YS Jagan Kuppam Visit
-
వెన్నుపోటు, దొంగ ఓట్లకు బాబు కేరాఫ్
కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు.. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పంపులు తిప్పితే తాగడానికి నీరు వచ్చే పరిస్థితిని మాత్రం తీసుకు రాలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతులను.. ప్రధాన మంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు అనుభవం అంతా ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మాత్రం బాగా ఉపకరించిందని ఈ జిల్లాలో కథలు కథలుగా చెబుతారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్ అడ్రస్ చంద్రబాబే అని చెప్పారు. రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించే వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తమ బతుకులు బాగు పడ్డాయని లబ్ధిదారులు స్వయంగా చెప్పే ఈ చేయూత పండుగ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ వేదికపై నుంచి సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. కుప్పంపై కూడా బాబుకు వెన్నుపోటు ప్రేమే సొంత మామ మీద చంద్రబాబు చూపించే వెన్నుపోటు ప్రేమే కుప్పం మీద కూడా చూపారు. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు. ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం ఆలోచించ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారు. కుప్పంలో కరువు, నీటి సమస్య నివారణకు హంద్రీ–నీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అది చేస్తే ప్రజలు తన మాట వినరని భయపడిపోయారు. అందుకే ఆ హంద్రీ–నీవా పనులకు ఆయనే అవరోధంగా మారారు. ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం కాంట్రాక్టు ఇచ్చి వందల కొద్దీ ట్రాక్టర్లతో నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేశానని చెప్పుకొని, దొంగ అకౌంట్లతో దోచేశారు. కుప్పంతో మొదలు ప్రతి చోటా బీసీలకు అన్యాయమే.. కుప్పం నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారు. ఈ నియోజకవర్గం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాకపోయినా.. బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ తనే లాక్కొన్నారు. బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడు. 1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుప్పం అసెంబ్లీ టికెట్‌ను బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. కుప్పంతో మొదలు పెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశారు. బీసీలను వాడుకుని, విడిచి పెడుతున్నది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. బాబు చేయలేనిది మేం చేస్తున్నాం కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేస్తున్నాం. కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో పాటు.. దాని అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్ సబ్‌స్టేషన్ ఇచ్చాం. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేశాం. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. రాళ్లమడుగూరు జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా ఈ ప్రభుత్వమే. నవరత్నాల పథకాలన్నీ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం. రాష్ట్రమంతటితో పాటు కుప్పం నియోజకవర్గానికి వివిధ డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు.. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు.. మొత్తంగా ఈ నియోజకవర్గ ప్రజలకు రూ.1,149 కోట్లు పంపిణీ చేసింది మీ బిడ్డ జగనే. ఎమ్మెల్సీగా ఉంటూనే తన ద్వారా కుప్పానికి నాతో అన్నీ చేయిస్తున్న భరత్‌ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి. మంత్రిగా మీ ముందుకు పంపిస్తాను. ఈ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వానికి తేడా గమనించండి సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మీ ఈ ముఖ్యమంత్రి చూస్తున్న విధానానికీ మధ్య తేడాను ప్రజలు గమనించాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లల చదువులో, రైతుల్లో, ఆరోగ్య రంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. సామాజిక వర్గాల ఆర్తిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అడుగులు వేస్తోంది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన ప్రభుత్వం ఇది. నవరత్నాలు అమలు, డీబీటీ, పదవులు, కాంట్రాక్టులు.. ఇలా ఏది తీసుకున్నా పారదర్శకత కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఏకంగా చట్టాలు చేసి మేలు చేశాం. కానీ, చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడిని చూసుకుంటే చాలనుకున్నారు. ఎవరూ చూపరు, రాయరు.. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని భావించారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకొని అభివృద్ధికి మద్దతిస్తే ఎలా ఉంటుందో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్సార్సీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. చేతకానితనమా.. చేయకూడదనే దుర్బుద్ధా.. చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్ ఇస్తానన్నాడు. అది చేయలేదు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని ప్రజల చెవిలో పువ్వు పెట్టాడు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఈయనే అంటాడు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లొస్తుంటారు. వీరికి సొంత నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి చూపించాలన్న ఆలోచన ఈయనకు రాదు. చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండరు. ఇక్కడకు రారు. పట్టించుకోరు. 14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. చివరకు రెవెన్యూ డివిజన్ కోసం జగన్‌కు లేఖ రాస్తాడు. మీ కోసం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేశాం. చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు.. మెడికల్ కాలేజీ లేదు. పుట్టింటోళ్లు కూడా ఇలా ఆదుకోలేదు మూడేళ్ల క్రితం వరకు మా కుటుంబంలో నేను కూలీ పనులే చేసుకునేదాన్ని. చేయూత పథకంలో నాకు మొదటి విడతలో రూ.18,750 ఇచ్చారు. దానికి బ్యాంకు లోన్ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను. రెండో విడత వచ్చిన డబ్బులతో గడ్డి కటింగ్ మెషిన్ తీసుకొన్నాను. మా మహిళా సంఘం గ్రూప్ సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు వచ్చింది. బ్యాంకు వారు మాకు రూ.20 లక్షలు ఇస్తే నాకు రూ.2 లక్షలు వచ్చాయి. దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నా. స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి. మా పాపకు విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. తను బీఎస్సీ (హార్టికల్చర్) చదువుతోంది. ఇవాళ నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్ల పాలు పోస్తున్నాను. ఖర్చులు పోను నెలకు రూ.60 వేలు మిగులుతున్నాయి. ఈ ఘనత మా జగన్మోహన్రెడ్డిదే. నా పుట్టింటి వాళ్లు కూడా ఇలా సాయం చేయలేదు. మళ్లీ మళ్లీ జగన్నే సీఎంగా గెలిపించుకుందాం. – సుబ్బమ్మ, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు ఈసారి కూడా జగనే సీఎం.. గతంలో మేం కూలికి వెళ్లే వాళ్లం. మాకు మొదటి విడత చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా. రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది. నేను, మా ఆయన.. ఇద్దరం ప్రతి రోజూ మిమ్మల్ని తలుచుకుంటాం. వాళ్ల మేనమామ (సీఎం) వల్ల పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మూడో విడత వచ్చే డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను. మీ వల్ల పాలకు కూడా మంచి ధర వస్తోంది. మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతోనే ఉంటారు. మళ్లీ కూడా మీరే సీఎం. – మరియమ్మ, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పాలన జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇప్పుడు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైఎస్సార్ చేయూత పథకం ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సంతృప్త స్థాయిలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నారు. బటన్ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం టీడీపీ వాళ్లకూ లబ్ధి కలిగించాం చంద్రబాబూ.. నువ్వు పులివెందులకు వెళ్లొచ్చు కానీ, సీఎం కుప్పం రాకూడదా? మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించి, సులువుగా గెలవచ్చని ఇక్కడ పాతుకుపోయావు. ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేశావు. వైఎస్ జగన్ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమ పథకాలు వర్తింప చేసింది. అందుకే ఈ రోజు కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. ఇన్నేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖా మంత్రి బాబు ఎప్పుడూ అందుబాటులో లేరు 33 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులోనూ 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఇక్కడి వారికి ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. పైగా సీఎం జగన్ కుప్పంకు ఏం చేశారని అడుగుతున్నారు. మీతోనే (చంద్రబాబు) ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ప్రకటన చేయించారు. ఇది చాలదా.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతగా కృషి చేస్తున్నారో చెప్పడానికి. – భరత్, ఎమ్మెల్సీ ఎంఐజీ లేఅవుట్లలో.. 60% ధరకే విక్రయ ఒప్పందం సాక్షి, అమరావతి : పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న ఎంఐజీ లే అవుట్లు, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో భూమి ధరలను రెండు భాగాలుగా విభజించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇక నుంచి పట్టణాభివృద్ధి సంస్థలు భూమి ధరను మొత్తం విక్రయ ధరలో 60 శాతం, అభివృద్ధి రుసుములు కింద మొత్తం విక్రయ ధరలో 40 శాతంగా విభజించుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా స్థాయి కమిటీలు నిర్ణయించిన ధర ఆధారంగా ఈ విభజన ఉండాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో పూర్తి విక్రయ ధర చెల్లిస్తే గానీ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదని.. కానీ, ఇప్పుడు మొత్తం విక్రయ ధరలో 60 శాతం చెల్లించడం ద్వారా ఒప్పందం చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంవల్ల రిజి్రస్టేషన్ శాఖకు ఎటువంటి నష్టం ఉండదని.. సేల్‌డీడ్ ఇచ్చేటప్పుడు మొత్తం విక్రయ ధర అంటే భూమి ధర 60 శాతం, అభివృద్ధి రుసుము 40 శాతం చెల్లించిన తర్వాతే జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో వై. శ్రీలక్ష్మి స్పష్టంచేశారు. -
జగనన్న చేయూతకు జేజేలు.. కుప్పంలో సీఎం పర్యటనకు అపూర్వ స్పందన
చంద్రబాబును 33 ఏళ్లుగా గెలిపించినా కూడా ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఓటు కూడా లేదు. కుప్పం తన సొంతం అని ఆయన ఏనాడూ భావించ లేదు. హైదరాబాద్‌లో ఇంద్ర భవనం కట్టుకున్న ఆయన అక్కడ లోకల్, కుప్పంకు నాన్ లోకల్. నా దృష్టిలో పులివెందుల ఎంతో.. కుప్పం కూడా అంతే. ఈ ప్రాంత ప్రజల కోసం రూ.250 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ సమస్యలు తొలగ్గానే రూ.120 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తాం. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ కోసం రూ.66 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన నాలుగు మండలాల అభివృద్ధికి రూ.100 కోట్లు అవసరం అని భరత్ అడిగాడు. నువ్వు నియోజకవర్గంలో తిరుగు.. ఆ నిధులు ఇస్తానని చెబుతున్నా. – కుప్పం సభలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, చిత్తూరు, కుప్పం: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికారులు, వైఎస్సార్సీపీ నేతల అంచనాలకు మించి జనం భారీగా తరలివచ్చారు. కుర్చీల్లో కూర్చున్న వారి కంటే నిలుచున్న వారి సంఖ్య అంతకు మించి ఉండటం విశేషం. ఇక సభా ప్రాంగణం బయట, పట్టణమంతా జనసంద్రమే. బహిరంగ సభలో సీఎం ప్రసంగం ప్రజలను కట్టిపడేసింది. చంద్రబాబు గురించి ప్రస్తావించిన ప్రతిసారీ జనం కేరింతలు కొడుతూ నిజమేనంటూ కోరస్ పలికారు. బాబు మూడు దశాబ్దాల పాలనలో మగ్గిన కుప్పంలో మూడున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని చూస్తున్నారు కదా.. అనగానే జనం ఒక్కసారిగా కేకలు వేశారు. నాటి ప్రభుత్వానికి.. నేటి మన ప్రభుత్వానికి తేడాను గమనించారా? అనగానే చేతులు ఊపుతూ మద్దతు పలికారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్.. కుప్పానికి నాన్‌లోకల్’ అనగానే నవ్వులు, కేకలు మిన్నంటాయి. 33 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనిపించ లేదా అని ప్రశ్నిస్తూ.. అసలు కుప్పంలో ఆ పెద్దమనిషికి ఓటు కూడా లేదని చెప్పడంతో జనం పెద్దపెట్టున కేకలు వేశారు. ప్రధానంగా బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా వారికి అవకాశం ఇవ్వలేదన్నప్పుడు కేకలే కేకలు. ఇలా చంద్రబాబును విమర్శించిన ప్రతిసారీ ప్రజలు కేరింతలు కొట్టారంటే.. బాబు తీరుపై ఎంతగా విసిగిపోయారో ఇట్టే స్పష్టమవుతోంది. కాగా, అంతకు ముందు సీఎం వైఎస్ జగన్ కొంత మంది ‘చేయూత’ పథకం లబ్ధిదారులతో ముచ్చటించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఆ తర్వాత కుప్పంలో రూ.66 కోట్లతో చేపట్టిన మున్సిపల్ ఆఫీసు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, కేవీ ఉషశ్రీ చరణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు బాబు కేరాఫ్.. కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు.. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పంపులు తిప్పితే తాగడానికి నీరు వచ్చే పరిస్థితిని మాత్రం తీసుకు రాలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతులను.. ప్రధాన మంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు అనుభవం అంతా ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మాత్రం బాగా ఉపకరించిందని ఈ జిల్లాలో కథలు కథలుగా చెబుతారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్ అడ్రస్ చంద్రబాబే అని చెప్పారు. రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించే వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తమ బతుకులు బాగు పడ్డాయని లబ్ధిదారులు స్వయంగా చెప్పే ఈ చేయూత పండుగ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ వేదికపై నుంచి సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. కుప్పంపై కూడా బాబుకు వెన్నుపోటు ప్రేమే సొంత మామ మీద చంద్రబాబు చూపించే వెన్నుపోటు ప్రేమే కుప్పం మీద కూడా చూపారు. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు. ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం ఆలోచించ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారు. కుప్పంలో కరువు, నీటి సమస్య నివారణకు హంద్రీ–నీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అది చేస్తే ప్రజలు తన మాట వినరని భయపడిపోయారు. అందుకే ఆ హంద్రీ–నీవా పనులకు ఆయనే అవరోధంగా మారారు. ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం కాంట్రాక్టు ఇచ్చి వందల కొద్దీ ట్రాక్టర్లతో నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేశానని చెప్పుకొని, దొంగ అకౌంట్లతో దోచేశారు. కుప్పంతో మొదలు ప్రతి చోటా బీసీలకు అన్యాయమే.. కుప్పం నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారు. ఈ నియోజకవర్గం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాకపోయినా.. బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ తనే లాక్కొన్నారు. బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడు. 1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుప్పం అసెంబ్లీ టికెట్‌ను బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. కుప్పంతో మొదలు పెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశారు. బీసీలను వాడుకుని, విడిచి పెడుతున్నది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. బాబు చేయలేనిది మేం చేస్తున్నాం కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేస్తున్నాం. కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో పాటు.. దాని అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్ సబ్‌స్టేషన్ ఇచ్చాం. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేశాం. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. రాళ్లమడుగూరు జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా ఈ ప్రభుత్వమే. నవరత్నాల పథకాలన్నీ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం. రాష్ట్రమంతటితో పాటు కుప్పం నియోజకవర్గానికి వివిధ డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు.. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు.. మొత్తంగా ఈ నియోజకవర్గ ప్రజలకు రూ.1,149 కోట్లు పంపిణీ చేసింది మీ బిడ్డ జగనే. ఎమ్మెల్సీగా ఉంటూనే తన ద్వారా కుప్పానికి నాతో అన్నీ చేయిస్తున్న భరత్‌ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి. మంత్రిగా మీ ముందుకు పంపిస్తాను. ఈ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వానికి తేడా గమనించండి సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మీ ఈ ముఖ్యమంత్రి చూస్తున్న విధానానికీ మధ్య తేడాను ప్రజలు గమనించాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లల చదువులో, రైతుల్లో, ఆరోగ్య రంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. సామాజిక వర్గాల ఆర్తిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అడుగులు వేస్తోంది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన ప్రభుత్వం ఇది. నవరత్నాలు అమలు, డీబీటీ, పదవులు, కాంట్రాక్టులు.. ఇలా ఏది తీసుకున్నా పారదర్శకత కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఏకంగా చట్టాలు చేసి మేలు చేశాం. కానీ, చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడిని చూసుకుంటే చాలనుకున్నారు. ఎవరూ చూపరు, రాయరు.. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని భావించారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకొని అభివృద్ధికి మద్దతిస్తే ఎలా ఉంటుందో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్సార్సీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. చేతకానితనమా.. చేయకూడదనే దుర్బుద్ధా.. చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్ ఇస్తానన్నాడు. అది చేయలేదు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని ప్రజల చెవిలో పువ్వు పెట్టాడు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఈయనే అంటాడు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లొస్తుంటారు. వీరికి సొంత నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి చూపించాలన్న ఆలోచన ఈయనకు రాదు. చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండరు. ఇక్కడకు రారు. పట్టించుకోరు. 14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. చివరకు రెవెన్యూ డివిజన్ కోసం జగన్‌కు లేఖ రాస్తాడు. మీ కోసం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేశాం. చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు.. మెడికల్ కాలేజీ లేదు. పుట్టింటోళ్లు కూడా ఇలా ఆదుకోలేదు మూడేళ్ల క్రితం వరకు మా కుటుంబంలో నేను కూలీ పనులే చేసుకునేదాన్ని. చేయూత పథకంలో నాకు మొదటి విడతలో రూ.18,750 ఇచ్చారు. దానికి బ్యాంకు లోన్ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను. రెండో విడత వచ్చిన డబ్బులతో గడ్డి కటింగ్ మెషిన్ తీసుకొన్నాను. మా మహిళా సంఘం గ్రూప్ సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు వచ్చింది. బ్యాంకు వారు మాకు రూ.20 లక్షలు ఇస్తే నాకు రూ.2 లక్షలు వచ్చాయి. దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నా. స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి. మా పాపకు విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. తను బీఎస్సీ (హార్టికల్చర్) చదువుతోంది. ఇవాళ నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్ల పాలు పోస్తున్నాను. ఖర్చులు పోను నెలకు రూ.60 వేలు మిగులుతున్నాయి. ఈ ఘనత మా జగన్మోహన్రెడ్డిదే. నా పుట్టింటి వాళ్లు కూడా ఇలా సాయం చేయలేదు. మళ్లీ మళ్లీ జగన్నే సీఎంగా గెలిపించుకుందాం. – సుబ్బమ్మ, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు ఈసారి కూడా జగనే సీఎం.. గతంలో మేం కూలికి వెళ్లే వాళ్లం. మాకు మొదటి విడత చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా. రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది. నేను, మా ఆయన.. ఇద్దరం ప్రతి రోజూ మిమ్మల్ని తలుచుకుంటాం. వాళ్ల మేనమామ (సీఎం) వల్ల పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మూడో విడత వచ్చే డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను. మీ వల్ల పాలకు కూడా మంచి ధర వస్తోంది. మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతోనే ఉంటారు. మళ్లీ కూడా మీరే సీఎం. – మరియమ్మ, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పాలన జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇప్పుడు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైఎస్సార్ చేయూత పథకం ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సంతృప్త స్థాయిలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నారు. బటన్ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం టీడీపీ వాళ్లకూ లబ్ధి కలిగించాం చంద్రబాబూ.. నువ్వు పులివెందులకు వెళ్లొచ్చు కానీ, సీఎం కుప్పం రాకూడదా? మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించి, సులువుగా గెలవచ్చని ఇక్కడ పాతుకుపోయావు. ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేశావు. వైఎస్ జగన్ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమ పథకాలు వర్తింప చేసింది. అందుకే ఈ రోజు కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. ఇన్నేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖా మంత్రి బాబు ఎప్పుడూ అందుబాటులో లేరు 33 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులోనూ 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఇక్కడి వారికి ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. పైగా సీఎం జగన్ కుప్పంకు ఏం చేశారని అడుగుతున్నారు. మీతోనే (చంద్రబాబు) ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ప్రకటన చేయించారు. ఇది చాలదా.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతగా కృషి చేస్తున్నారో చెప్పడానికి. – భరత్, ఎమ్మెల్సీ * జనవరి నుంచి పింఛన్ రూ.2,750 కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుతం రూ.2,500 చొప్పున ఇస్తున్న అవ్వాతాతల పింఛన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,750కి పెంచబోతున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3 వేల వరకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధుల జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి దాకా మొత్తం రూ.14,110.62 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మూడు విడతలలో కలిపి ఒక్కొక్కరికీ ఇప్పటికే రూ.56,250 అందజేశామన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలు కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించామన్నారు. 60 ఏళ్లు నిండిన వారు పెన్షన్ జాబితాలోకి వెళ్లిపోతారని, కొత్తగా 45 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలోకి చేరుతారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అమ్మ కడుపులో బిడ్డ మొదలు అవ్వ వరకు.. అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందు కేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, పొదుపు సంఘాల వైఎస్సార్ సున్నా వడ్డీ.. ఈ నాలుగు పథకాల ద్వారానే కేవలం 39 నెలల్లో ఈ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12,757 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. మూడో దఫా జనవరి నెలలో ఇవ్వనున్నాం. చేయూత ద్వారా 26.4 లక్షల మందికి రూ.14,111 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.3,615 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదు. మొత్తంగా ఈ 39 నెలల్లో అన్ని రకాల పథకాల ద్వారా బటన్ నొక్కి మహిళలకు అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు. అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే రూ.1.71 లక్షల కోట్లు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలన్నీ అమలు చేస్తున్నాం. ఆరు నాన్ డీబీటీ పథకాలైన ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ద్వారా ఇచ్చిన రూ.1.41 లక్షల కోట్లు కలుపుకుంటే.. మొత్తం రూ.3,12,764 కోట్లు. ఇందులో అక్కచెల్లెమ్మలకే రూ.2.39 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ.2.3 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది. చేయూతతో 5.82 లక్షల మందికి ఆర్థిక సాధికారత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే డబ్బుతో చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి వాడుకోవాలా? అన్నది పూర్తిగా మహిళల నిర్ణయానికే వదిలేశాం. అయితే, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్ చేశాం. మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందించేలా చేస్తున్నాం. ప్రతి అక్కా, చెల్లెమ్మ రూ.7 వేల నుంచి రూ.10 వేలు ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల కొనుగోలుకు సహకరిస్తున్నాం. వీరిని ప్రోత్సహించేందుకు అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. గతంలో కన్నా కనీసం లీటర్ పాలకు రూ.5–15 ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. 2.96 లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు. 1.15 లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం 5,82,662 మంది ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ చేయూత పథకం ఉపయోగపడింది. అప్పుడు, ఇప్పుడు అదే బడ్జెట్ ఇంతకు ముందు పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్. అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే. కానీ అప్పటి ప్రభుత్వంలో ఇంతగా లబ్ధి ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎలా జరుగుతోంది.. మీరే ఆలోచించండి. è ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతి ఉండేది. కేవలం నలుగురు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు.. వారికి తోడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది కాదు. ఇవాళ బటన్ నొక్కుతున్నాం.. నేరుగా మీ (లబ్ధిదారుల) ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ కుప్పం పర్యటన (ఫొటోలు)
-
చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప.. చేసిందేమీ లేదని సీఎం జగన్ చాటిచెప్పారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంత గడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు. కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదు. చంద్రబాబు హైదరాబాద్‌కి లోకల్.. కుప్పానికి నాన్‌లోకల్ అని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజలకు ఏం కావాలో కూడా ఆయన ఆలోచించలేదని సీఎం జగన్ అన్నారు. గత పరిపాలనలో కంటే అప్పులు ఈ ప్రభుత్వం తక్కువగా చేస్తోందని, అదే సమయంలో అభివృద్ధి ఎక్కువగా చేస్తున్నామని సీఎం జగన్ తెలియజేశారు. అప్పుడు.. దోచుకో పంచుకో తినుకో ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బాగుపడ్డారని అన్నారాయన. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సంక్షేమం సాధ్యమైందని, ప్రజలు అది గుర్తించాలని సీఎం జగన్ మనవి చేసుకున్నారు. చంద్రబాబుది చేతగాని తనం అనాలా? చేయకూడదనే దుర్భుద్ది అనాలా? అర్థం కావట్లేదన్నారు ఆయన. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాడని అన్నారు. పైగా హంద్రీనీవాకు ఆటంకంగా కూడా మారారన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడని, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని, కుప్పంకు మంచి నీళ్లు మాత్రం తెప్పించలేకపోయాడన్నారు. కుప్పంలో సరైన రోడ్లు కూడా వేయించలేకపోయారని విమర్శించారు. ఉపాధి కల్పించాలనే ఆలోచన కూడా చేయలేదని.. కుప్పం నుంచి నిరుద్యోగులు కూడా తరలిపోయారన్నారు. కుప్పానికి చేం చేయలేని చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు అని సీఎం జగన్ మండిపడ్డారు. చివరకు.. సీఎంగా ఉన్న టైంలో ఏనాడూ రెవెన్యూ డివిజన్ గురించి ఆలోచించలేదని, కానీ, ప్రజా ఒత్తిడితో రెవెన్యూ డివిజన్ కావాలని లేఖ రాశాడని సీఎం జగన్ తెలిపారు. ‘‘కానీ, జగన్ మీవాడు.. మంచోడు.. మీ బిడ్డ.. మీరు అడిగారు.. జగన్ ఇచ్చాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ ఎవరంటే అది చంద్రబాబేనని అని అన్నారు. బీసీల సీటు అయిన కుప్పంను సైతం లాక్కుని తన మార్క్ సామాజిక న్యాయం ప్రదర్శించాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ‘‘చంద్రబాబుకు తలవంచేది లేదని కుప్పం ప్రజలు తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశాం. కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారు. కుప్పం ప్రజలకు మూడేళ్లలో పథకాలతో రూ.1,149 కోట్లు ఇచ్చాం. కుప్పం నియోజక వర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు ఇచ్చాం. నాన్ డీబీటీ ద్వారా రూ.283కోట్లు ఇచ్చాం. చంద్రబాబుకు తనకు పిల్లనిచ్చిన మామపై ఎలాంటి ప్రేమ ఉందో.. కుప్పంపై కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమే ఉందన్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాం. ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తి చేస్తాం. కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. రామకుప్పంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేగెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను కూడా పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పూర్తి చేశాం. ఇంకా చాలా చేశాం. ఇవన్నీ పూర్తి చేసింది మీ బిడ్డే అని సీఎం జగన్ కుప్పం ప్రజలకు గుర్తు చేశారు. ఈ మూడేళ్లలోనే కుప్పం సిసలైన అభివృద్ధిని చూసింది. ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్ నాతో ఇన్ని మంచి పనులు చేయించాడు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తా. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్ కుప్పం ప్రజలకు చివరగా విజ్ఞప్తి చేశారు. -
కుప్పం అంటే ఇప్పుడు అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదు. నా అక్కచెల్లెమ్మల అభివృద్ది. నా అనుకుంటున్న అన్ని వర్గాల ఇంట అభివృద్ధి. అది ఇక్కడి చిరునవ్వులోనే కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పంలోని అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి బహిరంగ సభ నుంచి ప్రసంగించారు. మరో మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. నా పేద ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా పేద అక్కచెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. కుటుంబాన్ని బాధ్యతతో మోస్తున్నవాళ్లకు అండగా ఉండేందుకు అమలు చేస్తున్న కార్యక్రమని సీఎం జగన్ గుర్తు చేశారు. చేయూతతో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పు అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేకాదు.. వారం రోజుల చేయూత ఉత్సవాలు కుప్పం నుంచి ప్రారంభం అవుతాయని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు వచ్చి.. అక్కాచెల్లెమ్మల సంతోషంలో భాగస్వాములవుతారని అన్నారు. ఇక ఇదే వేదిక నుంచి ఏపీలో జనవరి నుంచి పెన్షన్ రూ.2,750కి పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అలాగే.. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు మూడు వేల రూపాయలు వరకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరస్తామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కూడా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత నిధులు అందిస్తున్నామని, ఈ ఏడాదికిగానూ అక్కాచెల్లెమ్మల కోసం రూ.4,949 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఒక్క చేయూత ద్వారానే మూడేళ్లలో రూ.14,110 కోట్ల సాయం అందించామని, అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్ తెలియజేశారు. అలాగే ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు ఇచ్చినట్లు, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడా పారదర్శకతా, వివక్ష లేకుండా.. బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతున్నాయని ఆయన అన్నారు. గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించాలని, ఒక్కసారి ఆలోచించమని ప్రతీ అక్కాచెల్లెమ్మను కోరారు సీఎం జగన్. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించాలనే స్వేచ్ఛను అక్కాచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టామని, అది ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలని, అవసరమైన సాంకేతికత ప్రభుత్వం తరపున అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
‘సీఎం జగన్ వల్లే చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు’
సాక్షి, చిత్తూరు: కుప్పం ప్రజలను ఇన్నాళ్లు టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోయారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎద్దేవాచేశారు. కాగా, వైఎస్సార్ చేయూత సభలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చంద్రబాబు అన్యాయం చేశారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు మంచినీరు కూడా ఇవ్వలేకపోయారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాము. 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు కుప్పంకు చేసిందేమీలేదు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారు’ అని తెలిపారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ.. ‘కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు. సీఎం వైఎస్ జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది’అని వ్యాఖ్యలు చేశారు. -
అన్నొచ్చిన వేళ.. కుప్పంలో పండుగ వాతావరణం
సాక్షి, చిత్తూరు: అక్కడేం ఎన్నికలు జరగడం లేదు. విజయోత్సవాల నిర్వహణ అంతకన్నా కాదు. అయినా పండుగకు ఏమాత్రం తీసిపోని వాతావరణం వెల్లివిరిసింది. రాజన్న బిడ్డ తమ గడ్డకు సీఎం హోదాలో వచ్చిన వేళ.. మురిసిపోయిన కుప్పం జనసంద్ర సంబురమే అదంతా!. అడుగడుగునా స్వాగత తోరణం.. వయసుతో సంబంధం లేకుండా ‘వైఎస్ జగన్’ నినాదాలు. తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నేతను చూడాలనే ఉత్సాహం, అంతకు మించి అభిమానం.. మూడు కిలోమీటర్ల మేర వాళ్లను ఎండనుసైతం లెక్కచేయకుండా నిలబెట్టింది. సంక్షేమ పథక అమలుతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తమ చెంతకు వచ్చిన రాజన్న బిడ్డకు జనం పట్టిన నీరాజనం ఇది. కుప్పం పాత పేట వద్ద హెలిప్యాడ్ చెంత నుంచి సభా ప్రాంగణ వేదిక దాకా.. దారి వెంబడి వైఎస్ కుటుంబ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బారులు తీరారు. జగనన్న అంటూ యువత నినాదాల నడుమ.. ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది కుప్పం. తమ బాగోగులు చూస్తున్న మనవడి కోసం అవ్వాఅయ్యాలు.. పెద్దకొడుకులా కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు అమ్మలు, తోబుట్టువుల్లాగా తమను ఆదరిస్తున్నందుకు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు.. విద్యను అందిస్తూ మేనమామ కోసం విద్యార్థులు కుప్పంలోనూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ఇలాకాగా, టీడీపీ కంచుకోటగా జబ్బలు చరుచుకునే పచ్చ నేతలకు.. జన నేతకు లభిస్తున్న సాదర ఘనస్వాగతం ఏమాత్రం మింగుడుపడని విషయమే!. ముప్ఫైమూడు ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని కుప్పంలో.. ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఎంతో చేసి చూపించారని, జనసంక్షేమ పథకాలను తాము అర్థం చేసుకున్నామని అంటున్నారు అక్కడి జనం. ఇక ఈ జోష్‌తో.. వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డ జగన్ అడ్డాగా మారబోతోందని, అక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. -
CM YS Jagan Kuppam Tour: నూతన వెలుగులు..ఉద్యానవనాల అభివృద్ధి
మాటల్లో చెప్పలేని ఆనందం సొంత నియోజకవర్గంతో సమానంగా కుప్పంను అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ దిశగా అడుగులు వేస్తుండడం చాలా సంతోషం. ఈ పనులను ప్రారంభించేందుకు స్వయంగా ఆయనే వస్తుండడంతో మాటల్లో చెప్పలేని ఆనందం ఉంది. మా ప్రాంతంలో ప్రధానంగా తాగునీటి సమస్య చాలా కాలంగా ఉంది. సీఎం చొరవతో ఇప్పటికి పరిష్కారం లభించనుంది. – చిలకమ్మ, కుప్పం అభివృద్ధి చేసి చూపుతున్నారు మాటల్లో చెప్పడమే కాదు, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపుతోంది. పథకాల కోసం ఎక్కడెక్కడో తిరిగే పని లేకుండా వలంటీర్లే ఇంటి వద్దకు వచ్చి సేవలందిస్తున్నారు. ప్రతీ విషయంలో జవాబుదారీ ఉంటోంది. గతంలో పట్టణమంతా సమస్యలే. ఇప్పుడు కోట్లాది రూపాయల పనులు చేస్తుండటంతో వాటన్నింటికీ పరిష్కారం లభిస్తుందనే నమ్మకం కలిగింది. – జయమ్మ, కుప్పం ప్రజల అమాయకత్వాన్ని టీడీపీ అధినేత ఓట్లుగా మలుచుకున్నారే కానీ.. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ కృషి చేయలేదు. సమస్యలు పరిష్కారమైతే ఎక్కడ ప్రజలు తమ చేయి జారిపోతారోనని ఆ ఊసెత్తకుండా ‘రాజకీయం’ అనే గంప కిందనే ఉంచేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పాలన పారీ్టలు, కులమతాలకు అతీతంగా సాగుతోంది. సీఎం తన సొంత నియోజకవర్గం తరహాలోనే ప్రతిపక్ష నేత ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టి తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నా.. బాబుకు ఇటీవల ఎన్నికల్లో ఓటమే ఎదురైంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.66కోట్లతో మున్సిపాలిటీ రూపురేఖలు మార్చనుండటం విశేషం. కుప్పం: మూడేళ్లలోనే 30 ఏళ్లకు సరిపడా అభివృద్ధి కుప్పం సొంతమవుతోంది. ఇప్పటి వరకు సంక్షేమం ఎరుగని ప్రజలకు ఇప్పుడు ఇంటి తలుపుతడుతున్న పథకాలను చూసి ఆశ్చర్యం కలుగుతోంది. ఇన్ని రోజులు తాము ఎలా మోసపోయామో తెలుసుకున్న ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. వరుస ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినేత రాజకీయ చలి కాచుకునే ప్రయత్నం చేస్తున్నా స్థానికులు అభివృద్ధికే ఆకర్షితులు అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి.. కుప్పం విషయంలోనూ తనదైన మార్కు కనపరుస్తున్నారు. మున్సిపాలిటీ అప్‌గ్రేడ్ చేయడంతో పాటు రెవెన్యూ డివిజన్‌గా మార్పు చేశారు. తాజాగా పట్టణాన్ని సమస్యల సుడిగుండం నుంచి గట్టెక్కించేందుకు ఏకంగా రూ.66కోట్లు కేటాయించడంతోపాటు పనుల ప్రారం¿ోత్సవానికి స్వయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రానుండడంతో కుప్పం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. నూతన వెలుగులు పట్టణం వేగంగా విస్తరిస్తున్నా ఆయా ప్రాంతాల్లో సరైన వీధి దీపాలు లేకపోవడంతో చాలా చోట్ల చీకటి కమ్ముకుంది. నూతన లేఅవుట్లలోని ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం విద్యుత్ స్తంభాలతోపాటు మెర్క్యూరీ బల్బుల ఏర్పాటుకు ప్రభుత్వం రూ.1.5 కోట్లు కేటాయించింది. ఈ పనులతో పట్టణం వెలుగులు సంతరించుకోనుంది. ఉద్యానవనాల అభివృద్ధి పట్టణంలోని రాజావారి పార్కుతో పాటు దళవాయికొత్తపల్లి పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారు. రూ.2.55 కోట్లతో వీటిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం చెరువు నిండి మొరవ పారుతుండడంతో ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక్కడ పార్కు అభివృద్ధి చేస్తే ప్రజలకు మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. అదేవిధంగా సాయంకాలం, సెలవుల సమయాల్లో పట్టణ ప్రజలు, పిల్లలకు అభివృద్ధి చేయనున్న పార్కులు ఊరట కల్పించనున్నాయి. మున్సిపాలిటీకి నూతన భవనం స్వాతం్రత్యానికి ముందు నిర్మించిన పురాతన భవనంలోనే ఇప్పటికీ మున్సిపాలిటీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. అప్‌గ్రేడ్ అయిన తర్వాత ప్రజల రాకపోకలు, అధికారుల బాధ్యతలు రెట్టింపయ్యా యి. ఈ నేపథ్యంలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.4.3 కోట్లు కేటాయించింది. శ్మశాన వాటిక ఆధునీకరణ పట్టణ నడిఒడ్డున ఉన్న శ్మశాన వాటికను ఆధునీకరించేందుకు రూ.1.38 కోట్లు ఖర్చు చేయనున్నారు. అంత్యక్రియల నిర్వహణకు ప్రత్యేక షెడ్లు, నీటి సమస్యతో పాటు ఈ ప్రాంతం రూపురేఖలు మార్చనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు అంగన్వాడీ మహిళ కమ్యూనిటీ భవనాలకు ప్రభుత్వం రూ.69 లక్షలు కేటాయించింది. పట్టణంలోని 4 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించనున్నారు. అదేవిధంగా మహిళా సంఘాల సమావేశాల నిర్వహణకు ప్రత్యేకంగా కమిటీ హాలు నిర్మించనుండటం విశేషం. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల్లో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. శాశ్వత పరిష్కారం దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డికే పల్లి చెరువు నుంచి తాగునీటి సరఫరాకు ప్రణాళిక సిద్ధం చేసింది. పట్టణ పరిధి పెరగడంతో చుట్టుపక్క గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీటిని అందించేందుకు ముమ్మర ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా రూ.3.67 కోట్లతో నూతన బోరు డ్రిల్లింగ్, పైపులైన్లను ఏర్పాటు చేయనున్నారు. డీకే పల్లి చెరువుతో పాటు అనిమిగానిపల్లి, తంబిగానిపల్లి, పరమసముద్రం, చీగలపల్లి, కమతమూరు గ్రామాల్లో నూతన డ్రిల్లింగ్‌తో పాటు ట్యాంకుల నిర్మాణంతో తాగునీటిని అందించనున్నారు. డ్రైనేజీ, సీసీ రోడ్డుకు ప్రాధాన్యం ప్రభుత్వం కేటాయించిన నిధుల్లో అధిక శాతం సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వెచ్చించనున్నారు. ఏకంగా రూ.43.5 కోట్లు ఇందుకోసం ఖర్చు చేయనుండటం విశేషం. పట్టణంలో మురుగునీటి కాలువలు లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. తాజా పనులతో పట్టణ రూపురేఖలు మారిపోనున్నాయి. మున్సిపాలిటీలో కొత్తగా 8 పంచాయతీల్లోని గ్రామాలను చేర్చారు. వీటన్నింటికీ మహర్దశ రానుంది. ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం పారదర్శక పాలనకు సీఎం వైఎస్ జగన్ నిదర్శనం. అభివృద్ధి విషయంలో ఆయనకు పక్కా ప్రణాళిక ఉంది. ముఖ్యంగా కుప్పం విషయంలో చూపుతున్న చొరవ ఎనలేనిది. గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసినా, కోట్లాది రూపాయల నిధులతో ఏళ్ల నాటి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. సీఎం అడుగుజాడల్లో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. – డాక్టర్ సుధీర్, చైర్మన్, కుప్పం మున్సిపాలిటీ -
చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్: సీఎం జగన్
సీఎం జగన్ కుప్పం పర్యటన.. అప్డేట్స్ 1:48PM మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల వైఎస్సార్ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 4,949.44 కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం జగన్ 12:50PM సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని కీలకాంశాలు కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి కుప్పం అంటే ఈరోజు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు.. ఇలా ప్రతి ఇంటా అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో వీరి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం 26,39, 703 మందికి వరుసగా మూడో ఏడాది వైయస్సార్ చేయూత అమలు చేస్తున్నాం ఈ ఏడాది అందిస్తున్న ఆర్థిక సహాయంతో అక్షరాల రూ. 4,949.44 కోట్లుతో మొత్తంగా రూ.14,110.62 కోట్లు వారంరోజులపాటు చేయూత ఉత్సవాలు వారంరోజుల పాటు ప్రతి మండలంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేయూత పంపిణీ చేయూత మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు సమాజానికే మార్పులు వరుసగా నాలుగేళ్లపాటు అదే అక్క చెల్లెమ్మకు రూ.75వేలు అందిస్తామని హామీ ఇచ్చాం మనసా , వాచా, కర్మణా అమలు చేశాం ఈ మూడో విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు అక్షరాల చేయూత ద్వారా రూ.56,250లు పెట్టినట్టు అవుతుంది 45–60 సంవత్సరాల మధ్యలో నా పేద అక్కచెల్లెమ్మలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చాం ఈ వయస్సులో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారు వాళ్ల చేతిలో డబ్బులు పెడితే.. ఆకుటుంబం ఎదుగుతుందని విశ్వసించాం ఇక 60 ఏళ్లు దాటితే ఎలాగూ పెన్షన్‌వస్తుంది సూర్యోదయానికి ముందే.. ఠంచనుగా పెన్షన్ ఒకటో తారీఖున వస్తోంది పెన్షన్ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3వేల వరకూ తీసుకుని పోతాను అంటూ చెప్పిన మాటను నెరవేరుస్తున్నాను అమ్మ కడుపులోని బిడ్డ నుండి, ఆప్యాయంగా ఆశీర్వదించే బిడ్డ వరకూ మన ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం మీది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ చేయూత ద్వారానే రూ.14,110 కోట్లు అందించాం అక్కచెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా ఈప్రభుత్వం అడుగులు ముందుకేసింది అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షలమందికి రూ.19,617 కోట్లు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ఇచ్చాం వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74లక్షలమందికి రూ. 12,757 కోట్లు ఇచ్చాం రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి మూడో దఫా జనవరి మాసంలో ఇస్తున్నాం చెప్పిన మాటమేరకు నాలుగు దఫాల్లో ఇస్తున్నాం చేయూత ద్వారా 26.4లక్షలమందికి రూ. 14,111 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సున్నా వడ్డీ పథకానికి రూ. 3,615 కోట్లు ఇచ్చాం కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా 39 నెలల కాలంలో రూ.51వేల కోట్లు ఇచ్చాం బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము రూ.1,17,666 కోట్లు ఇచ్చాం అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే.. రూ. 1.71లక్షల కోట్లు అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం మార్పును చూడమని, తేడాను చూడమని కోరుతున్నాను అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడండి నాన్ డీబీటీ పథకాలతో కలుపుకుంటే.., అక్షరాల ఈ 39 నెలల కాలంలో ప్రతికుటుంబానికీ ఇచ్చిందిమొత్తం రూ.3,12,764 కోట్లు ఇచ్చాం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం 21 లక్షల ఇళ్ల నిర్మాణలు వేగంగా జరుగుతున్నాయి ఇళ్లు పూర్తైతే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షల ఇస్తి ఇచ్చినట్టు అవుతుంది ఇళ్ల కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది తేడా గమనించమని ప్రతి అక్కా చెల్లెమ్మను కోరుతున్నాం ఇంతకుముందు పరిపాలనలో ఇక ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడూ అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి... అప్పుడు చేసిన అప్పులు కన్నా.. ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే కాని, ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి.. ఆలోచన చేయలేదు ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో తినుకో.. పద్ధతి ఉండేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది లేదు ఇవాళ బటన్ నొక్కుతున్నాం... నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి అందుకనే ఇప్పుడు జరుగుతున్నాయి..., ఇప్పుడు జరగలేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారం చేయూత ద్వారా వచ్చే డబ్బును ఎలా వాడుకోవాలన్నది మీ చేతిలో పెట్టాను చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి ఎలా వాడుకోవాలా? అన్నది మీ నిర్ణయమే చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారికి వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్చేశాం మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందిచేలా కూడా చేస్తున్నాం ప్రతి అక్కా.. చెల్లెమ్మ మరో రూ.7–10వేల ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని ప్రభుత్వం చూపించనుంది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొనాలన్నా.. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం గతంలో కన్నా కనీసం రూ.5–15లు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థకూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది వైఎస్సార్ ఆసరా, చేయూతల ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షలమంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు మరో 60,995 మంది వస్త్రవ్యాపారం చేస్తున్నాం 2.96లక్షలమంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు 1.15లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో వారు ఉపాధి పొందుతున్నారు 12:25PM 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కుప్పం రూపు రేఖలు మారాయి. మూడేళ్లలో మహిళలకు రూ. 2.39 లక్షల కోట్ల సాయం అందించారు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారు. వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం. కుప్పం అభివృద్ధశిని వైఎస్ జగన్ చేతల్లో చూపిస్తున్నారు. భరత్‌ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి: మంత్రి పెద్దిరెడ్డి కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు: ఎమ్మెల్సీ భరత్.సీఎం వైఎస్ జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ భరత్ 12:00PM ‘వైఎస్సార్ చేయూత’ వేదిక వద్దకు చేరిన సీఎం జగన్ 11:15AM కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కుప్పంలో అడుగడుగునా సీఎం జగన్‌కు నీరాజనం సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన కుప్పం ప్రజలు 10:50AM సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ డా.గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరలు ఉన్నారు. 9:15AM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుప్పం పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం తర్వాత.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ► పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. ► బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద.. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు అర్హులకు రూ.14,110.62 కోట్ల లబ్ధి ► రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ► సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. -
కుప్పం వేదికగా 'చేయూత'
సాక్షి, అమరావతి/చిత్తూరు: వైఎస్సార్ చేయూత పథకం కింద శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం వేదికగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు. పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. ఇప్పటి వరకు రూ.14,110.62 కోట్ల లబ్ధి ► రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ► సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. ► వీటితో పాటు 60 ఏళ్లు నిండిన అర్హులైన వారికి వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా ప్రతి నెలా 1వ తేదీనే కచ్చితంగా పింఛన్ పంపిణీ చేస్తోంది. అమ్మ కడుపులోని బిడ్డ నుంచి అవ్వల వరకు అందరినీ అన్ని దశల్లోనూ కంటికి రెప్పలా ఆదుకుంటోంది. జీవనోపాధి పెంపు ఇలా.. ► ఇప్పటి వరకు 5,82,662 మంది అక్కచెల్లెమ్మలు వైఎస్సార్ చేయూత ద్వారా కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్నారు. వీరిలో 1.10 లక్షల మంది కిరాణా దుకాణాలు, 60,995 మంది వస్త్ర వ్యాపారం, 1,15,446 మంది ఇతర జీవనోపాధి, 2,96,221 మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకంలో రాణిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ► ప్రతి మండలానికి ఒక వైఎస్సార్ చేయూత మహిళా మార్ట్ ద్వారా అక్కచెల్లెమ్మలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారిని వ్యాపార వేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ► కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న అక్కచెల్లెమ్మలకు ఐటీసీ, హెచ్‌యూఎల్, పీఅండ్‌జీ, రిలయెన్స్ వంటి కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ చేయించి మార్కెట్ రేటు కంటే తక్కువకు నాణ్యమైన సరుకులు అందేలా చర్యలు తీసుకుంది. పాడి గేదెలు, ఆవులు కొనుగోలు చేయడానికి సహాయం చేస్తూనే అమూల్ భాగస్వామ్యంతో మార్కెట్లో ఇస్తున్న ధర కంటే లీటర్ పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనంగా అందిస్తోంది. ► పేద అక్కచెల్లెమ్మలకు ఆర్థిక శక్తిని అందిస్తే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, జీవన స్థితిగతులు మెరుగు పడతాయన్న ఉద్దేశంతో సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివిధ పథకాల ద్వారా 5,30,01,223 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,39,013.40 కోట్లు లబ్ధి చేకూర్చారు. శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కుప్పంలో పర్యటించనున్నారు. అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారి ఇక్కడ పర్యటించనున్న నేపథ్యంలో భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో కుప్పం నిండిపోయింది. కుప్పం చెరువు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు మూడు కిలోమీటర్ల మేర దారిపొడవునా స్వాగత తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా, ముఖ్యమంత్రి ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, రేణిగుంట మీదుగా 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. ఇక్కడ కార్యక్రమాల అనంతరం తిరిగి మధ్యాహ్నం 3.10 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు. -
