
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇసుక మాఫియా మరోసారి రెచ్చిపోయింది. రాజాపూర్ మండలం తిరుమలాపూర్‌లో తన పంట పొలాల్లో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రైతు గుర్రం కాడి నరసింహులును లారీతో ఢీకొట్టి.. ఇసుక మాఫియా ఆయన ప్రాణాలు బలిగొంది. గత ఏడాది అదే గ్రామంలో ఒక రైతుని కూడా అడ్డు వచ్చాడనే నెపంతో ఇసుక మాఫియా ఇసుక దిబ్బ కూల్చి రైతుని హత్య చేసినట్టు కూడా తెలిసింది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన పై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసి లారీ అద్దాలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఒక ప్రజా ప్రతినిధితో ఇసుక మాఫియా సెటిల్ మెంట్ చర్చలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment