Live Updates
12:30PM, Feb 26th, 2024
సీఎం జగన్ ప్రసంగించడానికి వచ్చిన సమయంలో ‘సీఎం.. సీఎం’ అంటూ దద్దరిల్లిన సభా ప్రాంగణం
సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు?
- కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి
- భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి
- భరత్ గెలిచిన తర్వాత మంత్రిని చేస్తాను
- కేవలం అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు ఎందుకు?
- ప్రజలనె మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో వస్తారు
- మీ బిడ్డను గెలిపిస్తేనే పేదవారికి మంచి జరుగుతుంది
కుప్పానికి ఏమీ చేయని చంద్రబాబు.. ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా?
- మంత్రిగా ఉంటూ చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడిపోయారు
- 35 ఏళ్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇళ్లు కట్టుకోలేదు
- చంద్రబాబు పేరు చెబితే గుర్తుచ్చే ఒక్క స్కీమ్ ఐనా ఉందా?
- కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది
- 14 ఏళ్లు సీఎంగా ఉండి ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా?
- ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు
- దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమం కుప్పంలో జరుపుకుంటున్నాం
- ఒక పండుగ వాతావారణంలో జరుపుకుంటున్నాం
- కొండలు,గుట్టలు దాటుకుని, ఏ రకంగా 672 కి.మీ దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ.. కుప్పంలోకి ప్రవేశించింది.
- ఎక్కడ కుప్పం.. ఎక్కడ శ్రీశైలం
- 672 కి.మీ దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి, ఈరోజు మన కుప్పం నియోజకవర్గంలో ప్రవేశించడం కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజే
- 2022, సెప్టెంబర్ 23వ తేదీన, ఇదే కుప్పంలో జరిగిన బహిరంగ సభకు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను
- చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఆనాటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే .. ఈరోజు మన ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసింది
- కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా, మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేయడానికి మరో రెండు రిజర్వాయులు ప్రారంభించడానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది
- అందుకు సంబంధించి పరిపాలన పరమైన అనుమతులు కూడా ఇచ్చాం
- చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు
- కుప్పం నియోజకవర్గానికి 35 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యే
- 14 ఏళ్లు సీఎంగా కూడా పని చేశారు
- 35 ఏళ్లలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు
- కుప్పం బ్రాంచ్ కెనాల్ నిధులు పారే ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చాడు.
- అంచనాలు పెంచి అయినవాళ్లకు కాంట్రాక్టులు కట్టబెట్టారు
- 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసింది
- కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది ఎవరంటే మీ జగన్
- కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే మీ జగన్
- కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్
- కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే మీ జగన్
- చంద్రబాబు తన హెరిటేజ్ లాభాల కోసం మూసివేయించిన చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్‌ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధరను అందించేలా ఏర్పాటు చేసింది ఎవరంటే మీ జగన్.
- ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మక సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్.. వెల్లూరు సీఎంసీ మెడికల్ కాలేజ్
- దాన్ని అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు వియ్యంకుడు
- ఈ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్టును ముందుకు వెళ్లకుండా చేస్తే.. దాన్ని పునః ప్రారంభించేలా చేసింది ఎవరంటే మీ జగన్
- ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి జమ చేసింది రూ. 14 వందల కోట్లు.
- రూ. 14 వందల కోట్లును ఈ కుప్పం నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం
- ఇక్కడున్న ప్రతీ ఒక్కరికి చెబుతున్నా
- మీరు బ్యాంకులకు వెళ్లండి.. చంద్రబాబు పాలనకు సంబంధింది ఐదేళ్లు స్టేట్‌మెంట్, మీ బిడ్డ జగన్ వచ్చిన తర్వాత స్టేట్‌మెంట్స్ తీసుకోండి
- బాబుగారి పాలనలో ఒక్క రూపాయి అయినా వచ్చిందా అని చూసుకోమని అడుగుతున్నా
- అదే మీ బిడ్డ ప్రభుత్వ పాలనలో మీకు జమ అయిన నగదును కూడా ఆ స్టేట్‌మెంట్‌లో చూసుకోమని చెబుతున్నా..
- మరి ఎవరిది మనసున్న పాలన.. ఎవరిది పేదల ప్రభుత్వమన్నది ఆలోచన చేయమని అడుగుతున్నా
- కుప్పం ప్రజలంతా మా వాల్లేనని గర్వంగా చెబుతున్నా
- కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం
- కులం, మతం, ప్రాంతం,పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించాం
- కుప్పంలో 44,888 మహిళలకు రూ. 172 కోట్లు ఇచ్చాం
- పెన్షన్‌ల కోసం క్యూలెన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చేశాం
- ప్రతినెలా ఇంటికే వచ్చివలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు
- మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచి 45,374 మందికి ఈ కుప్పం నియోజకవర్గంలో అందిస్తున్నాం
- కుప్పంలో 31 వేల మందికి మాత్రమే చంద్రబాబు పెన్సన్ ఇచ్చారు.. అది కూడా వెయ్యి రూపాయలే.
- ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎటువంటి వివక్ష లేకుండా పెన్షన్లు ఇస్తున్నాం
- కుప్పం నియోజకవర్గంలో 1400 వలంటీర్లతో సేవలు అందిస్తున్నాం
- కుప్పం నియోజకవర్గంలో 76 విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం
- కుప్పంలో 44, 640 రైతులకు రూ. 214 కోట్లు రైతు భరోసా ఇచ్చాం
- చంద్రబాబు హయాంలో రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు
- పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం చేశారు
- వైఎస్సార్ ఆసరా కింద రాష్ట్రంలో రూ. 26వేల కోట్లు అందించాం
- కుప్పంలో 35951 మంది తల్లులకు జగనన్న అమ్మ ఒడి ఇచ్చాం
- కుప్పంలో 15, 727 మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చాం
- ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని చెప్పడానికి గర్విస్తున్నా
- వైఎస్సార్ చేయూత ద్వారా 19, 921 మందికి రూ. 85 కోట్లు ఇచ్చాం
- నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింప చేశాం
- కుప్పంలో 108 వాహనాలు అందించాం
- కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17552 మందికి ఆరోగ్య సేవలు అందించాం
- ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరికీ ప్రయోజనం చేకూరుస్తున్నాం
- ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నాం
12:10PM, Feb 26th, 2024
- వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన సీఎం జగన్
- ఆ తర్వాత సీఎం జగన్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం
12:02PM, Feb 26th, 2024
కుప్పం శాంతిపురం సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్
11:22AM, Feb 26th, 2024
హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన సీఎం జగన్
- కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసిన సీఎం జగన్
- కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేసిన సీఎం జగన్
- కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్ లక్ష్యం
- కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్
- కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు
- కృష్ణమ్మ స్వర్శతో పరవశించిపోతున్న కుప్పం
11:18AM, Feb 26th, 2024
- కుప్పంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
- పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్
11:01AM, Feb 26th, 2024
కుప్పం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
10:04AM, Feb 26th, 2024
► కాసేపట్లో కుప్పానికి సీఎం జగన్
►రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్
9:21AM, Feb 26th, 2024
►కుప్పం బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
►కాసేపట్లో కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్
►కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్న ముఖ్యమంత్రి జగన్
►కుప్పం నియోజకవర్గ ప్రజలకు 2022, సెప్టెంబరు 23న ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్‌ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీ–నీవా కాలువల మీదుగా కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఇప్పటికే కృష్ణా జలాలు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలానికి చేరుకున్నాయి.
►కృష్ణమ్మ స్పర్శతో దుర్భిక్ష కుప్పం పరవశించిపోతోంది. కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో 68.466 కిమీ వద్ద క్రాస్ రెగ్యులేటర్ (రామకుప్పం మండలం రాజుపాలెం వద్ద) నుంచి మద్దికుంటచెరువు (2.91 ఎంసీఎఫ్‌టీ), నాగసముద్రం చెరువు (0.25 ఎంసీఎఫ్‌టీ), మనేంద్రం చెరువు (13.78 ఎంసీఎఫ్‌టీ), తొట్లచెరువు (33.02 ఎంసీఎప్‌టీ)లకు సోమవారం సీఎం జగన్ కృష్ణాజలాలను విడుదల చేసి, జాతికి అంకితం చేయనున్నారు.
►ఆ తర్వాత మిగతా 106 చెరువులకు కృష్ణాజలాలను విడుదల చేసి.. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్ తమకు సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారని ఆ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గత 57 నెలలుగా నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారనడానికి కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తే తార్కాణమని ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment