గెలిచిన వెంటనే ఇసుక యార్డులను హస్తగతం చేసుకున్న టీడీపీ నేతలు
దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ డిమాండ్
నర్సీపట్నం: కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత టీడీపీ నాయకులు పాల్పడిన ఇసుక దోపిడీపై విచారణ చేపట్టి, దోపిడీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో భారీఎత్తున ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల ఫలితాలకు ముందు నర్సీపట్నం గబ్బాడ యార్డులో లక్ష టన్నుల ఇసుక ఉండేదన్నారు.
ఫలితాలు వెలువడిన మరుసటి రోజే టీడీపీ నాయకులు యార్డును స్వా«దీనం చేసుకున్నారని చెప్పారు. లక్ష టన్నులు ఉండాల్సిన ఇసుక ప్రస్తుతం 48 వేల టన్నులే ఉందని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యార్డులోని రూ.5 కోట్లు విలువ చేసే ఇసుకను వాహనాల్లో తరలించి టీడీపీ నాయకులు సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు.
యార్డులోని 60 వేల టన్నుల ఇసుకను మాయం చేశారన్నారు. గబ్బాడ ఇసుక దోపిడీపై అధికారులు సమగ్రమైన విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని చెప్పారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను నయవంచనకు గురిచేసిందని గణేష్ దుయ్యబట్టారు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment