
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుకు మాఫియా దాడిలో ఓ ప్రభుత్వ ఉద్యోగి హతమయ్యాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం కండ్గావ్ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇసుక మాఫియా ముఠా.. సోమవారం రాత్రి అక్రమ ఇసుక రవాణాకు ప్రయత్నించారు.
(చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..!)
వీరిని అడ్డుకునేందుకు వీఆర్ఏ గౌతమ్ ప్రయత్నించగా.. ఇసుక మాఫియా ముఠా వీఆర్ఏను చితకబాదింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీఆర్ఏ గౌతమ్‌ను ప్రభుత్వ ఆసుస్పత్రికి తరలించినప్పటికి లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. దీంతో వీఆర్ఏ సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment