
సాక్షి, తిరుపతి: కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు.
టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరీవాణి శ్రీనివాసులు పోలీసులపై దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు. ఏపీ-కర్ణాటక బార్డర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిబంధనల ప్రకారమే అనుమతులు
కుప్పం: టీడీపీ నేతలు చంద్రబాబు సభకు పోలీసుల అనుమతి తీసుకోకుండా ఓవరాక్షన్ చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ టీడీపీ నేతలు అనుమతి కోరితే తప్పకుండా పరిశీలించి అనుమతిస్తామన్నారు. కొత్త నిబంధల ప్రకారమే ఎవరికైనా అనుమతులు ఉంటాయని తెలిపారు. వాస్తవాలను కప్పి పుచ్చి టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment