14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన సొంత నియోజక వర్గాన్ని మూడున్నర దశాబ్ధాలుగా పట్టించుకోలేదు. 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కుప్పానికి మహర్దశ పట్టిందంటున్నారు స్థానికులు. ఇంతకీ కుప్పంలో గత ఐదేళ్లలో వచ్చిన మార్పేంటీ?
ఏడు సార్లు చంద్రబాబును కుప్పం ప్రజలు గెలిపించారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉంది. అయితే తన నియోజక వర్గాన్ని ఆయన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే నియోజక వర్గం సమస్యలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తనకు అన్ని నియోజక వర్గాలూ సమానమే అన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల తరహాలోనే తన రాజకీయ ప్రత్యర్ధి ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజక వర్గానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు.
కేవలం నాలుగున్నరేళ్ల పాలనలోనే కుప్పాన్ని మున్సిపాలిటీని చేశారు. రెవిన్యూ డివిజన్‌గా మార్చారు. డిఎస్పీని నియమించారు. గ్రామ సచివాలయాలతో నియోజక వర్గంలో ప్రతీ ఇంటికీ పాలనను చేరువ చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు పార్టీలు, కులమతాలకతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందించారు. అభివృద్దికి ప్రత్యేక నిధులు కేటాయించారు. చూస్తూండగానే కుప్పం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది.
కుప్పం ప్రజల చిరకాల కోరిక హంద్రీ నీవా కాలువల ద్వారా కుప్పానికి సాగు తాగునీరు అందించడం. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. నాలుగున్నరేళ్ల పాలనలోనే హంద్రీ నీవాని కుప్పానికి తెచ్చి కుప్పం ప్రజల దాహాన్నీ.. పంట పొలాలకు సాగునీటి సదుపాయాన్నీ అందించి చూపించారు జగన్‌మోహన్‌రెడ్డి.
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం రేషన్ కార్డు కావాలన్నా.. పింఛను రావాలన్నా.. సంక్షేమ పథకాలు అందాలన్నా జన్మభూమి కమిటీలు ఆమోద ముద్ర వేస్తేనే పని అయ్యేది లేదంటే అంతే సంగతులు. ఇపుడు అటువంటి పరిస్థితి లేనే లేదంటున్నారు కుప్పం వాసులు.
కుప్పం తలరాత మారిపోయింది. కళ్లముందరే నియోజక వర్గానికి రాజయోగం పట్టింది. తమ జీవితాలల్లో మార్పులు తెచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పం ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏనాడూ తమని పట్టించుకోని చంద్రబాబు నాయుడికి ఇక సెలవిచ్చేస్తాం అంటున్నారు
ఇదీ చదవండి: అన్నీ లాగేసుకుని.. ఇదేం లిస్ట్ బాబూ..?
Comments
Please login to add a commentAdd a comment