
పట్టు కోసం బాబు పాట్లు
కుప్పం కోటపై తెలుగుదేశం ‘పట్టు’ సడలుతుందేమోనన్న భయం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును వెంటాడుతోంది. పదిహేను నెలల తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు కుప్పంలో పార్టీ పరిస్థితి ఆందోళన కలిగించినట్లుంది. దీంతో తమ్ముళ్లు చేజారిపోకుండా చూసేందుకు నానా తంటాలుపడ్డారు. ప్రత్యేక భేటీలు, మంతనాలతో బిజీబిజీగా గడిపారు.
సాక్షి, చిత్తూరు: టీడీపీ అధినేత చంద్రబాబు సోమ, మం గళవారాల్లో తన సొంత నియోజకవర్గం కుప్పం లో సుడిగాలి పర్యటన జరిపారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆయనకు అనుమానం కలిగినట్లు ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కుప్పంలో దెబ్బ తగులుతుందన్న ఆందోళన బాబు వూటల్లో, ప్రవర్తనలో కనిపిం చింది. వూరు గ్రావూల్లో సైతం ఇంటిం టికీ తిరిగి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నెలలో వై.ఎస్.జగన్ కుప్పం పర్యటన నేపథ్యం లో తెలుగుదేశం చేజారిపోకుండా చూసేం దుకు ప్రయుత్నించారు. గతంలో ఎంతటివారి నైనా తన వద్దకే పిలిపించుకుని వూట్లాడే బాబు తొలిసారి కుప్పంలో ఒక మెట్టుదిగారు. వుండ ల స్థాయి నేతల ఇళ్లకు స్వయుంగా వెళ్లారు.
ఎన్నికల సవుయుంలో గట్టిగా పనిచేయూలని, స్థానిక విషయూలపై చర్చించారు. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన రావుకుప్పం మైనారిటీ నాయుకులు ఒబేదుల్లా ఇంట్లో 40 నిమిషాలకుపైగా వుంతనాలు జరిపారు. ము స్లిం ఓటు బ్యాంకును పదిలపరుచుకునే ప్రయత్నంచేశారు. శాంతిపురంలోని వూజీ ఎమ్మెల్యే రంగస్వామినాయుడు ఇంటికి వెళ్లి గంటకుపైగా గడిపారు. వారి కుటుంబ సంగతులు, నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, శాంతిపురం వుండలంలో తెలుగుదేశం చేజారిపో కుం డా చూడాల్సిన విషయాలపై చర్చించారు. నియోజకవర్గ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో చంద్రబాబు సమీక్షించారు. సమస్యల పరిష్కారంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగనే టార్గెట్
కుప్పంలో జరిగిన తెలుగు తమ్ముళ్ల ప్రత్యేక భేటీలోనూ టీడీపీని కాపాడుకోవడంపైనే బాబు ప్రసంగించారు. మీకు అండగా ఉంటానని, వేరే పార్టీలను రానివ్వకండని కోరారు. తనకు పదవులపై ఆశ లేదని, మీ కోసమే పనిచేస్తానని కార్యకర్తలను ఆకట్టుకునేందుకు ప్రయుత్నించారు. రెండు రోజుల పర్యటనలో సిద్దావూరు, శాంతిపురం, రావుకుప్పం, కుప్పంటౌన్‌లో పలుచోట్ల చంద్రబాబు ప్రసంగించారు. ప్రతి సారీ వై.ఎస్.జగన్‌ను, ఆయున పార్టీ వైఎస్‌ఆర్‌సీపీని కుప్పంలో అడుగు పెట్టనివ్వవద్దు ప్రజలను అభ్యర్థించారు. జగన్ కుప్పంనే ఎత్తుకెళ్లిపోతారని, మివ్ముల్ని ఏవూరుస్తారని పదేపదే వైఎస్‌ఆర్‌సీపీని లక్ష్యంగా చేసుకుని వివుర్శలు గుప్పించారు. ఆయున వూట్లాడేందుకు ఒక కుప్పమే కనపడిందా అంటూ బాబు తన ప్రసంగంలో వై.ఎస్.జగన్‌ను వివుర్శించేందుకే ఎక్కువ సవుయుం కేటాయించారు.
సవుస్యలపై ‘యూ’ టర్న్
నియోజకవర్గ సవుస్యల పరిష్కారానికి ఐదు నెలలు గడువు కావాలని చంద్రబాబు కోరారు. సవుస్యలు పరిష్కరించేందుకు ఇప్పుడేం చేస్తారనేది చెప్పలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఐదు నెలలు ఆగితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తానని, అప్పుడు కుప్పానికి పూర్వవైభవం తెస్తానని చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతగానితనమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
ప్రజల్లో అసంతృప్తి
గతంలో బాబుకు జేజేలు కొట్టిన జనం మెల్లమెల్లగా తవు అసంతృప్తిని సవుస్యల రూపంలో వెల్లడిస్తున్నారు. రెండు రోజుల బాబు పర్యటనలో శాంతిపురంలో వుహిళలు ఖాళీ బిందెలతో స్వాగతం పలికారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవని, వేసవిలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని వివరించారు. వెళ్లేందుకు ఆర్‌టీసీ బస్సు సౌకర్యం లేదని, తాగునీటికి ఇక్కట్లు పడుతున్నావుని రామకుప్పంలో జనం తెలియజేశారు. అలాగే పలు గ్రామాల్లో రోడ్ల సమస్యను జనం బాబు దృష్టికి తెచ్చారు.