వైఎస్సార్‌సీపీ నేతలకు గాయాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడులోని వంకలో ఇసుకను టిప్పర్లతో తరలిస్తున్నారు. శనివారం రాత్రి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నేతలపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఇసుకను బయటి ప్రాంతాలకు తరలిస్తుండటంతో వైఎస్సార్‌సీపీకి చెందిన భూమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, రమణారెడ్డి మరికొందరు అడ్డుకున్నారు. పొలాల అవసరాలకు ఇసుకను ట్రాక్టర్లతో తీసుకెళ్లొచ్చు కానీ.. టిప్పర్లతో బయటకు తరలించడం ఏమిటని నిలదీశారు. తామే అధికారంలో ఉన్నాం కాబట్టి తమ ఇష్టం వచి్చనట్టి చేసుకుంటామని టీడీపీకి చెందిన నారప్పరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, నారప్పరెడ్డి రమే‹Ùరెడ్డి ఘర్షణకు దిగారు.
అనంతరం టీడీపీ నేతలు దాడికి తెగబడటంతో వైఎస్సార్‌సీపీ నేత భూమిరెడ్డి వెంకటరమణరెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయతి్నంచగా.. టీడీపీకి చెందిన వెంకటసుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డిలకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు. రెండువర్గాల ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీకి చెందిన బి.వెంకటరమణారెడ్డి, మరికొందరితోపాటు టీడీపీకి చెందిన ఎన్.వెంకటరమణ సుబ్బారెడ్డి, రమే‹Ùరెడ్డి, మరికొందరిపై కేసులు నమోదు చేసినట్టు ఎర్రగుంట్ల సీఐ నరే‹Ùబాబు తెలిపారు.
యంత్రాంగం ప్రేక్షక పాత్ర
పెద్దనపాడు వంక నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఇసుక అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని కలెక్టర్, ఎస్పీ పదేపదే చెబుతున్నా ఎర్రగుంట్ల మండలంలో యథేచ్ఛగా ఇసుక తరలిపోతోంది. నిత్యం గ్రామంలో రెవెన్యూ అ«ధికారులు తిరుగుతుంటారు. గ్రామస్తులు అడ్డుకునే వరకు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment