గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో ధూళ్ళిపాళ్ల నరేంద్ర దొంగలా తయారయ్యారని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు 45 ఎకరాల జడ్పీ భూముల్లో అక్రమ మైనింగ్‌కి పాల్పడ్డారని విమర్శించారు. ఎలక్షన్లు వచ్చాయని ఉనికి కాపాడుకోవడానికి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నరేంద్రకు లేదని అన్నారు. అభివృద్ధి పైన చర్చకు రావాలని ధూళ్లిపాళ్ల నరేంద్రకు వెంకట రోశయ్య సవాల్ విసిరారు.
'వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్ పాల్పడి ధూళ్లిపాళ్ల నరేంద్ర వేల కోట్లు దోచేశారు. గత ప్రభుత్వంలో పొన్నూరు, పెదకూరపాడు, మంగళగిరి నియోజకవర్గాల్లో గ్రావెల్, ఇసుకను ధూళ్ళిపాళ్ల నరేంద్ర, ఆయన తమ్ముడు సురేంద్ర అక్రమ మైనింగ్ చేశారు. రైతులకు రావాల్సిన బోనస్ ను కొట్టేశారు. చంద్రబాబు నాయుడు సహకార రంగాన్ని నాశనం చేస్తే ధూళ్ళిపాళ్ల నరేంద్ర రైతుల ఆస్తి సంఘం డైరీని దోచేశారు. ప్రభుత్వం గురించి గానీ జగన్మోహన్ రెడ్డి గురించి గానీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా వారు చేయలేని పనులన్నీ ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ నాయకత్వంలో చేశాం.' అని వెంకట రోశయ్య అన్నారు.
ఇదీ చదవండి: ‘బాబు-పవన్‌ల కుతంత్రాలు.. సీఎం జగన్‌కు తిరుగేలేదు’
Comments
Please login to add a commentAdd a comment