
సాక్షి, ప్రకాశం జిల్లా: చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నాడంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ని అల్లకల్లోలంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సమక్షంలోనే వైఎస్సార్‌సీపీ పార్టీని, నాయకులను, మహిళలను అతి దారుణంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అక్కడే ఉన్న ఎంపీపీ అశ్వినిపై దాడి చేశారు. ఇదేనా మీకు మహిళలపై ఉన్న గౌరవం అంటూ ప్రశ్నించారు.
'కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని భయంతో నీచంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిపై, పోలీస్ వ్యవస్థపై మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబు పిచ్చి పట్టినట్లుందని ప్రజలు అనుకుంటున్నారు. కుప్పంలో స్థానిక ఎలక్షన్ లో చంద్రబాబు చావు దెబ్బ కొట్టారు. కుప్పం ప్రజలకు బాబు ఏ అభివృద్ధి చేయలేదు కాబట్టే జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు అధికారం ఇచ్చారు. గడిచిన 3 సంవత్సరాలలో సీఎం జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి చంద్రబాబు ఓర్చుకోలేక ఈ విధంగా ప్రవర్తిసున్నాడు. రానున్న రోజుల్లో కుప్పంలో కూడా చంద్రబాబు గెలవలేడని' ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment