చంద్రబాబు కుప్పానికి నాన్‌ లోకల్‌: సీఎం జగన్‌ | AP CM YS Jagan Kuppam Tour Live Updates and Highlights | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కుప్పానికి నాన్‌ లోకల్‌: సీఎం జగన్‌

Published Fri, Sep 23 2022 8:50 AM | Last Updated on Fri, Sep 23 2022 8:02 PM

AP CM YS Jagan Kuppam Tour Live Updates and Highlights - Sakshi

సీఎం జగన్‌ కుప్పం పర్యటన.. అప్‌డేట్స్‌

1:48PM
మూడో విడత వైఎస్సార్‌ చేయూత నిధులు విడుదల
వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్‌
రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ
అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 4,949.44 కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం జగన్‌

12:50PM
సీఎం జగన్‌ ‍ ప్రసంగంలోని కొన్ని కీలకాంశాలు

  • కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి
  • కుప్పం అంటే ఈరోజు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు.. ఇలా ప్రతి ఇంటా అభివృద్ధి కనిపిస్తోంది
  • కుప్పంలో వీరి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది
  • కుప్పంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం

  • 26,39, 703 మందికి వరుసగా మూడో ఏడాది వైయస్సార్‌ చేయూత అమలు చేస్తున్నాం
  • ఈ ఏడాది అందిస్తున్న ఆర్థిక సహాయంతో అక్షరాల రూ. 4,949.44 కోట్లుతో మొత్తంగా రూ.14,110.62 కోట్లు
  • వారంరోజులపాటు చేయూత ఉత్సవాలు 
  • వారంరోజుల పాటు ప్రతి మండలంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేయూత పంపిణీ
  • చేయూత మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు సమాజానికే మార్పులు
  • వరుసగా నాలుగేళ్లపాటు అదే అక్క చెల్లెమ్మకు రూ.75వేలు అందిస్తామని హామీ ఇచ్చాం
  • మనసా , వాచా, కర్మణా అమలు చేశాం

  • ఈ మూడో విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు అక్షరాల చేయూత ద్వారా రూ.56,250లు పెట్టినట్టు అవుతుంది
  • 45–60 సంవత్సరాల మధ్యలో నా పేద అక్కచెల్లెమ్మలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చాం
  • ఈ వయస్సులో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారు
  • వాళ్ల చేతిలో డబ్బులు పెడితే.. ఆకుటుంబం ఎదుగుతుందని విశ్వసించాం
  • ఇక 60 ఏళ్లు దాటితే ఎలాగూ పెన్షన్‌వస్తుంది
  • సూర్యోదయానికి ముందే.. ఠంచనుగా పెన్షన్‌ ఒకటో తారీఖున వస్తోంది
  • పెన్షన్‌ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నాం
  • మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3వేల వరకూ తీసుకుని పోతాను అంటూ చెప్పిన మాటను నెరవేరుస్తున్నాను
  • అమ్మ  కడుపులోని బిడ్డ నుండి, ఆప్యాయంగా ఆశీర్వదించే బిడ్డ వరకూ మన ప్రభుత్వం అండగా నిలుస్తుంది
  • ఈ ప్రభుత్వం మీది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను
  • ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ చేయూత ద్వారానే రూ.14,110 కోట్లు అందించాం
  • అక్కచెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా ఈప్రభుత్వం అడుగులు ముందుకేసింది
  • అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షలమందికి రూ.19,617 కోట్లు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ఇచ్చాం
  • వైఎస్సార్‌ ఆసరా ద్వారా 78.74లక్షలమందికి రూ. 12,757 కోట్లు ఇచ్చాం
  • రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి

  • మూడో దఫా జనవరి మాసంలో ఇస్తున్నాం
  • చెప్పిన మాటమేరకు నాలుగు దఫాల్లో ఇస్తున్నాం
  • చేయూత ద్వారా 26.4లక్షలమందికి రూ. 14,111 కోట్ల రూపాయలు ఇస్తున్నాం
  • సున్నా వడ్డీ పథకానికి రూ. 3,615 కోట్లు ఇచ్చాం
  • కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా 39 నెలల కాలంలో రూ.51వేల కోట్లు ఇచ్చాం
  • బటన్‌ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము రూ.1,17,666 కోట్లు ఇచ్చాం
  • అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే.. రూ. 1.71లక్షల కోట్లు
  • అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం
  • మార్పును చూడమని, తేడాను చూడమని కోరుతున్నాను

  • అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడండి
  • నాన్‌ డీబీటీ పథకాలతో కలుపుకుంటే.., అక్షరాల ఈ 39 నెలల కాలంలో ప్రతికుటుంబానికీ ఇచ్చిందిమొత్తం రూ.3,12,764 కోట్లు ఇచ్చాం
  • రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం
  • 21 లక్షల ఇళ్ల నిర్మాణలు వేగంగా జరుగుతున్నాయి
  • ఇళ్లు పూర్తైతే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షల ఇస్తి ఇచ్చినట్టు అవుతుంది
  • ఇళ్ల కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది
  • తేడా గమనించమని ప్రతి అక్కా చెల్లెమ్మను కోరుతున్నాం
  • ఇంతకుముందు పరిపాలనలో ఇక ముఖ్యమంత్రి ఉన్నారు
  • అప్పుడూ అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి...
  • అప్పుడు చేసిన అప్పులు కన్నా.. ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే
  • కాని, ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి.. ఆలోచన చేయలేదు
  • ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో తినుకో.. పద్ధతి ఉండేది
  • ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి
  • అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది లేదు 
  • ఇవాళ బటన్‌ నొక్కుతున్నాం... నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి
  • అందుకనే ఇప్పుడు జరుగుతున్నాయి..., ఇప్పుడు జరగలేదు

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

  • అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారం
  • చేయూత ద్వారా వచ్చే డబ్బును ఎలా వాడుకోవాలన్నది మీ చేతిలో పెట్టాను
  • చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి ఎలా వాడుకోవాలా? అన్నది మీ నిర్ణయమే
  • చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్‌ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది
  • కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారికి వారికి ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబెల్, రిలయన్స్‌ లాంటి కార్పొరేట్‌ కంపెనీలతో టై అప్‌చేశాం
  • మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందిచేలా కూడా చేస్తున్నాం
  • ప్రతి అక్కా.. చెల్లెమ్మ మరో రూ.7–10వేల ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని ప్రభుత్వం చూపించనుంది
  • ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొనాలన్నా.. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్‌ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం
  • గతంలో కన్నా కనీసం రూ.5–15లు ఎక్కువ రేటుకు అమూల్‌ సంస్థ కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
  • అమూల్‌ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్‌ సంస్థకూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది
  • వైఎస్సార్‌ ఆసరా, చేయూతల ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షలమంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు
  • మరో 60,995 మంది వస్త్రవ్యాపారం చేస్తున్నాం
  • 2.96లక్షలమంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు
  • 1.15లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో వారు ఉపాధి పొందుతున్నారు

12:25PM
14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు.  వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక కుప్పం రూపు రేఖలు మారాయి. మూడేళ్లలో మహిళలకు రూ. 2.39 లక్షల కోట్ల సాయం అందించారు.  మూడేళ్ల పాలనలో సీఎం జగన్‌ అన్ని వర్గాలకు అండగా నిలిచారు. వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం.  కుప్పం అభివృద్ధశిని వైఎస్‌ జగన్‌ చేతల్లో చూపిస్తున్నారు. భరత్‌ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి: మంత్రి పెద్దిరెడ్డి

కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు: ఎమ్మెల్సీ భరత్‌.సీఎం వైఎస్‌ జగన్‌ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ భరత్‌

12:00PM
‘వైఎస్సార్‌ చేయూత’ వేదిక వద్దకు చేరిన సీఎం జగన్‌

11:15AM
కుప్పం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.
కుప్పంలో అడుగడుగునా సీఎం జగన్‌కు నీరాజనం
సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన కుప్పం ప్రజలు

10:50AM
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కుప్పం పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ డా.గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర్ రెడ్డి తదితరలు ఉన్నారు.

9:15AM
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. కుప్పం పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్‌. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్‌ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆపై బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తారు. వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం తర్వాత.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 


► పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు.

► బటన్‌ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్‌.

► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. 


వైఎస్సార్‌ చేయూత పథకం కింద..

► వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు అర్హులకు రూ.14,110.62 కోట్ల లబ్ధి

రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు.  

వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది.

 సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్‌ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement