
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) గురువారం విచారణ చేపట్టింది. ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్‌జీటీ ఆదేశించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం 20 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తామని ఎన్జీటీకి తెలిపింది. కాగా తెలంగాణలో అక్రమ ఇసుక తవ్వకాల జరుగుతున్నాయని.. రేలా సంస్థ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్జీటీ విచారణ చేపట్టింది.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విచారణ జరిపింది. నెల రోజుల్లో ఇసుక తవ్వకాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. లేదంటే రూ.100 కోట్లు జరిమానాను సీపీసీబీ ఖాతాలో వేయాల్సి ఉంటుందని ఏపీకి ఎన్జీటీ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ ఫిబ్రవరి 14కు వాయిదా వేస్తున్నట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్‌జీటీ) పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment