సాక్షి, తిరుపతి: మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు కేసులో దొరికిన నేత చంద్రబాబు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.
మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది. గతంలో చంద్రబాబు తన అనుచరులకు దోచిపెట్టారు. టీడీపీ ప్రభుత్వం ఇసుక పేరుతో దోచుకుంది. ఇసుక కాంట్రాక్టు, మైనింగ్ విషయంలోనూ పారదర్శకంగా ఇస్తున్నాము. మేనిఫెస్టోలో హామీలు అమలు చేయని వ్యక్తి చంద్రబాబు.
కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 98 శాతానికి పైగా హామీలు అమలు చేశారు. సీఎం వైఎస్ జగన్ పారదర్శక పాలన అందిస్తుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో ఏపీకి సంబంధం ఏంటి?. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు’ అని విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment