రెచ్చిపోయిన టీడీపీ ఇసుక మాఫియా.. జనసేన నేతపై దాడి | TDP And Jana Sena Are Fighting In Yellamanchili Anakapalle Over Sand Issue, More Details Inside | Sakshi
Sakshi News home page

హోం మంత్రి అనిత నియోజకవర్గంలో రెచ్చి పోయిన ఇసుక మాఫియా

Published Wed, Oct 30 2024 9:13 AM | Last Updated on Wed, Oct 30 2024 10:53 AM

TDP and Jana Sena are fighting in Anakapalle over sand

అనకాపల్లి : హోం మంత్రి అనిత నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమంగా ఇసుక తరలించే క్రమంలో కూటమి నేతలు కత్తులు దూసుకుంటున్నారు 

కోటవురట్ల మండలంలో టీడీపీ, జనసేన నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సొమ్ము చేసుకుంటున్నారు.అయితే, ఇసుక అక్రమ రవాణా తరలింపులో కూటమి నేతల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతలు ఒకరిపై ఒకరు మారణాయుధాలతో దాడులు చేసుకున్నారు.  

టీడీపీ నేతలు జనసేన నేత కోన మౌళిపై గొంతుపై బ్లేడ్‌తో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన కోన మౌళిని అత్యవసర చికిత్స నిమిత్తం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇసుక అక్రమ రవాణపై ఇరు పార్టీ నేతలు చేసుకున్న దాడుల్ని భూతగాదా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement