనే ఆదాయం హైదరబాద్‌కు కేవలం 70 కిలో మీటర్ల దూరంలో మునుగోడు, నారమణపురం మండలాల నుంచి ఇసుక రవాణాచేస్తే లారీ యజమానులకు రావాణా భారం తగ్గుతుంది. అయితే ఆ రవాణా ఖర్చుల కింద సాండ్ టాక్స్ ద్వారా తమ డంపింగ్ కేంద్రాల వద్ద ఇసుక పోస్తున్న ట్రాక్టర్ యజమానులకు ట్రిప్పుకు అదనంగా రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. ఒక లారీలో 32 టన్నులు ఇసుక లోడు చేసేందుకు 8 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుంది. అయితే ఆ ట్రాక్టర్‌కు రూ. సాండ్ టాక్స్ ఒక్కోక ట్రాక్టర్‌కు రూ. రూ.2,400లకు లభిస్తుండగా రూ. 19,200లకు లోడు అవుతుంది. అలా డంప్‌లో ఇసుక పొసిన ట్రాక్టర్స్కి వ్యాపారులు రూ. 1000 చెల్లించగా వారికి రూ. 2,7200 ఇసుక రావడంతో పాటు డీజిల్ ఖర్చు రూ.5వేలతో మొత్తం 32 టన్నుల ఇసుక హైదరబాద్‌కు తరిలిపొతోంది. ఆ ఇసుకని రూ.2వేల చొప్పున విక్రయించినా దాదాపు రూ. 64 వేలు రాగా అందులో ఖర్చులు పోను రూ.30వేలపైనే ఆదాయం వస్తోంది. మండలం లో 20 రోజులుగా రోజుకు 10 లారీల చొప్పున ఇసుకను హైదరాబాద్‌కు రవాణా చేస్తూ ఇసుకాసురులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా చేస్తేనే.. సాండ్ టాక్స్ విధానంలో కొన్ని నిబంధనలు పెడితేనే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా గతంలో ఇసుక అవసరం ఉన్న వ్యక్తి ఫోన్ నంబర్‌తో పాటు ఆధార్‌కార్డును కూడా అప్లోడ్ చేసిన తర్వాతే బుకింగ్ చేసుకునే వారు. కొంతకాలంగా ఆధార్ కార్డు లేకున్నా కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా బుక్ చేసుకున్న వ్యక్తికి రోజుకు 5 ట్రాక్టర్ల చొప్పున ఇసుకను రవాణా చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఇసుకాసురులకు వరంగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్న సాండ్ టాక్స్ విధానంలో ఇసుక అవసరం ఉన్న వ్యక్తి ఆధార్‌కార్డుతో పాటు సదరు వ్యక్తి ఇంటి నిర్మాణం చేపడుతున్నాడా లేదా అని సంబంధిత అధికారి ధ్రువీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేసే విధంగా షరతు విధిస్తే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ట్రాక్టర్ యజమానులను మచ్చిక చేసుకుని.. ప్రస్తుతం మండలంలోని కొరటికల్ గ్రామ వాగు నుంచి సాండ్‌టాక్స్ విధానంతో ఇసుక రవాణా జరుగుతోంది. అయితే ఆ వాగు నుంచి ఇసుక రవాణాచేసే ట్రాక్టర్ యజమానులను వ్యాపారులు మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. బినామీ పేర్లతో బుక్ చేసుకున్న వ్యాపారులు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ యజమానులకు అదనంగా కొంత డబ్బు చెల్లించి మండలంలోని కొంపల్లి, చల్మెడ, వెల్మకన్నె, కల్వ కుంట్ల, గూడపూర్ గ్రామాల్లోని నిర్మానుష్య ప్రదేశాల్లో ఇసుకని డంప్ చేసి అక్రమ రవా ణాకు పాల్పడుతున్నారు. ఇలా 20 రోజులుగా ప్రతి రోజు దాదాపు 10 లారీల్లో ఇసుకను హైదరాబాద్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలుతీసుకుంటున్నాం. ఇటీవ దాడులు నిర్వహించగా మూడు ట్రాక్టర్లు ప ట్టుబడ్డాయి. వాటిపై వాల్టా కేసులు నమో దు చేశాం. అంతేకాకుండా అందుకు సహకరించిన వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేశాం. ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి రోజు ట్రాక్టర్లను తనిఖీలు చేస్తాం. – రజినీకర్, ఎస్ఐ, మునుగోడు సాండ్ టాక్స్‌ని రద్దు చేయాలి సాండ్ టాక్స్ ద్వారా మండలంలోని వాగు నుంచి ఇసుక అక్రమంగా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. సాండ్ టాక్స్‌ని రద్దు చేసి కేవలం స్థానిక అవసరాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. లేదంటే ఇసుక వాగులు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. – చాపల శ్రీను, సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు -
వచ్చే 60 రోజుల్లో మార్పు కనిపించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులు ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా మంగళవారం సీఎం వైఎస్ జగన్ కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరతను తీర్చడానికి సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రవాణ చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని అన్నారు. సమీక్షలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఓపెన్ చేయండి. జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలి. ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలి. వరదలు తగ్గాయి, ఇసుక లభ్యత ఉంది. తక్కువ రేట్లకు అందించాలి. వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలి. ప్రతి జిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలి. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలి. దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలి. ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలి. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిపెట్టాలి. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనునమతించరాదు. గత ప్రభుత్వానికీ, ఇప్పటి ప్రభుత్వానికీ తేడా కచ్చితంగా కనిపించాలి. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదు. ఈ విషయంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాను. మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచండి’ అని పేర్కొన్నారు. మంచి మైలురాయి అందుకున్నట్టే.. అక్టోబరు 2న (రేపు) గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం అవుతున్నాయి. డిసెంబర్ 1 నాటికి గ్రామ సచివాలయాలు పనిచేయడం ప్రారంభం కావాలి. నవంబర్ నెలాఖరు నాటికి అన్ని సదుపాయాలు గ్రామ సచివాలయాలకు అందుతాయి. ఈలోగా గ్రామ సచివాలయాల కార్యాలయాలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలి. గ్రామ వాలంటీర్లకు అందించే స్మార్ట్ఫోన్లతో సహా కంప్యూటర్లు ఇతరత్రా సదుపాయలన్నీ గ్రామ సచివాలయాలకు చేరాలి. ఏవైనా లోపాలు ఉంటే.. వాటిని డిసెంబరులో సరిదిద్దుకోవాలి. జనవరి నుంచి దాదాపు 500 రకాలకు పైగా సేవలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పౌరులకు అందాలి. వివిధ పథకాల లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో బోర్డులపై పెట్టాలి. జనవరి 1 నుంచి అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలి. ఈ మేరకు కార్యాచరణ సిద్ధంచేయాలి. గ్రామ సచివాలయాలు జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలుపెట్టాక ప్రతిరోజూ స్పందన కార్యక్రమం చేపట్టాలి. 72 గంటల్లోగా రేషన్‌కార్డు, పెన్షన్లు లాంటి సేవలు అందాలి. వివక్ష, పక్షపాతం లేకుండా, లంచాలు లేకుండా ప్రజలకు సేవలందాలి. ఇది జరిగితే.. ఒక మంచి మైలురాయిని మనం అందుకున్నట్టే. దీనికి సంబంధించిన యంత్రాంగం గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్లకు, శాఖాధిపతులకు అనుసంధానం ఉండాలి. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందో లేదో నాకు తెలియదు. గ్రామాల వారీగా, వార్డుల వారీగా పరిపాలనలో ఇది విప్లవాత్మక మార్పు. కలెక్టర్లు, అధికారులు పూర్తిస్థాయిలో ధ్యాసపెట్టాల్సిన అవసరం ఉంది. తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు.. ఇతర. అధికారులతో మాట్లాడినప్పుడు.. ఈ అంశాలను వారికి వివరించండి’ అని సూచించారు. -
దోపిడీ చేసిన వారే రాళ్లేస్తున్నారు
సాక్షి, అమరావతి: మొన్నటి వరకూ ఇసుక దందా ద్వారా దోచుకున్న వారే ఇప్పుడు ప్రభుత్వంపై రాళ్లేయాలని చూస్తున్నారని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారే విమర్శలు చేస్తున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విమర్శలకు అవకాశం లేని విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇసుకపై సచివాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై అధికారులకు ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా స్టాక్ యార్డులు పెంచాలని, వరద తగ్గిన వెంటనే రీచ్‌ల నుంచి వీలైనంత త్వరగా స్టాక్ యార్డులకు ఇసుక చేరవేసి ప్రజలకు అందించేందుకు సర్వసన్నద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. ఇసుక మాఫియాకు ఏమాత్రం అవకాశం లేకుండా చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించాలన్నారు. సీసీ కెమెరాలు, జీపీఎస్ విధానం ఇందుకు బాగా ఉపకరిస్తాయని చెప్పారు. కొత్తవిధానం అమలు ప్రారంభించిన వెంటనే వరదలతో రీచ్‌లు మునగడంవల్ల ప్రారంభంలో కొన్ని సమస్యలు ఉంటాయని, ఆ సమస్యలను త్వరితగతిన అధిగమించి ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ వరదలవల్ల వచ్చిన విరామ సమయాన్ని పరిస్థితులను సరిదిద్దుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని ఉద్బోధించారు. ఏ స్థాయిలో కూడా అవినీతికి ఏమాత్రం అవకాశం ఉండరాదన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం ఉన్నా సరిదిద్దుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎవరు ఎక్కడ ఇసుక అక్రమ తరలింపు, తవ్వకాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని, మాఫియాపై ఉక్కుపాదం మోపాలని చెప్పారు. నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇసుకకు కొరత ఉందో ఆయా ప్రాంతాల్లో నిర్మాణదారులకు సమాచారం ఇవ్వాలని సీఎం జగన్ సూచించారు. ఎప్పటినుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందనే విషయాన్ని కూడా ముందస్తుగా తెలియజేస్తే నిర్మాణదారులు తదనుగుణంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి అన్ని చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్టాలని, మోసం జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలని ఆదేశించారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు వరదల కారణంగా ఇసుక తవ్వడానికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని అధికారులు చెప్పారు. మొత్తం 102 రీచ్‌లకుగాను 25 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుకను తీయగలుగుతున్నామని వివరించారు. తవ్వి నదుల పక్కన పోసిన ఇసుక వరదల కారణంగా కొట్టుకుపోయిందని తెలిపారు. లంక భూములు కూడా మునిగిపోయాయని, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, మార్కెట్లో ప్రస్తుతం 23 వేల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు వివరించారు. రవాణా విషయంలో 90 శాతం వరకు ఇబ్బందులు అధిగమించామని తెలిపారు. -
కిలో ఇసుక 6 రూపాయలు
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో కిలో ఇసుకను రూ.6 చొప్పున విక్రయిస్తున్నారు. వర్షాకాలం కావడంతో గోదావరి, మానేరు నదులు వరద కారణంగా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇసుక కొరత ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇళ్ల నిర్మాణాలు చివరిదశలో ఉన్న యజమానులు మాత్రం అక్కడక్కడ ఇసుక బస్తాలు కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు 25 కిలోల ఇసుక బస్తాను రూ.150 విక్రయిస్తున్నారు. అంటే దాదాపు కిలో ఇసుక రూ.6కు దొరుకుతోంది. ఇళ్ల నిర్మాణంలో చివరగా ప్లాస్టరింగ్ చేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తూ బస్తాల చొప్పున ఇసుకను కొనుగోలు చేస్తున్నారు. వేసవి సీజన్లో ఇసుకను జల్లెడ పట్టి బస్తాల్లో నింపి మానేరు, గోదావరి ఒడ్డున గ్రామాల్లోని కొందరు ఏజెంట్లు రహస్యంగా నిల్వ ఉంచుకున్నారు. వారే ప్రస్తుతం వ్యాపారులకు 25 కిలోల బస్తా రూ.100కు విక్రయించగా రిటైల్‌గా వ్యాపారులు రూ.130 నుంచి 150కి అమ్ముతున్నారు. -
నవ్విపోదురు గాక మాకేటి సిగ్గు
అధికారంలో ఉన్నంతకాలం నదులనే కాదు వాగులు, వంకలను కూడా వదల్లేదు. ఇసుక దోపిడీకి తెగబడ్డారు. ఉన్న పళంగా రూ.కోట్లకు పడగెత్తారు. రూ.1500 కోట్లకు పైగా టీడీపీ నేతలు ఆర్జించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడా నేతలకు వీలుపడటం లేదని సామాన్యుల కోసమంటూ.. రోడ్డెక్కుతున్నారు. దోపిడీకి గురి కాకూడదని, తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతో కొత్త ఇసుక పాలసీని రూపొందించి, మరో ఐదు రోజుల్లో అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ పచ్చనేతలు ఇసుక రాజకీయాలు చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎవరైతే ఇసుకను దోచుకున్నారో వారే నేడు ఇసుక కోసం ధర్నాలకు దిగుతున్నారు. సెప్టెంబర్ 5నుంచి వచ్చే పాలసీ తమ వల్లే వచ్చిందని చెప్పుకునేందుకు కూడా ఆరాటపడుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు గత ఐ దేళ్ల కాలంలో బక్కచిక్కిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి గుల్లగా మారిపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఏ ఒక్కదాన్నీ విడిచిపెట్టలేదు. నిరాటంకంగా ఇసుక దోపిడీ సాగించారు. టీడీపీ నాయకులు మాఫియాతో చేతులు కలిపి ఇసుకను దోచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానం సామాన్యులకు ఉపయోగపడలేదుగానీ టీడీపీ నేతలకు మాత్రం కాసులు కురిపించింది. ఇసుక ర్యాంపులను తమ అడ్డాగా చేసుకుని కోట్ల రూపాయలు దోచుకున్నదెవరంటే టీడీపీ నాయకులని ప్రజల వేళ్లు చూపిస్తాయి. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు బాతులా మారిపోయిన విషయం తెలిసిందే. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదలకుండా మింగేశారు. నిబంధనలకు విరుద్ధంగా.. జిల్లా సాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలు ఉన్నా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేశారు. వంతెనలకు, ఇరిగేషన్ పంపులు, వాటర్ ఫిల్టర్ సంపులకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాల వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలను వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోయారు. రీచ్‌ల వద్ద లారీకి రూ.6 వేల నుంచి 10 వేల వరకూ వసూలు చేసిన దాఖలాలున్నాయి. నేతలపై ఆరోపణలు.. ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న వంశధార, నాగావళి నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధువులు, అనుచరగణం పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పోతయ్యవలస ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే లారీలు రాకపోకలు సాధించాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు వద్ద ఇసుక కోసం వందల సంఖ్యలో లారీలు బారులు తీరిన సందర్భాలుండేవి. ఆమదాలవలస మండలం దూసి రైల్వే వంతెన సమీపంలో నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోనైతే 25 లారీలతోపాటు నాలుగు జేసీబీలు వరద పోటుకు మునిగిపోయాయి. డ్రైవర్లు, క్లీనర్లు వరద దిగ్బంధంలో చిక్కుకున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తవ్వకాలు చేస్తుండగా వరద ముంపునకు గురయ్యారు. ఆ వాహనాలన్నీ కూన రవికుమార్ ప్రధాన అనుచరులవేనంటూ కోడై కూసింది. -శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో అచ్చెన్నాయుడు అనుచరులు దందా చేశారన్న వాదనలు ఉన్నాయి. శ్రీకాకుళం రూరల్ బట్టేరు వద్ద అయితే ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు గ్రామ రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. కల్లేపల్లి, భైరీ ర్యాంపుల్లో టీడీపీ నేతల ఆగడాలు తెలిసిందే. -నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు భారీగా వసూళ్లు చేశారన్న వాదనలు ఉన్నాయి. -పాతపట్నం నియోజకవర్గంలో మాతల వద్ద నాటి ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే. -ఎచ్చెర్ల నియోజకవర్గంలో తమ్మినాయుడుపేట, ముద్దాడ పేట, పొన్నాడలో అనధికార ఇసుక ర్యాంపులు నడిచాయి. నాటి జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నాటి మంత్రి కళా వెంకటరావు మధ్య వివాదం కూడా నడిచింది. ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నేతలు గొడవకు దిగిన దాఖలాలున్నాయి. టీడీపీ రాకముందు... అధికారంలోకి వచ్చాక... టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజి వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరేజి రూపేణా జిల్లాలో ఏటా రూ.50 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను స్థానిక సంస్థల మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు పెట్టేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 300 లారీల వరకు ఇసుకను విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా సాగించారు. విశాఖ మార్కెట్లో లారీ ఇసుక డిమాండ్‌ను క్యాష్ చేసుకున్నారు. లారీ ఇసుక రూ.20 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మొత్తానికి ఐదేళ్లలో రూ.1500 కోట్ల వరకు అక్రమంగా ఆర్జించారు. -
సాండ్ పాలిటిక్స్
-
పదింతలు దోచేద్దాం
కొత్త ఇసుక పాలసీ మరో పదిరోజుల్లో అమలులోకి రానున్న నేపథ్యంలో ఈలోపే పదింతలు దోచుకునేందుకు ఇసుకమాఫియా యత్నిస్తోంది. దీనికి రెవెన్యూ, పోలీసు అధికారులు హకరిస్తున్నారు. ప్రభుత్వ పనుల కోసం కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను అడ్డం పెట్టుకుని నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రతి లారీకి ఒక స్లిప్ ఇచ్చి అది వెళ్లిన సమయం నోట్ చేయాల్సి ఉండగా దానికి భిన్నంగా ఒకే స్లిప్పై పది నుంచి 11 లారీల నంబర్లు వేసి 30 నుంచి 36 యూనిట్ల ఇసుక పంపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు కొవ్వూరు తహసీల్దార్ సంతకంతో ఉన్న స్లిప్ కలకలం రేపుతోంది. సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : కాకినాడ వద్ద రైల్వే కాంట్రాక్టర్‌కు సుమారు 300 యూనిట్ల వరకూ ఇసుకను దఫదఫాలుగా ఇవ్వడానికి కలెక్టర్ నుంచి అనుమతి వచ్చింది. ఇసుకను తరలించేటప్పుడు ఒక్కో స్లిప్పై లారీ నంబర్, ఎన్ని యూనిట్లు ఇసుక తరలిస్తున్నది, ఎన్ని గంట లకు లారీ రీచ్‌లోకి వచ్చింది. ఎన్ని గంటలకు వెళ్లింది.. అనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ లేకుండానే ఇసుక అక్రమంగా తరలిపోయింది. కొవ్వూరులోని ఔరంగాబాద్, వాడపల్లి ర్యాంపుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక రియల్ ఎస్టేట్ నిర్వాహకులకు తరలించినట్లు సమాచారం. ఒకే స్లిప్పై పది లారీల నంబర్లు వేయడంతో ఏ లారీ ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడు వస్తుందన్న సమాచారం లేకుండా పోయింది. దీంతో ఒకే స్లిప్పై రోజుకు రెండు మూడు ట్రిప్పుల ఇసుకను తరలించి నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాకినాడకు తరలించాల్సిన ఇసుక రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లోని భవన నిర్మాణాలకు తరలించి నట్లు సమాచారం. 11 లారీలలో 30 యూనిట్లు తరలించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే అందులో చూపించిన లారీల నంబర్ల ఆధారంగా ఆరా తీస్తే అవి 10 టిప్పర్లుగా తెలుస్తోంది. వీటిలో ఒక్కోదానిలో ఐదు నుంచి ఏడు యూనిట్ల వరకూ ఇసుకను రవాణా చేసే సామర్థ్యం ఉంది. దీన్నిబట్టి చూస్తే ఒక్క ట్రిప్‌లోనే 50 నుంచి 70 యూనిట్ల వరకూ తరలిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అదే రాజమండ్రి రూరల్‌లో ఉన్న ఇసుక రీచ్‌లో వాహనం నంబర్, అది ఏ కేటగిరిలో ఉంది, రోడ్డు చార్జీలు ఎంత, ఏ సమయానికి ఆ వాహనం వెళ్లింది అన్న వివరాలతో స్లిప్ ఇస్తున్నారు. కొవ్వూరు మండలంలో మాత్రం దీనికి భిన్నంగా ఇసుక రవాణా చేసేస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు లోడింగ్ చార్జీలతో కలిపి ప్రభుత్వం రూ.800 ధర నిర్ణయించగా, అక్రమంగా తరలించిన ఇసుకకు యూనిట్ రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకూ వసూలు చేసినట్లు సమాచారం. ఇక్కడ ర్యాంపులో ఉన్న వీఆర్ఏ నుంచి మండలస్థాయి అధికారుల వరకూ ఈ వ్యవహరంలో పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. దీనిపై కలెక్టర్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
కర్నూలు సిమెంట్ ఫ్యాక్టరీకి అనంతపురం ఇసుక
ఇది శింగనమల నియోజకవర్గం ఉల్లికల్లు గ్రామంలోని ఇసుక రీచ్. అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామనే పేరుతో ఇసుకను కర్నూలు జిల్లాలోని సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇక్కడ నేరుగా ఇసుక రీచ్‌లోకి టిప్పర్లు వెళ్లడంతో పాటు జేసీబీతో లోడింగ్ చేస్తున్నారు. వాస్తవానికి రీచ్ నుంచి స్టాక్ పాయింట్ వరకు కేవలం ట్రాక్టర్ల ద్వారా, అది కూడా మనుషులతోనే ఇసుకను లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇసుకాసురులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పట్టించుకోకపోవడంతో ధర్మవరం, కళ్యాణదుర్గం, రాయదుర్గం, పెనుగొండ, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. సాక్షి, అనంతపురం: ప్రభుత్వ పనులకు ఇసుక సరఫరా ముసుగులో విలువైన ఇసుక జిల్లా సరిహద్దులే కాదు.. ఏకంగా రాష్ట్ర సరిహద్దులను దాటి అక్రమంగా తరలిపోతోంది. ఈ వ్యవహారంలో కొద్దిమంది ఇసుక కాంట్రాక్టర్లు భారీగా వ్యవహారాలు నడుపుతూ.. రెవెన్యూ, పోలీసులను అటువైపు రాకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. బళ్లారి, బెంగళూరు వంటి నగరాలకు ఇక్కడి నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను రవాణా చేస్తున్నారు. అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్, పోలీసు వ్యవస్థలు అచేతనంగా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ వ్యవహారంలో అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా ఇసుకను తరలిస్తున్నారు. తద్వారా ఈ ఇసుకను అధిక ధరకు మార్కెట్లో విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. ఇసుక రీచ్ నుంచి ఇసుకను తరలించే వాహనాల వివరాలను ముందుగా సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే పేర్కొన్న వాహనాల్లో మాత్రమే ఇసుక సరఫరాకు అనుమతిస్తారు. అది కూడా అనుమతించిన వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జీపీఎస్ వ్యవస్థను నిరంతరం రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు పర్యవేక్షించాలి. తద్వారా అనుమతి ఇచ్చిన ప్రభుత్వ కార్యక్రమాలకు మాత్రమే ఇసుక సరఫరా అవుతోందా? పక్కదారి పడుతుందా అనే విషయం తెలిసిపోతుంది. అయితే, ఇక్కడే ఇసుకాసురులు దోపిడీకి మార్గం ఏర్పడింది. అనుమతి తీసుకున్న వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చుకోవడం లేదు. ఒకవేళ అమర్చుకున్నప్పటికీ నిర్దేషిత ప్రాంతానికి వెళ్లిన తర్వాత జీపీఎస్ వ్యవస్థ పనిచేయకుండా చేస్తున్నారు. తద్వారా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అంతేకాకుండా నిర్దేషించిన వాహనాలను మాత్రమే కాకుండా ఇతర వాహనాలను కూడా ఇసుక సరఫరాలో వినియోగిస్తున్నారు. ఇందుకోసం అనుమతి తీసుకున్న వాహనం పనిచేయడం లేదని చెబుతున్నారు. ఈ విధంగా ఇసుకాసురులు రెచ్చి పోవడానికి ప్రధాన కారణం.. రెవెన్యూ, మైనింగ్, పోలీసు వ్యవస్థలు కూడా అమ్యామ్యాలకు అలవాటుపడటమే. పర్మిట్లు ఇచ్చే విషయం నుంచి ఇసుకను తరలించే వరకూ ఈ విధంగా అన్ని విధాల అధికారులు ఇసుకాసురులకు సహకరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవీ నిబంధనలు..! ఇసుక సరఫరాలో ఇప్పటికే ప్రభుత్వం కొన్ని నిబంధనలను రూపొందించింది. వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రభుత్వమే ఇసుకను సరఫరా చేయనుంది. అప్పటి నుంచి ఇసుకాసురులు తమ ఆటలు సాగవని తెలుసుకుని సందట్లో సడేమియాగా ఇప్పుడే సొమ్ముచేసుకుంటున్నారు. నిబంధనల మేరకు ఇసుక రీచ్ నుంచి కేవలం మనుషుల ద్వారా లోడింగ్ చేసుకోవాలి. అది కూడా కేవలం ట్రాక్టర్లకు మాత్రమే. ఇక్కడి నుంచి స్టాక్ పాయింట్‌కు తీసుకొచ్చిన తర్వాత ఇతర వాహనాల్లో ఇసుకను తరలించుకునే అవకాశం ఉంటుంది. అది కూడా దూరం మరీ ఎక్కువైతేనే టిప్పర్లను అనుమతిస్తారు. అదేవిధంగా ఈ వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చుకోవాల్సి ఉంటుంది. అయితే, జిల్లాలో ఇసుక సరఫరా వ్యవహారంలో ఈ నిబంధలను అధికారులు ఎక్కడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తద్వారా ఇసుకాసురులు ఆడింది ఆట.. పాడింది పాటగా వ్యవహారం సాగుతోంది. -
రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత అమిలినేని సురేంద్రబాబు సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు చెక్ పడింది. ‘ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద’ శీర్షికన శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనంతో రెవెన్యూ అధికారులు కళ్లు తెరిచారు. పరిగి మండలంలోని శాసనకోట వద్ద ఇసుక రవాణాను వెంటనే నిలిపివేయించడంతో పాటు మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని మైనింగ్ డీడీని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక కావాలంటూ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తు చేసుకోగా ఐదు వాహనాలకు పరిగి తహసీల్దారు అనుమతి మంజూరు చేశారు. అయితే అనుమతించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో రోజూ 10 ట్రక్కులకు పైగా ఇసుకను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు తరలిస్తున్నారు. అదీ కూడా ఇసుక తరలింపునకు అనుమతిచ్చిన బాల్‌రెడ్డిపల్లి నుంచి కాకుండా శాసనకోట నుంచి ఇసుక తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకున్నారు. ఈవిధంగా గత మూడు నెలల కాలంలో ఏకంగా రూ.10కోట్లకు పైగా ఆర్జించినట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా ప్రచురించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు శాసనకోట ప్రాంతాన్ని పరిశీలించి రీచ్ లేకపోయినప్పటికీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ భారీగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడినట్లు నిర్ధారించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు హెచ్చరిక జారీ చేశారు. విచారణకు ఆదేశం జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న విషయమై మైనింగ్ డీడీని విచారణకు ఆదేశించాం. ప్రభుత్వ పాలసీకి భిన్నంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు. మైనింగ్ డీడీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ -
ఇసుక దిబ్బల్లో కాంట్రాక్టు గద్ద
ప్రభుత్వ పనుల ముసుగులో ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దందా చేస్తోంది. ఎక్కడ ఇసుక కనిపించినా అక్కడ వాలిపోతూ సరిహద్దులు దాటించేస్తోంది. కాంట్రాక్టు పనుల్లో లబ్ధిని పక్కనపెడితే.. ఆయా ప్రాంతాల్లోని ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటోంది. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి నేతల అండతో చెలరేగిపోయిన ఈ సంస్థ ఇప్పటికీ జిల్లా నలుమూలల నుంచి ఇసుక దోపిడీకి పాల్పడుతుండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టు పనుల నిర్వహణ సంస్థగా జిల్లాకు సుపరిచితం. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు జిల్లాలోని విలువైన ఇసుక నిల్వలను కర్ణాటకకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. గత ఐదేళ్లుగా ఇదే తంతు. వాస్తవానికి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక కావాలంటూ సదరు సంస్థ దరఖాస్తు చేసుకుంది. పనులకు ఇబ్బంది లేకుండా ఐదు వాహనాల్లో ఇసుక తరలించుకునేందుకు పరిగి తహసీల్దారు అనుమతి మంజూరు చేశారు. అయితే, ఇందుకు భిన్నంగా అనుమతించిన వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో ప్రతి రోజూ 10 ట్రక్కులకు పైగా ఇసుక అక్రమంగా తరలిపోతోంది. వాస్తవానికి ఇసుకను తీసుకోవాల్సిన ప్రాంతం బాల్‌రెడ్డిపల్లి. ఇక్కడి నుంచి కాకుండా శాసనకోట నుంచి ఇసుకను తరలిస్తూ.. మొదట భారీగా సొమ్ము చేసుకుంటోంది. ఈ విధంగా అక్రమ ఇసుకను అనుమతి లేని ట్రక్కు నుంచి తరలిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇసుక దందా ఇలా.. ఎవరు: ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ: శాసనకోట, పరిగి మండలం ఎలా: రోజూ 10 ట్రక్కుల్లో.. ఎంత: ట్రక్కు ఇసుక రూ.లక్ష ఎప్పటి నుంచి: మూడు నెలలుగా నెలసరి అక్రమార్జన: రూ.3 కోట్లు కళ్ల ముందు కనపడుతున్నా! జాతీయ రహదారి పనుల్లో భాగంగా పెన్నా నది మీద బ్రిడ్జి నిర్మాణానికి ఇసుక తరలించుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్ అండ్ బీ ఎస్ఈ నుంచి 6వ తేదీ జూలై 2019న లేఖ వెళ్లింది. ఇందుకు పరిగి తహసీల్దారు 31 జూలై 2019న రోజుకు 5 ట్రక్కుల ఇసుకను తరలించుకునేందుకు అనుమతిచ్చారు. ఆ మేరకు ఏపీ02టీహెచ్ 1600, 1603, 1612, 1602, 1604 నెంబర్లు కలిగిన వాహనాల్లో మాత్రమే ఇసుకను తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అది కూడా ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు(ఆదివారం మినహాయించి) మాత్రమే. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. వాస్తవానికి ఎవరైనా పేదలు చిన్న చిన్న ట్రాక్టర్లల్లో ఇసుకను తరలిస్తే వాటిని సీజ్ చేసి కేసులు నమోదు చేసే అధికారులు.. కళ్ల ముందు భారీ ట్రక్కు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ ఎందుకు వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేయలేదనే చర్చ జరుగుతోంది. ఏదీ వాహనాల ట్రాకింగ్ వాస్తవానికి ప్రభుత్వ అవసరాల కోసం ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వొచ్చు. అయితే, అనుమతించిన వాహనాల్లో మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం ట్రాక్టర్ల ద్వారా మాత్రమే ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంది. ఇక్కడ మాత్రం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఏకంగా ట్రక్కుల్లో ఇసుకను తరలిస్తోంది. అంతేకాకుండా అనుమతించిన వాహనాల్లో తరలించాల్సిన సందర్భాల్లో కూడా ఆ వాహనాలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఈ వాహనాల రాకపోకలను రెవెన్యూ యంత్రాంగం ఎప్పటికప్పుడు జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తూ ఉండాలి. పగటి సమయాల్లో కాకుండా రాత్రి వేళ ఇసుకను తరలించకూడదు. అదేవిధంగా ఏ ప్రదేశం నుంచి ఇసుకను తీసుకెళుతున్నారు? ఎక్కడికి తరలిస్తున్నారనే అనే వివరాలు కూడా జీపీఎస్ ద్వారా నమోదవుతుంటాయి. అయితే, ఇక్కడ మాత్రం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. నిర్దేశించిన వాహనాలు కాకుండా ఇతర వాహనాల్లో ఇసుకను అక్రమంగా రాష్ట్ర సరిహద్దులను దాటిస్తోంది. మరోవైపు అనుమతించిన వాహనాలకు కూడా జీపీఎస్ పరికరాలు లేవు. దీంతో ఈ ఇసుక నిజంగా ప్రభుత్వ పనులకు తరలుతోందా? ఆ పేరుతో అక్రమంగా అమ్ముకుంటున్నారా అనే వివరాలు కూడా అధికారులకు చేరడం లేదు. అన్నింటినీ మించి నిర్దేశించిన ప్రాంతం నుంచి కాకుండా వేరే ప్రదేశం నుంచి.. అది కూడా ఇసుక రీచ్ కాని ప్రాంతం నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా సదరు కంపెనీపై అధికారులు చర్యలు తీసుకుంటారా? మాముళ్ల మత్తులో జోగుతారా అనేది చూడాల్సి ఉంది. ‘ఫిన్స్’తో నేరాలకు చెక్ అనంతపురం సెంట్రల్: నేరాలను నివారించడంతో పాటు నేరస్తులను తెలుసుకునేందుకు ఎస్పీ సత్యయేసుబాబు ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం (ఫిన్స్) యాప్‌ను తీసుకొచ్చారు. శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్హాల్లో జరిగిన కార్యక్రమంలో ఫిన్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ బూసారపు సత్యయేసుబాబు మాట్లడుతూ... నేరాలకు అడ్డుకట్ట వేయడంలో ‘ఫిన్స్’ యాప్ కీలకంగా మారుతుందని వెల్లడించారు. సుమారు 10 లక్షల మంది నేరస్తుల వేలి ముద్రలను డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయన్నారు. దీనికి అనుబంధంగా ట్యాబ్ ద్వారా క్షేత్రస్థాయిలో పోలీసు అధికారులు పాత నేరస్తులు, రౌడీషీటర్లు తదితర వారిని గుర్తించే ఆస్కారముందన్నారు. ఈ యాప్ ద్వారా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలు వెరిఫై చేసి క్షణాల్లో అతను నేరస్తుడా... కాదా.. అని నిర్దారించుకునే వీలుంటుందన్నారు. వేలి ముద్రల ద్వారా నేరస్తులను గుర్తించే సిస్టం.. ఇప్పటికే ఉన్నప్పటికీ నేరస్తులను గుర్తించేందుకు చాలా సమయం పట్టేదన్నారు. అనంతరం ‘ఫిన్స్’ యాప్‌ను ఎలా వినియోగించాలో డెమో ద్వారా వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు చౌడేశ్వరి, ఎంవీఎస్స్వామి, డీఎస్పీలు వీరరాఘవరెడ్డి, మురళీధర్, సీఐలు, ఐటీ కోర్ టీం సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుక.. టీడీపీ నేతల పొట్టల్లో ఉంది
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలోని ఇసుకను గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా దోచుకున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అసెంబ్లీలో మండిపడ్డారు. ప్రస్తుతం ఇసుక నదిలోనో, చెరువుల్లోనే లేదని, అది టీడీపీ నేతల పొట్టల్లో ఉందని, దానిని కక్కిస్తే.. ఇసుక కొరత తీరుతుందని అన్నారు. విచ్చలవిడి ఇసుక దోపిడీ కారణంగా గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ రూ. 100 కోట్ల పెనాల్టీ విధించిందని ఆయన గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వమే భవన కార్మికుల పొట్ట కొట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇసుక కొరత కారణంగా భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ నేతలు సభ దృష్టికి తీసుకొచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నేతలు అవలంబించిన ఇసుక దోపిడీ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని జోగీ రమేశ్ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక మాఫియా నుంచి ఇసుకను కాపాడేందుకు, చట్టబద్ధంగా సమగ్ర విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, భవన కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. త్వరగా ఈ విధానాన్ని తీసుకురానున్నామని తెలిపారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్న విషయమే వాస్తవమేనని అన్నారు. కానీ ఆ కొరతకు కారణం గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు ఇసుక సంపాదనగా మార్చుకోవడమేనని తెలిపారు. సరైన సమగ్ర విధానంలో ఇసుక అమ్మకాలను క్రమబద్ధీకరిచేందుకు చర్యలు తీసుకుంటామని, ఇసుక మైనింగ్ కోసం సమగ్ర, పారదర్శకమైన నియమనిబంధనలు ఖరారు చేయబోతున్నామని తెలిపారు. -
వాత పెట్టినా.. పాత బుద్ధే..
‘వాత పెట్టినా పాత బుద్ధి మారని చందం’గా టీడీపీ నేతల దందా కొనసాగుతోంది. టీడీపీ సర్కారు హయాంలో జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోయి.. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన తీరును గమనించిన ప్రజలు.. సార్వత్రిక ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పారు. అయినప్పటికీ అవకాశం దొరికితే అదే పంథాను అవలంబిస్తామంటున్నారు ‘పచ్చ’నేతలు. ఇందుకు తాజాగా సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాయే ఉదాహరణగా నిలుస్తోంది. సాక్షి, రాజమహేంద్రవరం : ఇసుక దోపిడీని అరికట్టాలనే ఉద్దేశంతో ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. దీనిపై త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈలోగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు నిర్మించుకునే ఇళ్లకు, ప్రభుత్వ పరంగా సాగే నిర్మాణాలకు ఇసుక కొరత రాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ పరిమిత సంఖ్యలో ర్యాంపులకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా మన జిల్లాలోని రాజమహేంద్రవరంలో 2, తాళ్లరేవు మండలం పిల్లంకలో 1 చొప్పున ఇసుక ర్యాంపులకు అనుమతి ఇచ్చా రు. పిల్లంక ఇసుక ర్యాంపును తన గుప్పెట్లో పెట్టుకున్న ఓ బడా కాంట్రాక్టర్.. ఇదే అదునుగా టన్నుల కొద్దీ ఇసుకను అడ్డగోలుగా దోచుకుపోతున్నాడు. టీడీపీ ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేసిన నిమ్మకాయల చినరాజప్పకు బినామీగా వ్యవహరించిన సదరు కాంట్రాక్టర్ గుత్తాధిపత్యమే పిల్లంక రేవులో ఇంకా నడుస్తోంది. వాస్తవానికి పిల్లంక ర్యాంపును గోవలంక బోట్స్‌మెన్ సొసైటీ మత్స్యకారులకు అప్పగించారు. గోదావరిలో ఇసుక తీసేందుకు, లారీల్లో ఎగుమతికి అయ్యే ఖర్చుల వరకూ తీసుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కానీ మాజీ మంత్రి బినామీ ఈ ర్యాంపు నుంచి నిత్యం 25 పడవల ద్వారా ఇసుకను తరలిస్తూ దోపిడీకి పాల్పడుతున్నాడు. పర్మిట్ ఒకచోటకు.. తరలింపు మరోచోటకు.. కాకినాడ పోర్టు సమీపాన దేవీ ఇంజినీరింగ్ వర్క్స్ అవసరాల కోసమంటూ 5 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఈ నెల 17న కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్మిట్ ఇచ్చారు. దీనిని అవకాశంగా తీసుకున్న సదరు బినామీ.. నిర్దేశించిన ప్రాంతానికి మొక్కుబడిగా ఇసుక తరలించి, మూడు వంతులు పైగా ఇసుకను బయటి మార్కెట్లో అమ్మేస్తున్నాడు. ఇలా నిత్యం రూ.లక్షల విలువైన ఇసుకను అక్రమంగా కొల్లగొడుతున్నారు. ఈవిధంగా గడచిన ఆరేడు రోజులుగా రూ.అర కోటి విలువైన ఇసుక దోపిడీ జరిగినట్టు తెలుస్తోంది. మరోపక్క తాము పర్మిట్ తెచ్చుకున్నా ఇసుక దొరకడం లేదని ప్రభుత్వ కాంట్రాక్టులు చేస్తున్న వారు లబోదిబోమంటున్నారు. ఇసుక కోసం వచ్చి, గంటల తరబడి వేచిచూసి చూసి, ఖాళీ లారీలతో తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ఇసుక దోపిడీపై పలువురు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా రాజమహేంద్రవరం రీచ్‌లలో ఇసుకకు అధికంగా డబ్బులు అడుగుతున్నారని, దీనిపై ప్రజలు గొడవ చేశారు. ఇసుక దోపిడీపై విచారణ జరిపిస్తాం పిల్లంక రీచ్‌లో ప్రజలకు ఇసుక ఇవ్వడం లేదనే ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారణ జరిపిస్తాం. ఈ రీచ్‌ను గోవలంక బోట్స్‌మెన్ సొసైటీ నిర్వహిస్తోంది. సొసైటీ సభ్యులే పడవల్లో ఇసుకను తీసుకొచ్చి అమ్ముకుంటారు. తహసీల్దార్ పర్యవేక్షణలో వీఆర్వోను ఏర్పాటు చేసి ఇసుక ఇస్తున్నాం. – బి.రాజకుమారి, జిల్లా జాయింట్ కలెక్టర్–2 -
ఇసుక కొరత తీరేలా..
సాక్షి, అమరావతి: ఇసుక కావాలంటూ జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. భవనాలు, అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలకు ఇసుక ఇవ్వాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇసుక కేటాయింపులు చేస్తున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రాధాన్యతాక్రమాన్ని అనుసరిస్తున్నారు. మరో వైపు జిల్లాలోని రీచ్‌లలో ఇసుక మరో రెండు నెలలకు మించి వచ్చే అవకాశం లేకపోవడంతో గోదావరి జిల్లాల నుంచి ఇసుక తెప్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కొందరు అక్రమార్కులు మాత్రం అధికారుల కళ్లుగప్పి ఇసుక తరలించుకుపోతున్నారు. జిల్లాలో ఇసుక కొరత ఏర్పడింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పుతో మూడు నెలలుగా జిల్లాలోని ఇసుక క్వారీలు మూత పడ్డాయి. ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ అమలులోకి తెచ్చే వరకు ఇసుక పంపిణీ బాధ్యతను కలెక్టర్లకు అప్పజెప్పింది. వారం రోజుల నుంచి జిల్లాలో ఇసుక కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇసుక కోసం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ లబ్ధిదారులు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు వారి నుంచి తమకు ఇసుక కావాలని పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. జిల్లాలో ప్రభుత్వ నిబంధనలు, పర్యావరణ అనుమతులు కేవలం కొల్లిపర, కొల్లూరులోని రెండు మండలాల్లో ఐదు ఇసుక రీచ్‌లకు మాత్రమే వచ్చాయి. అక్కడ కేవలం 2,00,847 క్యూబిక్ ఇసుక నిల్వలు మాత్రమే గుర్తించారు. వారంలోపే 2 వేల మంది 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 20 వేల ట్రాక్టర్లకు సంబంధించి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను కేటాయించారు. ఈ ఇసుక కేటాయింపులు ప్రాధాన్యత క్రమంలో కేటాయించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇసుక కొరత దృష్ట్యా వస్తున్న దరఖాస్తులను పరిశీలిస్తే, జిల్లాలో 5 రీచ్‌లలో ఉన్న ఇసుక నిల్వలు రెండు నెలలలోపు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇసుక కొరతను అధిగమించేందుకు.. జిల్లాలో ఇసుక నిల్వలు తగినంత లేనందున కొత్త పాలసీ వచ్చేలోపు ఇసుక కొరతను అధిగమించేందుకు వీలుగా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఎంత మేర ఇసుక అవసరం ఉంటుందో ఆ మేరకు.. ఇసుకను గోదావరి జిల్లాల నుంచి తరలించి మంగళగిరి, తాడేపల్లిలో స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించేందుకుగాను సంబంధిత తహసీల్దార్లతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అగని అక్రమ దందా ఇసుక అక్రమ రవాణా కట్టడికి అధికారులు చర్యలు తీసుకొన్నామని చెబుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో దందా ఆగటం లేదు. స్థానికంగా ఇసుక క్వారీలు ఉన్న ప్రాంతంలోని అధికారులు ఇసుక తరలింపునకు ఎటువంటి అనుమతి తీసకోకుండానే తెనాలి, చెరుకుపల్లి, రేపల్లె ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కొంత మంది బిల్టర్లు అవసరానికి మించి ఎక్కువ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఇసుకను గుంటూరుకు తరలించి అక్కడ నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి వేలాది రూపాయలు దండుకొంటున్నారు. ఇసుక ట్రాక్టర్ల ద్వారానే తరలించాలని నిబంధన ఉంది. అయితే కొంత మంది క్వారీల సమీపం నుంచి నేరుగా కృష్ణా జిల్లా పర్మిట్లను అడ్డుపెట్టుకొని ఇసుక తరలిస్తున్నారు. అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యహరిస్తున్నారు. అధికారుల అనుమతితో తీసుకున్న ఇసుక నిర్మాణాలు చేపట్టే ప్రాంతంలో ఉండాలి. ప్రభుత్వం ట్రాక్టరు ఇసుక రూ.330కు అందిస్తోంది. అయితే కొంత మంది అక్కమార్కులు ఇసుక లారీ రూ.15 వేలకు విక్రయిస్తున్నారు. దీంతోపాటు అచ్చంపేట నుంచి క్రోసూరు, రాజుపాలెం, పిడుగురాళ్ల మీదుగా ఇసుకను అధికారుల కళ్లు గప్పి తరలిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం గుర్తించిన ఇసుక రీచ్‌లు పాత బొమ్మువానిపాలెం రీచ్‌లో 4,853 హెక్టార్లలో 48,530 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు అంచనా వేశారు. కొల్లూరు మండలం గాజులంక–1 రీచ్‌లో 3,340 హెక్టార్ల విస్తీర్ణలో 33,399 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు గుర్తించారు. కొల్లూరు మండలం ఈపూరు రీచ్‌లో 4,985 ఎకరాల్లో 48,530 క్యూబిక్ మీటర్ల ఇసుక ఉన్నట్లు అంచనా వేశారు కొల్లిపర మండలం పిడపర్తివారిపాలెం, బొమ్మువానిపాలెం గ్రామాల పరిధిలోని రీచ్‌లో, 3,340 హెక్టార్లలో 36,989 క్యూబిక్ మీటర్ల ఇసుకను గుర్తించారు. కొల్లిపర మండలం అత్తలూరిపాలెం–1, అత్తలూరిపాలెం రీచ్‌లో 3,700 హెక్టార్లలో 36,989 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉన్నట్లు గుర్తించారు. -
నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!
సాక్షి, లక్కవరపుకోట (విజయనగరం): అధికారుల నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఇసుక, కలప అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ప్రభుత్వ పాలనలో ప్రక్షాలన తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోంది. అయితే, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఇష్టారాజ్యంగా వృక్షాలను నరికివేసి తరలించుకుపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పగలు, రాత్రీ తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడాన్ని జనం తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు గెడ్డలు, వాగుల్లోని ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, లారీల సాయంతో తరలించుకుపోతున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా ఒకటి రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పెద్దపెద్ద వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. మండలంలోని ఐదు కర్రల మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల వద్ద వివిధ రకాలకు చెందిన వందలాది మానులు నెట్టువేసి ఉన్నాయి. అటవీశాఖ వారు ఈ అక్రమ కలప దందాపై కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. చెట్ల నరికివేతకు ఇటీవల కాలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత కలప ఎలా రవాణా అవుతుందో ఆర్ధం కావడం లేదని పలువురు బహిరంగానే చెబుతున్నారు. నిఘా నేత్రాలు నొట్టబోయే సరికి అక్రమ రవాణా దారులు దందాలకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అక్రమ రవాణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
సహజ నిధి దోపిడీ ఆగేదెన్నడు..?
ఒక వైపు ఇసుక రీచ్‌లపై రాజకీయ రాబంధుల అడ్డుకట్టకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంటే మరో వైపు అర్ధరాత్రుల్లో అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న అనుమతులను అడ్డం పెట్టుకుని విచ్చల విడిగా అక్రమ రవాణా చేస్తూ మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి అడ్డూ అదుపూ లేకుండా నెల్లూరు నగరంతో పాటు, పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి,నెల్లూరు: నదీ గర్భాల్లో సహజ నిధి ఇసుక దోపిడీ ఆగడం లేదు. నిశీధి వేళ ఇసుక మాఫియా దందా కొనసాగుతోంది. టీడీపీ హయాంలో చెలరేగిపోయిన ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కొత్త పాలసీ కోసం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీచ్‌ల నుంచి ఇసుక తరలింపును తాత్కాలికంగా నిలిపివేశారు. పేదల అవసరాల కోసం మాత్రం అధికారుల అనుమతితో ఇసుక తరలింపునకు ఆదేశాలిచ్చింది. ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని ఇసుక మాఫియా గుట్టుగా ఇసుకను కొల్లగొట్టుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో ఇసుక మాఫియా మాత్రం ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి పోలీసుల సహకారంతో యథేచ్ఛగా అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా సాగిస్తోంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఇసుక తరలింపు జీఓలను అడ్డుపెట్టుకొని నెల్లూరు నగరంలో బిల్డర్స్‌కు ఇసుక ధర పెంచి విక్రయాలు చేస్తూ మాఫియా సొమ్ము చేసుకుంటుంది. అర్ధరాత్రి వేళ నగరానికి రవాణా గత ప్రభుత్వం హయాంలో నెలూరురూరల్ పరిధిలోని పొట్టేపాళెం ఇసుక రీచ్ నుంచి శ్రీహరికోటలోని షార్‌లోని నిర్మాణాలు, శ్రీసిటీలోని పలు పరిశ్రమల నిర్మాణాల కోసం ఇసుక రవాణా కోసం టీడీపీ నేతలు ప్రత్యేక అనుమతులు తీసుకొన్నారు. ఆ అనుమతులు అడ్డుపెట్టుకొని రీచ్‌లో భారీ యంత్రాలతో పరిధికి మించి ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేశారు. పొట్టేపాళెం నుంచి షార్‌తో పాటు శ్రీసిటీకి, అటు నుంచి ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకకు ఇసుక తరలించి రూ.కోట్ల దోచుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా నూతన పాలసీపై కసరత్తు చేస్తున్న క్రమంలో ఇసుక రీచ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయినా కూడా పొట్టేపాళెంలోని ఇసుక మాఫియా మాత్రం అడ్డదారుల్లో ఇసుక రవాణా సాగిస్తున్నారు. పొట్టేపాళెం రీచ్ నుంచి అర్ధరాత్రి యంత్రాల ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తూ ట్రాక్టర్ ద్వారా రీచ్ పక్కనే ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లోకి డంప్ చేయిస్తున్నారు. డంప్ చేసిన ఇసుకను టిప్పర్లకు లోడ్ చేసి నెల్లూరు నగరంలోని అపార్ట్మెంట్ల నిర్మాణాల యజమానులకు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం.. పోలీసులకు మామూళ్లు పొట్టేపాళెం రీచ్ పక్కన ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి నెల్లూరు నగరానికి అర్ధరాత్రి ఇసుక తరలింపునకు కోసం పోలీసుల సహకారం అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజు దాదాపు 30 వాహనాల్లో 90 నుంచి 100 యూనిట్ల ఇసుకను నగరానికి అక్రమంగా రవాణా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు యూనిట్లు ఇసుకతో పాటు రవాణా చార్జీలకు నగరంలోని బిల్డర్స్ వద్ద రూ.35 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రతి రోజు అక్రమార్కులు రూ.10 లక్షల వరకు ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. నగరం నిద్రిస్తున్న వేళ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఇబ్బంది లేకుండా సహకరించినందుకు నెల్లూరురూరల్ , ఐదో నగర పరిధిలోని పోలీసులకు ఒక్కో వాహనం నుంచి రూ.5 వేలు వంతున మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక వైపు అవినీతికి అస్కారం ఇవ్వవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి పదేపదే ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం వేళ్లూనుపోయిన అవినీతి మాత్రం ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. పోలీసు అధికారులు మాత్రం అక్రమ రవాణాకు సహకరిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం విస్మయ పరుస్తోంది. -
‘ఇసుక తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి’
-
‘ఇసుక తరలింపు వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి’
సాక్షి, అమరావతి: కొత్త ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష చేపట్టారు. ఇకపై ఇసుకను ఏపీఎండీసీ ద్వారా విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు. అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కొత్త ఇసుక విధానం సెప్టెంబరు 5 నుంచి అమల్లోకి రానుంది. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌యార్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇసుక రీచ్ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదును ఇవ్వాలని.. రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్టాక్‌యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంతవరకూ మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు. స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయడమే కాకుండా.. ఇసుక బయటకు వెళ్లేటప్పుడు కూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు చేపట్టాలన్నారు. రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్ తప్పనిసరి ఉండాలని ఆదేశించారు. మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాలను గుర్తించాలని, వాటికి జీపీఎస్ అమర్చాలని ఆదేశించారు. వీటికి సంబంధించి ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డులను త్వరగా ఏర్పాటు పూర్తి చేయాలని సీఎం అన్నారు. ఇసుక వినియోగదారుల కోసం ఒక యాప్, వెబ్ పోర్టల్‌ను ఏపీఎండీసీ తయారుచేయనుంది. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కలెక్టర్లు కొనసాగించనున్నారు. రెండు నెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఎన్ఎమ్డీసీ ఇసుకను అందించనుంది. ప్రభుత్వానికి, వినియోగదారుడికి పరస్పరం మేలు జరిగేలా గనుల శాఖ ధరను నిర్ణయించనుంది. కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నారు. -
తూర్పుగోదావరి జిల్లాలో యధేచ్చగా ఇసుక దోపిడీ