AP CM YS Jagan To Visit Kuppam On 23rd September, Check Schedule Details Here - Sakshi
Sakshi News home page

CM Jagan Kuppam Tour: 23న కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన

Published Wed, Sep 21 2022 3:59 AM | Last Updated on Wed, Sep 21 2022 8:53 AM

CM Jagan visit to Kuppam on 23rd September - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. అక్కడ వైఎస్సార్‌ చేయూత పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. అలాగే బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. వాస్తవానికి ఈ నెల 22నే కుప్పం పర్యటనకు వెళ్లాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల 23కి వాయిదా పడింది.

సీఎం జగన్‌ పర్యటన షెడ్యూల్‌..
► ఈ నెల 23 ఉదయం 9.15 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కుప్పం బయలుదేరతారు. 
► 10.45 గంటలకు కుప్పం చేరుకుంటారు. 
► 11.15–12.45 గంటల మధ్య బహిరంగ సభలో పాల్గొంటారు
► అనంతరం వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. 
► 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement