
సాక్షి, కుప్పం(చిత్తూరు) : మాజీ ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబునాయుడు జూలై 2, 3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆమేరకు ఆయన పీఏ మనోహర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ రామకుప్పం, శాంతిపురం మండలాల్లో, 3వ తేదీ గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఆయన పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. తాను నామినేషన్‌కు రాకపోయినా అభిమానంతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.