Kuppam Tour
-
ఇక్కడ ఏమీ చేయని బాబు.. ఎమ్మెల్యేగా అర్హుడేనా?: సీఎం జగన్
Live Updates 12:30PM, Feb 26th, 2024 సీఎం జగన్ ప్రసంగించడానికి వచ్చిన సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ దద్దరిల్లిన సభా ప్రాంగణం సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి భరత్ గెలిచిన తర్వాత మంత్రిని చేస్తాను కేవలం అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు ఎందుకు? ప్రజలనె మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు మీ బిడ్డను గెలిపిస్తేనే పేదవారికి మంచి జరుగుతుంది కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు.. ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా? మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదు చంద్రబాబు పేరు చెబితే గుర్తుచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా? కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమం కుప్పంలో జరుపుకుంటున్నాం ఒక పండుగ వాతావారణంలో జరుపుకుంటున్నాం కొండలు,గుట్టలు దాటుకుని, ఏ రకంగా 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించింది. ఎక్కడ కుప్పం.. ఎక్కడ శ్రీశైలం 672 కి.మీ దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి, ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించడం కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజే 2022, సెప్టెంబర్ 23వ తేదీన, ఇదే కుప్పంలో జరిగిన బహిరంగ సభకు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఆనాటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే .. ఈరోజు మన ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసింది కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా, మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేయడానికి మరో రెండు రిజర్వాయులు ప్రారంభించడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది అందుకు సంబంధించి పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే 14 ఏళ్లు సీఎంగా కూడా పని చేశారు 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు కుప్పం బ్రాంచ్ కెనాల్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడు. అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్ చంద్రబాబు తన హెరిటేజ్ లాభాల కోసం మూసివేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్‌ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించేలా ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్. ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్.. వెల్లూరు సీఎంసీ మెడికల్ కాలేజ్ దాన్ని అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు ఈ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టును ముందుకు వెళ్లకుండా చేస్తే.. దాన్ని పునః ప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేసింది రూ. 14 వందల కోట్లు. రూ. 14 వందల కోట్లును ఈ కుప్పం నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం ఇక్కడున్న ప్రతీ ఒక్కరికి చెబుతున్నా మీరు బ్యాంకులకు వెళ్లండి.. చంద్రబాబు పాలనకు సంబంధింది ఐదేళ్లు స్టేట్మెంట్, మీ బిడ్డ జగన్ వచ్చిన తర్వాత స్టేట్మెంట్స్ తీసుకోండి బాబుగారి పాలనలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని చూసుకోమని అడుగుతున్నా అదే మీ బిడ్డ ప్రభుత్వ పాలనలో మీకు జమ అయిన నగదును కూడా ఆ స్టేట్మెంట్లో చూసుకోమని చెబుతున్నా.. మరి ఎవరిది మనసున్న పాలన.. ఎవరిది పేదల ప్రభుత్వమన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా కుప్పం ప్రజలంతా మా వాల్లేనని గర్వంగా చెబుతున్నా కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం కులం, మతం, ప్రాంతం,పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించాం కుప్పంలో 44,888 మహిళలకు రూ. 172 కోట్లు ఇచ్చాం పెన్షన్ల కోసం క్యూలెన్‌లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం ప్రతినెలా ఇంటికే వచ్చివలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచి 45,374 మందికి ఈ కుప్పం నియోజకవర్గంలో అందిస్తున్నాం కుప్పంలో 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్సన్ ఇచ్చారు.. అది కూడా వెయ్యి రూపాయలే. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎటువంటి వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 1400 వలంటీర్లతో సేవలు అందిస్తున్నాం కుప్పం నియోజకవర్గంలో 76 విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం కుప్పంలో 44, 640 రైతులకు రూ. 214 కోట్లు రైతు భరోసా ఇచ్చాం చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ. 26వేల కోట్లు అందించాం కుప్పంలో 35951 మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి ఇచ్చాం కుప్పంలో 15, 727 మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చాం ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని చెప్పడానికి గర్విస్తున్నా వైఎస్సార్ చేయూత ద్వారా 19, 921 మందికి రూ. 85 కోట్లు ఇచ్చాం నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింప చేశాం కుప్పంలో 108 వాహనాలు అందించాం కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17552 మందికి ఆరోగ్య సేవలు అందించాం ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాం 12:10PM, Feb 26th, 2024 వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్ ఆ తర్వాత సీఎం జగన్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 12:02PM, Feb 26th, 2024 కుప్పం శాంతిపురం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్ 11:22AM, Feb 26th, 2024 హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్ కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్ కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు కృష్ణమ్మ స్వర్శతో పరవశించిపోతున్న కుప్పం 11:18AM, Feb 26th, 2024 కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్ 11:01AM, Feb 26th, 2024 కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ 10:04AM, Feb 26th, 2024 ► కాసేపట్లో కుప్పానికి సీఎం జగన్ ►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్ 9:21AM, Feb 26th, 2024 ►కుప్పం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ►కాసేపట్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్ ►కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్న ముఖ్యమంత్రి జగన్ ►కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి. ►కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు. ►ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు. -
పోలీసులపై దాడి చేసిన టీడీపీ నేతలపై కేసులు
శాంతిపురం/చిత్తూరు అర్బన్: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా బుధవారం పోలీసులపై దాడులకు తెగబడిన టీడీపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాళ్లబూదుగూరు ఎస్ఐ మునస్వామి తెలిపిన వివరాల మేరకు పోలీసులపై దాడి చేసిన ఇతర జిల్లాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు కుప్పం నియోజకవర్గ పరిధిలోని పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఎస్.గొల్లపల్లి క్రాస్‌లో పోలీసులపై దాడి, చేయి చేసుకోవడం, తోసివేయడం, దౌర్జన్యం చేయడంపై పలమనేరు సీఐ అశోక్‌కుమార్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విశ్వనాథనాయుడు, కేదార్నాథ్, ఆంజనేయరెడ్డి, చంద్రకళ, నాగరాజు, అనసుయ, ప్రవీణ్, సుగుణ, రమేశ్, జయపాల్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. అనుమతి లేకుండా ప్రచార ర«థాలను వినియోగించినందుకు రామకుప్పం మండలం ననియాలకు చెందిన రాజశేఖర్, పశ్చిమగోదావరి జిల్లా పెద్దవల్లమిల్లికి చెందిన నానిబాబు, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన రాజుపై కేసులు నమోదు చేశారు. 121 పెద్దూరులో కృష్ణమూర్తి ఇంటి మేడపై ఉన్న పోలీసులపై దాడికి సంబంధించి గంగవరం ఎస్ఐ సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మంజునాథ్, అరుణ్‌కుమార్ తదితరులపై కేసులు నమోదయ్యాయి. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు. వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు.. ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేస్తారంటూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి గురువారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. కుప్పంలో పర్యటిస్తున్న చంద్రబాబును ఏక్షణమైనా పోలీసులు అరెస్టు చేయొచ్చంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. ఇలా తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
చంద్రబాబు కుప్పం పర్యటన: కేసులు నమోదు
చిత్తూరు జిల్లా: చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు పోలీసులపై దాడి, విధులను అడ్డుకోవడంపై మూడు కేసులు నమోదయ్యాయి. గొల్లపల్లి, శాంతిపురం, పెద్దూరు ఘటనపై కేసులు నమోదయ్యాయి. పెద్దూరులో ఎస్ఐ సుధాకర్‌రెడ్డిని దూషించిన ఘటనలో కేసు నమోదు చేయగా, గొల్లపల్లి వద్ద సీఐ విధులకు ఆటంకం కల్గించినందుకు కేసు నమోదయ్యింది. శాంతిపురంలోరని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మొత్తం మూడు ఘటనల్లో టీడీపీ కార్యకర్తలపై కేసులు ఫైల్ చేశారు పోలీసులు. చదవండి: నాకే రూల్స్ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్ -
బిగ్ క్వశ్చన్: కుప్పంలో కుట్ర
-
చంద్రబాబు తీరుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా దిగజారి రాజకీయాలు చేస్తున్నాడంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారశైలి మంచిది కాదని అన్నారు. తన కార్యకర్తలను పోలీసులపై రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగించడం.. వారిని పోలీసులపైకి ఉసిగొల్పే ధోరణి సరికాదన్నారు. ఈమేరకు మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు వల్ల రాజకీయ నేతల విలువ పోతోంది. చంద్రబాబు లాగే ఆయన కార్యకర్తలూ ఉన్నారు. పుంగనూరులో రాళ్లు, కర్రలతో గలాటా చేశారు. పోలీసులను కొట్టేలా కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. లాఠీఛార్జ్‌కు చంద్రబాబే కారణం. రాష్ట్రంలో అధికార, విపక్షాలకు నిబంధనలు ఒక్కటేనని స్పష్టం చేశారు. కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోతే జాగ్రత్తగా ఉండాల్సిందిపోయి.. కుప్పంలో కూడా అదే మాదిరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఎంతమంది చనిపోయిన కూడా నేను అధికారంలోకి రావాలి అనే ధోరణికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. చదవండి: (నాకే రూల్స్ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం) చట్టానికి ఎవరూ అతీతులు కాదు విశాఖలో గ్యాస్ లీకై చనిపోయిన బాధితులకు ఫ్యాక్టరీ యజమాని నుంచి, పొల్యూషన్ బోర్డు నుంచి కోటి రూపాయలు ఇప్పించ్చాం. అప్పుడు ఏదేదో మాట్లాడారు. మేము నిన్న కూడా చంద్రబాబు వల్ల చనిపోయిన బాధితులకు కూడా కంపెన్షషన్ ఇచ్చాం. చంద్రబాబు దాని గురించి ఆలోచించలేదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. ప్రభుత్వం జీవో నెం 1 విడుదల చేసింది. అంతకుముందే పలమనేరు డివిజన్లో పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చదవండి: (వారిద్దరికంటే తుగ్లక్‌లు రాష్ట్రంలో ఎవరూ లేరు: దాడిశెట్టి రాజా) -
చంద్రబాబు కుప్పం పర్యటనలో ఓవరాక్షన్‌పై ఎమ్మెల్సీ భరత్ ఫైర్
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే బాబు ఉద్దేశం అని మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, బుధవారం కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు. చదవండి: (కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్) -
కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, తిరుపతి: కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరీవాణి శ్రీనివాసులు పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు. ఏపీ-కర్ణాటక బార్డర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నిబంధనల ప్రకారమే అనుమతులు కుప్పం: టీడీపీ నేతలు చంద్రబాబు సభకు పోలీసుల అనుమతి తీసుకోకుండా ఓవరాక్షన్ చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ టీడీపీ నేతలు అనుమతి కోరితే తప్పకుండా పరిశీలించి అనుమతిస్తామన్నారు. కొత్త నిబంధల ప్రకారమే ఎవరికైనా అనుమతులు ఉంటాయని తెలిపారు. వాస్తవాలను కప్పి పుచ్చి టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. -
జగనన్న చేయూతకు జేజేలు.. కుప్పంలో సీఎం పర్యటనకు అపూర్వ స్పందన
చంద్రబాబును 33 ఏళ్లుగా గెలిపించినా కూడా ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఓటు కూడా లేదు. కుప్పం తన సొంతం అని ఆయన ఏనాడూ భావించ లేదు. హైదరాబాద్‌లో ఇంద్ర భవనం కట్టుకున్న ఆయన అక్కడ లోకల్, కుప్పంకు నాన్ లోకల్. నా దృష్టిలో పులివెందుల ఎంతో.. కుప్పం కూడా అంతే. ఈ ప్రాంత ప్రజల కోసం రూ.250 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ సమస్యలు తొలగ్గానే రూ.120 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తాం. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ కోసం రూ.66 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన నాలుగు మండలాల అభివృద్ధికి రూ.100 కోట్లు అవసరం అని భరత్ అడిగాడు. నువ్వు నియోజకవర్గంలో తిరుగు.. ఆ నిధులు ఇస్తానని చెబుతున్నా. – కుప్పం సభలో సీఎం వైఎస్ జగన్ సాక్షి, చిత్తూరు, కుప్పం: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అధికారులు, వైఎస్సార్సీపీ నేతల అంచనాలకు మించి జనం భారీగా తరలివచ్చారు. కుర్చీల్లో కూర్చున్న వారి కంటే నిలుచున్న వారి సంఖ్య అంతకు మించి ఉండటం విశేషం. ఇక సభా ప్రాంగణం బయట, పట్టణమంతా జనసంద్రమే. బహిరంగ సభలో సీఎం ప్రసంగం ప్రజలను కట్టిపడేసింది. చంద్రబాబు గురించి ప్రస్తావించిన ప్రతిసారీ జనం కేరింతలు కొడుతూ నిజమేనంటూ కోరస్ పలికారు. బాబు మూడు దశాబ్దాల పాలనలో మగ్గిన కుప్పంలో మూడున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని చూస్తున్నారు కదా.. అనగానే జనం ఒక్కసారిగా కేకలు వేశారు. నాటి ప్రభుత్వానికి.. నేటి మన ప్రభుత్వానికి తేడాను గమనించారా? అనగానే చేతులు ఊపుతూ మద్దతు పలికారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్.. కుప్పానికి నాన్‌లోకల్’ అనగానే నవ్వులు, కేకలు మిన్నంటాయి. 33 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనిపించ లేదా అని ప్రశ్నిస్తూ.. అసలు కుప్పంలో ఆ పెద్దమనిషికి ఓటు కూడా లేదని చెప్పడంతో జనం పెద్దపెట్టున కేకలు వేశారు. ప్రధానంగా బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా వారికి అవకాశం ఇవ్వలేదన్నప్పుడు కేకలే కేకలు. ఇలా చంద్రబాబును విమర్శించిన ప్రతిసారీ ప్రజలు కేరింతలు కొట్టారంటే.. బాబు తీరుపై ఎంతగా విసిగిపోయారో ఇట్టే స్పష్టమవుతోంది. కాగా, అంతకు ముందు సీఎం వైఎస్ జగన్ కొంత మంది ‘చేయూత’ పథకం లబ్ధిదారులతో ముచ్చటించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఆ తర్వాత కుప్పంలో రూ.66 కోట్లతో చేపట్టిన మున్సిపల్ ఆఫీసు, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, కేవీ ఉషశ్రీ చరణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు బాబు కేరాఫ్.. కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు.. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పంపులు తిప్పితే తాగడానికి నీరు వచ్చే పరిస్థితిని మాత్రం తీసుకు రాలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతులను.. ప్రధాన మంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు అనుభవం అంతా ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మాత్రం బాగా ఉపకరించిందని ఈ జిల్లాలో కథలు కథలుగా చెబుతారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్ అడ్రస్ చంద్రబాబే అని చెప్పారు. రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించే వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధులను చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన విడుదల చేశారు. కంప్యూటర్లో బటన్ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తమ బతుకులు బాగు పడ్డాయని లబ్ధిదారులు స్వయంగా చెప్పే ఈ చేయూత పండుగ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ వేదికపై నుంచి సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. కుప్పంపై కూడా బాబుకు వెన్నుపోటు ప్రేమే సొంత మామ మీద చంద్రబాబు చూపించే వెన్నుపోటు ప్రేమే కుప్పం మీద కూడా చూపారు. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు. ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం ఆలోచించ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారు. కుప్పంలో కరువు, నీటి సమస్య నివారణకు హంద్రీ–నీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అది చేస్తే ప్రజలు తన మాట వినరని భయపడిపోయారు. అందుకే ఆ హంద్రీ–నీవా పనులకు ఆయనే అవరోధంగా మారారు. ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం కాంట్రాక్టు ఇచ్చి వందల కొద్దీ ట్రాక్టర్లతో నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేశానని చెప్పుకొని, దొంగ అకౌంట్లతో దోచేశారు. కుప్పంతో మొదలు ప్రతి చోటా బీసీలకు అన్యాయమే.. కుప్పం నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారు. ఈ నియోజకవర్గం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాకపోయినా.. బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ తనే లాక్కొన్నారు. బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడు. 1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుప్పం అసెంబ్లీ టికెట్‌ను బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. కుప్పంతో మొదలు పెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశారు. బీసీలను వాడుకుని, విడిచి పెడుతున్నది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. బాబు చేయలేనిది మేం చేస్తున్నాం కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేస్తున్నాం. కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో పాటు.. దాని అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్ సబ్‌స్టేషన్ ఇచ్చాం. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తి చేశాం. రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. రాళ్లమడుగూరు జూనియర్ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా ఈ ప్రభుత్వమే. నవరత్నాల పథకాలన్నీ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం. రాష్ట్రమంతటితో పాటు కుప్పం నియోజకవర్గానికి వివిధ డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు.. నాన్ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు.. మొత్తంగా ఈ నియోజకవర్గ ప్రజలకు రూ.1,149 కోట్లు పంపిణీ చేసింది మీ బిడ్డ జగనే. ఎమ్మెల్సీగా ఉంటూనే తన ద్వారా కుప్పానికి నాతో అన్నీ చేయిస్తున్న భరత్‌ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి. మంత్రిగా మీ ముందుకు పంపిస్తాను. ఈ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వానికి తేడా గమనించండి సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మీ ఈ ముఖ్యమంత్రి చూస్తున్న విధానానికీ మధ్య తేడాను ప్రజలు గమనించాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లల చదువులో, రైతుల్లో, ఆరోగ్య రంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. సామాజిక వర్గాల ఆర్తిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అడుగులు వేస్తోంది. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని గుర్తించిన ప్రభుత్వం ఇది. నవరత్నాలు అమలు, డీబీటీ, పదవులు, కాంట్రాక్టులు.. ఇలా ఏది తీసుకున్నా పారదర్శకత కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఏకంగా చట్టాలు చేసి మేలు చేశాం. కానీ, చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడిని చూసుకుంటే చాలనుకున్నారు. ఎవరూ చూపరు, రాయరు.. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని భావించారు. చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకొని అభివృద్ధికి మద్దతిస్తే ఎలా ఉంటుందో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్సార్సీపీనే క్లీన్ స్వీప్ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. చేతకానితనమా.. చేయకూడదనే దుర్బుద్ధా.. చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీలో కనీసం డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్ ఇస్తానన్నాడు. అది చేయలేదు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని ప్రజల చెవిలో పువ్వు పెట్టాడు. జాబు కావాలంటే.. బాబు రావాలని ఈయనే అంటాడు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లొస్తుంటారు. వీరికి సొంత నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి చూపించాలన్న ఆలోచన ఈయనకు రాదు. చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండరు. ఇక్కడకు రారు. పట్టించుకోరు. 14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. చివరకు రెవెన్యూ డివిజన్ కోసం జగన్‌కు లేఖ రాస్తాడు. మీ కోసం కుప్పంను రెవిన్యూ డివిజన్ చేశాం. చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ లేదు.. మెడికల్ కాలేజీ లేదు. పుట్టింటోళ్లు కూడా ఇలా ఆదుకోలేదు మూడేళ్ల క్రితం వరకు మా కుటుంబంలో నేను కూలీ పనులే చేసుకునేదాన్ని. చేయూత పథకంలో నాకు మొదటి విడతలో రూ.18,750 ఇచ్చారు. దానికి బ్యాంకు లోన్ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను. రెండో విడత వచ్చిన డబ్బులతో గడ్డి కటింగ్ మెషిన్ తీసుకొన్నాను. మా మహిళా సంఘం గ్రూప్ సీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు వచ్చింది. బ్యాంకు వారు మాకు రూ.20 లక్షలు ఇస్తే నాకు రూ.2 లక్షలు వచ్చాయి. దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నా. స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి. మా పాపకు విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. తను బీఎస్సీ (హార్టికల్చర్) చదువుతోంది. ఇవాళ నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్ల పాలు పోస్తున్నాను. ఖర్చులు పోను నెలకు రూ.60 వేలు మిగులుతున్నాయి. ఈ ఘనత మా జగన్మోహన్రెడ్డిదే. నా పుట్టింటి వాళ్లు కూడా ఇలా సాయం చేయలేదు. మళ్లీ మళ్లీ జగన్నే సీఎంగా గెలిపించుకుందాం. – సుబ్బమ్మ, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు ఈసారి కూడా జగనే సీఎం.. గతంలో మేం కూలికి వెళ్లే వాళ్లం. మాకు మొదటి విడత చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా. రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది. నేను, మా ఆయన.. ఇద్దరం ప్రతి రోజూ మిమ్మల్ని తలుచుకుంటాం. వాళ్ల మేనమామ (సీఎం) వల్ల పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మూడో విడత వచ్చే డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను. మీ వల్ల పాలకు కూడా మంచి ధర వస్తోంది. మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతోనే ఉంటారు. మళ్లీ కూడా మీరే సీఎం. – మరియమ్మ, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పాలన జగన్మోహన్రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇప్పుడు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైఎస్సార్ చేయూత పథకం ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సంతృప్త స్థాయిలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నారు. బటన్ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం టీడీపీ వాళ్లకూ లబ్ధి కలిగించాం చంద్రబాబూ.. నువ్వు పులివెందులకు వెళ్లొచ్చు కానీ, సీఎం కుప్పం రాకూడదా? మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించి, సులువుగా గెలవచ్చని ఇక్కడ పాతుకుపోయావు. ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేశావు. వైఎస్ జగన్ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమ పథకాలు వర్తింప చేసింది. అందుకే ఈ రోజు కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. ఇన్నేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖా మంత్రి బాబు ఎప్పుడూ అందుబాటులో లేరు 33 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులోనూ 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఇక్కడి వారికి ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. పైగా సీఎం జగన్ కుప్పంకు ఏం చేశారని అడుగుతున్నారు. మీతోనే (చంద్రబాబు) ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ప్రకటన చేయించారు. ఇది చాలదా.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతగా కృషి చేస్తున్నారో చెప్పడానికి. – భరత్, ఎమ్మెల్సీ * జనవరి నుంచి పింఛన్ రూ.2,750 కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుతం రూ.2,500 చొప్పున ఇస్తున్న అవ్వాతాతల పింఛన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,750కి పెంచబోతున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3 వేల వరకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కుప్పంలో వైఎస్సార్ చేయూత పథకం మూడో విడత నిధుల జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి దాకా మొత్తం రూ.14,110.62 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మూడు విడతలలో కలిపి ఒక్కొక్కరికీ ఇప్పటికే రూ.56,250 అందజేశామన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలు కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించామన్నారు. 60 ఏళ్లు నిండిన వారు పెన్షన్ జాబితాలోకి వెళ్లిపోతారని, కొత్తగా 45 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలోకి చేరుతారని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. అమ్మ కడుపులో బిడ్డ మొదలు అవ్వ వరకు.. అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందు కేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, పొదుపు సంఘాల వైఎస్సార్ సున్నా వడ్డీ.. ఈ నాలుగు పథకాల ద్వారానే కేవలం 39 నెలల్లో ఈ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు ఇచ్చింది. అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12,757 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. మూడో దఫా జనవరి నెలలో ఇవ్వనున్నాం. చేయూత ద్వారా 26.4 లక్షల మందికి రూ.14,111 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.3,615 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదు. మొత్తంగా ఈ 39 నెలల్లో అన్ని రకాల పథకాల ద్వారా బటన్ నొక్కి మహిళలకు అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు. అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే రూ.1.71 లక్షల కోట్లు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలన్నీ అమలు చేస్తున్నాం. ఆరు నాన్ డీబీటీ పథకాలైన ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ద్వారా ఇచ్చిన రూ.1.41 లక్షల కోట్లు కలుపుకుంటే.. మొత్తం రూ.3,12,764 కోట్లు. ఇందులో అక్కచెల్లెమ్మలకే రూ.2.39 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ.2.3 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది. చేయూతతో 5.82 లక్షల మందికి ఆర్థిక సాధికారత వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే డబ్బుతో చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి వాడుకోవాలా? అన్నది పూర్తిగా మహిళల నిర్ణయానికే వదిలేశాం. అయితే, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్ చేశాం. మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందించేలా చేస్తున్నాం. ప్రతి అక్కా, చెల్లెమ్మ రూ.7 వేల నుంచి రూ.10 వేలు ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల కొనుగోలుకు సహకరిస్తున్నాం. వీరిని ప్రోత్సహించేందుకు అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. గతంలో కన్నా కనీసం లీటర్ పాలకు రూ.5–15 ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. వైఎస్సార్ ఆసరా, చేయూత ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. 2.96 లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు. 1.15 లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం 5,82,662 మంది ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్ చేయూత పథకం ఉపయోగపడింది. అప్పుడు, ఇప్పుడు అదే బడ్జెట్ ఇంతకు ముందు పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్. అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే. కానీ అప్పటి ప్రభుత్వంలో ఇంతగా లబ్ధి ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎలా జరుగుతోంది.. మీరే ఆలోచించండి. è ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతి ఉండేది. కేవలం నలుగురు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు.. వారికి తోడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది కాదు. ఇవాళ బటన్ నొక్కుతున్నాం.. నేరుగా మీ (లబ్ధిదారుల) ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం జగన్ కుప్పం పర్యటన (ఫొటోలు)
-
Drone Visuals : జనం కోసం జగన్
-
చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు ఉన్నాడని, అలాంటి వ్యక్తి కుప్పం నుంచి తనకు కావాల్సింది తీసుకున్నాడే తప్ప.. చేసిందేమీ లేదని సీఎం జగన్ చాటిచెప్పారు. కుప్పం అనిమిగానిపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. కుప్పంను చంద్రబాబు ఏనాడూ సొంత గడ్డగా భావించలేదని, హైదరాబాదే ముద్దు అని భావించాడు. అందుకే సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఇంద్రభవనంలాంటి ఇల్లు కట్టుకున్నాడు. కుప్పంలో సొంత ఇల్లు కాదు కదా.. ఓటు కూడా లేదు. చంద్రబాబు హైదరాబాద్‌కి లోకల్.. కుప్పానికి నాన్‌లోకల్ అని ఎద్దేవా చేశారు. కనీసం ప్రజలకు ఏం కావాలో కూడా ఆయన ఆలోచించలేదని సీఎం జగన్ అన్నారు. గత పరిపాలనలో కంటే అప్పులు ఈ ప్రభుత్వం తక్కువగా చేస్తోందని, అదే సమయంలో అభివృద్ధి ఎక్కువగా చేస్తున్నామని సీఎం జగన్ తెలియజేశారు. అప్పుడు.. దోచుకో పంచుకో తినుకో ద్వారా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు.. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు బాగుపడ్డారని అన్నారాయన. కానీ, ఇప్పుడు తమ ప్రభుత్వంలో సంక్షేమం సాధ్యమైందని, ప్రజలు అది గుర్తించాలని సీఎం జగన్ మనవి చేసుకున్నారు. చంద్రబాబుది చేతగాని తనం అనాలా? చేయకూడదనే దుర్భుద్ది అనాలా? అర్థం కావట్లేదన్నారు ఆయన. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా తన సొంత నియోజకవర్గంలో కరువు సమస్యకు పరిష్కారం చూపించలేకపోయాడని అన్నారు. పైగా హంద్రీనీవాకు ఆటంకంగా కూడా మారారన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చాడని, కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని, కుప్పంకు మంచి నీళ్లు మాత్రం తెప్పించలేకపోయాడన్నారు. కుప్పంలో సరైన రోడ్లు కూడా వేయించలేకపోయారని విమర్శించారు. ఉపాధి కల్పించాలనే ఆలోచన కూడా చేయలేదని.. కుప్పం నుంచి నిరుద్యోగులు కూడా తరలిపోయారన్నారు. కుప్పానికి చేం చేయలేని చేతగాని నాయకుడు ఈ చంద్రబాబు అని సీఎం జగన్ మండిపడ్డారు. చివరకు.. సీఎంగా ఉన్న టైంలో ఏనాడూ రెవెన్యూ డివిజన్ గురించి ఆలోచించలేదని, కానీ, ప్రజా ఒత్తిడితో రెవెన్యూ డివిజన్ కావాలని లేఖ రాశాడని సీఎం జగన్ తెలిపారు. ‘‘కానీ, జగన్ మీవాడు.. మంచోడు.. మీ బిడ్డ.. మీరు అడిగారు.. జగన్ ఇచ్చాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. వెన్నుపోటుకు, దొంగ ఓటుకు కేరాఫ్ ఎవరంటే అది చంద్రబాబేనని అని అన్నారు. బీసీల సీటు అయిన కుప్పంను సైతం లాక్కుని తన మార్క్ సామాజిక న్యాయం ప్రదర్శించాడని ఎద్దేవా చేశారు సీఎం జగన్. ‘‘చంద్రబాబుకు తలవంచేది లేదని కుప్పం ప్రజలు తేల్చి చెప్పారు. 2019 ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేశాం. కుప్పం ప్రజలు బాబు అవినీతికి వ్యతిరేకంగా ఓటేశారు. కుప్పం ప్రజలకు మూడేళ్లలో పథకాలతో రూ.1,149 కోట్లు ఇచ్చాం. కుప్పం నియోజక వర్గంలో డీబీటీ ద్వారా రూ.866 కోట్లు ఇచ్చాం. నాన్ డీబీటీ ద్వారా రూ.283కోట్లు ఇచ్చాం. చంద్రబాబుకు తనకు పిల్లనిచ్చిన మామపై ఎలాంటి ప్రేమ ఉందో.. కుప్పంపై కూడా అలాంటి వెన్నుపోటు ప్రేమే ఉందన్నారు. కుప్పాన్ని మున్సిపాలిటీ చేశాం. ఆరు నెలల్లో హాంద్రీనీవా పనులు పూర్తి చేస్తాం. కలగా మిగిలిన ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. రామకుప్పంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇంటిగ్రేగెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను కూడా పూర్తి చేశాం. ఒకేషనల్ జూనియర్ కాలేజీ పూర్తి చేశాం. ఇంకా చాలా చేశాం. ఇవన్నీ పూర్తి చేసింది మీ బిడ్డే అని సీఎం జగన్ కుప్పం ప్రజలకు గుర్తు చేశారు. ఈ మూడేళ్లలోనే కుప్పం సిసలైన అభివృద్ధిని చూసింది. ఎమ్మెల్సీగా ఉంటూనే భరత్ నాతో ఇన్ని మంచి పనులు చేయించాడు. భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తా. ఈ ప్రభుత్వం.. మీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి అని సీఎం జగన్ కుప్పం ప్రజలకు చివరగా విజ్ఞప్తి చేశారు. -
కుప్పం అంటే ఇప్పుడు అభివృద్ధి: సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: కుప్పం అంటే ఇవాళ చంద్రబాబు పాలన కాదు. నా అక్కచెల్లెమ్మల అభివృద్ది. నా అనుకుంటున్న అన్ని వర్గాల ఇంట అభివృద్ధి. అది ఇక్కడి చిరునవ్వులోనే కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కుప్పంలోని అనిమిగానిపల్లిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చేయూత నగదు జమ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి బహిరంగ సభ నుంచి ప్రసంగించారు. మరో మంచి కార్యక్రమాన్ని కుప్పం నుంచి శ్రీకారం చుడుతున్నాం. నా పేద ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా పేద అక్కచెల్లెమ్మల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. కుటుంబాన్ని బాధ్యతతో మోస్తున్నవాళ్లకు అండగా ఉండేందుకు అమలు చేస్తున్న కార్యక్రమని సీఎం జగన్ గుర్తు చేశారు. చేయూతతో వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పు అందరికీ స్ఫూర్తిదాయకమని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేకాదు.. వారం రోజుల చేయూత ఉత్సవాలు కుప్పం నుంచి ప్రారంభం అవుతాయని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి మండలానికి ప్రజాప్రతినిధులు వచ్చి.. అక్కాచెల్లెమ్మల సంతోషంలో భాగస్వాములవుతారని అన్నారు. ఇక ఇదే వేదిక నుంచి ఏపీలో జనవరి నుంచి పెన్షన్ రూ.2,750కి పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. అలాగే.. మ్యానిఫెస్టోలో చెప్పినట్లు మూడు వేల రూపాయలు వరకు పెన్షన్ ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేరస్తామని సీఎం జగన్ ఉద్ఘాటించారు. వరుసగా మూడో ఏడాది కూడా 26 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత నిధులు అందిస్తున్నామని, ఈ ఏడాదికిగానూ అక్కాచెల్లెమ్మల కోసం రూ.4,949 కోట్లు జమ చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఒక్క చేయూత ద్వారానే మూడేళ్లలో రూ.14,110 కోట్ల సాయం అందించామని, అమ్మ ఒడి ద్వారా 44.50 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చినట్లు సీఎం జగన్ తెలియజేశారు. అలాగే ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రూ.12,758 కోట్లు ఇచ్చినట్లు, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. ఎక్కడా పారదర్శకతా, వివక్ష లేకుండా.. బటన్ నొక్కగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ అవుతున్నాయని ఆయన అన్నారు. గత పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించాలని, ఒక్కసారి ఆలోచించమని ప్రతీ అక్కాచెల్లెమ్మను కోరారు సీఎం జగన్. చేయూత ద్వారా ఆదుకునే డబ్బును ఎలా ఉపయోగించాలనే స్వేచ్ఛను అక్కాచెల్లెమ్మల చేతుల్లోనే పెట్టామని, అది ఎలా సక్రమంగా ఉపయోగించుకోవాలో వాళ్లే నిర్ణయించుకోవాలని, అవసరమైన సాంకేతికత ప్రభుత్వం తరపున అందిస్తామని భరోసా ఇచ్చారు సీఎం జగన్. -
అన్నొచ్చిన వేళ.. కుప్పంలో పండుగ వాతావరణం
సాక్షి, చిత్తూరు: అక్కడేం ఎన్నికలు జరగడం లేదు. విజయోత్సవాల నిర్వహణ అంతకన్నా కాదు. అయినా పండుగకు ఏమాత్రం తీసిపోని వాతావరణం వెల్లివిరిసింది. రాజన్న బిడ్డ తమ గడ్డకు సీఎం హోదాలో వచ్చిన వేళ.. మురిసిపోయిన కుప్పం జనసంద్ర సంబురమే అదంతా!. అడుగడుగునా స్వాగత తోరణం.. వయసుతో సంబంధం లేకుండా ‘వైఎస్ జగన్’ నినాదాలు. తమ సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నేతను చూడాలనే ఉత్సాహం, అంతకు మించి అభిమానం.. మూడు కిలోమీటర్ల మేర వాళ్లను ఎండనుసైతం లెక్కచేయకుండా నిలబెట్టింది. సంక్షేమ పథక అమలుతో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తమ చెంతకు వచ్చిన రాజన్న బిడ్డకు జనం పట్టిన నీరాజనం ఇది. కుప్పం పాత పేట వద్ద హెలిప్యాడ్ చెంత నుంచి సభా ప్రాంగణ వేదిక దాకా.. దారి వెంబడి వైఎస్ కుటుంబ అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బారులు తీరారు. జగనన్న అంటూ యువత నినాదాల నడుమ.. ఒక పండుగ వాతావరణాన్ని తలపించింది కుప్పం. తమ బాగోగులు చూస్తున్న మనవడి కోసం అవ్వాఅయ్యాలు.. పెద్దకొడుకులా కుటుంబానికి అండగా నిలుస్తున్నందుకు అమ్మలు, తోబుట్టువుల్లాగా తమను ఆదరిస్తున్నందుకు అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు.. విద్యను అందిస్తూ మేనమామ కోసం విద్యార్థులు కుప్పంలోనూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు ఇలాకాగా, టీడీపీ కంచుకోటగా జబ్బలు చరుచుకునే పచ్చ నేతలకు.. జన నేతకు లభిస్తున్న సాదర ఘనస్వాగతం ఏమాత్రం మింగుడుపడని విషయమే!. ముప్ఫైమూడు ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని కుప్పంలో.. ఈ మూడేళ్లలో సీఎం జగన్ ఎంతో చేసి చూపించారని, జనసంక్షేమ పథకాలను తాము అర్థం చేసుకున్నామని అంటున్నారు అక్కడి జనం. ఇక ఈ జోష్‌తో.. వచ్చే ఎన్నికల్లో కుప్పం గడ్డ జగన్ అడ్డాగా మారబోతోందని, అక్కడ కూడా వైఎస్సార్సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. -
చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్: సీఎం జగన్
సీఎం జగన్ కుప్పం పర్యటన.. అప్డేట్స్ 1:48PM మూడో విడత వైఎస్సార్ చేయూత నిధులు విడుదల వైఎస్సార్ చేయూత పథకం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా 26.39 లక్షల మంది ఖాతాల్లో రూ. 4, 949 కోట్ల జమ అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి రూ. 4,949.44 కోట్ల నిధులను విడుదల చేసిన సీఎం జగన్ 12:50PM సీఎం జగన్ ప్రసంగంలోని కొన్ని కీలకాంశాలు కుప్పం అంటే ఈరోజు అక్క చెల్లెమ్మల అభివృద్ధి కుప్పం అంటే ఈరోజు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, నా మైనార్టీలు.. ఇలా ప్రతి ఇంటా అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో వీరి చిరునవ్వుల మధ్య అభివృద్ధి కనిపిస్తోంది కుప్పంలో ఈరోజు మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాం 26,39, 703 మందికి వరుసగా మూడో ఏడాది వైయస్సార్ చేయూత అమలు చేస్తున్నాం ఈ ఏడాది అందిస్తున్న ఆర్థిక సహాయంతో అక్షరాల రూ. 4,949.44 కోట్లుతో మొత్తంగా రూ.14,110.62 కోట్లు వారంరోజులపాటు చేయూత ఉత్సవాలు వారంరోజుల పాటు ప్రతి మండలంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో చేయూత పంపిణీ చేయూత మహిళల జీవితాల్లో వచ్చిన మార్పులు సమాజానికే మార్పులు వరుసగా నాలుగేళ్లపాటు అదే అక్క చెల్లెమ్మకు రూ.75వేలు అందిస్తామని హామీ ఇచ్చాం మనసా , వాచా, కర్మణా అమలు చేశాం ఈ మూడో విడత వరుసగా అదే అక్క చెల్లెమ్మకు అక్షరాల చేయూత ద్వారా రూ.56,250లు పెట్టినట్టు అవుతుంది 45–60 సంవత్సరాల మధ్యలో నా పేద అక్కచెల్లెమ్మలు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మల కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చాం ఈ వయస్సులో ఉన్న అక్క చెల్లెమ్మలు మొత్తం కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారు వాళ్ల చేతిలో డబ్బులు పెడితే.. ఆకుటుంబం ఎదుగుతుందని విశ్వసించాం ఇక 60 ఏళ్లు దాటితే ఎలాగూ పెన్షన్‌వస్తుంది సూర్యోదయానికి ముందే.. ఠంచనుగా పెన్షన్ ఒకటో తారీఖున వస్తోంది పెన్షన్ రూ.2500 కూడా ఈ జనవరి నుంచి రూ.2,750లకు పెంచుతున్నాం మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3వేల వరకూ తీసుకుని పోతాను అంటూ చెప్పిన మాటను నెరవేరుస్తున్నాను అమ్మ కడుపులోని బిడ్డ నుండి, ఆప్యాయంగా ఆశీర్వదించే బిడ్డ వరకూ మన ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం మీది, అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను ఈ 39 నెలల కాలంలో ఇప్పటివరకూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ చేయూత ద్వారానే రూ.14,110 కోట్లు అందించాం అక్కచెల్లెమ్మల సాధికారితే లక్ష్యంగా ఈప్రభుత్వం అడుగులు ముందుకేసింది అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షలమందికి రూ.19,617 కోట్లు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ఇచ్చాం వైఎస్సార్ ఆసరా ద్వారా 78.74లక్షలమందికి రూ. 12,757 కోట్లు ఇచ్చాం రెండు దఫాలు ఇప్పటికే పూర్తయ్యాయి మూడో దఫా జనవరి మాసంలో ఇస్తున్నాం చెప్పిన మాటమేరకు నాలుగు దఫాల్లో ఇస్తున్నాం చేయూత ద్వారా 26.4లక్షలమందికి రూ. 14,111 కోట్ల రూపాయలు ఇస్తున్నాం సున్నా వడ్డీ పథకానికి రూ. 3,615 కోట్లు ఇచ్చాం కేవలం ఈ నాలుగు పథకాల ద్వారా 39 నెలల కాలంలో రూ.51వేల కోట్లు ఇచ్చాం బటన్ నొక్కి డీబీటీ ద్వారా అందించిన సొమ్ము రూ.1,17,666 కోట్లు ఇచ్చాం అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే.. రూ. 1.71లక్షల కోట్లు అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలను అమలు చేస్తున్నాం మార్పును చూడమని, తేడాను చూడమని కోరుతున్నాను అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు తేడా చూడండి నాన్ డీబీటీ పథకాలతో కలుపుకుంటే.., అక్షరాల ఈ 39 నెలల కాలంలో ప్రతికుటుంబానికీ ఇచ్చిందిమొత్తం రూ.3,12,764 కోట్లు ఇచ్చాం రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం 21 లక్షల ఇళ్ల నిర్మాణలు వేగంగా జరుగుతున్నాయి ఇళ్లు పూర్తైతే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7–10 లక్షల ఇస్తి ఇచ్చినట్టు అవుతుంది ఇళ్ల కార్యక్రమం ద్వారా అక్క చెల్లెమ్మల చేతిలో రూ. 2–3 లక్షల కోట్లు పెట్టినట్టు అవుతుంది తేడా గమనించమని ప్రతి అక్కా చెల్లెమ్మను కోరుతున్నాం ఇంతకుముందు పరిపాలనలో ఇక ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడూ అదే బడ్జెట్, అదే ముఖ్యమంత్రి... అప్పుడు చేసిన అప్పులు కన్నా.. ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే కాని, ఆ ప్రభుత్వంలో ఎందుకు జరగలేదు, ఎందుకు ఇప్పుడు జరుగుతున్నాయి.. ఆలోచన చేయలేదు ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో తినుకో.. పద్ధతి ఉండేది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు, గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది లేదు ఇవాళ బటన్ నొక్కుతున్నాం... నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి అందుకనే ఇప్పుడు జరుగుతున్నాయి..., ఇప్పుడు జరగలేదు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వానికి ఉన్న మమకారం చేయూత ద్వారా వచ్చే డబ్బును ఎలా వాడుకోవాలన్నది మీ చేతిలో పెట్టాను చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి ఎలా వాడుకోవాలా? అన్నది మీ నిర్ణయమే చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్ పరంగా అన్ని సహకారాలను కూడా అందించడానికి ప్రభుత్వం మీకు తోడుగా ఉంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారికి వారికి ఐటీసీ, హిందుస్థాన్ లీవర్, ప్రాక్టర్ అండ్ గాంబెల్, రిలయన్స్ లాంటి కార్పొరేట్ కంపెనీలతో టై అప్చేశాం మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందిచేలా కూడా చేస్తున్నాం ప్రతి అక్కా.. చెల్లెమ్మ మరో రూ.7–10వేల ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని ప్రభుత్వం చూపించనుంది ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు కొనాలన్నా.. వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అమూల్ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం గతంలో కన్నా కనీసం రూ.5–15లు ఎక్కువ రేటుకు అమూల్ సంస్థ కొనుగోలు చేసుకునేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అమూల్ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్ సంస్థకూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది వైఎస్సార్ ఆసరా, చేయూతల ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షలమంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు మరో 60,995 మంది వస్త్రవ్యాపారం చేస్తున్నాం 2.96లక్షలమంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు 1.15లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో వారు ఉపాధి పొందుతున్నారు 12:25PM 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక కుప్పం రూపు రేఖలు మారాయి. మూడేళ్లలో మహిళలకు రూ. 2.39 లక్షల కోట్ల సాయం అందించారు. మూడేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని వర్గాలకు అండగా నిలిచారు. వచ్చె ఎన్నికల్లో కుప్పంలో విజయం సాధించి తీరుతాం. కుప్పం అభివృద్ధశిని వైఎస్ జగన్ చేతల్లో చూపిస్తున్నారు. భరత్‌ను మీరందరూ ఆశీర్వదించి గెలిపించాలి: మంత్రి పెద్దిరెడ్డి కుప్పం ప్రజలను చంద్రబాబు ఇన్నాళ్లు మోసం చేశారు: ఎమ్మెల్సీ భరత్.సీఎం వైఎస్ జగన్ వల్లే 33 ఏళ్ల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: ఎమ్మెల్సీ భరత్ 12:00PM ‘వైఎస్సార్ చేయూత’ వేదిక వద్దకు చేరిన సీఎం జగన్ 11:15AM కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్. కుప్పంలో అడుగడుగునా సీఎం జగన్‌కు నీరాజనం సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన కుప్పం ప్రజలు 10:50AM సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుప్పం పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్‌కు వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం వైఎస్ జగన్‌కు స్వాగతం పలికిన వారిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ డా.గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తదితరలు ఉన్నారు. 9:15AM ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కుప్పం పర్యటన కోసం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కుప్పంకు వెళ్లనున్నారు సీఎం జగన్. సీఎం హోదాలో ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి. నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆపై బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తారు. వైఎస్సార్ చేయూత కార్యక్రమం తర్వాత.. కుప్పం పురపాలక సంఘం అభివృద్ధికి సంబంధించి రూ.66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, రూ.11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ► పేద అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యంగా వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత కింద సాయాన్ని అందిస్తున్నారు. ► బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేరుగా జమ చేయనున్నారు సీఎం జగన్. ► దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోబుట్టువుగా ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం చేయడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగు పరుస్తున్నారు. వైఎస్సార్ చేయూత పథకం కింద.. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు అర్హులకు రూ.14,110.62 కోట్ల లబ్ధి ► రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 కుటుంబాల్లోని మహిళలకు తద్వారా కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ ఇప్పటి వరకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,110.62 కోట్లు (నేడు జమ చేసే మొత్తంతో కలిపి) అందించారు. అంటే మూడేళ్లలో అర్హులైన ఒక్కో లబ్ధిదారుకు రూ.56,250 చొప్పున జమ చేశారు. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అందిన నగదును లబ్ధిదారులు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకోవడానికి, ఇతర అవసరాలకు, జీవనోపాధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోంది. ► సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్ సహకారాలు అందిస్తూ.. కిరాణా షాపులు, గేదెలు, ఆవులు, మేకల పెంపకం వంటి వాటి ద్వారా జీవనోపాధి మార్గాలను చూపిస్తోంది. దిగ్గజ సంస్థలు, బ్యాంకులతో ఒప్పందం చేసుకుని వారి వ్యాపారాలను మందుకు నడిపిస్తోంది. -
వచ్చే ఎన్నికల్లో కుప్పంలోనూ గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
సాక్షి, చిత్తూరు: కుప్పం అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం కుప్పంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌తో కలిసి పర్యవేక్షించారు. 33 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పంను మున్సిపాలిటీగా చేయలేకపోయాడంటూ ఫైర్ అయ్యారు. కుప్పంను మున్సిపాలిటీతో పాటు, రెవెన్యూ డివిజన్ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం జగన్ తీసుకున్నారన్నారు. ఎన్నికల నాటికి హంద్రీనీవా కాలువల పనులు పూర్తి అవుతాయని తెలిపారు. గత ప్రభుత్వంలో కమిషన్లకు కక్కుర్తి పడి హంద్రీనీవా పనులు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో సీఎం వైఎస్ జగన్ సభ ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం స్థానాన్ని వైఎస్సార్సీపీ దక్కించుకుంటుంది'అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. చదవండి: (చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా ఆర్ఎం భాషా) -
కుప్పంలో టీడీపీ అరాచకం.. మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నేత, కుప్పం మాజీ జెడ్పీటీసీ రాజ్‌కుమార్‌ను హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24న చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు, పోలీసులపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కుప్పం పోలీసులు హైదరాబాద్‌లో రాజ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. చదవండి: (అలా చెప్పడానికి సిగ్గుండాలి.. టీడీపీపై మంత్రి అంబటి ఫైర్) -
దాడులు చేసిన టీడీపీ నాయకుల అరెస్టు
కుప్పం: ప్రతిపక్ష నేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి.. విచక్షణారహితంగా దాడులు చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు.. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బుధవారం రామకుప్పం మండలం, కొల్లుపల్లిలో పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు, బ్యానర్లను దౌర్జన్యంగా తొలగించారు. ఇది సరికాదంటూ అడ్డువచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్రగాయాలతో.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం సైతం కుప్పం పట్టణంలోని వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యంగా తొలగిస్తుండగా.. పోలీసులు అడ్డుకోబోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోయి.. పోలీసులపై సైతం దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలతో కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు కారణమైన టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు రామకుప్పం పోలీసుస్టేషన్ పరిధిలో 5, కుప్పం పరిధిలో 3 కేసులు నమోదయ్యాయి. నిందితులైన మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులుతో పాటు 59 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం చిత్తూరు సబ్‌జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ గంగయ్య, సీఐలు శ్రీధర్, సూర్యమోహన్‌రావు పర్యవేక్షించారు. -
'చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారు'
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని అల్లకల్లోలంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సమక్షంలోనే వైఎస్సార్సీపీ పార్టీని, నాయకులను, మహిళలను అతి దారుణంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఎంపీపీ అశ్వినిపై దాడి చేశారు. ఇదేనా మీకు మహిళలపై ఉన్న గౌరవం అంటూ ప్రశ్నించారు. 'కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని భయంతో నీచంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిపై, పోలీస్ వ్యవస్థపై మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబు పిచ్చి పట్టినట్లుందని ప్రజలు అనుకుంటున్నారు. కుప్పంలో స్థానిక ఎలక్షన్ లో చంద్రబాబు చావు దెబ్బ కొట్టారు. కుప్పం ప్రజలకు బాబు ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టే జగన్మోహన్రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చారు. గడిచిన 3 సంవత్సరాలలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్చుకోలేక ఈ విధంగా ప్రవర్తిసున్నాడు. రానున్న రోజుల్లో కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేడని' ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. చదవండి: (ఉనికి కోసమే బాబు ‘కుప్పం’ డ్రామా) -
కొంగణపల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల దాడి
-
కుప్పం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొంగణపల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీకి చెందిన ఓ అభిమాని పార్టీ గుర్తు చూపడంతో ఆ పార్టీ నేతలపై చంద్రబాబు ఎదుటే తెలుగు తమ్ముళ్లు విచక్షణా రహితంగా దాడి చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న ప్లెక్సీలను ధ్వంసం చేశారు. టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. చదవండి: (అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీపై క్లారిటీ ఇచ్చిన జీవీఎల్) -
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు
పలమనేరు(చిత్తూరు జిల్లా): కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన, తెలుగు తమ్ముళ్లను, జనాన్ని ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు ఆద్యంతం చెప్పిందే చెబుతూ ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని నింపేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో ఓటమి చెందినా టీడీపీ అసలు పోటీనే చేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఆపై మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా టీడీపీ చతికిలబడింది. దీనికి ఏం సమాధానం చెప్పాలో అక్కడి టీడీపీ క్యాడర్‌కు అర్థంకాలేదు. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు తగ్గుతున్న ఆదరణకు ఆయన ముందుగానే పసిగట్టి ఎలాగైనా కుప్పంలో మళ్లీ నిలదొక్కుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు పర్యటన సాగింది. చదవండి: టీడీపీ నేత పత్తిపాటి, అనుచరుల దౌర్జన్యకాండ.. అధికారిణిపై దాడి గత లోకల్‌బాడీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఓటమితో చంద్రబాబు వేరే నియోజకవర్గానికి వెళతాడంటూ అక్కడి జనం చెప్పుకోవడంతో ఈ సారి జాగ్రత్త పడ్డారు. తాను కుప్పంనుంచి ఎక్కడికి వెళ్లనంటూ ప్రజలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దాన్ని నిరూపించుకోవడం కోసం ఇక్కడే మెడికల్ కళాశాల పక్కన స్థలం చూశా, ఇల్లు కట్టుకుంటాను అని ప్రజలకు ప్రమాణం చేసి చెప్పాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు లేని ప్రేమ ఇప్పుడెందుకనే గుసగుసలు మొదలయ్యాయి. ప్రసంగాలకు నో రెస్పాన్స్ బాబు పర్యటనలో తొలిరోజు శాంతిపురం మండలంలో ఆ పార్టీ నాయకులు మినహా స్థానికులు కనిపించలేదు. అనికెర, రేగడదిన్నేపల్లి, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సొంత గ్రామమైన వెంకటేపల్లె్లలో సభలు వెలవెలబోయాయి. బోయనపల్లెలో బాదుడే బాదుడు కార్యక్రమానికి జనం నుంచి స్పందన లేకుండా పోయింది. ప్రభుత్వంపై ఎన్ని రకాల ఆరోపణలు, విమర్శలు చేసినా జనం పట్టించుకోలేదు. ట్రెండ్ మార్చినా లాభం లేదే... తన రెండోరోజు పర్యటనలో కుప్పం స్థానిక సమస్యలపై మాట్లాడారు. కానీ జనం నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో అక్కడి నాయకులపై మండిపడినట్టు సమాచారం. ఇక్కడ నాయకులంతా వినాయకుల్లా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా తన మూడు రోజుల కుప్పం పర్యటలో అనుకున్నది జరగలేగదనే ఫ్రస్టేషన్, తమ్ముళ్లు పనికిరాకుండా పోయారనే అసంతృప్తి చంద్రబాబు మొహంలో కనిపించింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానిపై బాబు ఫైర్ కుప్పం: నియోజకవర్గ పర్యటనలో చంద్రబాబు నాయుడు, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై నోరు పారేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ప్రజాదర్బార్ కవరేజికి జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకుడు, ఓ దినపత్రికలో విలేకరిగా పని చేస్తున్న శివ వచ్చాడు. అతన్ని చూసిన చంద్రబాబు పీఏ మనోహర్ ‘సార్ ఇతను కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని, జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని బ్యానర్లు వేస్తున్నాడని’ చెవిలో వేశాడు. దీంతో రెచ్చిపోయిన చంద్రబాబు శివను చూసి హెచ్చరికలు చేశారు. అభిమానం వేరు.. పార్టీ వేరు.. పార్టీలో చీలికలు తేవడం మంచిది కాదంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు. పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేవద్దని సంకేతాలు ఇస్తూ ఊగిపోయారు. -
తప్పు చేశా.. అందుకు తలవంచుకుంటున్నా!
సాక్షి, పలమనేరు/గుడుపల్లె (చిత్తూరు) : ‘ఏడుసార్లు కుప్పం ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఆదరించారు. కుప్పం ముద్దుబిడ్డగా చూసుకున్నారు. కానీ, నేను చాలా తప్పుచేశా. మొన్నటి ఎన్నికల్లో ఓటమికి నాదే బాధ్యత. తప్పు నా వైపు ఉంది. అందుకే తలదించుకుంటున్నా. తప్పు సరిదిద్దుకుంటా.. ఇక్కడే ఇల్లు కట్టుకుని మీ సేవలో తరిస్తా..’ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా రెండోరోజు గురువారం కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పొగురుపల్లి, చింతరపాళ్యం, దాసిమానుపల్లి, కుప్పిగానిపల్లి, యామగానిపల్లి, అగరం క్రాస్, కనమనపల్లి, గుండ్లసాగరం తదితర గ్రామాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ల పేరిట ఉద్యోగాలిస్తామంటూ ఈ మూడేళ్లలో ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో మందుల్లేక సమయానికి అంబులెన్సులు రాక జనం పడుతున్న ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి కనబడవా అని.. సీఎం సొంత జిల్లాలో ఓ ఎస్సీ బాలికను అత్యాచారం చేస్తుంటే రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా రాజకీయ నాయకుల కనుసన్నల్లో మెలుగుతోందన్నారు. హంద్రీ–నీవా పనులు టీడీపీ 88శాతం పూర్తిచేస్తే మిగిలిన పనులను ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదన్నారు. రూ.2 లక్షల కోట్ల ప్రజా సంపదను అమరావతిలో నాశనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తనవల్ల లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు టీడీపీ కోసం ఎంతోకొంత విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతుల మెడకు ఉరితాడు వేయాలన్న లక్ష్యంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని ఉవ్విళ్లూరుతోందని చంద్రబాబు విమర్శించారు. గతంలో దేశ స్వాతంత్య్రం కోసం ప్రజలు ఎలా పోరాటాలు సాగించారో అదే విధంగా నేడు టీడీపీ అధికారం కోసం యువత నడుం బిగించాలన్నారు. నా పేరు చెప్పుకొని ‘తమ్ముళ్ల’ అక్రమాలు నా పేరు చెప్పుకుని అక్రమాలు చేసే తమ్ముళ్లకు చెక్ పెడతామని, వారు నాయకుల్లా కాక వినాయకుల్లా మారారని చంద్రబాబు మండిపడ్డారు. కుప్పంలోని పార్టీ నేతలు సక్రమంగా ఉంటే గత స్థానిక ఎన్నికల్లో మనం చిత్తుగా ఓడేవారమా అని ప్రశ్నించారు. మరోవైపు.. రెండ్రోజులుగా జరుగుతున్న బాబు సభలకు జనం ముఖం చాటేశారు. సభలకు పలుచోట్ల కనీసం పదుల సంఖ్యలో కూడా రాకపోవడంతో బాబు అసహనం వ్యక్తంచేసినట్లు తెలిసింది. -
వారి ఆశీస్సులు ఉంటే పొత్తులతో పనే లేదు: చంద్రబాబు
సాక్షి, కుప్పం, పలమనేరు: ప్రజల ఆశీస్సులు ఉంటే పొత్తులతో పనే లేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తులు లేకున్నా గెలుస్తామన్నారు. పొత్తులు ఉన్నప్పుడు టీడీపీ గెలిచిందని మరికొన్నిసార్లు ఓటమి పాలైందని చెప్పా రు. జీవితాంతం తాను కుప్పం నుంచే పోటీ చేస్తాన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడినుంచే గెలిచి ముఖ్య మంత్రి పదవి చేపట్టి తనను ఇబ్బంది పెట్టినవారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తానని హెచ్చరించారు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కుప్పం నుంచే మెుదలవ్వాలన్నారు. అక్రమాలు, అన్యాయాలకు పాల్పడే టీడీపీ నాయకులను కార్యకర్తలే ప్రశ్నించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందన్నారు. కుప్పం లో నాయకులతో పనిలేకుండా ఏరోజుకారోజు వాస్తవాలు తనకు తెలిసేలా మానిటరింగ్‌సెల్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మూడు నెలలకోమారు కుప్పంలో పర్యటిస్తానన్నారు. శుక్రవారం కుప్పం మండలం దాసేగౌనూరు, కొత్తయిండ్లు తది తర గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుప్పం ప్రభుత్వా స్పత్రిలో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌ను ప్రారం భించారు. ఆయాచోట్ల చంద్రబాబు ప్రసంగం వివరాలివీ.. అవసరమైతే నేనే కేసులేస్తా.. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకుంటే అధైర్య పడొద్దని, అవసరమైతే తానే కోర్టుల్లో కేసులు వేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ‘పింఛన్లు తొలగించారని అధైర్యపడవద్దు. కోర్టుకెళ్లి వడ్డీతో సహా పింఛన్లు ఇప్పించే బాధ్యత టీడీపీదే’ అని చెప్పారు. ఈ ప్రభుత్వానికి వలంటీర్లు తొత్తులుగా మారారని, రేపు తమ ప్రభుత్వం వస్తే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీని గెలిపించినా నిజమైన కార్యకర్తలకు ఆ పార్టీలో న్యాయం జరగలేదని, కొందరు రౌడీలు దోచుకు తింటున్నారని చెప్పారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తరువాత తాను కచ్చితంగా సీఎం అవుతానని, అప్పుడు ప్రత్యేక కమిషన్ వేసి వీరి సంగతి చూస్తానన్నారు. చదవండి: (AP: 500 ఎకరాల్లో 'అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్') పథకాలు అవసరమా? పథకాల పేరుతో రూ.నాలుగువేలు ఆశచూపి ప్రజల నుంచి రూ.లక్షలు కొట్టేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిరుద్యోగులకు కనీసం జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇంత భారీ స్థాయిలో అప్పులు చేసిన రాష్ట్రాన్ని చూడలేదన్నారు. ప్రజల సొమ్ము తింటూ పథకాలు పెట్టడం అవసరమా? అని ప్రశ్నించారు. చెప్పిందే చెబుతూ.. రెండోరోజు కుప్పం మండలంలో చంద్రబాబు రచ్చబండ, రోడ్‌షో జనం లేక వెలవెలబోయింది. అన్నిచోట్లా చెప్పిందే చెబుతుండడంతో జనం విసి గిపోయారు. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివి ధంగా చంద్రబాబు సెల్ఫీలు దిగడం, పిల్లలను ఎత్తుకోవడం, మహిళలతో ముచ్చ టించటాన్ని చూసి స్థానికులే ఆశ్చర్యపోయారు. పవన్‌కల్యాణ్‌తో కలసి పనిచేస్తే బాగుంటుందని మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి విలేకరులతో పేర్కొన్నారు. -
కుప్పం పర్యటన.. జనంపై చంద్రబాబు చిందులు
సాక్షి, చిత్తూరు: సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్థానిక జనంపై అక్కసును వెళ్లగక్కారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు.. వెయ్యి, రెండు వేలకు అమ్ముడు పోతారా అంటూ జనంపై చిందులు తొక్కారు. టీడీపీ 22 సంవత్సరాలు అధికారంలో ఉందని, తాను తలుచుకుంటే ఎంతైనా డబ్బు ఇవ్వగలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లో ప్రకటన చేస్తాం: సీఎం జగన్ తనకు విలువలు ముఖ్యమని, మీరు డబ్బులకు అమ్ముడుపోయి తప్పు చేశారని జనాలను ఉద్ధేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే కుప్పం టీడీపీ నేతలు, కార్యకర్తలను సైతం చంద్రబాబు వదల్లేదు. స్థానిక ఎన్నికల్లో కొందరు టీడీపీకి ఎలా మోసం చేసారో తనకు తెలుసంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల చరిత్ర అంతా నా దగ్గర ఉందంటూ మండిపడ్డారు. పార్టీలో కొందరు కోవర్టులు ఉన్నారని , ఎవ్వరినీ వదలను అంటూ హెచ్చరించారు. డబ్బులకు అమ్ముడు పోయి తప్పు చేశారంటూ ధ్వజమెత్తారు. చదవండి: సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు: ఉద్యోగ సంఘాల నేతలు -
బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!
ఎప్పుడూ లేనంతగా ఆవేశంతో ఊగిపోవడం.. ఎక్కడికక్కడ గంటల తరబడి ఉపన్యాసాలు.. ఒంగి ఒంగి దండాలు.. మీ రుణం తీర్చుకోలేనంటూ సెంటిమెంట్ డైలాగులు.. ఇలా రెండురోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం ప్రజలకు తన విన్యాసాలు చూపించారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు.. బాబు భాషలో తమ్ముళ్లు.. రెండురోజులూ ఫూటుగా ఫుల్ బాటిళ్లు కొట్టేసి.. ఎక్కడికక్కడ తూగిపోతూ ఏం మాట్లాడుతున్నారో తెలియనంత మత్తులో మునిగితేలారు. మధ్యలో టీడీపీ నేతలు మాత్రం ఈ రెండు రోజుల బాబు టూర్‌కి ఎంత ఖర్చయింది.. ఇంత చేసినా వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ఈ పర్యటన ఏమైనా కలిసొస్తుందా.. లేదా అనవసర యాగీ వల్ల వచ్చే నాలుగు ఓట్లు కూడా పోతాయా.. అని లెక్కలు వేసుకుంటూ కనిపించారు. స్థూలంగా చెప్పాలంటే రెండు రోజుల కుప్పం పర్యటనలో బాబు ఆవేశం పేరిట ఆయాసం తప్ప ఫలితం ఏమీ కానరాదని కుప్పంలోని టీడీపీ సీనియర్లే విశ్లేషించుకుంటున్నారు. సాక్షి, తిరుపతి: ‘‘థూ.. అవి ఫలితాలా.. ’ దేశంలో నేనే సీనియర్ రాజకీయ నేత అని చెప్పుకునే చంద్రబాబు నోటి వెంట వచ్చిన ముత్యపు పలుకది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. అసలు అవి ఎన్నికలే కాదని, వాటికి మేము దూరంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కానీ త్వరలో జరగనున్న కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలకు మాత్రం ఆ విధంగా చెప్పుకునే పరిస్థితి లేకపోవడంతో అందరికంటే ముందుగానే ఎన్నికల ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో కూడా తెలియకుండానే బాబు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీడీపీ ఉనికి కాపాడుకోవడమే లక్ష్యంగా శుక్ర, శనివారాల్లో రాజకీయం చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ఈ మున్సిపాలిటీ ఎన్నిక ఫలితాలు మనకు చాలా ఇంపార్టెంట్ అని దిశానిర్దేశం చేశారు. రండి.. బాబూ రండి.. తొలిరోజు శుక్రవారం నాటి సభకు ఓ మాదిరిగానైనా జనాలను తరలించిన ద్వితీయ శ్రేణి నేతలు రెండో రోజు శనివారం చేతులెత్తేశారు. బాబు టూర్లో శనివారం ఉదయం జనం చాలా పలుచగా కనిపించారు. దీంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.. అందరి ఫోన్లకి మెసేజ్‌లు, వాట్సాప్‌లు పంపించారు. ఇవాళ జనం పెద్దగా లేరు.. వైఎస్సార్సీపీ నేతలు బాబు గారిని అడ్డుకునే అవకాశం ఉంది.. అందుకని మీరు బేగా వచ్చేయండి.. అద్దె జనాలను తీసుకురండి అని మెసేజ్‌లు దంచి కొట్టారు. అయినాసరే శనివారం ఎక్కడా జనం రద్దీ కానరాలేదు. దీంతో బాబు టూర్ షెడ్యూల్ ఎక్కడికక్కడ ఆలస్యం చేస్తూ పొలాల గట్ల వెంబడి నడిచి చిన్న చిన్న పల్లెటూర్లకు కూడా వెళ్లొచ్చారు. మొత్తం మీద ఈ ముప్పై ఏళ్లలో ఎప్పుడూ వెళ్లని, చూడని కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని మారుమూల ప్రాంతాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం బాబు కాలు మోపించిన ఘటన వైఎస్సార్సీపీ సర్కారుకే దక్కిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కొసమెరుపు.. బాబు మాటలకు, చేతలకు ఎంత తేడా ఉంటుందో ఈ ఒక్క విషయం చాలు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలను తాము పట్టించుకోలేదని, ‘‘చీ థూ.. అవి ఫలితాలా’’ అని బహిరంగంగా వ్యాఖ్యానించిన బాబు.. కుప్పం నియోజకవర్గంలో గెలిచిన ముగ్గురు ఎంపీటీసీలను మాత్రం ప్రత్యేకంగా అభినందించారు. ఈసారికి బస్సులో బస మూడు దశాబ్దాలకు పైగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఇప్పటివరకు సొంతిల్లు కానీ.. క్యాంపు కార్యాలయం కానీ లేని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడొచ్చినా ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లోనే బసచేస్తున్న విషయం తెలిసిందే. బాబు బసపై ‘సాక్షి’లో ఇటీవల గెస్ట్ హౌస్ బాబు పేరిట వచ్చిన కథనం చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన బస గెస్ట్‌హౌస్‌లో కాకుండా బస్సులో ఏర్పాటు చేశారు. ఇన్నేళ్లలో బాబు తొలిసారి కుప్పంలో బస్సులో నిద్రపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. -
పట్టాభితో బూతు డ్రామాలు.. కుప్పంలో బాంబు డ్రామాలు: ఆర్కే రోజా
సాక్షి, చిత్తూరు: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్టేషన్లో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్లో నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులున్నారని నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నగరి మునిసిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులపై మునిసిపల్ కౌన్సిల్ ప్రతిపాదించిన తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. బాబు 14 ఏళ్ల ముఖ్యమంత్రా.. లేక వీధి రౌడీనా?. ముందు 'యధా రాజా తథా ప్రజా' అంటారు. అయితే ఇప్పుడు 'యధా రాజా తథా చంద్రబాబు' అన్నది తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకే సరిపోతుంది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయం?. కుప్పంలో కనీసం ఇళ్లు, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి ఈ రోజు ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదం. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారు. చదవండి: (అప్పట్లో కన్నీళ్లు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు.. మిగిలినదంతా సేమ్ టు సేమ్..) కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ ఎద్దేవా చేశారు. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి ప్రజలని నమ్మించాలని చూస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికే పట్టం కడతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. టీడీపీ అధినాయకుడు చంద్రబాబు క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే చరిత్ర హీనుడిగా మిగిలి పోతారు' అని ఆర్కే రోజా హెచ్చరించారు. -
అప్పట్లో కన్నీళ్లు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు.. మిగిలినదంతా సేమ్ టు సేమ్..
అప్పట్లో కన్నీళ్లు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు.. మిగిలినదంతా సేమ్ టు సేమ్.. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తొలిరోజు శుక్రవారం పర్యటనకు సంబంధించి ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇంతే.. అవే ‘‘రుణం’’ మాటలతో ఆగకుండా గంటన్నర మాట్లాడేశారు. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ సారి క్యాడర్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సాక్షి, తిరుపతి: రెండు రోజుల కుప్పం పర్యటనలో తొలిరోజు కుప్పం బస్టాండ్ సర్కిల్ వద్ద జరిగిన బహిరంగసభలో స్థానిక ప్రజలనుద్దేశించి చంద్రబాబు ఎప్పటిలాగే మీ రుణం తీర్చుకోలేనంటూ సెంటిమెంట్ డైలాగులు వల్లించేశారు. 2004, 2009, 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇక్కడికి విచ్చేసి.. పార్టీ అధికారంలోకి రాకపోయినా మీరు నన్ను గెలిపించారు.. అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి వచ్చిన బాబు.. ఇప్పుడు ఒంగి ఒంగి దండాలు పెట్టారు. మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు.. మన అనుబంధం ఎవ్వరూ విడదీయలేరు.. అంటూ నాలుగుదిక్కులూ చూస్తూ బాగా ముందుకు వంగి ఓ విధంగా పొర్లు దండాలు పెట్టినంత పనిచేశారు. బాబు తన రెండు చేతులతో నమస్కారం పెడతారని ఊహించిన స్టేజీపైన నాయకులు ఒక్కసారిగా ఈయన పూర్తిగా ఒంగిపోవడంతో ఒకింత కంగారు పడ్డారు. ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడుతున్న టీడీపీ కార్యకర్తలు ఎంతయినా అద్దె జనం.. అవుతుందా ప్రభంజనం మునుపెన్నడూ లేనివిధంగా కుప్పంకు ఈసారి భారీ సంఖ్యలో బయటి ప్రాంతాల నుంచి కార్యకర్తలను, ఓ రకంగా చెప్పాలంటే అద్దె జనాన్ని చంద్రబాబు సభకు తరలించారు. అందుకే బాబు ప్రసంగిస్తుంటే.. ఎక్కడా వారి నుంచి స్పందన రాలేదు. చివరికి చంద్రబాబు నేరుగా వారినుద్దేశించి.. నేను ప్రభుత్వంపై పోరాడుతున్నాను.. మీరు నాతో కలిసి వస్తారా.. ధర్మపోరాటానికి సహకరిస్తారా..? అని ఒకటికి పలు పర్యాయాలు అడిగినప్పటికీ జనం నుంచి స్పందన లేకపోయింది. చదవండి: (చంద్రబాబుకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో నేర్పించండి) క్యాడర్ అరాచకం చేస్తున్నా వారించని బాబు సహజసిద్ధంగానే ప్రభుత్వంపై అకారణంగా విషం చిమ్ముతూ తీవ్ర విమర్శలు చేసే బాబు ఈసారి దానికి అదనంగా కుప్పంలో టీడీపీ శ్రేణులను అరాచకం సృష్టించే దిశగా ప్రోత్సహించారు. పచ్చమూకలు ఉదయం నుంచి కుప్పం పట్టణంలో మద్యం మత్తులో ఊగిపోతూ బండబూతులు మాట్లాడుకుంటూ తిరుగుతూ వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలన్నీ చించివేశారు. ఫ్లెక్సీలను, వైఎస్సార్సీపీ బోర్డులను తొలగిస్తున్న పచ్చమూకలను అడ్డుకునేందుకు యత్నించిన ఏఆర్ పోలీసులపైనా దాడి చేసినంత పనిచేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గి వెళ్లిపోవాల్సిన పరిస్థితి కలిగింది. ఇక బాబుకి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన టూరిజం శాఖ ఉద్యోగిని చావగొట్టేశారు. ఈ ఘటన చూస్తూ కూడా చంద్రబాబు కనీసం వారించకుండా బాంబులు తెచ్చాడేమో చూడండి.. అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం గమనార్హం! జన సమీకరణకు సంబంధించి డబ్బుల పంపిణీ కరెంటు తీసేశారంటూ హడావుడి బాబు బస చేసిన ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందంటూ టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. కరెంటు పోవడంతో చివరికి జనరేటర్ పెట్టారని ఆరోపిస్తూ నానాయాగీ చేశాయి. ఈ విషయాన్ని గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ(రెస్కో) ఎండీ సుబ్రహ్మణం తీవ్రంగా ఖండించారు. ఒక్క సెకను కూడా కరెంటు పోలేదనీ.. ముందు జాగ్రత్త చర్యగా జనరేటర్ ఏర్పాటు చేస్తే టీడీపీ నేతలు కరెంటు పోయిందేమోనని అపోహ పడ్డారని ఆయన చెప్పారు. మొత్తంగా నానాయాగీ చేసి కుప్పంలో తన ఉనికిని చాటుకోవాలనుకున్న బాబు ’షో’ రక్తి కట్టలేదనే చెప్పాలి. -
చంద్రబాబు పర్యటన: టీడీపీ కార్యకర్తల ఓవర్‌యాక్షన్.. ఉద్యోగిపై దాడి
-
చంద్రబాబు పర్యటన: సానుభూతి కోసం టీడీపీ సరికొత్త డ్రామా
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రాష్ట్రంలో 2019 ఎన్నికలతో పాటు ఆ తర్వాత వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ చంద్రబాబు తలకు బొప్పి కట్టడంతో అధికార పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి, అరాచకం సృష్టించడం ద్వారా ప్రజల సానుభూతి పొందేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపారు. సీఎంను బూతులు తిట్టించడంతో మొదలైన ఈ డ్రామా తాజాగా కుప్పంలో కూడా కొనసాగింది. టీడీపీ శ్రేణులు రెచ్చిపోయేలా వ్యాఖ్యలు చేస్తూ తన కసిని వ్యక్తం చేశారు. ఏదో జరిగిపోతోందని, తనపై ఎవరో దాడి చేయనున్నారని బీద అరుపులు అరుస్తూ ఆ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా రెచ్చగొట్టారు. ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. కుప్పం హరిత టూరిజం హోటల్లో అసిస్టెంట్ మేనేజర్ మోహన్ మరో తొమ్మిది నెలల్లో పదవీ విరమణ పొందనున్నారు. తన సొంతూరు చంద్రగిరికి బదిలీ కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే అయిన చంద్రబాబు సిఫార్సు కోసం ఆయన్ను కలిసేందుకు వచ్చారు. బస్టాండ్ వేదిక వద్ద జనం ఉండటంతో తొక్కిసలాటలో ఆయన చేతి బ్యాగ్‌లో ఉన్న వోలినీ స్ప్రే బాటిల్ (ఒంటి నొప్పులకు వాడతారు) ఒత్తిడికి గురయ్యి కాస్త శబ్దం వచ్చింది. అంతే.. ఆయన బాంబు తెచ్చాడంటూ టీడీపీ మూకలు రెచ్చిపోయాయి. వయస్సు కూడా చూడకుండా ఆయనపై దాడి చేశారు. నాపై రాళ్లు వేస్తున్నారు.. కళ్తెదుటే ఓ వ్యక్తిని కొడుతున్నా కనీసంగా స్పందించని చంద్రబాబు.. సెక్యూరిటీ వలయంలోకి వెళ్ళి.. ‘చూశారా తమ్ముళ్లూ నాపై దాడి చేయడానికి వచ్చారు.. తిరుపతిలో రాళ్లేశారు.. ఇక్కడకు కూడా రాళ్లు తెచ్చారు..’ అంటూ మరింతగా రెచ్చగొట్టారు. దీంతో అక్కడున్న వారు ఆ ఉద్యోగికి రక్తం చిందేట్టు చితక్కొట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో వారిపై మండిపడ్డారు. తీరా అతని బ్యాగ్ చెక్ చేస్తే డెట్టాల్ బాటిల్, వోలినీ స్ప్రే బాటిల్, ఎనర్జీ డ్రింక్, టాబ్లెట్లు ఉన్నాయి. గాయపడిన మోహన్‌ను పోలీసులు పీఈఎస్ మెడికల్ కళశాల ఆస్పత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వాస్తవానికి ఇతన్ని బాబు వద్దకు లక్ష్మీపురానికి చెందిన పార్టీ నేత సుబ్బు తీసుకురావడం కొసమెరుపు. టీడీపీ శ్రేణుల హల్చల్ టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి వెళుతూ కుప్పంలో కనిపించిన వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలన్నింటినీ చింపివేశారు. అడ్డుకోబోయిన ఎఆర్ పోలీసులపై దౌర్జన్యం చేశారు. వైఎస్సార్సీపీ నేతలను అసభ్య పదజాలంతో దూషించారు. మద్యం మత్తులో ‘జోహార్ టీడీపీ.. జోహార్ బాబు’ అంటూ నినాదాలు హోరెత్తించారు. జిల్లా నలుమూలల నుంచి, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున జనాన్ని తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జనరేటర్ ఏర్పాటు చేస్తే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్నారంటూ రెచ్చిపోయారు. వాస్తవానికి ఒక్క సెకను కూడా కరెంటు పోలేదు. -
నాకు సీఎం పదవి అవసరమా?: చంద్రబాబు
సాక్షి, తిరుపతి: ‘‘కార్యకర్తలకు మీరేం చేశారు? సీనియర్లు అని చెప్పుకునే వారు మాకొద్దు.. ఎన్నికల్లో ఎవరు పట్టించుకోలేదు..!’’ గురువారం కుప్పం పర్యటన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎదుట ఆ పార్టీ కార్యకర్తల నిర్వేదం ఇదీ. పంచాయతీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన చంద్రబాబు గుడుపల్లె, కుప్పంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. కార్యకర్తల వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైనా ఆయన తేరుకుని ‘‘పొరపాటు జరిగింది.. మీరు ఎన్నో త్యాగాలు చేశారు.. మీకోసం ఆలోచించి ఉంటే బాగుండేది.. మిమ్మల్ని విస్మరించా. ఇకపై మీ కోసం 25% సమయం కేటాయిస్తా.. మీరంతా చెప్పినట్లు వింటా..’’ అంటూ బుజ్జగించారు. తాను రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు పనిచేశానని, అయితే కార్యకర్తల కోసం సమయం కేటాయించలేకపోయానని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా చేశారని, నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. చోటా మోటా నాయకులు ఎగిరి పడుతున్నారని, చిన్న కాలువను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాను పులివెందులకు నీళ్లిస్తే అక్కడ ప్రజలు తనకు ఓటు వేశారన్నారు. ఈ ప్రభుత్వం కుప్పానికి ఎందుకు నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాకు సీఎం పదవి అవసరమా? చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కార్యకర్తలు అడ్డు తగిలి స్థానిక నేతల తీరుపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. గతాన్ని తవ్వుకుంటే ముందుకు వెళ్లలేమని, అంతర్గత విమర్శలతో బలహీనపడతామని చంద్రబాబు వారిని సముదాయించారు. కొత్త రక్తాన్ని, పోరాడే వారిని ముందుకు తెద్దామన్నారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన తనను అవమానాల పాలుచేసి చులకనగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ముఖ్యమంత్రి పదవి అవసరమా..? అంటూ ప్రశ్నించారు. కార్యకర్త ఆత్మహత్యాయత్నం చంద్రబాబు బెంగళూరు నుంచి గుడుపల్లెకు వస్తున్న మార్గంలో కొడతనపల్లి వద్ద కాన్వాయ్‌ను ఆపి స్థానికులతో మాట్లాడారు. ఆ సమయంలో శివ అనే కార్యకర్త చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా స్థానిక నాయకులు అడ్డుకోవడంతో జేబులోని పెట్రోల్ ప్యాకెట్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. బస్టాండ్ వద్ద బాబు బూతు పురాణం కుప్పం పర్యటన సందర్భంగా గురువారం రాత్రి బస్టాండ్ కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సభ్యత మరచి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార యంత్రాంగంపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగారు. అసభ్యంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేనొస్తే తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తా ‘‘నా దగ్గర నంగినంగిగా పని చేసిన కలెక్టర్లు, ఎస్పీలను ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వారి ప్రవర్తన నాకు ఒక గుణపాఠం. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టను... నేను వస్తే వారిపై తప్పుడు కేసులు పెట్టి శిక్షిస్తా. మీపై ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు. నేను వచ్చాక ఒక్క సంతకంతో అన్ని కేసులు మాఫీ చేస్తా’’ అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. -
బాబు పర్యటనకు తమ్ముళ్లు.. దూరం..దూరం
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కుప్పానికి చేరుకున్నారు. నియోజకవర్గంలోనే అన్ని మండలాల్లో పర్యటించారు. బహిరంగ సభలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. అయితే జిల్లాలోని ఆ పార్టీ ముఖ్య నాయకులెవరూ ఆయనను కలవడానికి ఇష్టపడలేదు. కుప్పానికి రమ్మని కబురు చేసినా చాలామంది ముఖం చాటేశారు. దీంతో చంద్రబాబు రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. సాక్షి, తిరుపతి : చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో జిల్లాలో ఎక్కడ పర్యటించినా.. దాదాపు అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు రెక్కలు కట్టుకుని ఆయన వద్ద వాలిపోయేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురవడం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మాజీ మంత్రి అమర్నాథ్రెడ్డి, మాజీ ఎంపీ శివప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్పర్సన్, డీసీసీబీ మాజీ చైర్మన్, తుడా మాజీ చైర్మన్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, మున్సిపాలిటీల మాజీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, నగర, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అందరూ జిల్లాలోనే ఉన్నా.. ఎవరూ కుప్పం వైపు చూడలేదు. ముఖ్యంగా తిరుపతికి చెందిన ముఖ్య నాయకులు కూడా చంద్రబాబును కలవడానికి ఇష్టపడలేదు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ, దుర్గా రామకృష్ణ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మాత్రమే చంద్రబాబుతో కనిపించారు. నాయకులతో సమావేశం ఏర్పాటు చెయ్యాలని, ఉన్న వారిని కుప్పానికి రమ్మని కబురు చేసినా ఎవరూ స్పందించలేదని తెలిసింది. ఫోన్లు చేసినా.. పనులు ఉన్నాయని, మరి కొందరు ఆరోగ్యం సరిగా లేదని ఇలా రకరకాల కారణాలు చెప్పి తప్పించినట్లు సమాచారం. మాకేం చేశారు చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు తమ అభిప్రాయాలకు ఏనాడూ విలువ ఇవ్వలేదని ఓ మాజీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. అధినేతను తాము ఏదైనా అడిగితే.. దాని వెనుక ప్రయోజనం గురించి ఆలోచించారని విమర్శించారు. నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయని కొందరు విన్నవించినా.. ఆయన పెద్దగా స్పందించలేదన్నారు. ఆయన కొందరికి మాత్రమే ప్రయోజనం చేకూర్చారని, తమకు, ప్రజలకు ఏమీ చెయ్యలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటినీ నెరవేర్చకుండా గాల్లో తిరిగే అధినేత వచ్చినా ఏం ఉపయోగం అని మరో ఇద్దరు నాయకులు, మరో మహిళా నాయకురాలు ప్రశ్నించడం గమనార్హం. సభల్లో బాబు అసంతృప్తి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నికల్లో తనను మరోసారి గెలిపించలేదని తీవ్ర పదే పదే ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి ప్రజలు ఇచ్చిన తీర్పును తాను ఊహించలేదని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఊహించని పరాభవం ఎదురవడంతో.. కార్యకర్తలు కూడా దూరం అవుతారనే ఆందోళన చంద్రబాబు మాట తీరులో స్పష్టమైంది. కార్యకర్తలందరూ టీడీపీకి శాశ్వతంగా ఉండాలని పదే పదే కోరడం బాబు పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన చెందుతున్నారని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. -
ఎందుకు ఓడిపోయామో..
కుప్పం (చిత్తూరు జిల్లా): ఎన్నికల్లో ప్రజాతీర్పు చూస్తే బాధగా ఉందని ప్రతిపక్ష నేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికలు జరిగి మూడు నెలలు కావస్తున్నా అసలు కారణాలను మాత్రం గుర్తించలేకపోతున్నామన్నారు. ప్రజలను సంక్షేమ పథకాలతో మెప్పించలేకనే ఓటమి పాలైనట్లు భావిస్తున్నామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశానే తప్ప తానెన్నడూ తప్పు చేయలేదన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా బుధవారం గుడుపల్లె, కుప్పంలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ ‘నేను చేసిన పనులు బహిరంగంగా కనిపిస్తున్నా ఎన్నికల్లో ప్రజలు ఎందుకిలా తీర్పు ఇచ్చారు..? నేను చేయరాని తప్పు ఏం చేశా..?’ అంటూ నిర్వేదం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను నివారించేందుకు అమరావతిలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించేందుకు ప్రయత్నించానన్నారు. రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులిచ్చిన భూములను కొన్ని సంస్థలకు అప్పగిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతోపాటు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చని భావించినట్లు చెప్పారు. ప్రభుత్వ డబ్బు పైసా లేకుండా రాజధానిని నిర్మించాలని ప్రయత్నం చేశానని, ఎన్నికల్లో వచ్చిన ఫలితాల వల్ల అంతా విఫలమైందని వ్యాఖ్యానించారు. కుప్పానికి నీళ్లివ్వండి...: శ్రీశైలం నుంచి నీళ్లు కుప్పం తరలించేందుకు చేసిన ప్రయత్నం చిన్న చిన్న పనుల వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులు పూర్తి చేసి హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీళ్లు ఇవ్వాలని కోరారు. కరువు జిల్లా అనంతపురంలో కియా కార్ల తయారీ కంపెనీని ఏర్పాటు చేయిస్తే చివరకు ఆ అసెంబ్లీ స్థానం కూడా గెలవలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా, 20 ఏళ్లు టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు ఇలాంటి ఫలితాలు ఎదురవటాన్ని కార్యకర్తలు, మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనకు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తెలుసని, ఓటమికి కుంగిపోయి వారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. -
అయినా.. బాబు మారలేదు
టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు.. చేతల్లో ఎటువంటి మార్పు కనిపించలేదని ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. ఎన్నికల తరువాత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అనేక మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని అధినేతకు తెలియజేయాలని భావించారు. కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినప్టికీ తమ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా.. తాను చెప్పాలనుకున్నది మాత్రం చెబుతున్నారని పెదవి విరుస్తున్నారు. మరో వైపు ఆయన పర్యటనలో ప్రజల నుంచి స్పందన కరువైంది. సాక్షి, తిరుపతి/కుప్పం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి తాను కారణం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తలకు చెప్పుకునే ప్రయత్నం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కుప్పానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నియోజకవర్గంలో పర్యటించారు. రెండుచోట్ల బహిరంగ సభలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో ఓటమికి రాజకీయ పార్టీ సిద్ధాంతాలే కారణమని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి కాబట్టే జనం ఓట్లేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంని చేస్తే.. టీడీపీ సిద్ధాంతాలు బాగోలేనట్టే కదా? ఓటమి చెందితే గానీ సిద్ధాంతాలను మార్చుకోవాలని తెలిసిరాలేదా? అని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. ఎన్నికల తరువాత నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా అనేకమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని భావించారు. అయితే చంద్రబాబు కార్యకర్తల సమావేశం ఏర్పాటుచేసినా వారు ఆశించినట్లు మాట్లాడే అవకాశం రాలేదు. చంద్రబాబు చెప్పాలనుకున్నది చెప్పి సమావేశాన్ని ముగించేశారు. ఘోరంగా ఓటమి పాలైనా.. చంద్రబాబు మాత్రం మారలేదనే అభిప్రాయం టీడీపీ శ్రేణులు వ్యక్తం చేశా రు. ఓటమికి కారణాలను విశ్లేషించుకోవాల్సింది పోయి.. ఆ పనిచేస్తే విభేదాలు తలెత్తుతాయనే అభిప్రాయం వ్యక్తం చెయ్యడంపై కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కుప్పంలో పర్యటించిన చంద్రబాబు తీవ్ర అసహనంతో కనిపించారు. ఘోర పరాభవం తరువాత పార్టీ శ్రేణులు ఎక్కడ టీడీపీకి దూరమవుతారనే ఆందోళన చంద్రబాబు ప్రసంగంలో స్పష్టమైంది. రామకుప్పం, శాంతిపురం బహిరంగ సభలు, కార్యకర్తల సమావేశాల్లో కార్యకర్తలను ప్రసన్నం చేసేకునే ప్రయత్నం చేశారు. ఎవరైనా తప్పులు చేసి ఉంటే.. వాటిని సరిదిద్దుకుని కలిసికట్టుగా పనిచేద్దాం అంటూ పిలుపునిచ్చారు. కుప్పంలో మెజారిటీ ఎందుకు తగ్గిందని ప్రశ్నిస్తే కారణం తానేనని ఎవరైనా వేలెత్తిచూపిస్తారని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ప్రజల పక్షాన పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. మనలో ఎన్ని విభేదాలున్నా మనమే పరిష్కరించుకుని సర్దుకుపోదాం అంటూ ఆయన చేసిన ప్రసంగం ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ టీడీపీకి అండగా ఉండాలని పదే పదే చెప్పుకొచ్చారు. స్పందన కరువు చంద్రబాబు కుప్పం పర్యటనలో స్పందన కరువైంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో బాబు పర్యటన అంటే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హడావుడి చేసేవారు. అయితే ప్రస్తుతం ఆయన పర్యటన సాదాసీదాగా సాగింది. రామకుప్పం, శాంతిపురం బహిరంగ సభల్లో కార్యకర్తలు ఓ మోస్తారుగా హాజరైనా ప్రజల్లో స్పందన కరువైంది. ఎన్టీఆర్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు జనం లేక వెలవెలబోయింది. బాబును చూసేందుకు సైతం ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదు. రోడ్లలో నిలబడి వాహనాలను నిలిపి హారతులిచ్చే మహిళలు కరువవడం గమనార్హం. -
2, 3 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటన
సాక్షి, కుప్పం(చిత్తూరు) : మాజీ ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబునాయుడు జూలై 2, 3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆమేరకు ఆయన పీఏ మనోహర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ రామకుప్పం, శాంతిపురం మండలాల్లో, 3వ తేదీ గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఆయన పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. తాను నామినేషన్‌కు రాకపోయినా అభిమానంతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. -
సమైక్య కోటను నిర్మిద్దాం: వైఎస్ జగన్మోహన్రెడ్డి
' కుప్పం సమైక్య శంఖారావం సభలో జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటన ' రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దాం ' 30కి పైగా ఎంపీ స్థానాలను మనం గెల్చుకుందాం: ప్రజలకు జగన్ పిలుపు ' తెలుగుజాతి చరిత్ర తెలియనివారు రాష్ట్రాన్ని విడదీయాలని చూస్తున్నారు ' ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం ' సోనియా తన కుమారుడిని ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విడదీస్తున్నారు ' అందుకు కిరణ్, చంద్రబాబు మద్దతు పలుకుతున్నారని మండిపాటు ' కుప్పంలో సమైక్య శంఖారావం సభకు పోటెత్తిన ప్రజలు ' రాష్ట్రాన్ని విడదీస్తే శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఉప్పునీరు తప్ప మంచినీరేదీ? ' ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉండగానే పై రాష్ట్రాల నుంచి చుక్కనీరు రాని పరిస్థితి ఉంది ' ఈ నష్టాలన్నీ కిరణ్‌కు, చంద్రబాబుకు తెలియదా.. తెలిసినా కళ్లున్న కబోదిలా నాటకాలాడుతున్నారా? ' హైదరాబాద్‌ను విడిచిపోతే సీమాంధ్ర యువత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలి? ఇక్కడ జరుగుతున్నది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం. నేను గట్టిగా కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు గట్టిగా సమాధానం చెప్పాలి. ‘రాష్ట్రాన్ని విడగొడతామని అంటున్నారు’ మీరు ఒప్పుకుంటారా? ’ (ఒప్పుకోం.. ఒప్పుకోం అని జనస్పందన). మీరు తెలుగులో చెప్తున్నారు. తెలుగులో చెప్తే ఢిల్లీ వారికి, సోనియాకు అర్థం కాదు. కిరణ్, చంద్రబాబుకు కూడా అర్థం కాదు. ‘నో’ అని చెప్పండి. (నో.. నో అంటూ జనఘోష) సోనియాగాంధీని, చంద్రబాబును, కిరణ్.. ఈ ముగ్గురిని క్షమిస్తారా? (ప్రజల నుంచి ‘నో.. నో’ అని సమాధానం). ఇప్పటికైనా వారికి బుద్ధి వస్తుందేమో అని ఆశిస్తున్నా. సమైక్య శంఖారావం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మనమంతా ఒక్కటై నిలుద్దాం.. రాష్ట్ర సమైక్యతను కాపాడుకుందాం.. ఎన్నికలు వస్తున్నాయి.. 30కిపైచిలుకు పార్లమెంటు స్థానాలను మనమే తెచ్చుకుందాం.. ఢిల్లీ కోటను బద్ధలు కొడదాం.. రాష్ట్రాన్ని ఎవరైతే సమైక్యంగా ఉంచుతారో వాళ్లనే ప్రధానమంత్రిని చేద్దాం. ఢిల్లీ కోటను మనమే నిర్మిద్దాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలుగుజాతి చరిత్ర తెలియనివారు రాష్ట్రాన్ని ముక్కలుచెక్కలు చేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇది ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని ఉద్ఘాటించారు. సమైక్యం పేరుతో డ్రామాలాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. వెంటనే అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేయడం లేదని నిలదీశారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించటాన్ని నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన సమైక్య శంఖారావం యాత్ర శనివారం తొలిరోజు చిత్తూరు జిల్లా కుప్పం నుంచి మొదలైంది. జగన్ వస్తే దుకాణాలు మూసేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపును పక్కనపెట్టి ప్రజలు అశేషంగా తరలివచ్చారు. జననేతకు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. కుప్పం బస్టాండ్ సెంటర్లో కిక్కిరిసిన జన సమూహాన్ని ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రసంగం ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... మిమ్మల్ని వెళ్లిపొమ్మంటే ఎలా ఉంటుంది? సోనియాగాంధీ గారిని ఒక్కమాట అడగదలుచుకున్నా. సోనియాగాంధీకి 1968లో రాజీవ్‌గాంధీతో పెళ్లయింది. 1983లో సోనియాగాంధీ భారతదేశ పౌరసత్వం తీసుకున్నారు. అంటే ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు భారతదేశ పౌరసత్వం తీసుకున్నవారంతా వారివారి దేశాలకు వెళ్లిపోవాలని ఎవరైనా పార్లమెంటులో బిల్లు పెడితే ఎలా ఉంటుందమ్మా...? అలా అంటే కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోరా అని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లను అడుగుతున్నా. 30 ఏళ్లకే మీకు ఇంత వ్యామోహం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసి బతుకుతున్న మమ్మల్ని వేరు చేస్తామంటే మాకెలా ఉంటుంది? సోనియాగాంధీ గారు ఓట్ల కోసం, సీట్ల కోసం అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడానికి ముందుకొస్తారు.. చంద్రబాబు గారేమో ఆమెకు పూర్తిగా మద్దతిస్తూ సమైక్యత అనే పదాన్ని బంగాళాఖాతంలో కలుపుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు. గతం ఏమిటో తెలియని వాళ్లు బలంగా ఉన్న తెలుగుజాతిని విడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు జాతిని విడగొట్టకపోతే సోనియాగాంధీ గారు తన కొడుకును ప్రధానమంత్రిని చేసుకోలేరు కాబట్టి. ఆమె కొడుకును ప్రధానమంత్రి ఉద్యోగంలో కూర్చోబెట్టడానికి మన పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. రాష్ట్ర చరిత్ర తెలియనివారు ఈరోజు పాలన చేస్తున్నారు. 1955కి ముందు విశాలాంధ్ర కావాలని, తెలుగువారు ఎక్కడ ఉన్నా కలిసికట్టుగా ఉండాలని హైదరాబాద్ స్టేట్‌లో అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు తన పదవిని కూడా త్యాగం చేశారు. హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీలో విశాలాంధ్ర కావాలంటూ మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానం చేశారు. అదే మాదిరిగా ఆంధ్ర రాష్ట్రం నేతలు కూడా విశాలాంధ్ర కోసం పాటుపడ్డారు. హిందీ తర్వాత అతిపెద్దజాతి తెలుగుజాతి అని చెప్పి, ఒక్కటిగా ఉంటేనే రాష్ట్రంలో తెలుగువారికి గౌరవం ఉంటుందని వాదించారు. చంద్రబాబూ.. లెటర్ ఎందుకివ్వవు? చంద్రబాబు గారూ.. విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాం ధ్రకు అనుకూలంగా మీరు ఎందుకు లేఖ ఇవ్వడం లేదు? ఏపీఎన్జీవోలు మీ దగ్గరకు వచ్చి.. ‘మీరు రాజీనామా చేయం డి... మీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామాలు చేయిం చండి..’ అని కోరితే మీరేమన్నారు? రాష్ట్రం విడిపోయినా రాజీనామా చేసేది లేదని మీరు చెప్పలేదా? ఇప్పటికీ మించిపోయింది లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా పోరాటం చేయండి. రాష్ట్ర సమైక్యత కోరుతూ లేఖ ఇవ్వండి. నేను కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు అంటున్నారు. ఎవరివి కుమ్మక్కు రాజకీయాలు? కాంగ్రెస్‌తో కలిసి నాపై కేసులు వేసింది ఎవరు? ఎఫ్‌డీఐ ఓటింగ్‌లో మీ ఎంపీలను గైర్హాజరు పరిచి కాంగ్రెస్‌కు మద్దతిచ్చింది ఎవరు? అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాన్ని కాపాడింది ఎవరు? రాష్ట్రాన్ని కాంగ్రెస్ విడగొడుతుంటే అందుకు మద్దతిస్తున్నది ఎవరు? చీకట్లో చిదంబరాన్ని కలిసింది ఎవరు? ఇలా రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ... నా వైపు వేలెత్తి చూపుతారా? కిరణ్‌వి డ్రామాలు.. కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలు గొప్పగా ఆడుతారు. ఎంత గొప్పగా అంటే.. రాష్ట్రాన్ని విభజించాలంటూ చంద్రబాబు ఢిల్లీ వెళ్లి దీక్షలు చేస్తారు. కిరణ్ ఏమో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చి ఉద్యోగులను భయపెట్టించి, వారితో సమ్మెను విరమింపజేస్తారు. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తుంటే ఎందుకు సహకరిస్తున్నారు? అసెంబ్లీని ఎందుకు సమావేశపర్చడం లేదు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ఎందుకు తీర్మానం చేయడం లేదు? ఈరోజు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా బురదజల్లే కార్యక్రమంలో ఉన్నారు. ఈ చిత్తూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. రాయలు ఏలిన రతనాల సీమ. వెంకటేశ్వరస్వామి కొలుైవె ఉన్నది ఇక్కడే, కాణిపాకం వినాయకుడు ఉన్నది ఇక్కడే, చందమామలో కూడా మచ్చలు ఉన్నట్టుగా మన ఖర్మ కొద్ది మన చిత్తూరు జిల్లాలో కూడా చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్కరూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని నినదిస్తుంటే.. వీరిద్దరు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. పొరుగు వాళ్లకు అర్థమైతే.. మీకు ఎందుకు కావట్లేదు? నేను రెండు వారాలుగా దేశంలోని ప్రతి రాష్ట్రానికి వెళ్తున్నా. ఆ రాష్ట్రాల్లోని ముఖ్య నాయకులను, ముఖ్యమంత్రులను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నా. అక్కడికి వెళ్లి వాళ్లందరితో మాట్లాడి వారి చేత స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నా. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచాలని వారితో చెప్పిస్తున్నాం. చంద్రబాబు గారూ... కిరణ్‌కుమార్‌రెడ్డి గారూ.. పొరుగు రాష్ట్రాల్లో ఉన్నా ఆ ముఖ్యమంత్రులకు, నాయకులకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం అవుతోంది. మరి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని మీకు ఎందుకు అర్థం కావడం లేదు. రైతుల జీవితాలతో చెలగాటమా? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కాని, ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు కాని ఈ ఇద్దరికీ రాష్ట్రం విడిపోతే జరగబోయే నష్టాల గురించి తెలుసా? ఒకవేళ తెలిస్తే కళ్లు ఉండి కూడా కబోదుల్లా నాటకాలు ఆడుతున్న వాళ్లని ఏమనాలి? నీటి విషయాన్నే తీసుకుంటే.. ఇవాళ నీళ్లు మహారాష్ట్ర దాటుకొని, కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ డ్యాం దాటుకొని కిందకు రావాలి. వారి డ్యాంలు నిండితేనే గాని కిందికి చుక్క కూడా నీళ్లు వదలని పరిస్థితి. ఇక మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? ట్రిబ్యునళ్లు, బోర్డులు ఉండగానే ఆలమట్టి, నారాయణపూర్ నిండితేనేగానీ ఒక్క చుక్క నీరు వదలని పరిస్థితి ఉంటే ఇక విడిపోతే రాష్ట్రం ఎడారి కాదా? బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. రాష్ట్రం విడిపోతుందన్న వదంతుల నేపథ్యంలో కృష్ణా నదిలో మనకు కేటాయించిన నీటిని తగ్గించే కార్యక్రమం జరుగుతోంది. మిగులు జలాల మీద మనకున్న హక్కులు తీసేస్తున్నారు. రాష్ట్రం ఒక్కటిగా ఉన్నప్పుడే ఇది జరుగుతోంది. ఇక విడిపోతే హంద్రీ-నీవాకు, గాలేరు-న గరికి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు? యువత ఉద్యోగాలకు ఎక్కడికి వెళ్లాలి?: ఈరోజు హైదరాబాద్ నగరాన్ని వదిలి వెళ్లిపొమ్మని చెప్తున్నారు. అలా అయితే చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలి? 60 ఏళ్లు ఒక్కటై కలిసి కట్టుకున్న హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపొమ్మంటారా? హైదరాబాద్ వైపు ఒక్కసారి చూడండి. వైఎస్సార్ బతికున్న రోజుల్లో కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టేవి. ఏటా 57 వేల మందిని క్యాంపస్ రిక్రూట్మెంటు చేసుకునే పరిస్థితి ఉండేది. మరి మూడేళ్లుగా ఏం జరుగుతోంది? క్యాంపస్ రిక్రూట్మెంట్లు 57 వేల నుంచి 25 వేలకు తగ్గిపోయాయి. పెట్టుబడుల విషయంలో గతంలో హైదరాబాద్ దేశంలోనే మూడు, నాలుగో స్థానంలో ఉండేది. ఇప్పుడు 12వ స్థానంలోకి పోయింది. చివరకు కోయంబత్తూరు కూడా హైదరాబాద్ కంటే ముందు ఉంది. అభివృద్ధి జరగాలంటే ఎయిర్‌పోర్టులు, సీ పోర్టులు ఉండాలి. మహానగరాలు, సముద్ర తీరాలు ఉండాలి. ఇలా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. పరిశ్రమలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి. మీరు చేస్తున్నది ఏమిటి? హైదరాబాద్‌ను ఒకరికి ఇచ్చేస్తున్నారు, సముద్ర తీరాన్ని మరొకరికి ఇచ్చేస్తున్నారు. ఇలా చేస్తే కొత్త పరిశ్రమలు ఎక్కడ్నుంచి వస్తాయి? కొత్త ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఇవాళ ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మందికి తక్కువ కాకుండా హైదరాబాద్‌లో ఉంటున్నారు. చదువుల కోసం, ఉద్యోగాల కోసం, చిన్నచిన్న వ్యాపారాల కోసం అక్కడికి వెళ్తున్నారు. చిన్నచిన్న ప్లాట్లు కొనుక్కుంటున్నారు. విభజన జరిగిపోతే హైదరాబాద్‌లోని ఆ ఇళ్ల విలువలు ఒక్కసారిగా తగ్గిపోతే, తగ్గిపోయిన విలువలను సోనియా భర్తీ చేస్తారా? కిరణ్ ఇస్తారా? లేదా ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబు ఇస్తారా? -
కుప్పం నుంచి వైఎస్ జగన్ `సమైక్య శంఖారావం`
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే బహిరంగ సభ ద్వారా సమైక్య శంఖారావం పూరించనున్నారు. ఆయన శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడ్నుంచి కుప్పం చేరుకుంటారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి శుక్రవారం అనుమతి మంజూరు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కుప్పంలో జరిగే బహిరంగ సభ నుంచి జగన్ సమైక్య శంఖారావం ప్రారంభించనున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సమయంలో ఆశించిన మేరకు జనం నుంచి స్పందన రాని నేపథ్యంలో జగన్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ మరణవార్త విని అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించడానికి గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్మోహన్రెడ్డి.. చిత్తూరులో ఈ యాత్ర చేయలేదు. ఇప్పుడు సమైక్య శంఖారావంతోపాటు ఓదార్పు యాత్ర కూడా నిర్వహించనున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జగన్ కుప్పం నియోజకవర్గంలోని పైపాళ్యం చేరుకుంటారు. అక్కడ వైఎస్ మరణవార్త విని గుండెపోటుతో మరణించిన వెంకటేష్ కుటుంబాన్ని ఓదార్చుతారు. తర్వాత ఎడుంగపల్లెలో, మల్లానూరు క్రాస్‌లో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 2 గంటలకు కుప్పం చేరుకుని బస్డాండ్ కూడలిలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. సాయంత్రానికి గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చేరుకుని లక్ష్మి కుటుంబాన్ని ఓదార్చుతారు. -
బాబును వెంటాడుతున్న భయం
-
పట్టు కోసం బాబు పాట్లు
కుప్పం కోటపై తెలుగుదేశం ‘పట్టు’ సడలుతుందేమోనన్న భయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును వెంటాడుతోంది. పదిహేను నెలల తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కుప్పంలో పార్టీ పరిస్థితి ఆందోళన కలిగించినట్లుంది. దీంతో తమ్ముళ్లు చేజారిపోకుండా చూసేందుకు నానా తంటాలుపడ్డారు. ప్రత్యేక భేటీలు, మంతనాలతో బిజీబిజీగా గడిపారు. సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు సోమ, మం గళవారాల్లో తన సొంత నియోజకవర్గం కుప్పం లో సుడిగాలి పర్యటన జరిపారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆయనకు అనుమానం కలిగినట్లు ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో దెబ్బ తగులుతుందన్న ఆందోళన బాబు వూటల్లో, ప్రవర్తనలో కనిపిం చింది. వూరు గ్రావూల్లో సైతం ఇంటిం టికీ తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నెలలో వై.ఎస్.జగన్ కుప్పం పర్యటన నేపథ్యం లో తెలుగుదేశం చేజారిపోకుండా చూసేం దుకు ప్రయుత్నించారు. గతంలో ఎంతటివారి నైనా తన వద్దకే పిలిపించుకుని వూట్లాడే బాబు తొలిసారి కుప్పంలో ఒక మెట్టుదిగారు. వుండ ల స్థాయి నేతల ఇళ్లకు స్వయుంగా వెళ్లారు. ఎన్నికల సవుయుంలో గట్టిగా పనిచేయూలని, స్థానిక విషయూలపై చర్చించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన రావుకుప్పం మైనారిటీ నాయుకులు ఒబేదుల్లా ఇంట్లో 40 నిమిషాలకుపైగా వుంతనాలు జరిపారు. ము స్లిం ఓటు బ్యాంకును పదిలపరుచుకునే ప్రయత్నంచేశారు. శాంతిపురంలోని వూజీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడు ఇంటికి వెళ్లి గంటకుపైగా గడిపారు. వారి కుటుంబ సంగతులు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, శాంతిపురం వుండలంలో తెలుగుదేశం చేజారిపో కుం డా చూడాల్సిన విషయాలపై చర్చించారు. నియోజకవర్గ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో ఆర్అండ్బీ అతిథిగృహంలో చంద్రబాబు సమీక్షించారు. సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనే టార్గెట్ కుప్పంలో జరిగిన తెలుగు తమ్ముళ్ల ప్రత్యేక భేటీలోనూ టీడీపీని కాపాడుకోవడంపైనే బాబు ప్రసంగించారు. మీకు అండగా ఉంటానని, వేరే పార్టీలను రానివ్వకండని కోరారు. తనకు పదవులపై ఆశ లేదని, మీ కోసమే పనిచేస్తానని కార్యకర్తలను ఆకట్టుకునేందుకు ప్రయుత్నించారు. రెండు రోజుల పర్యటనలో సిద్దావూరు, శాంతిపురం, రావుకుప్పం, కుప్పంటౌన్లో పలుచోట్ల చంద్రబాబు ప్రసంగించారు. ప్రతి సారీ వై.ఎస్.జగన్‌ను, ఆయున పార్టీ వైఎస్ఆర్సీపీని కుప్పంలో అడుగు పెట్టనివ్వవద్దు ప్రజలను అభ్యర్థించారు. జగన్ కుప్పంనే ఎత్తుకెళ్లిపోతారని, మివ్ముల్ని ఏవూరుస్తారని పదేపదే వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని వివుర్శలు గుప్పించారు. ఆయున వూట్లాడేందుకు ఒక కుప్పమే కనపడిందా అంటూ బాబు తన ప్రసంగంలో వై.ఎస్.జగన్‌ను వివుర్శించేందుకే ఎక్కువ సవుయుం కేటాయించారు. సవుస్యలపై ‘యూ’ టర్న్ నియోజకవర్గ సవుస్యల పరిష్కారానికి ఐదు నెలలు గడువు కావాలని చంద్రబాబు కోరారు. సవుస్యలు పరిష్కరించేందుకు ఇప్పుడేం చేస్తారనేది చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐదు నెలలు ఆగితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తానని, అప్పుడు కుప్పానికి పూర్వవైభవం తెస్తానని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతగానితనమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో అసంతృప్తి గతంలో బాబుకు జేజేలు కొట్టిన జనం మెల్లమెల్లగా తవు అసంతృప్తిని సవుస్యల రూపంలో వెల్లడిస్తున్నారు. రెండు రోజుల బాబు పర్యటనలో శాంతిపురంలో వుహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవని, వేసవిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని వివరించారు. వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, తాగునీటికి ఇక్కట్లు పడుతున్నావుని రామకుప్పంలో జనం తెలియజేశారు. అలాగే పలు గ్రామాల్లో రోడ్ల సమస్యను జనం బాబు దృష్టికి తెచ్చారు. -
చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చిన వేళ!
చిత్తూరు: అసలే ఆయనకు కోపం ఎక్కువ. పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పడిపోయే పార్టీని నిలబెట్టడానికి నానా కష్టాలు పడుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కార్మికులు వచ్చి సమస్యలు చెబుతామన్నారు. దాంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సొంత జిల్లా కుప్పం పర్యటనలో ఉండగా, కలిసేందుకు వచ్చిన అల్యూమినియం కార్మికులపై ఆయన మండిపడ్డారు. యూనియన్లతో సమస్యలు పరిష్కారం కావని వాటితో సంబంధం లేకుండా తన వద్దకు రావాలని చెప్పారు. యూనియన్లతో తన వద్దకు రావద్దని కూడా హెచ్చరించారు. చంద్రబాబు వైఖరి చూసి కార్మికులు విస్తుపోయారు. ఆయన మారలేదు.. ఇక మారబోరని నియోజకవర్గ ప్రజలే చెబుతున్నారు. ఎందుకంటే ఆయన అప్పటి మాటలనే ఇప్పటికీ వల్లిస్తున్నారు. నేను మారాను, నేను మారాను అని చెప్పుకునే చంద్రబాబు మారలేదని ఈ సంఘటనతో ప్రజలకు అర్థమైపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనియన్లను వ్యతిరేకించారు. యూనియన్లు ఉంటే పరిశ్రమలు రావన్నారు. అంతేనా ఆర్ట్స్ సబ్జక్ట్లు దండగన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..... ఇప్పుడు కుప్పం పర్యటనలో ఉన్న బాబు యూనియన్లు పెట్టుకోవడమే సమస్య అంటూ తన వద్దకు వచ్చిన కార్మికులకు క్లాస్ పీకి పంపించారు. మీ పిల్లలను రాజకీయాల్లోకి రానివ్వకండి, బాగా చదివించాలని తన వద్దకు వచ్చిన మహిళలకు చంద్రబాబు చెబుతున్నారు. ఆయన తన పర్యటనలో తమ బాధలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళల గోడు కూడా వినడంలేదు. తొమ్మిదేళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు తన సొంత నియోజకవర్గంలో సమస్యలు వినడానికే ఆసక్తి చూపడంలేదు. ఇక తమ సమస్యలు ఆయన ఏమి పరిష్కరిస్తారని ప్రజలు అంటున్నారు. ప్రతిపక్ష నాయకుడి సొంత నియోజకవర్గం పర్యటన పరిస్థితి ఇది. రెండు కళ్లు, రెండు నాలుకలతో రాష్ట్రవ్యాప్తంగా విమర్శల పాలయిన చంద్రబాబు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనూ ప్రజలకు దూరమవుతున్నారు.