
చిత్తూరు జిల్లా: చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు పోలీసులపై దాడి, విధులను అడ్డుకోవడంపై మూడు కేసులు నమోదయ్యాయి. గొల్లపల్లి, శాంతిపురం, పెద్దూరు ఘటనపై కేసులు నమోదయ్యాయి.
పెద్దూరులో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిని దూషించిన ఘటనలో కేసు నమోదు చేయగా, గొల్లపల్లి వద్ద సీఐ విధులకు ఆటంకం కల్గించినందుకు కేసు నమోదయ్యింది. శాంతిపురంలోరని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మొత్తం మూడు ఘటనల్లో టీడీపీ కార్యకర్తలపై కేసులు ఫైల్ చేశారు పోలీసులు.
చదవండి: నాకే రూల్స్ చెబుతారా..? కుప్పంలో పోలీసులపై చంద్రబాబు వీరంగం