
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.63 కోట్ల ఆదాయం వచ్చింది. ఏడాది అంతా చూస్తే ఇది వేల కోట్లకు వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్ళింది చంద్రబాబు’ అంటూ ప్రశ్నిస్తూ ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. పచ్చ ఇసుక మాఫియా ద్వారా ఇన్నాళ్లు మీకు వాటా ముట్టిందని, అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇటువంటి సాహసం ఎవరూ చేయలేదు..
‘దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 14400 కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయింది. ఎవరు లంచం అడిగినా, డబ్బులివ్వందే పని జరగదని చెప్పినా ఫోన్ చేయొచ్చ’ని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.