![Financial Powers to SEB - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/29/GAUTAM-SAWANG.jpg.webp?itok=ONTrh8Lz)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)కు ప్రభుత్వం ఆర్థిక వ్యవహారాలతో సహా హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్‌వోడీ) హోదాను కల్పించింది. ఈ మేరకు దేశంలోనే తొలిసారిగా ఎక్స్‌అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎస్‌ఈబీ విభాగం మెరుగైన ఫలితాలు సాధించేలా పోలీసు శాఖను సమన్వయం చేసేందుకు డీజీపీకి ఎక్స్ అఫిషియో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా కల్పించారు. ఏపీ జీఏడీ పరిధిలోకి ఎస్‌ఈబీ వింగ్‌ను తీసుకొచ్చారు. ఐజీ, అంతకంటే పై స్థాయి ఐపీఎస్ అధికారి ఎస్‌ఈబీకి కమిషనర్, హెడ్‌గానూ వ్యవహరిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment