మళ్లీ అలవిగాని హామీలు గుప్పించిన చంద్రబాబు నాయుడు
ప్రతి ఎన్నికల ముందే ఇవే గొప్పలు 35 ఏళ్లుగా అదే తంతు
అధికారంలో ఉన్నప్పుడు ఒక్కటీ పట్టించుకోని తాత
బాబు హామీలపై నిలదీస్తున్న కుప్పం ప్రజలు
గత, ప్రస్తుత ప్రభుత్వాల అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్న స్థానికులు
ఎక్కడ సింగపూరు.. ఎక్కడ కుప్పం.. బెంగళూరు అభివృద్ధి ఎక్కడ.. కుప్పంలో అభివృద్ధి ఎంత..? ఇవి విపక్ష నేత చంద్రబాబుకు తెలియంది కాదు.. ఓట్ల వేటలో నోటికొచ్చిన హామీలు గుప్పించి అమాయక కుప్పం ప్రజలను బురిడీ కొట్టించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. 35 ఏళ్లుగా వారిని మభ్యపెట్టిన బాబు ఇప్పుడూ అదేపాట అందుకున్నారు. ‘కుప్పాన్ని మరో సింగపూర్ చేస్తా.. బెంగళూరు జనం చదువు, పనుల కోసం కుప్పానికి వచ్చేటట్లు మారుస్తా..’ నంటూ అలవిగాని హామీలు గుప్పించేశారు. రెండు రోజులుగా తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి హామీల వర్షంలో కుప్పం ప్రజలను తడిపి ముద్దచేశారు. వీటి అమలు ఎంత.. బాబు హామీల్లో నిజం ఎంత అని స్థానికులు చర్చించుకుంటున్నారు. సంక్షేమ ప్రభుత్వం నీడన ఉన్న చల్లదనం.. సైకిలు ఎక్కితే వచ్చిందా..? అని చర్చించుకుంటున్నారు. బాబు హామీలు.. వాటి విధివిధానాలపై జనం చర్చించుకుంటున్నారు.
కుప్పం/కుప్పంరూరల్: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు రోజుల పాటు అలవిగాని హామీలు గుప్పించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సీఎం హోదా ఉన్నప్పుడు కుప్పాన్ని అభివృద్ధి చేయని తాత మరో అవకాశం ఇస్తే చేస్తానంటూ జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఈసారి అయితే మరో అడుగు ముందుకేసి బెంగళూరు జనం కుప్పం వచ్చేలా చేస్తానంటూ అమలుకు యోగ్యం కాని హామీలు గుప్పించి స్థానికులకు విసుగు తెప్పించారు. ఆయన హామీలపై మీరే ఓ లుక్కేయండి..!
రికార్డు అరిగిపోయింది బాబూ!
♦ కుప్పాన్ని దేశానికే ఆదర్శం చేస్తా
♦ పారిశ్రామికవాడ చేసి యువకులకు ఉపాధి కల్పిస్తా
♦ కుప్పం పట్టణాన్ని శాటిలైట్ సిటీ చేసి, ప్రతి పంచాయతీకి కోటి, మేజర్ పంచాయతీకి రెండు కోట్ల నిధులు కేటాయిస్తా.
♦ గ్రామాల్లో అభివృద్ధి పనులు స్థానికులే చేసుకునే విధంగా అవకాశం
♦ ప్రతి గ్రామానికీ రోడ్డు, ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయితో పాటు పొలాలకు సిమెంట్ రోడ్లు వేయిస్తా
♦ కుప్పాన్ని బయటి ప్రపంచంతో అనుసంధానం చేసేందుకు బెంగళూరుకు ఫోర్‌వే రోడ్డుతో పాటు ప్రత్యేక విమానాశ్రయం
ఏర్పాటు చేస్తా
♦ కుప్పంలో ప్రతి ఎకరాకు బిందుసేద్యం పరికరాలు ఇచ్చి వ్యవసాయ హబ్‌గా తయారు చేస్తా
♦ శాశ్వత తాగు, సాగునీటికి హంద్రీ–నీవా జలాలు తీసుకువస్తా
♦ ద్రావిడ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలలను అనుసంధానం చేస్తా.
♦ ప్రతి మహిళకు నాలుగు ఆవులు ఇచ్చి పాడి పరిశ్రమతో స్వయం ఉపాధి కలి్పస్తా
గతంలో ఇచ్చిన హామీలు గుర్తున్నాయా బాబూ?
♦ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చే వరకు కుప్పంలో కనీసం డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయని బాబు చదువుల హబ్‌గా ఎలా మారుస్తారని స్థానికులు నిలదీస్తున్నారు.
♦ పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టెండర్లు పిలిస్తే తమిళనాడు ప్రభుత్వంతో కలిసి కోర్టులకు వెళ్లింది చంద్రబాబు కాదా..? అని కుప్పం ప్రజలు గళమెత్తుతున్నారు.
♦ గతంలో ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని నిరీ్వర్యం చేసి ఇప్పుడు ఇంజినీరింగ్ కళాశాలతో అనుసంధానం చేస్తామంటే ఎలా నమ్మేదని ధ్వజమెత్తుతున్నారు.
♦ 2004లో కుప్పాన్ని మరో సింగపూర్ చేస్తామన్న హామీ ఇచ్చి, ఆపై సీఎం హోదాలో మరిచిపోయిన సంగతి గుర్తులేదా..? అంటున్నారు.
♦ 2001లో పారిశ్రామిక వాడ కోసం అనిమిగానిపల్లి వద్ద శంకుస్థాపన చేసి.. ఇప్పుడు యువతకు ఉద్యోగాలిస్తామనడం తప్పు కాదా అని ప్రశి్నస్తున్నారు.
♦ 2018లో ఎయిర్‌పోర్ట్ కోసం శంకుస్థాపన చేసి ఆరు నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయింది నువ్వు కాదా అని మండిపడుతున్నారు.
♦అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు గొప్పలు చెప్పి మరో అవకాశం ఇవ్వాలంటూ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.
మా నమ్మకం నువ్వే జగన్
నమ్మకానికి మారుపేరు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని కుప్పం ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కుప్పం పట్టణాన్ని అప్‌గ్రేడ్ చేసి మున్సిపాలిటీ హోదా కల్పించాలని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అలాగే కుప్పాన్ని రెవెన్యూ, పోలీసు డివిజన్లుగా తీర్చిదిద్దారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం అభివృద్ధి సీఎం జగనన్నతోనే సాధ్యమని నినదిస్తున్నారు. కలగా మారిన హంద్రీ–నీవాను పూర్తిచేసి కుప్పానికి నీళ్లిచ్చిన ఘనత జగనన్నదని నమ్ముతున్నారు. అదేవిధంగా పాలారు ప్రాజెక్టు, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి అడుగులు వేయడం అభివృద్ధికి సంకేతమని చెబుతున్నారు. రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణం, కమ్యూనిటీ భవనాల నిర్మాణం ఎవరి హయాంలో పూర్తయ్యాయో బాబు చెప్పాలని నిలదీస్తున్నారు. మరోమారు జగనన్నను గెలిపించుకుంటే కుప్పం రూపురేఖలు మారడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఈ సారి కుప్పంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తామని ముక్తకంఠంతో హోరెత్తిస్తున్నారు.
కుప్పంకు బాబు చేసిందేమీ లేదు
చంద్రబాబు కుప్పం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయినా ఆయన చేసింది ఏమీ లేదు. కనీసం కుప్పంలో డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయలేదు. పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవాళ్లం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి డిగ్రీ కళాశాల పెడితే, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టణంలో అండర్ బ్రిడ్జీ్జల నిర్మాణం పూర్తిచేశారు. కుప్పంలో శాశ్వత అభివృద్ధి జరగాలంటే మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందే. ఆయన వస్తే కుప్పం రూపురేఖలు మారతాయని మా నమ్మకం.
– మాధవన్, డీకే పల్లి, కుప్పం మండలం
ఇంతకాలం ఎందుకు చెయ్యలేదు?
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు ఇంకో అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తానంటున్నారు. 35 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 3 పర్యాయాలు సీఎంగా ఉండి ఎందుకు చేయలేదు?. కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేయలేకపోయారు. ఆయనను ఇకమీదట ఇక్కడి ప్రజలు నమ్మరు. జగన్‌మోహన్‌రెడ్డి కుప్పానికి చేసిన అభివృద్ధి ఏమిటో జనం ప్రత్యక్షంగా చూశారు. ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ–నీవా కాలువ నిర్మాణం పూర్తి చేసి కుప్పానికి నీళ్లిచ్చారు. రెవెన్యూ, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేసి కుప్పం రూపురేఖలే మార్చేశారు. మరోమారు జగన్‌మోహన్‌రెడ్డికే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.
– కుమార్, డీకే పల్లి, కుప్పం మండలం
Comments
Please login to add a commentAdd a comment