Kuppam: రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పాలన
కులం లేదు.. మతం లేదు.. పార్టీలతో సంబంధం లేదు.. అర్హులైతే చాలు, పథకం తలుపు తడుతోంది. గతంలో జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలకు.. ఇళ్ల మధ్యనున్న సచివాలయం సాదర స్వాగతం పలుకుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ‘నవ’రత్న పథకాలతో ప్రతి కుటుంబం వేల నుంచి లక్షల రూపాయల లబ్ధి పొందుతోంది. ఏ సమస్య వచ్చినా మేమున్నామంటూ ఇంటి వద్దకే వస్తున్న వలంటీర్లు.. లోటుపాట్లు తెలుసుకునేందుకు ‘గడప గడప’కు వెళ్తున్న నేతలు.. సంక్షేమ పాలనలో ఊరూవాడా అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. చిత్తూరు కలెక్టరేట్/కుప్పం: సంక్షేమ పాలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త అర్థం చెబుతోంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా ప్రతి ఇంట్లో ఆనందం నింపుతోంది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన వారందరికీ ఇళ్ల వద్దకే ప్రభుత్వ పథకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కింది. ఈ విషయంలో ప్రతిపక్ష టీడీపీ నేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం అయినా సరే.. సీఎం సొంత నియోజకవర్గానికి ఏమాత్రం తీసిపోకుండా పాలనలో పారదర్శకత కనిపిస్తుంది. కుప్పం వాసుల చిరకాల కోరికలైన మున్సిపాలిటీ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాము ప్రజల పక్షమని నిరూపించింది. చంద్రబాబు తన నియోజకవర్గంలో సర్కారు బడులను మూసివేసి ఓ కార్పొరేట్ పాఠశాలకు అనుమతిచ్చి విద్యను వ్యాపారం చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గంలో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి నాడు–నేడు మొదటి దశలో 121 సర్కారు పాఠశాలల రూపురేఖల మార్పునకు రూ. 31.23 కోట్లు, రెండవ దశలో 267 పాఠశాలలకు రూ.101.48 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఇళ్లు లేని పేదలకు టీడీపీ పాలనలో 3,800 మందికి పట్టాలు ఇవ్వగా.. 4,691 మందికి ఇళ్లు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 15,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పక్కా గృహాలను నిర్మిస్తోంది. కుప్పం ప్రజలను చంద్రబాబు తన రాజకీయ లబ్ధికి వాడుకోగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చీకటి జీవితాల్లో వెలుగులు నింపుతూ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధికి మారుపేరుగా తీర్చిదిద్దుతుండడం గమనార్హం. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చెందిన ఈమె పేరు అమ్ములు. భర్త మంజునాథ్ వ్యవసాయ కూలీ. టీడీపీ కార్యకర్త. వీరికి ఇద్దరు పిల్లలు హృతిక్(4), దివ్య(3). కరోనా నేపథ్యంలో ఉపాధి లేక ఉన్న ఒక్క ఆవు ఇచ్చే పాలను అమ్ముకుని జీవించేవారు. టీడీపీ పాలనలో ఈ కుటుంబానికి ఎలాంటి లబ్ధి కలగలేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ కుటుంబం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా రూ.18,400, వెలుగులో రూ.50 వేల రుణం పొందింది. ప్రభుత్వ పథకాల సహాయంతో రామకుప్పం మండలంలో మురుకుల తయారీ కేంద్రం ప్రారంభించారు. ప్రస్తుతం వ్యాపారం సజావుగా సాగుతుండంతో నెలకు అన్ని ఖర్చులు పోను రూ.8 వేల నుంచి రూ.10 వేల ఆదాయం వస్తోంది. వీరి జీవనం సాఫీగా సాగుతోంది. కుప్పం పట్టణంలోని పాత పోస్టాపీసు వీధికి చెందిన ఈమె పేరు ధనలక్ష్మీ. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. భర్త మురుగన్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు ప్రియదర్శిని, భూమిక. వీరిని చదివించేందుకు ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా అమ్మ ఒడి ఇస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పిల్లలను చదివిస్తోంది. రామకుప్పం మండలం విజలాపునికి చెందిన సాగరాభి(65) కుటుంబంలో ఆరుగురు ఉన్నారు. సాగరాభి వృద్ధాప్యం, హనీష్(45) దివ్యాంగుడు కావడంతో నిత్యం నరకమే. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. కూలీలుగా మారారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం వచ్చాక, సాగరాబీకి రూ.2,500, దివ్యాంగుడు హనీష్కు రూ.3వేల పింఛను ప్రతి నెలా వస్తోంది. ఈ మూడేళ్లలో ఆ కుటుంబానికి రూ.1.92 లక్షలు అందింది. గుడుపల్లె మండలం సంగనపల్లెకు చెందిన ఈయన పేరు నారాయణప్ప. 2.5 ఎకరాల పొలం ఉంది. అటవీ సరిహద్దు పొలాలు కావడంతో వ్యవసాయం చాలా కష్టం. విత్తనాల కొనుగోలుకు, ఎరువులు.. పెట్టుబడికి ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అలాంటి సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ఆయన్ను ఆదుకుంది. మూడేళ్లలో ప్రభుత్వం రూ.41 వేలు ఆయన ఖాతాలో జమచేయడంతో సాగు సాఫీగా సాగుతోంది. కుప్పం మండలం జరుగు పంచాయతీ పోరకుంట్లపల్లెకు చెందిన మళ్లికమ్మ, భర్త గోవిందప్ప టీడీపీలో క్రియాశీల కార్యకర్తలు. వీరికి ఉండడానికి ఇల్లు లేదు. గత ప్రభుత్వంలో పక్కా గృహం కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వలంటీర్ స్వయంగా ఇంటి పట్టాను తెచ్చివ్వడంతో ఆ దంపతుల కళ్లలో ఆనందం వ్యక్తమైంది. ప్రస్తుతం ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకొని జగనన్న కాలనీలోనే నిసిస్తుండడం విశేషం. గుడుపల్లె మండలం అత్తినత్తం గ్రామానికి చెందిన ఈయన పేరు వెంకటాచలం. సాగునీరు లేక వ్యవసాయం వదిలి బెంగళూరులో కూలీ పనులకు వెళ్లేవాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక బిసానత్తం వద్ద ఉన్న కల్లివంక కాలువ పనులు పూర్తి కావడంతో ఈ ప్రాంతంలోని పొలాలు సస్యశ్యామలయ్యాయి. ఈ నేపథ్యంలో వెంకటాచలం తిరిగి తమ గ్రామానికి చేరుకొని వ్యవసాయ పనులతో ఉపాధి పొందుతున్నాడు. నీటి చెరువుల అనుసంధానంతో కుప్పం రైతుల సమస్యకు పరిష్కారం లభించింది. -
23న కుప్పంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. వాస్తవానికి ఈ నెల 22నే కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది. సీఎం జగన్ పర్యటన షెడ్యూల్.. ► ఈ నెల 23 ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరతారు. ► 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. ► 11.15–12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు ► అనంతరం వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ► 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌తో కలిసి పర్యవేక్షించారు. 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీగా చేయలేకపోయాడంటూ ఫైర్ అయ్యారు. కుప్పంను మున్సిపాలిటీతో పాటు, రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం జగన్ తీసుకున్నారన్నారు. ఎన్నికల నాటికి హంద్రీనీవా కాలువల పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తి పడి హంద్రీనీవా పనులు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో సీఎం వైఎస్ జగన్ సభ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంటుంది'అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చదవండి: (చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఆర్ఎం భాషా) -
22న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన
కుప్పం(చిత్తూరు జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 22న కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు హెలిప్యాడ్ స్థలాలను గురువారం పరిశీలించారు. కుప్పం మున్సిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నట్లు నేతలు తెలిపారు. చదవండి: చంద్రబాబు 420.. లోకేశ్ 210