నీడనిచ్చిన కుప్పాన్నికూడా.. చప్పరించేసారు | CM Jagan will inaugurate Kuppam Branch Canal this month itself | Sakshi
Sakshi News home page

నీడనిచ్చిన కుప్పాన్నికూడా.. చప్పరించేసారు

Published Sat, Feb 3 2024 4:23 AM | Last Updated on Sat, Feb 3 2024 1:48 PM

CM Jagan will inaugurate Kuppam Branch Canal this month itself - Sakshi

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఆయన రెక్కల కష్టంతో నిర్మించిన పార్టీని, అధికారాన్ని గుంజు­కోవడాన్ని ఏమంటారు? మోసం.. ద్రోహం.. వంచన అనే కదా!

నోట్ల కట్టలతో దొంగ ఓట్లతో మూడు దశా­బ్దాలుగా నెగ్గుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన ప్రజలకు చుక్క నీళ్లు ఇవ్వకుండా ఖజానాను దోచేసిన మనిషిని నమ్మక ద్రోహి అనే కదా అంటారు!

రాజకీయ అరంగేట్రంలోనే చంద్రబాబు ఫోర్‌ ట్వంటీ వేషాలు వేయడంతో సొంత నియోజకవర్గం అయిన చంద్రగిరి ప్రజలు తరిమికొట్టారు. గత్యంతరం లేక వలస వెళ్లిన కుప్పంలోనూ ఆయన అవే వేషాలు వేశారు! ఏడుసార్లు తనను గెలిపించిన కుప్పాన్ని తన కమీషన్ల కోసం తాకట్టు పెట్టి.. నీళ్లివ్వకుండా ఎండగట్టారు!

సాక్షి, అమరావతి: కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా కృష్ణా జలాలను తరలించి సాగు, తాగునీరు అందిస్తానని నమ్మబలికిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఆ ముసుగులో ఖజానాను దోచేసి పనులు చేయలేక చేతులెత్తేసి నయవంచనకు పాల్పడ్డారు! తన కమీషన్ల కోసం సొంత నియోజకవర్గం కుప్పంను తాకట్టుపెట్టి నీచ రాజకీయం చేస్తున్నారు.

బాబు ఇలా మోసం చేస్తే, 2022 సెప్టెంబర్ 23న కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా ప్రజలకు ఇచ్చి న హామీ మేరకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మేలు చేస్తున్నారు. పూర్తయిన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను ఈ నెలలోనే సీఎం జగన్‌ ప్రారంభించి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్నారు. ఇప్పటికే రామకుప్పం మండలం వరకూ కృష్ణా జలాలను తరలించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా చెరువులు నింపి సమృద్ధిగా సాగు, తాగునీరు అందించనున్నారు.   

పురిటిగడ్డకు ద్రోహం 
సొంతూరు నారావారిపల్లె ఉన్న చంద్రగిరి నియోజకవర్గం నుంచి 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన చంద్రబాబు నాడు టీడీపీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడి చేతిలో 17,429 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు. ఆ దెబ్బకు 1985 ఎన్నికల్లో పోటీ చేయడానికే జంకిన చంద్రబాబు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ పంచన చేరి 1989లో తమిళనాడు, కర్ణాటక, రాష్ట్ర సరిహద్దుల్లోని కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు.

అప్పటి నుంచి గూండాయిజం, నోట్ల కట్టలు, దొంగ ఓట్లతో నెగ్గుకొస్తున్నారు. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం లో భాగంగా దివంగత వైఎస్సార్‌ చేపట్టిన హంద్రీ–నీవా సుజల స్రవంతిలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా సాగు, తాగునీరు అందిస్తానని చంద్రబాబు నమ్మబలికారు.

హంద్రీ–నీవాలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో చిత్తూరు జిల్లా పెద్దపంపాణి మండలం అప్పినపల్లి (207.8 కిమీ వద్ద) నుంచి రోజుకు 216 క్యూసెక్కులను మూడు (పంప్‌ హౌస్‌లు) దశల్లో ఎత్తిపోసి 123.641 కి.మీ. పొడవున తవ్వే కాలువ ద్వారా తరలించి, 110 చెరువులను నింపడం ద్వారా కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 6,300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 4.02 లక్షల మందికి తాగునీరు అందిస్తామని నమ్మించారు.  

అంచనాల్లోనే రూ.120 కోట్ల లూటీ! 
కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను 123.641 కి.మీ. పొడవున తవ్వేందుకు 98,85,140 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 3,84,457 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయాలి. 2015–16 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం క్యూబిక్‌ మీటర్‌ మట్టిపనికి రూ.89, క్యూబిక్‌ మీటర్‌ కాంక్రీట్‌ పనికి రూ.3 వేలు చొప్పున వ్యయం అవుతుంది. ఈ లెక్కన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో మట్టి, కాంక్రీట్‌ పనులకు రూ.203.11 కోట్లు ఖర్చు అవుతుంది.

మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం, మోటార్లు, ప్రెజర్‌మైన్లు, విద్యుత్‌ సరఫరా ఏర్పాటుకు రూ.90 కోట్ల వ్యయం అవుతుంది. 2015–16 ధరల ప్రకారం కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు రూ.293.11 కోట్ల వ్యయం అవుతుంది. ఆ మేరకు జలవనరుల శాఖ అధికారులు 2015 మేలో అంచనాలు రూపొందించారు. కానీ అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిడితో పనుల అంచనా వ్యయాన్ని రూ.413 కోట్లకు పెంచేశారు. అంటే టెండర్ల దశలోనే రూ.120 కోట్ల మేర పెంచేసినట్లు స్పష్టమవుతోంది.   

కడప టీడీపీ అధ్యక్షుడికి కానుక.. 
అంచనా వ్యయం పెంచేసిన పనులను కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాకు కట్టబెట్టి రూ.120 కోట్లు కాజేయడానికి చంద్రబాబు స్కెచ్‌ వేశారు. ఆ మేరకు కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులకు రూ.413 కోట్లు అంచనా విలువగా నిర్ణయించి 2015 ఆగస్టులో టెండర్లు పిలిచారు. ఆర్కే ఇన్‌ఫ్రా సంస్థకే పనులు దక్కేలా టెండర్లులో నిబంధనలు పెట్టారు.

టెండర్లలో ఆ సంస్థ ఒక్కటే నాలుగు శాతం అధిక(ఎక్సెస్‌) ధరకు కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఒకే  షెడ్యూలు (సింగిల్‌ బిడ్‌) దాఖలైతే ఆ టెండర్‌ను రద్దు చేసి మళ్లీ పిలవాలి. కానీ చంద్రబాబు ఒత్తిడి మేరకు ఆర్కే ఇన్‌ఫ్రాకు 4 శాతం అధిక ధరకు రూ.430.26 కోట్లకు పనులు కట్టబెట్టారు. మొబిలైజేషన్‌ అడ్వాన్సుల కింద రూ.43 కోట్లు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి వాటిని బాబు జేబులో వేసేశారు.  
 
సీఎం రమేష్‌ పేచీతో చెరిసగం.. 

శ్రీనివాసరెడ్డికి భారీ ఎత్తున లబ్ధి చేకూర్చుతూ కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు కట్టబెట్టడంపై అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ పేచీ పెట్టారు. తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్‌ ఒత్తిడి చేయడంతో దిగివచ్చి న చంద్రబాబు చీకటి పంచాయితీ చేశారు. శ్రీనివాసరెడ్డికి చెందిన ఆర్కే ఇన్‌ఫ్రాకు 50 శాతం పనులు, మిగతా 50 శాతం పనులు సీఎం రమే‹Ùకు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌కు సబ్‌ కాంట్రాక్టు కింద ఇవ్వాలని ఆదేశించారు.   

ప్రధాన కాంట్రాక్టర్‌పై వేటు.. ‘సబ్‌’కే మొత్తం 
చెరి సగం పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డి, సీఎం రమేష్‌ క్యూబిక్‌ మీటర్‌కు రూ.40 చొప్పున మట్టి తవ్వకం పనులను సబ్‌ కాంట్రాక్టర్లకు ఇచ్చేసి భారీ లబ్ధి పొందుతూ వచ్చారు. వారి వద్ద నుంచి చంద్రబాబు ఎప్పటికప్పుడు కమీషన్లు వసూలు చేసుకుంటూ వచ్చారని టీడీపీ నేతలే అప్పట్లో ఆరోపించారు.

తనతోపాటు శ్రీనివాసరెడ్డి భారీ ఎత్తున లబ్ధి పొందుతుండటాన్ని సహించలేని సీఎం రమేష్‌ మొత్తం పనులను తనకే కట్టబెట్టాలని మరోసారి పేచీకి దిగారు. దీంతో పనులన్నీ రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌కే కట్టబెట్టాలని జలవనరుల శాఖను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో టెండర్‌ ద్వారా పనులు దక్కించుకున్న శ్రీనివాసరెడ్డిపై వేటు వేసి సీఎం రమేష్‌కు చెందిన రితి్వక్‌ ప్రాజెక్టŠస్‌కే మొత్తం పనులు అప్పగించేశారు.    

మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌.. 
సీఎం జగన్‌ అధికారం చేపట్టాక ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కుప్పంను మున్సిపాల్టీని చేశారు. కుప్పం కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. మున్సిపాల్టీతోపాటు గ్రామాల్లో అంతర్గత రహదారులు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేసి కృష్ణా జలాలను అందించి సుభిక్షం చేస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటూ యుద్ధప్రాతిపదికన కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులను పూర్తి చేయించారు. ఇప్పటికే కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ 74 కి.మీ. వరకూ అంటే రామకుప్పం మండలం మనేంద్రం గ్రామం వరకూ కెనాల్‌ నీటిని తరలించారు. చెరువులను నింపి సాగు, తాగునీరు అందించనున్నారు.  

రూ.460.88 కోట్లు నీళ్ల పాలు.. 
కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌లో సీఎం రమేష్‌ సంస్థకు రూ.460.88 కోట్లను 2019 ఏప్రిల్‌ నాటికి ప్రభుత్వం బిల్లుల రూపంలో చెల్లించింది. అంటే కాంట్రాక్టు విలువ కంటే రూ.30 కోట్లు ఎక్కువగా చెల్లించినా పనులు పూర్తి కాలేదు. రూ.99.41 కోట్ల విలువైన పనులు మిగిలిపోయాయి.

నాసిరకమైన పైపులు వేయడం వల్ల వర్షపునీటికే పగిలిపోయాయి. దీన్ని బట్టి కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల్లో సీఎం రమేశ్ తో కలిసి చంద్రబాబు ఏ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డారో విశదం చేసుకోవచ్చు. వరుసగా ఏడు సార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీళ్లు కూడా అందించకుండా చంద్రబాబు నమ్మకద్రోహం చేశారు.   

పాలార్‌కు మోకాలడ్డు
కుప్పం నియోజకవర్గాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా జలయజ్ఞంలో భాగంగా కుప్పం మండలం గణేశపురం వద్ద పాలారు నదిపై 0.6 టీఎంసీల సామర్థ్యంతో రూ.55 కోట్ల వ్యయంతో రిజర్వాయర్‌ పనులను 2005లో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టారు. ఈ రిజర్వాయర్‌ ద్వారా నాలుగు వేల ఎకరాలకు సాగునీరు, 1.50 లక్షల మందికి తాగునీరు అందించేలా పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ రిజర్వాయర్‌ పూర్తయితే కుప్పం నియోజకవర్గంలో తనకు రాజకీయంగా ఉనికి లేకుండా పోతుందని ఆందోళన చెందిన చంద్ర­బాబు తమిళనాడు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. పాలారు రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల తమ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, దాని నిర్మాణాన్ని నిలిపివేసేలా ఆంధ్ర­ప్రదే­శ్‌ను ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభు­త్వంతో సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేయించారు. పాలార్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ఆపేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో అప్పట్లో ఆ పనులు ఆగిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement