
సాక్షి, చిత్తూరు: కుప్పం ప్రజలను ఇన్నాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవాచేశారు.
కాగా, వైఎస్సార్ చేయూత సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు అన్యాయం చేశారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాము. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు కుప్పంకు చేసిందేమీలేదు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారు’ అని తెలిపారు.
ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. ‘కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు. సీఎం వైఎస్ జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది’అని వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment