
సాక్షి, చిత్తూరు: చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా ప్రవర్తించారు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌కు వెళ్లింది. ఇటీవలే 11 మంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్నారు. మళ్లీ చంద్రబాబు ఏం చేద్దామని కుప్పం వచ్చారంటూ ప్రశ్నించారు. అమాయకుల మరణాలకు సంబంధించి పోలీసులపై నెపం నెట్టి ప్రజలను డైవర్ట్ చేయాలన్నదే బాబు ఉద్దేశం అని మండిపడ్డారు. పేద ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు విలువలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, బుధవారం కుప్పంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు పోలీసులపై చేయి చేసుకున్నారు.