సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్, ఏసీబీ విభాగాలతో తనిఖీలు చేయాలని ఆదేశించారు. అన్నిజిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలన్నారు. గురవారం సీఎం రేవంత్ రెడ్డి.. గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.
ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాకు అడ్డాగా మారిందని తెలిపారు.
48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. రెండు రోజుల తర్వాత అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గత వారం ఆకస్మిక తనిఖీలు చేస్తే 83 లారీల్లో 22 లారీలకు అనుమతి లేదన్నారు. దాదాపు 25 శాతం ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని సీఎం రేవంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment